Followers

ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

 ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి

వికారాబాద్,  పెన్ పవర్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లోని ఘనపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ రెడ్డి క్రీడలు మనుషులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కనబరుస్తాయి. యువత క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ క్రీడల కోసం చాలా నిధులు ఖర్చు చేస్తుందని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని. నియోజకవర్గంలో పరిగి లో మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగిందని, మహేశ్వర్ రెడ్డి వివరించారు. 

21వార్డ్ లో పర్యటించిన వంశీకృష్ణ శ్రీనివాస్

21వార్డ్ లో పర్యటించిన వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ తూర్పు, పెన్ పవర్

వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం 21వార్డ్ లో పర్యటించారు.వార్డ్ పరిధిలో గల వివిధ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయుటకు అవకాశాలను జీవీఎంసీ అధికారులతో కలసి వార్డులో పరిశీలించారు.వార్డులో డ్రైనేజీ, తాగునీరు, మొదలైన విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. 

ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డ్ లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరంచారు. చేపల మార్కెట్  అభివృద్ధి,పీతల వీధి నుంచి మెయిన్ రోడ్ కు  రహదారి,యాదవ్ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ,రెళ్లివీధి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, శెట్టిబలిజ, పద్మశాలి,ఒడియా బ్రహ్మిన్ మరియు వివిధ కమ్యూనిటీలకు భవనాల కొరకు వార్డ్ లో చేపట్టవలసిన కార్యక్రమాలకోసం చర్చించారు. కార్యక్రమంలో ఎ.ఈ.శిరీష జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

చౌడపూర్లో 16 లక్షలతో సిసి రోడ్డు కు శంఖుస్థాపన చేసిన పరిగి ఎమ్మెల్యే

 చౌడపూర్లో 16 లక్షలతో సిసి రోడ్డు కు శంఖుస్థాపన చేసిన పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్ , పెన్ పవర్

 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలోని చౌడపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయలతో జి పి నిధులతో సిసి రోడ్లు ప్రారంభించిన శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని నాయకులు ముందుకు వచ్చి గ్రామాలకు అవసరమున్న రోడ్లను మంజూరు మంజూరు చేయించుకుని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధ్యక్షులు మీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజలకు అందజేసిందని, ఇలాంటి పథకాలను ప్రజలు ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జెడ్ పి టి సి ఎం పి పి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పరిగి బస్సు స్టాండ్ ముందు కాంగ్రెస్ పార్టీ దర్నా

 పరిగి బస్సు స్టాండ్ ముందు కాంగ్రెస్ పార్టీ దర్నా


వికారాబాద్ జిల్లా,  పెన్ పవర్ 

 ఉద్యోగులకు వయో పెంచి పెంచి ఉద్యోగులను ఉద్యోగ అవకాశాలు రావని, నిరాశతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇవాళ  కాకతీయ యూనివార్సిటీలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని నిరాశ తోనైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ లో చలనం రావాలని ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మ హత్య చేసుకున్న సునీల్ హాత్మ శాంతి చేకూరాలని ఆయన ఫోటోకి పరిగి బస్టాండ్ ముందు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  రామ్మోహన్ రెడ్డి  నివాళులు అర్పించారు.అనంతరం యూత్ కాంగ్రెస్ పరిగి నియోజక వర్గ నాయకులు ఎర్రగడ్డపల్లి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్ర గడ్డ పల్లి కృష్ణా, పలువురు పరిగి మండల నాయకులు పాల్గొన్నారు.

2వ రోజు రిలే నిరాహారదీక్షలు...

 2వ రోజు రిలే నిరాహారదీక్షలు...

మహారాణి పేట, పెన్ పవర్

2వ రోజు రిలే నిరాహారదీక్షలు. దేశానికి వెన్నుముక అయిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను తక్షణమే విరమించుకోవాలి. జెఎసి నాయకులు సిహెచ్ నర్సింగరావు.శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2వ రోజు జరిగిన రిలే దీక్షలను ఉద్దేశించి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ లాభ నష్టాలతో సంబంధం లేకుండా దేశ సంపదను మొత్తం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మేయడం కోసం మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అబద్ధాలు ఆడుతూ ప్రజలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనులు చేస్తున్నదని అన్నారు. రైల్వేలు, స్టీల్ ప్లాంట్, బ్యాంకులు, ఎల్ఐసి వంటి ప్రజల సంపదను కార్పొరేట్ లకు అమ్మడాన్ని అడ్డుకుంటామని అన్నారు. 

బిజెపి ప్రభుత్వం దేశానికి శాపంగా మారిందని అన్నారు. ప్రజలు ఇలాంటి శాపాలను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలుసని అన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా దేశ సంపదను కాపాడుకుంటామని, మోడీ ప్రభుత్వం ఆటలు సాగనివ్వమని అన్నారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు పడాల రమణ,ఎస్.ఎ. రెహమాన్,సిఐటియు నాయకులు భానుమూర్తి, ఒ.అప్పారావు,ఎన్ సింహాచలం డివైఎఫ్ఐ నాయకులు ఎస్ శ్రావణ్, కె.సురేష్,ఎస్ఎఫ్ఐ నాయకులు అప్పలరాజు,టిఎన్ టియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జోరందుకున్న మండల పరిషత్ అభ్యర్థుల ప్రచార జోరు

 జోరందుకున్న మండల పరిషత్ అభ్యర్థుల ప్రచార జోరు

పరవాడ,పెన్ పవర్

పరవాడ గ్రామంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పి.పి అభ్యర్థి పయిల వెంకట పద్మ లక్ష్మీ, పరవాడ ఎం.పి.టి.సి -2 అభ్యర్థి పయిల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న పాలన కు మద్దతు తెలపాలని ప్రతీ ఒక్కరిని కోరుతు ప్రచారం సాగించారు.ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు,పిఎంసి చైర్మన్ పయిల హరీష్,మరియు వార్డు మెబర్లు పయిల వెంకట్ రావు,వర్రీ లక్ష్మీ,వర్రీ పైడం నాయుడు,పోతల అప్పలనాయుడు, సిరిపురపు చిట్టమ్మ, చుక్క వెంకట లక్ష్మీ,పి సత్యవేణి,గండి ఈశ్వరరావు,పయిల అప్పలనాయుడు,గెడ్డం లక్ష్మీ ,పయిల అక్కులమ్మ, సిరిపురపు రాజేష్, పయిల నరేష్,పయిల రాధ కృష్ణ,పయిల అప్పలనాయుడు, చీపురుపల్లి సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

తాండూర్ కొత్త ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసిన డి ల్ పి వో

 తాండూర్ కొత్త ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసిన డి ల్ పి వో

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా/తాండూర్ గ్రామ పంచాయతీ తాండూర్ సర్పంచ్ కొండు అంజయ్య (అంజిబాబు) ఆకాలమరణం చెందడం తో  తాండూర్ సర్పంచ్ పదవికి ఎలక్షన్ నోటిఫికేషన్  వచ్చే అవకాశం ఉంది. అందులో బాగంగా తాండూర్ గ్రామ పంచాయతీ యొక్క కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేసి ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో  డి ల్ పి వో ఫణిన్దర్ రావ్  ఓటర్ లిస్ట్ ను పబ్లిష్ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఇంచార్జి సర్పంచ్ నవీన్ కుమార్,ఈ వో  తపాస్, వార్డు సభ్యులు తిరుపతి,  ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...