Followers

ఐ.ఎన్.నగర్ కాలనీ సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే మైనంపల్లి

 ఐ.ఎన్.నగర్ కాలనీ సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే మైనంపల్లి




పెన్ పవర్,మల్కాజిగిరి

 మల్కాజిగిరి గౌతంనగర్ డివిజన్ లోని ఐ.ఎన.నగర్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్దానిక కాలనీ సమస్యలపై పర్యటించారు. పెండింగులో ఉన్న రోడ్డు పనులు మంచినీటి పైప్ లైన్ లీకేజీలు తదితర సమస్యలు కాలని వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న తాగునీరు, రోడ్డు, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.వి. సతీష్ కుమార్, మహేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

బేటి బచావో బేటి పడావో కరపత్రాల విడుదల

 బేటి బచావో బేటి పడావో కరపత్రాల విడుదల




 ఆదిలాబాద్,పెన్ పవర్

జిల్లా బాలల పరిరక్షణ విభాగము, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కరపత్రాలను ఆదిలాబాద్  డి యస్ పి వెంకటేశ్వర్లు చేతులమీదగా శనివారం  విడుదల చేశారు.డి యస్ పి మాట్లాడుతూ ఈ సమాజంలో ఆడపిల్లలని పుట్టనిద్దాం, చదువనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో  లింగ వివక్షత లేకుండా బాలబాలికలకు సమాన అవకాశాలు ఇవ్వాలని విద్య, ఉద్యోగ, రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.బాలల అక్రమ రవాణాను నియంత్రించుటకు  కలెక్టర్ చౌక్ లోని ఆటోలకు, బస్సు లకు పోస్టర్స్ అతికించరు.గుర్తు తెలియని  వ్యక్తులు ఎవరైనా పిల్లలను అపహరించడం, వివక్షకు గురి చేయడం గమనించినట్లయితే ఆటో డ్రైవర్లు 1098,100 సమాచారం ఇవ్వాలని డీఎస్పీ అన్నారు.



అదేవిధంగా బాల కార్మికులు, బాల్య వివాహాలు, వివక్షకు గురవుతున్న అటువంటి పిల్లలు, అక్రమ రవాణాకు గురవుతున్న అటువంటి పిల్లలు, బిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా తారసపడిన చో చైల్డ్ లైన్ 1098  కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ట్రాఫిక్ సీ ఐ గంగాధర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త తిరుపతి, పోలీస్,1098 సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా పరిషత్ కార్యాలయములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

 ప్రజా పరిషత్ కార్యాలయములో   అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు




జగిత్యాల,పెన్ పవర్

మహిళలను  అన్ని రంగాలలో అభివృద్ది పథములో నడిపిస్తున్న శ్రీ కే.సి.ఆర్ గారి మార్గనిర్దేశకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...దావ వసంతసురేష్ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో శ్రీమతి దావ వసంతసురేష్,చైర్ పర్సన్, జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ గారి ఆధ్వర్యములో  మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఇట్టి కార్యక్రమములో శ్రీమతి సింధు శర్మ,IPS సూపరింటేన్డెంట్  ఆఫ్ పోలీస్,జగిత్యాల  ముఖ్య అతిధిగా హాజరైనారు. శ్రీమతి అరుణ శ్రీ, అడిషనల్ కలెక్టర్,స్థానిక సంస్థలు , వెల్గటూర్ జిల్లా ప్రాదేశిక వర్గ సభ్యులు శ్రీమతి బి.సుధారాణి ,  కొడిమ్యాల జిల్లా ప్రాదేశిక వర్గ సభ్యులు శ్రీమతి పి.ప్రశాంతి , బీర్పూర్ జిల్లా ప్రాదేశిక వర్గ సభ్యులు శ్రీమతి పి.పద్మ  ఇబ్రహీంపట్నం జిల్లా ప్రాదేశిక వర్గ సభ్యులు శ్రీమతి కే.భారతి , రాయికల్ జిల్లా ప్రాదేశిక వర్గ సభ్యులు శ్రీమతి అశ్విని జాదవ్  హాజరైనారు.అలాగే, కథలాపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జవ్వాజి రేవతి , జగిత్యాల అర్బన్ మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మ్యాదరి వనిత , మేడిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దొనకంటి ఉమాదేవి , పెగడపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గోలి శోభ , రాయికల్ మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి లావుడ్యా సంధ్యారాణి  హాజరైనారు. జిలా స్థాయి అధికారులు, జి.ప్ర.ప. ముఖ్యకార్యనిర్వహణాధికారి ,జిల్లా ట్రెజరీ అధికారి శ్రీమతి ఎస్.పద్మ , శ్రీమతి ఎల్.శ్రీలత, జి.ప్ర.ప. ఉప ముఖ్యకార్యనిర్వహణాధికారి,డి.ఎం.మార్క్ ఫెడ్ శ్రీమతి దివ్య  హాజరైనారు.అదేవిధంగా ఇట్టి కార్యక్రమమునకు మండల స్థాయి మహిళా అధికారులైన మండల పరిషత్ అభివృద్ది అధికారులు, సి.డి.పీ.ఓ. లు, మండల పంచాయతి అధికారులు, ఏ.పి.ఓ.(MNREGA), ఎ.పి.యం.IKP,మండల విధ్యాధికారులు, వైద్యాధికారులు,ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం.లు, జిల్లా మండల కార్యాలయములలో వివిధ స్థాయి లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, జిల్లా సమాఖ్య సంఘ భాధ్యులు తదితరులు హాజరైనారు.     

జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమము ప్రారంభమై చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో సభికులను ఆనందపరచడం జరిగినది.తదనంతరము కార్యక్రమమునకు హాజరైన మహిళా అధికారులు, ఉద్యోగినులు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు విద్యావంతులై వారి పిల్లలను సరైన మార్గంలో నడిపించవలసిన మరియు సమాజ సేవలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నదని తెలిజేసినారు. ఇట్టి కార్యక్రమ ముఖ్య అతిధి శ్రీమతి సింధు శర్మ,IPS సూపరింటేన్డెంట్  ఆఫ్ పోలీస్,జగిత్యాల  మాట్లాడుతూ విషయములో నేటి సమాజములో జరుగుచున్న అరాచకాలను అధిగమించుటకు మహిళలు తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకోవాలని తెలియజేసినారు.కార్యక్రమమును నిర్వహించిన శ్రీమతి దావ వసంతసురేష్,చైర్ పర్సన్, జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్  మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు తోటి ఆడవారితో ఈర్శాద్వేషాలతో కాకుండా  ప్రేమాభిమానాలతో మెలగాలని అభిప్రాయము వ్యక్తం చేసినారు. మహిళలు శక్తి వంతులై ధైర్యముగా ముందుకు సాగాలని తెలియజేసినారు.మహిళలకు భద్రత కల్పించాలనే సదుద్దేశముతో షి టిమ్ లను నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదములు తెలియ చేసినారు.నేటి మహిళలు అన్ని రంగాలలో పోటీపడి విజయపథంలో నడవడం మహిళాలోకం గర్వించదగ్గ పరిణామమని ఇందుకు మార్గదర్శక నిర్దేశం చేస్తున్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్ రావు గారికి ఇట్టి సంధర్బంలో ధన్యవాదములు తెలియజేసినారు.

           ఇట్టి కార్యక్రమములో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులు,ఉద్యోగులను శాలువాలతో సత్కరించి మోమెంటో బహుకరించారు.

వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన...

 వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన ...



 విజయనగరం,పెన్ పవర్

ప్రజా సంక్షేమ పాలకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఆశీర్వదిస్తూ నగరపాలక  ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం 37 వ వార్డు వీటి అగ్రహారం బిసి కాలనీలో, 45 వ వార్డు కేఎల్  పురం రెవెన్యూ కాలనీలో, 11వ వార్డు షాదీఖానా వద్ద ,50 వార్డు గాజులరేగ రాళ్ల వీధి, వైయస్సార్ నగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ  వార్డులు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికలు కీలకమైనవని అన్నారు. ప్రజలు ఆలోచించి ప్రజారంజక పాలన అందిస్తున్న పాలకులకు, నాయకులకు మద్దతుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, మరింత ఆనందంగా అన్ని కుటుంబాలు  శ్రేయస్కరంగా ఉండాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించి పార్టీని బలపరచాలని అన్నారు. మంచి ప్రజాదరణ కలిగిన నేతగా కోలగట్ల వీరభద్రస్వామి అండగా నిలుస్తున్నారని ఇదే స్ఫూర్తి కొనసాగాలంటే నగరపాలక సంస్థ పీఠాన్ని వైసిపి కి కట్టబెట్టాలన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ  తాత్కాలిక ప్రలోభాలకు ఆకర్షితులై శాశ్వత ఆనందానికి దూరం కావద్దని ప్రజలకు హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం నాయకులు నగరానికి చేసింది శూన్యమే నని అన్నారు. ఉన్న నిధులను ఖర్చు పెట్టలేక వెనక్కి పంపిన ఘనత తెలుగుదేశం నాయకులకే చెల్లిందన్నారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుని వైసిపికి పట్టం కడితే నగరం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 37 అభ్యర్థి కడియాల రామకృష్ణ, 45 పార్టీ అభ్యర్థి తాళ్లపూడి సంతోషి కుమారి, 11వ వార్టు అభ్యర్థి వెంపటాపు విజయలక్ష్మి, 50వ వార్టు అభ్యర్థి పట్టా ఆదిలక్ష్మి ,వైసిపి నాయకులు,జోనల్ ఇన్ చార్జిలు పాల్గొన్నారు.

ఉచిత పంటల భీమా కోసం బయోమెట్రిక్ వేయాలి

ఉచిత పంటల భీమా కోసం బయోమెట్రిక్ వేయాలి



పెన్ పవర్, కరప

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వైయస్సార్ ఉచిత పంటల బీమా సౌకర్యం పొందాలంటే రైతులందరూ తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రంకెళ్ళి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయాలని మండల వ్యవసాయ అధికారి ఏ.గాయత్రీదేవి తెలిపారు.రైతులు ఆధార్ కార్డు తీసుకుని  ఆర్బికేల వద్దకు వెళితే  విఏఏ లు రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకొని, వేలిముద్ర తీసుకుంటారు అన్నారు.కరప ఆర్బికే ను శనివారం ఆమె సందర్శించి వీఏఏ కే.కిరణ్మయి, ఆర్.సత్యప్రసాద్ లకు సూచనలు చేశారు.మండల పరిధిలో 1,4631మంది రైతులు ఉండగా ఇంతవరకు సుమారుగా 1,850 మంది వరకు రైతులు వైఎస్సార్ బీమా కోసం నమోదు చేయించుకోవడం జరిగిందన్నారు.సిగ్నల్ లేక బయోమెట్రిక్ తీసుకోవడం ఆలస్యమవుతున్నట్టు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది అని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

వాడపల్లి వెంకన్న కు విరాళం వెల్లువ

 వాడపల్లి వెంకన్న కు విరాళాల వెల్లువ 




 పెన్ పవర్,ఆత్రేయపురం

  వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానానికి  శనివారం పురస్కరించుకుని వచ్చిన భక్తులు ఆ స్వామి వారి యొక్క అన్నప్రసాదం ట్రస్ట్ రాజమహేంద్రవరం కి  చెందిన శాఖల అనిల్ గాయత్రి దేవి దంపతులు10,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన మాధవరం వెంకటరమణ ఇందిరా దంపతులు 10116/- రూపాయలు ఏలూరు మండలం  గెలిపూడి గ్రామానికి చెందిన పోతుల రాజ వరప్రసాద్ మోహన్ సాయి దంపతులు 10116 రూపాయలు నర్సాపురం గ్రామానికి చెందిన గుడి కొండ వీర వెంకట సత్యనారాయణ ఉషారాణి దంపతులు 11 వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆ స్వామివారి అన్నప్రసాదం ట్రస్ట్ కు  విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఆ పుణ్య దంపతులకు ఆ వెంకటేశ్వరస్వామి చిత్ర  పటాన్ని ఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేశారు.

కస్టమ్ హైరింగ్ నిర్వహణపై అవగాహనా కార్యక్రమం

 కస్టమ్ హైరింగ్ నిర్వహణపై అవగాహనా కార్యక్రమం



తాళ్ళపూడి, పెన్ పవర్

 శనివారం ఆత్మా తాళ్ళపూడి వారి సౌజన్యంతో కొవ్వూరు ఎడిఎ పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాళ్ళపూడి మండలంలోని కస్టమ్ హైరింగ్ నిర్వహణ, నూతన వ్యవసాయ యాంత్రీకరణ పద్దతులపై అవగాహనా కార్యక్రమం తాళ్ళపూడి  మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎడిఎ  చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంబించబోతున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లలో భాగంగా రైతులు 40% ప్రభుత్వ రాయితీ, 50% బ్యాంక్ లోన్, 10% రైతుల సొంత సొమ్ము ద్వారా దపదపాలుగా లేదా ఒకేసారి కావలసిన పరికరాలు గ్రూప్ ద్వారా కొని రైతుభరోసా కేంద్రానికి అనుసంధానంగా గ్రామంలో అద్దెకు తిప్పి, తద్వారా వచ్చే సొమ్ముతో ఉపాధి పొందవచ్చు నని, మరియు బ్యాంక్ రుణం తీర్చవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని జి.రుచిత, ఆత్మా కమిటీ సభ్యులు ఎల్లిన శివయ్య, బత్తుల సూర్యచంద్రం, సిహెచ్సి గ్రూప్ సభ్యులు, విఎఎ లు, విహెచ్ఎ లు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...