Followers

భారతీయ జనతాపార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం

 భారతీయ జనతాపార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం  గ్రామంలో బిజెపి 41 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల సోషల్ మీడియా అధ్యక్షులు రమేష్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళాబత్తుల చిన్నారి హాజరయ్యారు జెండా ఎగురవేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ  లక్ష్యాలను సాధించడానికి పండిత్ దీనదయాల్  ఉపాధ్యాయ సిద్ధాంతాలతో అభివృద్ధి ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి ఫలాలు చేరాలని దేశం అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహార్ వాజపేయి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ సారధ్యంలో ఏప్రిల్ 6 1986 భారత జనతా పార్టీ ప్రారంభించడం జరిగినది ఈరోజు బిజెపి 41వ వారి ఆవిర్భావ  దినోత్సవ పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు ప్రధాన కార్యకర్త ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా అధ్యక్షుడు చెరుకూరి రమేష్ వర్మ కళాబత్తుల రామచంద్రన్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

వెంకన్న ఆలయం ముఖద్వారానికి వెండి తాపడం

వెంకన్న ఆలయం ముఖద్వారానికి వెండి తాపడం

 పెన్ పవర్, ఆత్రేయపురం

 వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత కొలువై ఉన్నాడు మంగళవారం పురస్కరించుకుని  దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయనికి  రావులపాలెం చెందిన మన్యం నాగేంద్ర కుమార్ నాగ సునీత దంపతులు స్వామివారి ముఖద్వారమునకు ఒక కేజీ వెండి తాపడం చేయించి ఇచ్చుటకు అంగీకరించారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వహణ అధికారి ఆలయ అర్చకులు ఆ పుణ్య దంపతులకు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు

అమ్మవారి జాతర ఉత్సవాల కు పోలిస్ బందోబస్తు ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఉత్సవాల కు పోలిస్ బందోబస్తు ఏర్పాట్లు

పెన్ పవర్, ఆలమూరు 

  ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసియన్న ఉభయగోదావరి జిల్లాల్లో ప్రసిద్ధ గాంచిన శ్రీ నూకాంబిక అమ్మ వారి జాతర మహోత్సావాలు పురస్కరించుకుని  ఈ నెల 11 వతేదీన ప్రారంభమగు  సందర్భంగా  పొలీసు బందోబస్తు ఏర్పాట్లు చెయడానికి  సోమవారంసాయంత్రం రామచంద్రపురం డి ఎస్ పి  బాలచంద్రారెడ్డి,మండపేట రూరల్ సి ఐ కె మంగాదేవి,ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ లు వచ్చి ఆలయం అవరణ అంతయు  పరిశీలించి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ 19 సెకండ్ వేవ్   నిబంధనలు పాటిస్తు  ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి,శానిటజర్ వాడుతు కనీసదూరం పాటించేలా చూడాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలిస్ సిబ్బంది చర్యలు చెప్పట్టుందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అలయ కార్య నిర్వహణ అధికారి ఏ ఎస్ బి జి రామలింగం (భాస్కర్)  అలయ సిబ్బంది  గ్రామస్థులు పాల్గొన్నారు.

సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం

సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం

జగనన్న పాలనకు మద్దతు ఇవ్వండి

వై.సీ.పి యం.పీ.టీ.సి,జడ్.పీ.టీ.సి అభ్యర్థులను గెలిపించండి

ప్రచారంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి ప్రజా నీరాజనాలు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్


కురుపాం మండలంలోని వివిధ పంచాయతీలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యం.పీ.టీ.సి,జడ్.పీ.టీ.సి లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల.పుష్పశ్రీ వాణి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రికి హారతులతో ఆహ్వానించి నీరాజనాలు పలికారు.వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి కురుపాం నియోజకవర్గం కంచుకోటాగా ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిద సంక్షేమ పధకాలను ప్రజలకు స్పష్టంగా వివరించారు.కరోనా వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోలేక అగ్రరాజ్యాలు కూడా వెనగడుగు వేసినప్పటిటీ సంక్షోభంలో కూడా ఏ ఒక్క నెల వెనగడుగు వేయకుండా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వై.యస్.జగనన్న పాలిస్తున్న వై.సీ.పీ ప్రభుత్వమని గర్వంగా చెప్తున్నానన్నారు.గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగించారని గత అసెంబ్లీ ఎన్నికలకు కూడా పసుపు, కుంకుమ పేరుతో ప్రతీ మహిళకు ఎన్నికలకు 6నెలల ముందు 10వేల రూపాయలను ఇచ్చి బ్యాంకుల చుట్టూ తిప్పించి మళ్ళీ మోసం చేసి గద్దె ఎక్కలని కుట్ర పన్నాడని  అందుకే ఇప్పుడు వెతికిన దొరకని విధంగా ప్రజలు తీర్పును ఇచ్చారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతీ అర్హులకు లబ్ది చేకూరే  విధంగా పాలనను సాగిస్తున్నారని గత ప్రభుత్వంలో లంచాల పరంపర కొనసాగేదాని ఆధార్,రేషన్ కార్డులు కూడా లంచం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిరకుండా వచ్చేవి కావని కానీ ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో మీ ఇంటిదగ్గర కూర్చొని గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా పనుల్ని చేయించుకునే వెసులుబాటు కల్పించారని అన్నారు.రైతులకోసం, మహిళల కోసం, బడుగుల కోసం,విద్యార్థులకోసం,వితంతువులకోసం,ప్రజల ఆరోగ్యము కోసం,పరిశ్రమల ప్రగతి కోసం ఆలోచించి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని కనుక జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఫ్యాను గుర్తుకు ఓటేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలి

 కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పని చేయాలి 

పెద్దాపురం,పెన్ పవర్

కౌంటింగ్ నిర్వహణలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు బాధ్యతయుతంగా పని చేయాలని ఆర్డీఓ ఎస్. మల్లి బాబు పేర్కొన్నారు. తెలిపారు.మంగళవారం పెద్దాపురం డివిజన్ పరిధిలో స్థానిక మట్ట ఆదినారాయణ కల్యాణ మండపంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధారణ ఎన్నికలు -2021 కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం మాస్టర్ ట్రైనీలతో  ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్. మల్లి బాబు  మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కౌంటింగ్ శిక్షణలో కౌంటింగ్ సూపర్ వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు,పోలింగ్ ప్రక్రియలో వచ్చే సందేహలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రెండు బ్యాచ్ లుగా వేరుచేయడం జరిగిందని, మొదటి బ్యాచ్ మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు, రెండవ బ్యాచ్ సా.4గం గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్యాలెట్ బాక్సలు పనితీరు, బ్యాలెట్ పేపర్లు ,వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్ల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అదేవిధంగా పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని తెలిపారు. 

పోలింగ్ సమయంలో శిక్షణ అధికారులు మాస్కులు, శానిటేషన్, సామాజిక దూరం  పాటించే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పాత్రలపై అవగాహనకలిగివుండాలని,రెగ్యులర్ బ్యాలెట్,పోస్టల్ బ్యాలెట్ లపై మధ్య వ్యత్యాసం ఆర్డీఓ క్షుణ్ణంగా  తెలియజేసారు.అదేవిధంగా పోలింగ్  సమయంలో కౌంటింగ్ సూపర్ వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు నిక్షిప్తపతంగా వ్యవరించాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఇఓ పి.ఆర్.డి హిమా మహేశ్వరి, మాస్టర్ ట్రైనీలు బి. జాన్ కెనడి, వై. శ్రీనివాస్, వి. సీతారామరావు, ఎం. శివయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీసు అధికారులు

  ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీసు అధికారులు

విజయనగరం,పెన్ పవర్

జగదీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీసు అధికారులు చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన సిఆర్ పిఎఫ్ మరియు మావోయిస్టు దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండర్ రౌతు జగదీష్ కుటుంబాన్ని విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు మంగళవారం నాడు పరామర్శించి,ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగరావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి. కృష్ణా రావు విజయనగరం పట్టణం గాజులరేగలోని రౌతు జగదీష్ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళి, అతని తల్లిదండ్రులు సింహాచలం, రమణమ్మ దంపతులను కలిసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

జగదీష్ పార్ధివ శరీరంపై విశాఖ రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు రీత్ లను, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిఆర్ పిఎఫ్ అధికారులు, జిల్లా పోలీసుశాఖ జగదీష్ అంతిమ యాత్రలో పాల్గొని, పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంఛనాల్లో భాగంగా పార్ధివ శరీరంను స్మసానం వరకు పోలీసు బ్యాండుతో సాగనంపి, సిఆర్ పి ఎఫ్ మరియు జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆర్మడు రిజర్వు పోలీసులు తుపాకులతో మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి, గౌరవ వందనం సమర్పించారు.అమర వీరుడు రౌతు జగదీష్ అంతిమ యాత్రలో విశాఖపట్నం రూరల్ ఎస్పీ బి. కృష్ణారావు, పార్వతీపురం ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు, విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్. మంగవేణి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు

 ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు..తగ్గిన వ్యాపారాలు..

పేదవాడికి చికెన్ తినడం కలగా మారుతున్న తరుణం..

 కేసముద్రం,  పెన్ పవర్

రాష్ట్రస్థాయి ఎండలు విజృంభిస్తున్న తరుణంలో బ్రాయిలర్ కోడి రేటు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యునికి అందుబాటులో లేక పోవడం అరకిలో కొన్ని సగటు మనిషి పావు కిలో కొనుక్కో పోతున్నాడు ఒకపక్క   కరోణ విజృంభిస్తున్న తరుణంలో మరోపక్క పిల్లలకు స్కూల్ లేక ఇంటిలోనే ఉంటున్నారు. వారానికి ఒక రోజు చికెన్ కొనుక్కొని తిందామనుకున్నా సగటు మనిషి ఆశలు ఆడియశలు గా మిగిలిపోతున్నది, గత పది రోజుల క్రితం 80 రూపాయలు ఉన్న కోడి నేడు 150 రూపాయలకు అమ్ముతున్నారు చికెన్ చికెన్ 180 కి అమ్మగా నేడు 260 కి అమ్ముతున్నాడు చికెన్ 200 రు అమ్మగా  280 రూపాయలకు పెరిగిందన్నారు.  దీనికంతటికీ కారణం బ్రాయిలర్ కోళ్ళు కోళ్ల ఫారం లో పెంచడం తగ్గిపోయిందని బ్రాయిలర్ కోడి పెంపకాలు లేకపోవడం అధిక ఉష్ణోగ్రత ఉండడంతో కోళ్ల షెడ్ ఖాళీగా ఉంచుతున్నామన్నా రు.  కోళ్ల ఫారం యజమానులు తెలియజేస్తున్నారు. గత పది రోజుల క్రితం ఉన్న గిరాకీ సగానికి పైగా పడిపోయాయని చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు. ఇప్పటికే చిన్న చిన్న చికెన్ షాపులు మూతపడ్డాయని ఇలాగే ఉంటే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుందని దానికి కారణం వ్యాపారాలు లేకపోవడం ఎండవేడిమికి కోళ్ళు సప్లై లేకపోవడం కారణమని చికెన్ షాప్ .యాజమానులు వాపోతున్నారు. ఏదేమైనా ధర తక్కువగా ఉంటేనే వ్యాపారం ఎక్కువ సాగుతుందని సగటు మనిషి ఒక్కపూటైనా కోడిమాంసం తింటారని వాళ్ల తింటేనే మా బ్రతుకులు బాగుంటాయని లేకపోతే మళ్లీ వేరే పనులు చేసుకొని బతకాల్సి వస్తోందని కేసముద్రం చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...