Followers

జెసిబి లారీలు సీజ్

జెసిబి లారీలు సీజ్

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

అక్రమంగా మైనింగ్ తవుతున జెసిబి రెండు లారీలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో అక్రమంగా గ్రావెల్.  తవ్వుతున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసారు  ఆ సమయంలో అక్కడ ఉన్న జెసిబితో పాటు రెండు లారీలను పట్టుకున్నారు వాటిని స్వాధీనం చేసుకుని తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు అప్పగించారు.

పాడిపరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

పాడిపరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

 పెన్ పవర్,కరప

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం సొమ్ములతోపాటు, బ్యాంకుల నుంచి రుణపరపతి పొందిన మహిళలు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. మహిళల స్వయం ఉపాధికోసంఅమలు చేస్తున్న చేయూత పథకానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. కరప మండలం అరట్లకట్టలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ద్వారా 33 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేసి, ఆయన మాట్లాడారు. బ్యాంక్ లోన్ ద్వారా పాడిగేదెలు కొనుగోలు చేసుకుని, అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ చేపట్టేవరకు పాలను బయట అమ్ముకోవాలన్నారు. పాడిగేదెలు పెంపకంవల్ల అదనపు ఆదాయం చేకూరడమేకాకుండా కుటుంబసభ్యులకు పాలడ్వారా పోషకాహారం లభిస్తుందన్నారు. 45 ఏళ్లనుంది అని ఏళ్ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చేయూత పడకంలో మొదటి విడతగా రూ.18.750 లు ఇవ్వడం జరిగిందని, దీనికి బ్యాంకులద్పారా రూ 56250 లు లోన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం రూ 15 వేలతో పాడిగేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏటా వచ్చే చేయూత సామ్మును ద్యాంకులోన్కు జమవుతుందన్నారు. ముందుగా బ్యాంక్ లో జేయాతవధకంలో ఇచ్చే లోన్ డాక్యుమెంటేషన్ ప్రాసెసిను పరిశీలిందారు, చేయూత పధకం ఉదేశాన్ని కరెర్ మురళీధర్ రెడ్డి లబిచారులకు వివరించి, ఈవధకాన్ని ఎలా వినియోగించు కుంటారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యాంకులో ఇవ్వని విధంగా అత్యధికంగా లోన్లు మంజూరు చేసినందుకు, 138 మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేసినందుకు యూనియన్ బ్యాంక్ ఆరట్టకట్ట బ్రాండ్ మేనేజర్ టి.కమలాకరరావును కలెక్టర్ మురీధర్రెడ్డి అడినందంచి, పత్కనిండారు. గ్రామసర్పంచ్ గోపి సత్యవేణి, ఎంపీడీక, కర్రె స్వప్న, చెలుగు పీడీ వై.,హరనాధ్, పకుసంపర్షకకాఖ జేడీ డాక్టర్ ఎన్ టీ శ్రీనివాసరావు, ఎడీ డాక్టర్ సురేష్ బాబు, వెలుగు ఏసీ ఆకోక్లటగరత్ ఎపీఎం టి.మురకళీక్ృష్ణ ఎం కె.బల్లి కృష్ణవేణి, ఈఓపీఆర్ సీహెచ్ కాలాలు వెంకటరమణ, వెటర్నరీ డాక్టర్లు రంజిత్ సింగ్, దీవివెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు ఇదేనా విధ్యా బోధనా?

 గిరిజన విద్యార్థులకు ఇదేనా విధ్యా బోధనా?

అరో తరగతి విద్యార్థి కి ఏడో ఎక్కం రాలేదు..

ఉపాధ్యాయులపై ఐ.టి.డి.ఏ.పీఓ ఆగ్రహం...

పెన్ పవర్,విశాఖపట్నం

 గిరిజన విద్యార్థుల విద్యాబోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్  సలిజామల  హెచ్చరించారు. సోమవారం సాయంత్రం  అంజలి శనివారం తదితర ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు  విద్యా బోధన  పై పరిశీలించారు. అంజలి శనివారం  మినీ గురుకులంలో  తరగతి విద్యార్థిని ఏడో ఎక్కం  చెప్పమన్నారు. విద్యార్థి  బిక్కమొహం వేసి  ఎగాదిగా  చూడడంతో  విద్యాబోధన ఏ మేరకు జరుగుతుందో ఆయన విష్మయం చెందారు. దీంతో ఆగ్రహించిన ఆయన గిరిజన విద్యార్థుల విద్య నాణ్యత ప్రమాణాల్లో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన విద్యార్థులకు విద్యాగంధం పూయాలన్న సంకల్పంతో  ప్రభుత్వం కోట్లాది రూపాయలు వచ్చేస్తున్న  ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు పథకం అమలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా  ఉన్నాయన్నారు. గడువు నాటికి నాడు నేడు పనులు పూర్తి కావాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. పాఠశాలలో  గిరిజన విద్యార్థులకు విద్యా బోధన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. నాడు నేడు పనులు  నిర్లక్ష్యం చేసిన అంజలి శనివారం ప్రధానోపాధ్యాయురాలు అచ్చమ్మకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నాడు నేడు పనులు విద్యా బోధన నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వెంకటేశ్వర సంజామల హెచ్చరించారు.

ఉద్యమాలు ఏవైనా ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీలే

 ఉద్యమాలు ఏవైనా  ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీలే 

చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ల తోనే సామాజిక న్యాయం 

బండారి బాల్ రెడ్డి ఆత్మీయ సన్మాన సభలో

 బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి  పర్ష హాన్మండ్లు

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్

ఉద్యమాలు ఏవైనా ప్రాణాలు ఇచ్చేది మాత్రం బీసీ లేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హాన్మండ్లు  అన్నారు.  మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లక్ష్మీ మల్లారెడ్డి  ఫంక్షన్ హాల్ లో బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నిక కాబడ్డ బండారి బాల్ రెడ్డి ని ఎల్లారెడ్డిపేట మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు . ఈ ఆత్మీయ సన్మాన సభ కు మండల శాఖ అధ్యక్షులు కంచర్ల రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి గా పర్ష హాన్మండ్లు  హాజరై  మాట్లాడుతూ బండారి బాల్ రెడ్డి ఆత్మీయ సన్మానం సభకు అన్ని బీసీ కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావడం బీసీల ఐక్యతకు నిదర్శనం అన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలు అసెంబ్లీ .పార్లమెంటులలో మాత్రం 8 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఇది బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయం అన్నారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు . బీసీలకు మంచి చేసే పార్టీలను స్వాగతించి  మద్దతు ఇస్తామని వ్యతిరేకించే పార్టీల భరతం పడతామని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీసీలు బానిస బతుకులకు స్వస్తి పలికితే భవిష్యత్తు అంతా బీసీలదే అవుతుందన్నారు. అన్ని రంగాలలో బిసి రిజర్వేషన్ 27 శాతం నుంచి 56 శాతం  కు పెంచాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీలకు 20 వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని  హనుమాన్లు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లా రేణుక కిషన్ మాట్లాడుతూ అంచెలంచెలుగా బీసీ సంఘం లో జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి బండారి బాల్ రెడ్డి అని ఆమే అన్నారు  బండారి బాల్ రెడ్డి  సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందడం గొప్ప విషయం అన్నారు . బీసీలు ఐక్యంగా అయితే సమస్యలు పరిష్కారం అవుతాయని మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా ఉండదన్నారు . బిసి బిడ్డ గా నేను బిసి జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నారు సన్మాన గ్రహీత  బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో పనిచేస్తూ బిసి ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు .భవిష్యత్తులో బిసి సంఘ బలోపేతానికి కృషి చేస్తూ బీసీ సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు.   ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆత్మీయ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బండారి బాల్ రెడ్డి  ప్రకటించారు.  ఈ ఆత్మీయ సభలో బీసీ సంక్షేమ సంగం మండల అధ్యక్షులు కంచర్ల రాజు.  కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నరసయ్య జిల్లా ఉపాధ్యక్షులు శేక్ గౌస్.  రజక సంఘం మండల అధ్యక్షులు పెద్దూరి కిష్టయ్య  ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ హైమద్ . తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రం బిజెపి సీనియర్ నాయకులు మద్దుల బుగ్గా రెడ్డి .దూస శ్రీనివాస్. మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నంది కిషన్ . పట్టణ అధ్యక్షులు వడ్నాల  లక్ష్మణ్ . మాజీ అధ్యక్షులు మీసం రాజం. వార్డు మెంబర్లు పందిర్ల శ్రీ నివాస్ గౌడ్. గంట బాలకిషన్ గౌడ్.రవి.  కార్యదర్శి సాన రవి.  కోశాధికారి వడ్నాల ఆంజనేయులు. కొండ ఆశి రెడ్డి . మాజీ ఎంపీటీసీ ఓగ్గు బాలరాజు యాదవ్. చంద్. మేగి నర్సయ్య. లాల్ బాయి. స్కైలాప్. వడ్నాల రామస్వామి. తదితరులు పాల్గొన్నారు.

మార్చి 15 నాటికి నాడు -నేడు పనులు పూర్తి కావాలి

 మార్చి 15 నాటికి  నాడు -నేడు పనులు పూర్తి కావాలి

 జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి




పెన్ పవర్, బ్యూరో (విశాఖపట్నం)

 జిల్లాలో అమలు జరుగుతున్న నాడు నేడు పనులను మార్చి 15లోగా పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం ఏజెన్సీలోని పాడేరు  జి.మాడుగుల మండలాల్లో జరుగుతున్న నాడు నేడు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో  నాడు నేడు పనులను ప్రారంభించినప్పటికీ  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  అధికారుల  నిర్లక్ష్యం కారణంగా  నత్తనడక నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని  పాలు మార్లు హెచ్చరించిన  ప్రధానోపాధ్యాయులు చలనం కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన  డీఈవో  ఏజెన్సీ లో జరుగుతున్న నాడు నేడు పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా పాడేరు గుడివాడ ప్రభుత్వ పాఠశాలల  వద్ద జరుగుతున్న నాడు నేడు పనులను తనిఖీ చేశారు. జి.మాడుగుల మండలం కే కూడా పల్లి ప్రభుత్వ పాఠశాల బాలుర గురుకుల పాఠశాల బాలికల మినీ గురుకులం పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అమ్మ ఒడి పథకం యూనిఫారం పంపిణీ ఎంతవరకు జరిగిందని ఆయన అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు నిర్మాణాల్లో  నాణ్యత ప్రమాణాలు ఆశించినంతగా లేవని పెదవి విరిచారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయాలు చిత్తశుద్ధితో పనిచేయాలని  ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఎంఐఎం కోఆర్డినేటర్ సత్య ప్రకాష్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ క్రాంతికుమార్ పాడేరు జి.మాడుగుల  ఎం ఈ ఓ లు  భూషణం సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు.

 ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

సిరిసిల్ల ,పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరవుపేట మండలం లోని లయన్ తండా, కమ్మరిపేట తండా, గోవిందరావుపేట తండా, లచ్చపేట తండా లలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ వలయాధికారి ఎంపీఆర్ చంద్రశేఖర్  ఆధ్వర్యంలో  సిబ్బంది దాడులు చేసి 120 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసారు. లీటర్ల నాటుసారా సీజ్ చేసారు .ఈ నాటు సారా తయారీ కి బాధ్యులు అయినటువంటి  వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఎవరైనా గుడుంబా తయారుచేసినా, అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఎస్సై కిషన్, ట్రైనీ ఎస్సైలు శ్రీకాంత్, శేఖర్ లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు,  హకానీ, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్స్ శంకర్, హమీద్,సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, పర్శరామ్, సుమలత, రజిత పాల్గొన్నారు.

వైఎస్ షర్మిలను కలిసిన జిల్లా వైఎస్సార్ సిపి నాయకులు

 వైఎస్ షర్మిలను కలిసిన  జిల్లా వైఎస్సార్ సిపి నాయకులు

మందమర్రి, పెన్ పవర్

హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల ను మంగళవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి నెల చివర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. షర్మిలను కలిసిన వారిలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,టీటీడీ ఎల్ఎసి సభ్యులు బెజ్జంకి అనిల్ కుమార్, నాయకులు షేక్ అజీమోద్దీన్, సుద్దాల ప్రభుదేవ్, వంశీ, బొంతు అఖిల్,జావేద్ తదితరులు కలరు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...