Followers

ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన ఎస్ఐ

 ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన ఎస్ఐ 

 నార్నూర్, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్  గ్రామ పంచాయతీ లో సోమవారం ఎసై మాదాసు విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రజలకు ఉచితంగా 50 మాస్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపత్యంలో ప్రజలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా ప్రతిఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలన్నారు. వాహనాలను అపి ప్రయాణికులకు డ్రైవర్ లకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వారికి వాహన పత్రాలు లేని వారికి జరిమాన విధించారు. నియమాలను పాటించని యెడల  చటం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపి వారికి  అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎసైలు ప్రవళిక, ధనశ్రీ, ఉపసర్పంచ్ విష్ణు గ్రామస్తులు సుభాష్, రమేష్ తదితరులు  పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తార్నాక, పెన్ పవర్.

రాష్ట్రంలోని రజక, నాయీబ్రా హ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలన్న సీఎం కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మల్లాపూర్ కు చెందిన  రజక , నాయీబ్రాహ్మణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న క్షౌర శాలలకు (కటింగ్‌ షాపులు), లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లవరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తూ తక్షణం జీవో జారీకి చర్యలు తీసుకున్న సీఎం గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. అత్యంత బలహీనవర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వారికోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని  పన్నాల దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో హమాలీ శ్రీనివాస్ , కుంటి కృష్ణ  , సానాల రవి , ఎస్.వీ.శివ కుమార్ , పీఆర్ ప్రవీణ్ , నాయి బ్రాహ్మణా , రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులు  రాచమళ్ళ సత్తయ్య , నాగరాజు , విట్టల్ , నర్సింహులు , శ్రీనివాస్ , అశోక్ , రాజేందర్ ప్రసాద్, కిష్టయ్య , వెంకటరమణ , పరుశురాములు , రవి, రాహుల్ , సాగర్  పాల్గొన్నారు.

సంక్షేమ సంఘం ఎన్నికలలో కె.యం.ప్రతాప్ బలపర్చిన వ్యక్తి గెలుపు..

 సంక్షేమ సంఘం ఎన్నికలలో కె.యం.ప్రతాప్ బలపర్చిన వ్యక్తి గెలుపు.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

సంక్షేమ సంఘం ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ బలపరిచిన అల్లా బక్ష్ 136 ఓట్ల మెజార్టీతో అధ్యక్షునిగా గెలుపొందారు.. చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షులుగా గొడుగు గుర్తుపై పోటీ చేసిన అల్లా బక్ష్ విజయం సాదించారని కే.యం.ప్రతాప్ గౌడ్ పేర్కొన్నారు.. ప్రధాన కార్యదర్శి గా గొడుగు గుర్తుపై పోటీ చేసిన శ్యామలమ్మ 48 ఓట్ల మెజారిటీతో గెలిచిందని తెలిపారు.. శ్యామలమ్మకు 699 ఓట్లు రాగా, ప్రత్యర్ధులు, మాస్క్ గుర్తుపై పోటీ చేసిన రాఘవేంద్ర స్వామికి 651 ఓట్లు పోల్ అవగా, చైర్ గుర్తుపై పోటీ చేసిన వరదరాజు కు 413 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు... ఈ సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ ను నూతన కమిటి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు..అనంతరం ప్రతాప్ గౌడ్ ను సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు..ప్రతాప్ నూతనంగా ఎన్నికైన భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లా బక్ష్ కు మరియు ప్రధాన కార్యదర్శి శ్యామలమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రతాప్  మాట్లాడుతూ నూతన కమిటీకి తాను  ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటూ బస్తి అభివృద్ధికి పాటుపడాలన్నారు..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణనికి భూమి పూజా

 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణనికి భూమి పూజా...


 నార్నూర్, పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల 12 మంది విలేకరులకు12 తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశారు. రెండు పడకల ఇల్ల నిర్మాణం  కొరకు సోమవారం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లె లతో కాలసి భూమి పూజా చేశారు. ఈ సందర్భంగా  జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ  ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలికితీసి వార్తలు సేకరించి ప్రచురితం చేసిన విలేకర్ల సౌకర్యార్థం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పత్రికా విలేకరుల అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కనక మోతుబాయ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీటీసీ పరమేశ్వర్,స్థానిక డైనమిక్ సర్పంచ్ బానోత్ గజానంద్,గుండాల సర్పంచ్ శ్రీరామ్,ఫాక్స్ డైరెక్టర్ దుర్గే కాంతారావు,మేడల్ స్కూల్ చైర్మన్ రాథోడ్ సుభాష్,రమేష్,సురేష్ ఆడే, మహేందర్ దుర్గే, కోరేలా మహీందర్,మాణికరావు, మోతే రాజన్న, సత్తర్, అయమద్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినందుకు  నార్నూర్ ఉమిడీ మండల విలేకరులు నాయకులకు, కెసిఆర్ కు అత్యధిక  కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద మజ్జిగ చలివేంద్రం ప్రారంభం..

 ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద మజ్జిగ చలివేంద్రం ప్రారంభం..  

 ప్రత్తిపాడు, పెన్ పవర్ 

ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై .రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కె సుధాకర్ నేతృత్వంలో భారీ ఎత్తున మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. పోలీస్ స్టేషన్కు వచ్చే సందర్శకులకు, రహదారి వెంబడి వెళ్లే ప్రయాణికులకు వాహనదారులకు వారి దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రం దోహదపడుతుందని సి ఐ వై రాంబాబు తెలిపారు.రహదారిపై వెళ్లే ప్రయాణికులకు పిలిచి మజ్జిగ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఏలేశ్వరం ఎస్ఐ సంపత్ కుమార్, అడిషనల్ ఎస్ ఐ ఏ. సత్యనారాయణ, ఏ ఎస్ ఐ ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్, రాజారావు, శ్రీనివాసరావు, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, గోవిందు, సిబ్బంది నాయుడు, రాఘవ, రామకృష్ణ, ఉదయ్ భాస్కర్, సుమన్, రాజబాబు, ఉమామహేశ్వరరావు, త్రిమూర్తులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

భారత దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు నిరుపమానం...

 భారత దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు నిరుపమానం...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

భారత దేశ ఉప ప్రధాని గా, కేంద్రమంత్రిగా బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలు నిరుపమానమైనవని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కొనియాడారు. సోమవారం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బాబూ జగ్జీవన్ రామ్ 114 వ జయంతి  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామల ముందుగా ఏ ఎస్ డబ్ల్యూ ఓ పార్వతి, హెచ్ డబ్ల్యూ ఓ నాగమణి,విద్యార్థినిలు తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి సామల మాట్లాడుతూ  దేశ స్వాతంత్ర్య సమరయోధునిగా, భారత రిపబ్లిక్ మొట్ట మొదటి లోక్ సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా,దేశ ఉప ప్రధానిగా నాలుగు దశాబ్దాల పాటు దేశానికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం అసిస్టెంట్  సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి పార్వతి, హెచ్ డబ్ల్యూ ఓ జె నాగమణి హాస్టల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.

డా.బాబు జగజీవన్ రాం సేవలు మరవలేనివి

 డా.బాబు జగజీవన్ రాం సేవలు మరవలేనివి...

 ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్

ఉట్నూర్,  పెన్ పవర్

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మాజీ ఉప ప్రదానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూర్ మండలకేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌక్ లో అదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, పెసా కో ఆర్డినెటర్ వెడ్మ బొజ్జు, ఉట్నూర్ అర్.డి.ఓ జాడి రాజేశ్వర్ లు ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్ మరియు పెసా కో ఆర్డినేటర్ వెడ్మ బొజ్జ లు మాట్లాడుతు భారతదేశంలోనే అత్యున్నతమైన స్థానంలో నిలిచి దేశ ప్రజలందరీకి సేవలందించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం  అని నేడు వారి జయంతి సందర్భంగా ఉట్నూర్ లో బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులార్పించడం జరిగిందని, దేశ ప్రజలందరు కూడా వారి సేవలను కొనియాడుతు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ టి.అర్.ఎస్.మండల అద్యక్షుడు సింగారే భారత్, దళిత సంఘాల నాయకులు బిరుదుల లాజర్, లింగంపల్లి చంద్రయ్య, అరికిల్ల అశోక్, బండి విజయ్, ఖానాపూర్ నియేజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి భారత్ చౌహాన్, నార్నూర్ మాజీ జడ్పీటిసి బ్రిజ్ లాల్, ఉట్నూర్ మాజి సర్పంచ్ బోంత అశరేడ్డి, స్థానిక నాయకులు ఆడే ప్రకాష్, దిలేష్ చౌవన్,  జిల్లపెల్లి రాజన్న, కుటికల ఆగష్టీన్, కోల్లూరి లింగన్న, కోమ్ము బాపురావ్, చోప్పదండి కాంతారావ్, మహెందర్ దుర్గే తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...