Followers

శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల

 శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల 

జమ్మికుంట,పెన్ పవర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రోజునా జరిగిన శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఈటల రాజేందర్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ని పురోహితులు వేద మంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు, అనంతరం పూజా కార్యక్రమాలు చేయించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఈటల మాట్లాడుతూ శివయ్య  ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే బోలా శంకరుడు అని అన్నారు, ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నానని అన్నారు,  ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని  అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, శ్రీరామ్ శ్యామ్, ఆలయ కమిటీ, వార్డు కౌన్సిలర్ లు, నాయకులు మరియు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి

 పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి


బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డిజిల్,నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా మంగళవారం బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య,ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ కేంద్ర  రాష్ట్రప్రభుత్వలు ప్రజా వ్యతిరేకపాలనసాగిస్తున్నాయని,ప్రజలపైనధరలభారాన్నిమోపుతున్నాయని,పూర్తిగా కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నాయని,ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని,అందుకే అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు పెంచినగ్యాస్,డీజిల్,పెట్రోల్,నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని లేనియెడల దశలవారి ఆందోళన  చేపడతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సబ్బని విజయలక్మి, బర్ల స్రవంతి,కాంపెల్లిరాధ,కిరణ్మయి, పద్మ,పసులేటి వెంకటేష్,కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

పెన్ పవర్,పొన్నలూరు 

పొన్నలూరు గ్రామానికి చెందిన వాకాని వేణు గోపాలా చార్యులు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నెల్లూరు హాస్పిటల్ కి కారులో వెళుతుండగా కొడవలూరు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను డికొట్టి ప్రక్క రోడ్డు పైకి దూసుకెళ్లింది.ఎదురుగా వస్తున్న ఇంద్ర బస్సు ఆ కారును డీ కొనడంతో పూజారి వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించాడు.వేణు గోపాలా చార్యులు పొన్నలూరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో పూజరిగాను ,కందుకూరు పామూరు రోడ్డు నందు ఉన్న రామాలయానికి పూజారి గాను పనిచేస్తున్నారు. అను నిత్యం అందరితో కలిసి మెలసి మంచిగా ఉండే వేణు గోపాలా చార్యులు మృతి చెందడంతో పొన్నలూరు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.గ్రామ ప్రజలు ,వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.ఇతని తో పాటు ఆ వాహనంలో గ్రామంలోని మరొక పూజారి మణికంఠ ,సుధాకర్ ,డ్రైవర్ వెంకటేశ్వర్లు లకు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.పోలీస్ వారు కేసు నమోదు చేసి ప్రమాదానికి జరిగిన కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

 తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

తాళ్ళపూడి,పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన టైలర్స్ యూనియన్ సభ్యులు దేశాబత్తుల దావీదు రోడ్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబం ఇతనిపై ఆధారపడి ఉంది. ఇతను టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ తరపున 25 కేజీల బియ్యం, 1000 రూపాయల నగదు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దావీదు మాట్లాడుతూ ఆపదలో ఉన్న సహాయం చేసిన తమ టైలర్స్ యూనియన్ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపి, మనలో ఎవరికైనా కష్టం కలిగితే ఇదేవిధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మరియు వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ  కార్యదర్శి యలమర్తి సుబ్రహ్మణ్యం, కోశాధికారి షేక్ కరిముల్లా, మలకపల్లి గ్రామ టైలర్స్ అధ్యక్షులు కుప్పాల గణపతి మరియు టైలర్స్ పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

 టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

వికారాబాద్,పెన్ పవర్

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని పాలేపల్లి గ్రామంలో ని పట్ట బద్రులు తమ ఓటు ను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదెవికి మీయెక్క ఓటు వేసి గెలిపించాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయం డ్తెరెక్టర్ బంగ్లా యదయ్యగౌడ్ కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చెస్తున్నా అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కార్యక్రమాలు ఉప్పరి తిరుపతయ్య ,ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ హనుమంతు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ

 సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ

గంభీరావుపేట్,పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరవుపేట మండలం లింగన్నపేట్ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తొమ్మిది మంది  లబ్ధిదారులకు  మండల ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు, ఈ కార్యక్రమంలో  ఎంపీపీ వంగ కరుణ-సురేందర్ రెడ్డి, జడ్పీటిసి కొమిరిశెట్టి విజయ-లక్ష్మణ్,   సర్పంచ్ దొంతినేని చైతన్య-వెంకట్రావు, కొత్తపల్లి సింగిల్విండో చైర్మన్ భూపతి సురేందర్ ఉపాసర్పంచ్ దుబాసి రాజు, ఎంపీటీసీ బెందే రేణుక-కృషమూర్తి, ఏఎంసీ చైర్మన్  సూతరి  బాలవ్వ , తెరాస మండల,అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు బిల్ల గోపాల్,  మండల యూత్ అధ్యక్షులు బిల్ల రాజు,  మాజీ ఏఎంసి చైర్మన్ దయాకరరావు, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర రాంచంద్రం, చెవుల మల్లేశం, మాజీ సర్పంచ్ నర్మాల రాజు, తెరాస సోషల్ మీడియా నాయకులు మెండే సుమన్, వార్డ్ సభ్యులు  ఆంజనేయులు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, నాయకులు బాణగారి దేవయ్య, పొసన్నగారి ఆంజనేయులు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

జెడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో మాక్ పార్లమెంట్

 జెడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో మాక్ పార్లమెంట్


చిన్నగూడూరు,పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలో మంగళవారం నాడు మాక్ పార్లమెంట్ జడ్.పి.హెచ్.ఎస్ చిన్నగూడూరు పాఠశాలలో నిర్వహించబడినది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏ రెహమాన్  మాట్లాడుతూ... 'పార్లమెంట్' దేశ పరిపాలనలో కీలకమైన  పాత్రను పోషిస్తుందని, సభా చట్టాలను ఆమోదంతో శాసనం చేస్తుందని అలాగే  విద్యార్థినీ విద్యార్థులు సభ నిర్వహణలో పాలుపంచుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా అలాగే ఆదర్శవంతమైన రాజకీయవేత్తలుగా భవిష్యత్ తరానికి పునాదిగా నిలబడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ భానోత్ అనిల్, ప్రధానమంత్రిగా కుమార్, వివిధ శాఖల మంత్రులు పూజ,ఉమా,కృష్ణజ, అరుణ్,వెంకటేష్ అలాగే ప్రతిపక్ష నేతలుగా గణేష్,ఉదయ్,స్రవంతి నరేంద్ర చారి మొదలగు పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా టి.తేజోన్నత రెడ్డి నోడల్ ప్రధానోపాధ్యాయులు జడ్.పి.హెచ్ఎస్ జయ్యారం మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు కె నాగేశ్వరరావు,కొలిపాక శ్రీనివాస్,జి.సతీష్ లు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో మిగతా ఉపాధ్యాయులు.వెంపటి విజయ్ రాజ్,సత్యం, సురేష్,రేణుకా దేవి,శ్రీనివాస్ రెడ్డి,కె.లలిత పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...