Followers

ఈ నెల 5వ తారీఖున జరిగే బంద్ ను జయప్రదం  చేయండి ...

ఈ నెల 5వ తారీఖున జరిగే బంద్ ను జయప్రదం  చేయండి 

వి.ఆర్.పురం,పెన్ పవర్

 వి.ఆర్.పురం మండలం రేఖపల్లి సెంటర్ లో   కిరాణా షాపులు వారికి గ్రామ ప్రజలకు సిపిఎం, సి ఐ టి యు, గిరిజన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కరపత్రాలు  ప్రజలందరికీ ఇవ్వటంజరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు కారం సిరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని  ప్రయివేట్ పరం చేసి,ఈ దేశాన్ని  పూర్తీగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే "విశాఖ ఉక్కు స్టిల్స్" ను ప్రయివేటుపరం చేయాలని  కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనకు పూనుకుందని ఆయన అన్నారు.  తదుపరి జిల్లా కమిటీ సభ్యులు  బొపెన కిరణ్ మాట్లాడుతూ ఐదవ తేదీన జరగబోవు బంద్ లో ప్రతీ ఒక్కరు  కలిసికట్టుగా పాల్గొని  బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సి.పి.యం సీనియర్ నాయకులు మాజీ MPP కారం.శిరమయ్య,జిల్లాకమిటి సభ్యులు బొప్పెన.కిరణ్, సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు పూనెం.సత్యనారాయణ, శ్రీరామగిరి సర్పంచ్ పులి.సనోథ్ కుమార్,నాయకులు  పంకు.సత్తిబాబు,పోడియం.శ్రీరాముర్తి,గుండెపుడి.లక్ష్మణ్ రావు,నాళ్లరపు.ప్రకాశ్ రావు,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

 అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్.




విశాఖపట్నం, పెన్ పవర్ 

మార్చి 10 న జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా గెలిపించి ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని 31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల నియమావళి కి అనుగుణంగా బుధవారం వార్డులో అమ్మోరు వీధి, కనకల దిబ్బ, డాబాగార్డెన్స్,లలితా కోలని, అమరావతి లైన్, స్ప్రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.




అనంతరం వార్డు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వానపల్లి యువసేన సభ్యులతో ప్రత్యేక  సమావేశం నిర్వహించారు.    ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ మాట్లాడుతూ తాను పార్టీ పరంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు,వార్డు అభివృద్ధి పనులను గుర్తించి టీడీపీ నాయకత్వం 31 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందని గుర్తు చేస్తూ అధిష్టానంకు వార్డు ప్రజానీకం తరపున కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, వార్డు సమస్యలపై ఇప్పటికే ఓ అంచనాకు రావడం జరిగిందని తెలిపారు. 



గతంలో ఇదే వార్డు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం వార్డు అభివృద్ధికి  కృషి చేశానని పేర్కొన్నారు.   కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేష్, నాయకులు కనకరాజు, అప్పారావు,విజయ్, లోహిత్, నరేష్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.   




కార్యాలయంలో సంబరాలు:- ఉత్కంఠ వాతావరణంలో మంగళవారం రాత్రీ 10 గంటల సమయంలో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బిఫారం అందుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్డు కార్యాలయంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు నడుమ వానపల్లి రవికుమార్ అందరికీ మిఠాయిలు పంచుకొంటూ సంబరాలు చేసుకున్నారు. పలువురు వార్డు కులసంఘాల పెద్దలు కలిసి వానపల్లి కి శుభాకాంక్షలు తెలిపారు.

మూడు లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత

 మూడు లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత -డిఎస్పి ఎన్.ఎస్ వి వెంకటేశ్వరరావు,

 టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా పట్టివేత, గంజాయి రవాణా చేస్తున్నా ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

 *గంజాయి రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం, విజయవాడలో గంజాయి సప్లై చేసిన వ్యక్తిపై కేసు నమోదు,

 పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేసు పూర్వాపరాలు వెల్లడించిన డిఎస్పి

 ఆదిలాబాద్, పెన్ పవర్ 


ఆదిలాబాద్ పట్టణం జాతీయ రహదారి గుండా అక్రమంగా నిషేధిత గంజాయి వాహనాల్లో రవాణా జరుగుతున్న విషయం టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు నెల రోజుల నుండి మాటువేసి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు అదిలాబాద్ గ్రామీణ సిఐ కే పురుషోత్తం చారి, ఎస్సై ఏ. హరిబాబు సిబ్బందితో కలిసి ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్ కంటి గ్రామం నీరా వాటర్ ప్లాంట్ రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎర్టిగా వాహనం KA 38 M 4036 నెంబరు గల  తనిఖీ చేయగా వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీట్ల లోపల దాచిన ఒక్కో ప్యాకెట్ రెండు కిలోల బరువు గల 30 ప్యాకెట్లు లభ్యమయ్యాయి, మొత్తం బరువు 60 కేజీల వరకు ఉంటుంది, గంజాయి స్థానిక మార్కెట్ విలువ ప్రకారం 3 లక్షల పైచిలుకు ఉంటుందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో 20 లక్షల పైనే పలుకుతుందని వెల్లడించారు, గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా దడిగి గ్రామానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు..

 A 2- బేలూరే పరమేశ్వర్, (29) 

 A3- పర్సన్నే బల్వంత్ (32) అని వెల్లడిస్తూ.. విజయవాడలో ప్రసాద్ అనే వ్యక్తి అందజేసిన 60 కేజీల గంజాయి ప్యాకెట్లను వాహనంలో నింపుకొని ఆదిలాబాద్ కు చెందిన ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తికి అందజేయాలని సూచించిగా వాహనంలో గంజాయితో బయలుదేరినట్లు నిందితులు వెల్లడించారు, ఈ క్రమంలో గంజాయి లోడు వచ్చిందని స్థానిక మహాలక్ష్మివాడ కు చెందిన ఉస్మాన్ ఖాన్ తన ద్విచక్ర వాహనంలో ఘటన స్థలంకు చేరుకోగా అతన్ని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టుబడిన గంజాయి కేసు స్థానిక అదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, విజయవాడకు చెందిన గంజాయి వ్యాపారి ప్రసాద్ పైన కేసు నమోదైనట్లు వెల్లడించారు, త్వరలో ప్రత్యేక బృందాన్ని విజయవాడ కు చెందిన A 4 ప్రసాద్ నిందితున్ని అరెస్టు చేస్తామని తెలిపారు, ముగ్గురు నిందితుల్లో A 1 అదిలాబాద్ మహాలక్ష్మివాడ కు చెందిన ఉస్మాన్ ఖాన్ (44)  గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నాడని తెలిపారు, అతనిపై 2005 సంవత్సరం నుండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ నమోదయి ఉన్నట్లు తెలిపారు, అరెస్టయిన ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న 60 కేజీల గంజాయి, ఎర్టిగా, ద్విచక్ర వాహనం, న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు, టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా అందిన సమాచారం మేరకే గంజాయి వాహనం నువ్వు పట్టుకున్నట్లు వెల్లడించారు, ఈ కార్యక్రమంలో అదిలాబాద్ గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి, ఎస్సై ఏ. హరిబాబు, ఆదిలాబాద్ శిక్షణ మహిళా ఎస్సై బాల్తా స్నేహ, మావాల శిక్షణ మహిళా ఎస్సై కుడికల శ్రవంతి, టాస్క్ ఫోర్స్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, కానిస్టేబుల్ సయ్యద్ రాహత్, అదిలాబాద్ గ్రామీణ సిబ్బంది ఎస్ రమణయ్య, మహమ్మద్ జలాలుద్దీన్, స్టేషన్ రైటర్ ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థికి పూర్తి మద్దతు శ్రీదేవి హన్మంత్ రావు

 ఎమ్మెల్సీ అభ్యర్థికి పూర్తి మద్దతు శ్రీదేవి హన్మంత్ రావు

పెన్ పవర్ ,మల్కాజిగిరి


ఎమ్మెల్సీ ఎన్నికలు నేఫద్యంలో  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోజున బిజెపి అభ్యర్థి ఎమ్మెల్సీ రామచంద్ర రావు మాజీ కార్పొరేటర్ శ్రీదేవి మరియు జి.కె. హనుమంతరావు గారిని మర్యదపూర్వకంగ కలిసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీదేవి, జికె. హనుమంతరావు బిజెపి అభ్యర్థి రామచంద్ర రావు గెలుపు కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు, బిజెపి యొక్క హైదరాబాద్ యూనిట్ అధ్యక్షుడు మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్నారు, స్నేహ స్వభావం కలిగిన వారు కాబట్టి వారికి మద్దతుగా నిలిచామని జి.కె. హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసుదన్ రెడ్డి, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి పైపు లైన్ మరమత్తులు

తాగునీటి పైపు లైన్ మరమత్తులు

పెన్ పవర్, మల్కాజిగిరి

  నేరేడ్మట్ ప్రధనమైన రహదారి పై కృష్ణావాటర్ తాగునీటి పైపులైన్ పగిలిపోయి రోడ్డుపై తాగునీళ్లు వృద్దగా పోతున్నాయని, పగిలినచోట గుంతగా ఏర్పాడి వాహనదారులు పల్లుమర్లు ప్రమాదానికి గురైతున్నా సమస్యలపై పెన్ పవర్ లో కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి కృష్ణావాటర్ పైపులైన్ మరమత్తుల పనులను ప్రారంభించారు. అల్వాల్ కు తాగునీటి సరపర ప్రధనమైన పైపులైన్ పగిలిపోవడంతో ఒక్కరోజుతో పాటు తాగునీరు తత్కాలికంగా నిలిపివేసి పనులు కొన్నసాగుతున్నాయి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండ ట్రాఫిక్ పోలీసుల సహకరం తీసుకొని పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని జలమండలి కృష్ణామాచారి అధికారి తెలిపారు.

సుపరిపాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించండి...అదితి గజపతిరాజు

సుపరిపాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించండి...అదితి గజపతిరాజు

విజయనగరం,పెన్ పవర్ 

విజయనగరం కార్పొరేషన్లో సుపరిపాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం 48వ డివిజన్లో, సాయంత్రం 45, 46, 47 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేవిధంగా ప్రజలు ఓటువేయాలన్నారు. డివిజన్లలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. వైకాపా నాయకులు ప్రజా ధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిరంకుశ పాలనతో పేద ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. కార్పొరేషన్లో ఆస్తి విలువ ద్వారా పన్నులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన జీవోలను తీసుకువచ్చిందన్నారు పెంచిన పన్నులను తగ్గించేవరకు తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరైన పనులనే ప్రస్తుత పాలకులు ప్రారంభోత్సవాలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐవిపి రాజు, బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు, కోరాడ వెంకటరావు, ఆల్తి బంగారుబాబు, నడిపిల్లి రవి, 48వ డివిజన్ అభ్యర్థి పత్తిగిల్లి సూర్యకుమారి, 49వ డివిజన్ అభ్యర్థి కర్రోతు రాధామణి, 47వ డివిజన్ అభ్యర్థి మైలపల్లి పైడిరాజు 45 వ డివిజన్ అభ్యర్థి కోరాడ శోభారాణి, 46వ డివిజన్ అభ్యర్థి కోండ్రు కృష్ణవేణి, ఆయా వార్డుల పార్టీనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హైస్కూల్ డిపుటేషన్లను తిరస్కరించండి

 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హైస్కూల్ డిపుటేషన్లను తిరస్కరించండి- స్టేట్ డిప్యూటీ జనరల్ సేక్రటరీ రాత్లవత్ రోహిత్ నాయక్

వనపర్తి, పెన్ పవర్

ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలో డిపుటేషన్లపై పంపిస్తే దానిని తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టిఎస్పిటిఎ) స్టేట్ డిప్యూటీ జనరల్ సేక్రటరీ రాత్లవత్ రోహిత్ నాయక్ ఉపాధ్యాయులకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ నుంచి ప్రాథమిక ఉపాధ్యాయులను ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలని మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అలా హాజరు కావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఉన్నత పాఠశాలలో డిపుటేషన్లపై పంపిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఉపాధ్యాయులు ఎటువంటి భయం లేకుండా దానిని తిరస్కరించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించి, ఉపాధ్యాయులకు మొండి చెయ్యి చూపించిందని వారు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈసీ అనుమతి తీసుకొని తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని వారు కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...