దళిత సమైక్య సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో బంద్ విజయవంతం
జగ్గంపేట,పెన్ పవర్
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జగ్గంపేటలో దళిత సమైక్య సంఘాల ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం జగ్గంపేటలో దళిత సమైక్య తరపున నిర్వహించిన బంద్ కార్యక్రమంలో జగ్గంపేట మెయిన్ రోడ్డు, పుర వీధుల్లో తిరిగి దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటిని మూసివేయించి బంద్ కు సహకరించాలని కోరారు. అదేవిధంగా జగ్గంపేట మెయిన్ రోడ్డు పై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిద దళిత సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడుపు గట్టి చిన్నబాబు, దళిత ప్రజాచైతన్యం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆర్ పి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్, ఎం ఆర్ పి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుమర్తి గణేష్, దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యానందం, ఏ ఎం డీ కే ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దిరిశాల పండు, దళిత బహుజన ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మోర్త తాతారావు, ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..






