Followers

ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్

 ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్..ఎమ్మెల్యే.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శివాలయం నగర్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ నవనిర్మాణం, సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటాకోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, టిఆర్ఎస్ నాయకులు రవీందర్ ముదిరాజ్, వార్డు సభ్యులు సిద్దిక్, జానకిరామ్, దళిత సంఘాల ఐక్యవేదిక, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఏసురత్నం, సభ్యులు అశోక్, సాయి బాబా, మద్దెల సత్యనారాయణ, బి.శ్రీనివాస్, ఎం.బుచ్చయ్య, ఎం.సత్తయ్య, ఆనంద్ బాబు, ప్రశాంత్, ఆగమయ్య, నర్సింగ్ రావు, భాస్కర్, జానయ్య, డి.రాజు, గోపాల్, ప్రసాద్, ఎం.బాల్ రామ్, ప్రవీణ్ కుమార్, ఎం.బాబు, సాంబ, శ్యామ్, లక్ష్మణ్, రత్నం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...