Followers

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు

మందమర్రి, పెన్ పవర్



మందమర్రి ఏరియా ఎల్లందు క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలందరికీ శనివారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  చింతల లక్ష్మీ శ్రీనివాస్ విచ్చేసి  మహిళలందరికీ  శుభాకాంక్షలు తెలియజేసి  పోటీలను ప్రారంభించారు. టగ్ ఆఫ్ వార్,  షాట్ ఫుట్, టిటి బాల్ త్రో,  మ్యూజికల్ బాల్  పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  చింతల లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ, పోటీలకు మందమర్రి ఏరియాలోని సుమారు 150 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైపిఎం రెడ్డి మల్ల తిరుపతి, కమ్యూనికేషన్ అండ్ సేవా కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ లేడీస్ క్లబ్ మెంబర్ లక్ష్మి  శ్రీనివాస్,   స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీ హెచ్ రమేష్, ఎన్. తిరుపతి, కమ్యూనికేషన్ అండ్ సేవా సమితి కో ఆర్డినేటర్ ఎం. నెల్సన్, తుమ్మల సంపత్,     సేవా సభ్యులు ఫ్యాకల్టీలు, మహిళలు పాల్గొన్నారు.

ఆయుర్వేదిక్ దవాఖానా కు జాతీయ విశిష్టత పురస్కారం

 ఆయుర్వేదిక్ దవాఖానా కు దక్కిన జాతీయ విశిష్టత పురస్కారం

చింతూరు,పెన్ పవర్

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా లోని కొవ్వూరు లో బుధవారం KVS ఫంక్షన్ హాల్ లో యువతేజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విశిష్టత పురస్కారాన్ని తూర్పుగోదావరి జిల్లా, చింతూరు ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ దవాఖానా కు చెందిన షేక్.సుబహాని  గారికి అందజేసారు.కరోనా సమయంలో చేసినటువంటి వీరి సేవలను గుర్తించి ఈ అవార్డు ను  అందించడం జరిగింది. ఈ అవార్డు ను శ్రీవాణి నాచురోపతి కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చంద్రపూర్ ఫౌండర్ డాక్టర్.రాహుల్ పదల్ వార్ గారు, విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తాళ్లూరి సువర్ణ కుమారి గారు, యువతేజం ట్రస్ట్ చైర్మన్ కరీముల్లాగారు అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడానికి కారకులైన ఆప్రిన్ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్, జమాల్ ఖాన్ కి నా ధన్యవాదాలు తెలుపుతున్న అని అన్నారు.

మల్లంపేట్ లో సమీకృత వ్యాపార సముదాయానికి కలెక్టర్ స్థలపరిశీలన.

 మల్లంపేట్ లో సమీకృత వ్యాపార సముదాయానికి కలెక్టర్ స్థలపరిశీలన..

దుండిగల్,పెన్ పవర్

దుండిగల్ మున్సిపల్ పరిధిలో సమీకృత వ్యాపార సముదాయం ఏర్పాటుకు ఎకరం స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.. శనివారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మెహంతి మల్లంపేట్ లోని సర్వే. 258లో సమీకృత వ్యాపార సముదాయానికి కేటాయించిన ఒక ఎకరం స్థలాన్ని పరిశీలించారు.. శాఖాహారా మాంసాహార మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉండాలని.. వ్యాపారా సముదాయాల వద్ద సౌకర్యాలను వసతులను ఏర్పాటు చేయాలని.. వ్యాపారస్తులకు కేటాయించిన షాపులలో మాత్రమే క్రయవిక్రయాలు జరగాలని..ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని దుండిగల్ మున్సిపల్ అధికారులకు కలెక్టర్ శ్వేతామహాంతి తెలిపారు..దుండిగల్ మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతిని కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.. వ్యాపార సముదాయాలకు కేటాయించిన స్థలం వివరాలను, ప్రతిపాదించి పూర్తి విషయాలను తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.. ఈ కార్యక్రమములో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శాంసన్, గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుంకరి కృష్ణవేణి కృష్ణ, మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, గండిమైసమ్మ మండల డిప్యూటీ తహసీల్దారు సుధాకర్, గండిమైసమ్మ మండల సర్వేయర్, మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,

ఆదిత్యలో సరస్వతీ, సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు

 ఆదిత్యలో సరస్వతీ, సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు

గండేపల్లి,పెన్ పవర్

  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ప్రాంగణంలో గల ఆధ్యాత్మిక వేదిక సరస్వతీ దేవి, శిరిడి సాయి బాబా ఆలయాల తృ తీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెండు  రోజులపాటు (ది.07-3-2021 నుండి ది.08-3-2021)  ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, ఈ రెండు రోజులు( ఆది, సోమవారం)  సాయి బాబా వారికి  ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక హారతులు తదితర పూజలు నిర్వహించబడతాయని, ది.08-3-2021న అష్టోత్తర  కలశాభిషేకం, సా.4-00గం.లకు శిరిడీ సాయి బాబా వారి ఊరేగింపు ఉంటుందని, అలాగే సరస్వతి దేవికి  పంచాయతన హోమాలు  ఉదయం.8-00గం.లకు అభిషేకాలు, సా.4-00గం.లకు హోమాలు, రాత్రి కుంకుమార్చన, పుష్పాలంకరణ సేవలు  ది.08-3-2021న సా.4-00గం.లకు   అమ్మ వారి ఊరేగింపు ఉంటుందని, ది.08-3-2021పూర్ణాహుతి తో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. కావున భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ని గెలుపించాలి

 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ని గెలుపించాలి హనుమంత్ ముదిరాజ్

వికారాబాద్, పెన్ పవర్

ఈ నెల 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వేములవాడ చిన్నారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ కోరారు. పరిధిలోని ఇండోర్ స్టేడియంలో ఆయన ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థిచిన్నారెడ్డి . చాలా మంచి వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని హనుమంతు వివరించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షులు, అంజి తదితర నాయకులు పాల్గొన్నారు, వికారాబాద్ జిల్లా కార్యదర్శి హనుమంతు, పలువురు నాయకులు ఉదయం మార్నింగ్ వాకింగ్ చెసుకుంటు ప్రచార నిర్వహించారు

వాలీబాల్, టోర్నమెంట్ ప్రారంభించిన - వైస్ ఎంపీపీ

 వాలీబాల్, టోర్నమెంట్ ప్రారంభించిన - వైస్ ఎంపీపీ

పెన్ పవర్ ,మందమర్రి 


మందమర్రి మండలం లోని ఆదిల్ పేట్, గ్రామంలో ఆదే, రవి, స్మారకార్థం, వాలీబాల్ టోర్నమెంట్, ప్రారంభించడం, జరిగింది, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ,  రాజ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల, అధ్యక్షుడు, సంజీవ రావు, మాట్లాడుతూ, యువతకు, అటలు, అడటం, వల్ల, క్రీడాకారులు, ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట్ గ్రామ సర్పంచ్ పున్నం, శంకర్ పల్లి సర్పంచ్, సది, మామిడి గట్టు, సర్పంచ్, రాయ లింగు సారంగ పల్లి, సర్పంచ్ పర్వీన్ సుల్తానా, ఫిరోజ్, బొక్కల గుట్ట యూత్ అధ్యక్షులు,  సంజీవ్, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, పట్టణ యూత్ తదితరులు పాల్గొన్నారు.

బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి..

 బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి......

పెన్ పవర్, ఆలమూరు 

  బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆలమూరు మండల సీఆర్పీలు అన్నారు. మండల పరిధి మడికి, చెముడులంక, జొన్నాడ గ్రామాలలో గల ఇటుకల బట్టీలు, వీధుల్లో ఖాళీగా తిరిగే బాలలు, పలు వాణిజ్య సంస్థల నందు పని చేసేవారిని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు శనివారం పిల్లల గుర్తింపు, బడిబయట ఉన్న వీధిబాలల సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా జొన్నాడలో సుమారు ఆరుగురు విద్యార్థులను బడి బయట పిల్లలను (ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిని ) గుర్తించారు. అలాగే మడికి గ్రామంలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను అదే గ్రామంలో గల సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు సన్నాహాలు  చేపట్టారు. ఈ కార్యక్రమంలో. సీఆర్పీలు పెద్దిరెడ్డి శ్రీనివాసు,  గంటి శ్రీను, ఒప్పంద ఉపాధ్యాయులు మేడపాటి వీరలక్ష్మి, వడ్డి విజయలక్ష్మి, కె రామకృష్ణ, డిఎన్ లక్ష్మి, డి సత్యలు  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...