విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ
స్వామి స్వరూపానంద స్వామిని కలిసిన నారాయణ
పెందుర్తి, పెన్ పవర్
విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ
స్వామి స్వరూపానంద స్వామిని కలిసిన నారాయణ
పెందుర్తి, పెన్ పవర్
ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి...
జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్
ఆదిలాబాద్, పెన్ పవర్దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. బుధవారం మండలంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మండల తెరాస నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఏ రాష్ట్రంలో ఆడపడుచులకు లేనటువంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది కెసిఆర్ పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రె,ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ ఎంపిపి రఘుకుల్ రెడ్డి, తహసిల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్,టిఆర్ఎస్ నాయకులు తన్విర్ ఖాన్, మంగేష్, సుధాకర్, సుభాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నారాయణ, గీత తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గురుకుల పాఠశాల/కళాశాలను తిరిగి ఇంద్రవెల్లికి తెప్పించాలి
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు డిమాండ్
ఆదిలాబాద్,పెన్ పవర్ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన గురుకుల పాఠశాల కోసం తుడుం దెబ్బ ఆదివాసీ నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి మండలంలో గత నాలుగేండ్ల కిందట గిరిజన గురుకుల పాఠశాల, రెషిడెన్షియల్ కళాశాల మంజూరైయింది.ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది.నాలుగేండ్లు గడుస్తున్న ఆ భవనం ఇంకా పూర్తి కాలేదు.ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇదివరకే పలుమార్లు తమకు ఇతర చోటా ఇరుకు గదులు మరియు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ధర్నాలు చెపట్టారు.గతెడాది లాక్ డౌన్ కన్న ముందే ఈ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మావల మండల కేంద్రంలో ఎర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అక్కడే చదువులు కొనసాగించారు.
లాక్ డౌన్ అయిన తరువాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఇప్పుడు విద్యార్థులు ఇంద్రవెల్లి నుండి ఆదిలాబాద్ కు వెళ్ళాలంటె అక్కడ సైతం వారికి తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందని, ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన ఈ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి తరలించడంపై ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులు మండిపడుతున్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ ఆద్వర్యంలో విలేఖరుల సమావేశం ఎర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ మాట్లాడుతూ గత నాలుగేళ్ల కిందట ఇంద్రవెల్లి మండలంలో మంజూరైన గిరిజన గురుకుల పాఠశాల మరియు రెసిడెన్షియల్ కళాశాల భవనం నాలుగేళ్లు గడుస్తున్న భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇంద్రవెల్లికి చెందిన గిరిజన గురుకుల పాఠశాల ,కళాశాలను ఇక్కడి ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోని మావల మండల కేంద్రానికి తరలించడం పట్ల విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే తిరిగి ఇంద్రవెల్లి మండలంలో గిరిజన గురుకుల పాఠశాల కళాశాలను కొనసాగించెలా చర్యలు తిసుకోవాలని లేనిపక్షంలో ఇంద్రవెల్లి నుండి ముత్నూర్ వరకు ఆదివాసీ గిరిజనులంత కలిసి రోడ్డు దిగ్బందం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగనాథ్, మాజీ ఎటిడబ్లయూఎసి చైర్మెన్ సిడాం భీంరావ్, ఇంద్రవెల్లి ఎంపిపి పోటేశోభా, ఇంద్రవెల్లి మాజీ సర్పంచ్ కొరెంగ సుంకట్ రావ్, ఆదివాసీ నాయకులు తొడసం నాగోరావ్, మెస్రం జైవంత్, గెడం భారత్ , తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరిన బండారు సత్యనారాయణ
ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో నిరసన
ఆదిలాబాద్, పెన్ పవర్
ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి సహకార సంఘం సిఇఓ ఆత్మహత్యకు నిరసినగా ఒక్కరోజు కార్యలయం బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ధరమ్ సింగ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆత్మహత్యకు కారకులైన చైర్మన్ ను వెంటనే తొలిగించాలని వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మక్బల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ సునిల్, సిబ్బంది లక్ష్మణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు
మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని సూచించిన మండలం వి. వో వరప్రసాద్
ఆత్రేయపురం మండలం లొల్ల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం అంశాలను మండల వి వో వరప్రసాద్ పరిశీలించారు అలాగే మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని సూచించారు మెనూలో సూచించినట్లు విద్యార్థులకు వారానికి రెండు దినములు కోడిగుడ్డును వేయడం జరుగుతుంది పాడినవి కోడిగుడ్లు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు అందించకుండా వాటిని తొలగించి వాటి స్థానంలో సరఫరాధరుల నుండి మంచివి తీసుకోవాలని సూచించారు ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు ఐ. ఎమ్. ఎమ్. ఎస్ ఆన్లైన్ ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు రోజువారి మెనూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు పాఠశాల మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ రోజు భోజనం అనంతరం అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎ. ఎన్. ఎమ్. ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న డి వార్మింగ్ డే నులి పురుగు నియంత్రణ మాత్రలు కార్యక్రమం పరిశీలించారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...