Followers

జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి

 జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి

మంచిర్యాల,  పెన్ పవర్

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా  పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ పట్టణ కమిటీ నాయకులు గుర్లె ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి  ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికిస్తున్నటువంటి కరోనా ముగిసిందని అనుకుంటే మళ్ళీ జిల్లాలో విశ్వరూపం చూపిస్తుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో,  హాస్టళ్లలో విద్యార్థులకు, సిబ్బందికి, ఉపాధ్యాయులకు కరోనా  వచ్చిన విషయం అందరికీ  తెలిసిందే. కరోనా  మళ్లీ విజృంభించక  ముందే   జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలు సంక్షేమ గురుకుల హాస్టల్ లోని విద్యార్థులకు కరోనా రాపిడ్ టెస్టుల్లో చేయించాలని, కరోనా  బారినపడ్డ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సిబ్బంది, ప్రజలకు  అందరికీ  అందుబాటులో ఉండే విధంగా జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని  జిల్లాలో  ఉన్నటువంటి పాఠశాల, కళాశాల, హాస్టళ్లలో ప్రతిరోజు శానిటైజర్ చేయించాలని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి  మహారాష్ట్రలో రోజుకు వేల సంఖ్యలో కరోనా  వ్యాపిస్తుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, వైద్య, పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాకు వచ్చే ప్రజలందరికీ  వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా  వచ్చినవాళ్లు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలని వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరుపున ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, బాపూరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

 కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి 

పెన్ పవర్, కందుకూరు

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు కొరకు ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కోరుతూ ఈనెల 26వ తేదీన జరిగే భారత బంద్ ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం సింగరాయకొండ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రంగారావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాల వలన రైతులు, రైతు కూలీలే కాకుండా పేద మధ్యతరగతి, కార్మిక వర్గానికి తీవ్ర నష్టం అని అన్నారు. బ్లాక్ మార్కెట్ పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని అన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు వీరారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నా నరేంద్ర మోడీ కి గాని నిర్మలా సీతారామన్ కు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు.

 వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయని ప్రజల మీద అధిక భారం పడుతుందని అన్నారు. ఈనెల 26వ తేదీన జరిగే భారత్ బంద్ కొండేపి నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో జయప్రదంగా నిర్వహించాలని అందుకు బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ప్రజలు, వ్యాపార వర్గాల వారు వివిధ కళాశాలల, స్కూలు యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచారులు, జై భీమ్ పీపుల్స్ జెఎసి అధ్యక్షులు అంబటి కొండల రావు యువజన కాంగ్రెస్ నాయకులు రసూల్, ఏ  ఐఎఫ్టియు నాయకులు సుల్తాన్ భాష ఏఐటీయూసీ నాయకులు మీరా ప్రజా సంఘాల నాయకులు సుల్తాన్ ,సుభాన్ పాల్గొన్నారు.

నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలి

నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలి

పెన్ పవర్, కొవ్వూరు

 వచ్చేనెల 10-04-2021 వ తేదీన జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజీ చేసుకోవాలని  కొవ్వూరు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఆర్ శరత్ బాబు గారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఈరోజు అనగా మార్చి 20వ తేదీన సీఐ ఎస్ఐలు కోర్టు కానిస్టేబుల్స్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించి కాంపౌండబుల్  పెండింగ్ కేసుల రాజీ కి మార్గాలను నిర్దేశించారు. ఏప్రిల్ పదవ తేదీన నేషనల్ లోక్ అదాలత్ ను కక్షి దారులు వినియోగించుకోవాలని పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరియు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ జి ధర్మారావు, శ్రీమతి కె మాధవి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి కె శారదాంబ పాల్గొన్నారు.

అనకాపల్లి పట్టణ ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించిన...మళ్ళ సురేంద్ర

 అనకాపల్లి పట్టణ ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించిన...మళ్ళ సురేంద్ర

అనకాపల్లి, పెన్ పవర్

శనివారం అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి ని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,టిడిపి 81వ డివిజన్ ఇంచార్జ్, మళ్ళ సురేంద్ర కలిసి అనకాపల్లి పట్టణ ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి వాటర్ ట్యాంకులు పని చేయకుండా ఉన్నాయి అని ముఖ్యంగా ఎన్టీఆర్ హాస్పిటల్ వెనకాల రామానాయుడు కాలనీలో 280 పేద కుటుంబాలు ఉన్నాయని వాళ్లు అందరూ కూడా మంచినీటి కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారని అలాగే మరి ఎన్నో ప్రాంతాల్లో మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారని దయచేసి ఈ వేసవి కాలంలో ఏ ఒకరికి మంచి నీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ కి తెలియజేశార.ఈ కార్యక్రమంలో పోలవరపు త్రినాథ్, దాడి జగన్, పిట్టల రాజు, సబ్బవరపు గణేష్ కొణతాల తులసి, జొన్నాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం

శ్రీ స్వామి వారి నిత్య అభిషేకం లో గంధము మరియు తేనె కు ఉపయోగించు 

స్వర్ణ పాత్రలు (బంగారు) రెండు విరాళం 

 చిత్తూరు,పెన్ పవర్

సుమారు బరువు - 205 గ్రాములు సుమారు విలువ - 8,00,000/- రూపాయలు, మరియు  శ్రీ స్వామివారి సిద్ధి వినాయక గో సంరక్షణ ట్రస్ట్ కు విరాళం - 1,00,000/- రూపాయలు, ఈ రెండు విరాళములు ఓకే దాత అందించి ఉన్నారు. దాత పేరు - గుమ్మడి అన్వేష్ మరియు వారి కుటుంబ సభ్యులు విజయవాడ వాస్తవ్యులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి  శ్రీ ఎ. వెంకటేశు, వారికి ఈ విరాళము అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు కోదండపాణి, రమేష్ గారు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర తీర్థ మహోత్సవం (పరస)లో పాల్గొన్న...కె.కె రాజు

 శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర తీర్థ మహోత్సవం (పరస)లో పాల్గొన్న...కె.కె రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు తిక్కవానిపాలెంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర తీర్థ మహోత్సవం (పరస)లో ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లును దర్శించుకున్న  విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు ఈ తీర్థ మహోత్సవంలో జి.వి.ఎమ్.సి, జోన్-5 కమిషనర్ సింహాచలం,46,55 వార్డు కార్పొరేటర్లు కటుమూరి సతీష్,కె.వి.యన్ శశికళ,మొల్లి అప్పారావు, దుప్పలపూడి శ్రీనివాసరావు,గువ్వల చంద్రశేఖర్,ఆర్.పి నాయుడు,మధు,ఎర్రంశెట్టి శ్రీను,పొలారాజు,రాము,జగదీష్,బి.ఈశ్వర రెడ్డి,యం.డి గౌస్,కె.చిన్నా,లక్ష్మీ ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.



శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామినీ కలిసిన టి.టి.డి, ఈ.ఓ, జవహర్ రెడ్డి

 శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామినీ కలిసిన టి.టి.డి, ఈ.ఓ, జవహర్ రెడ్డి

పెందుర్తి, పెన్ పవర్

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో  జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీకి సంబంధించి  శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తో ఈవో చర్చించారు. ఈ భేటీలో భాగంగా కొన్ని కీలక అంశాలను స్వరూపానంద స్వామి, జవహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. టిటిడి తరఫున నిర్వహించబోతున్న కళ్యాణమస్తు  కార్యక్రమం మారుమూల ప్రాంతానికి చెందిన భక్తులకు సైతం చేరువ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానంద స్వామి సూచించారు. అదేవిధంగా  టిటిడి తరఫున గిరిజన గ్రామాలలో నిర్మించడానికి తలపెట్టిన ఆలయాల  పని త్వరితగతిన పూర్తి చేసేందుకు  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని  జవహర్ రెడ్డి కి స్వరూపానంద స్వామి సూచించారు. స్వరూపానంద స్వామి చేసిన సూచనలపై ఈవో జవహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...