Followers

వాడపల్లి వెంకన్న కు విరాళం వెల్లువ

 వాడపల్లి వెంకన్న కు విరాళాల వెల్లువ 




 పెన్ పవర్,ఆత్రేయపురం

  వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానానికి  శనివారం పురస్కరించుకుని వచ్చిన భక్తులు ఆ స్వామి వారి యొక్క అన్నప్రసాదం ట్రస్ట్ రాజమహేంద్రవరం కి  చెందిన శాఖల అనిల్ గాయత్రి దేవి దంపతులు10,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన మాధవరం వెంకటరమణ ఇందిరా దంపతులు 10116/- రూపాయలు ఏలూరు మండలం  గెలిపూడి గ్రామానికి చెందిన పోతుల రాజ వరప్రసాద్ మోహన్ సాయి దంపతులు 10116 రూపాయలు నర్సాపురం గ్రామానికి చెందిన గుడి కొండ వీర వెంకట సత్యనారాయణ ఉషారాణి దంపతులు 11 వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆ స్వామివారి అన్నప్రసాదం ట్రస్ట్ కు  విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఆ పుణ్య దంపతులకు ఆ వెంకటేశ్వరస్వామి చిత్ర  పటాన్ని ఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేశారు.

కస్టమ్ హైరింగ్ నిర్వహణపై అవగాహనా కార్యక్రమం

 కస్టమ్ హైరింగ్ నిర్వహణపై అవగాహనా కార్యక్రమం



తాళ్ళపూడి, పెన్ పవర్

 శనివారం ఆత్మా తాళ్ళపూడి వారి సౌజన్యంతో కొవ్వూరు ఎడిఎ పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాళ్ళపూడి మండలంలోని కస్టమ్ హైరింగ్ నిర్వహణ, నూతన వ్యవసాయ యాంత్రీకరణ పద్దతులపై అవగాహనా కార్యక్రమం తాళ్ళపూడి  మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎడిఎ  చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంబించబోతున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లలో భాగంగా రైతులు 40% ప్రభుత్వ రాయితీ, 50% బ్యాంక్ లోన్, 10% రైతుల సొంత సొమ్ము ద్వారా దపదపాలుగా లేదా ఒకేసారి కావలసిన పరికరాలు గ్రూప్ ద్వారా కొని రైతుభరోసా కేంద్రానికి అనుసంధానంగా గ్రామంలో అద్దెకు తిప్పి, తద్వారా వచ్చే సొమ్ముతో ఉపాధి పొందవచ్చు నని, మరియు బ్యాంక్ రుణం తీర్చవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని జి.రుచిత, ఆత్మా కమిటీ సభ్యులు ఎల్లిన శివయ్య, బత్తుల సూర్యచంద్రం, సిహెచ్సి గ్రూప్ సభ్యులు, విఎఎ లు, విహెచ్ఎ లు, తదితరులు పాల్గొన్నారు.

వాడపల్లి వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

 వాడపల్లి వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 




పెన్ పవర్,ఆత్రేయపురం 

  వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత కొలువై ఉన్నారు  శనివారం పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు  కాలినడకన వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్రానికి ఆలయం వద్దకు చేరుకున్న   భక్తులకు సాయంత్రం భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది  స్వామి వారి దర్శనార్థమై తెల్లవారుజాము నుండి  భక్తులు  క్యూ లైన్ లో ఉండి ఆ గోవిందుడి  నామ తో  ఆలయమంతామరిమోగయ్  స్వామి వారికీ తలనీలాలు ఇచ్చే భక్తులు   గోదావరి  తీరాన ఏర్పాటుచేసిన కేసరా ఖండ  దగ్గర భక్తుల తాకిడి ఎక్కువైనది    భక్తులు తాకిడి నీ దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బంది కలగకుండా తగ్గు  ఏర్పాటు చేయడం జరిగినది.

గ్రామసచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి

 గ్రామసచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి 



పెన్ పవర్,ఆలమూరు 

   ఆలమూరు గ్రామ సచివాలయం సిబ్బంది ప్రజలందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండి వారికి జవాబు దారితనం గా ఉండాలని జాయింట్ కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి  అన్నారు అమె శుక్రవారం మండల కేంద్రమైన ఆలమూరు సచివాలయంతో పాటు గుమ్మిలేరు సచివాలయం లో జరుగుతున్న ఆన్లైన్ పక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ బీమా,అసరా,చేయూత మొదలగు పథకాలను  సచివాలయానికి వచ్చే ప్రజలందరికీ అలసత్వం వహించకుండా వారికి సకాలంలో దరఖాస్తులు అందజేయాలని అలాగే  ఆన్లైన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అమె అన్నారు దీనిపై మండల స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు  పర్యవేక్షించాలని  తెలియజేశారు   ఆమెతో పాటు  మండల పరిషత్ పరిపాలన అధికారి టి  సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి డి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో శాఖాహార,మాంసాహార మార్కెట్ల ఏర్పాటు....కలెక్టర్

ప్రజలకు అందుబాటులో శాఖాహార,మాంసాహార మార్కెట్ల ఏర్పాటు....కలెక్టర్


జిల్లాలోని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్లకు కలెక్టర్ స్థల పరిశీలన

ప్రజలకు అనుకూలంగా ఉండే చోట్లనే మార్కెట్లు ఏర్పాటు చేయాలి

దుకాణ దారులకు కేటాయించిన వద్దనే విక్రయాలు జరుపుకోవాలి

మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలి

మార్కెట్లకు స్థలాలను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి

మేడ్చల్ మల్కాజిగిరి,పెన్ పవర్



మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో శాఖాహార, మాంసాహార మార్కెట్లకు అవసరమైన చోట్ల స్థలాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు.. శనివారం ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి మార్కెట్ల నిర్మాణం కోసం స్థలాలను కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా పరిశీలించారు.. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, పోచారం, బోడుప్పల్, ఫీర్జాదీగూడ, దుండిగల్, కూకట్పల్లి, నిజాంపేటలలో పలు స్థలాలు కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. పలు చోట్ల శాఖాహార మాంసాహార మార్కెట్లకు కావాల్సిన స్థలం..ప్రజలకు అందుబాటులో ఉందా..? లేదా..లేదా..? అనే విషయాలతో పాటు ప్రస్తుతం మార్కెట్లను ఎక్కడ కొనసాగిస్తున్నారన్న వివరాలను మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు.శాఖాహార..మాంసాహార మార్కెట్లు జనవాసాలకు అందుబాటులో ఉండాలి..



ఈ సందర్భంగా స్థలాలకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలించారు. మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో పాటు ఆమోదయోగ్యంగా ఉండాలని,,అన్ని వసతులకు అనుకూలంగా ఉండాలని, ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్థలాల వివరాలను వెంటనే తనకు ప్రతిపాదనల రూపంలో అందచేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.. నూతనంగా ఏర్పాటు చేయబోయే  మార్కెట్లలో ఆయా మున్సిపాలిటీలలో జనావాసాలకు దగ్గరగా ఉండే విధంగా సర్వే చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంపొందించే విధంగా ప్రజలకు సౌలభ్యాలు, సౌకర్యాలు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా చోట్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్,  జిల్లాలోని ఆయా మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, ల్యాండ్ అండ్ సర్వే రికార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంపార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

 ఇంపార్మర్ నెపంతో గిరిజనుడి హత్య


గూడెం కోత్తవీధి,పెన్ పవర్

మిలిసియా సభ్యునిగా పని చేసి లొంగిపోయిన గిరిజనున్నిఇంపార్మర్ నెపంతో  మావోయిస్టులు హతమార్చారు.విశాఖ మన్యంలోని జికెవిది మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామానికి వచ్చిన సాయుధ మావోయిస్టులు ఇంట్లో నిద్రిస్తున్న కొర్ర పిల్కు అనే గిరిజనుడ్ని బయటకు తీసుకువచ్చి గొడ్డలితో నరికి చంపారు.ఆ సమయంలో అడ్డుకున్న  భార్యమిత్తు ని కొట్టడంతో చేతిపై గాయమైంది. ఈయన మిలిసియా సభ్యుడిగా పనిచేస్తూ లొంగిపోయి పోలీసుఇంపార్మర్ గా మారినట్లు మావోయిస్టు పార్టీ గాలికొండ ప్రాంతీయ కమిటీ  పేరుతోసంఘటన స్థలంలో ఒక లేఖ వదిలివెళ్లారు.గ్రామాల్లోవుంటూ  మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేసి కుంబింగ్ చేయించేవారని అందులో పేర్కొన్నారు.ప్రజాకోర్టు పెట్టి హెచ్చరించిన పద్ధతి మార్చుకోకపోవడంతో శిక్ష విధించామని తెలిపారు.పిల్కు కి భార్య ,నలుగురు పిల్లలు ఉన్నారు.( ఫోటో : పిల్కు మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య,పిల్లలు.

తమ్ముళ్లు.. రవిశంకర్ యువకుడు చదువుకున్నవాడు

తమ్ముళ్లు.. రవిశంకర్ యువకుడు చదువుకున్నవాడు

రవి శంకర్ నీ గెలిపించండి...చంద్రబాబు నాయుడు

మహారాణి పేట, పెన్ పవర్

 విశాఖలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో లో మాట్లాడుతూ ఈ దొంగలకు మేయర్ పీఠం దక్కింది అంటే ప్రశాంతం గా ఉన్న వైజాగ్ ని రౌడీయిజం. గుండాయిజం తో చెలరేగిపోతారని మరో ఫ్యాక్షన్  అడ్డాగా మారుస్తారని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని  నిత్యావసర సరుకులు అధిక రేట్లుపెంచేశారు.పేదవాడు రోజంత కష్టపడి వచ్చి పొరపాటున మధ్యం షాప్ కి వెళితే జోబి మొత్తం ఖాళీ మధ్యం రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచేశారు.అమ్మఒడి రూ14000 ఇచ్చి నాన్నబుడ్డీ అని ఇచ్చిన డబ్బులు వడ్డీ తో లాగేస్తున్నారు ఇవన్నీ మనం గుర్తు ఉంచుకొని తమ్ముళ్లు విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ కి ఇచ్చి మన వైజాగ్ ని కాపాడుకుందాం. తమ్ముళ్లు 37వ వార్డు టీడీపీ అభ్యర్థి బంగారి రవిశంకర్ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను తమ్ముళ్లు.. రవిశంకర్ యువకుడు చదువుకున్న వాడు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చంద్రబాబు అన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...