Followers

రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో బెస్ట్ టీం అవార్డు కైవసం చేసుకున్న కేసముద్రం క్రీడాకారులు

 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో బెస్ట్ టీం అవార్డు కైవసం చేసుకున్న కేసముద్రం క్రీడాకారులు...

 కేసముద్రం,  పెన్ పవర్

 ఈ నెల 2,3,4 తేదీల్లో మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్ బాయ్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కేసముద్రం మండల హాకీ క్రీడాకారుల ప్రతిభకు బెస్ట్ టీం అవార్డు దక్కింది.12 హాకీ స్టిక్స్,12 బాల్స్ మంగళవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో  తెలంగాణ  మాస్టర్ హాకీ చైర్మన్ రఘునందన్ రెడ్డి ల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం సీనియర్ హాకీ క్రీడాకారులు ప్రసాద్, నరేశ్, గణేష్, మోహన్, వినోద్ పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు కేసముద్రం ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటినందుకు  గ్రామ పెద్దలు అభినందించారు.

ప్రేమాసమాజం లో జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు...

ప్రేమాసమాజం లో జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు...

మహారాణి పేట, పెన్ పవర్

వైస్సార్సీపీ స్టేట్ సీనియర్ నాయకులు  జాన్ వెస్లీ  పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం 33వ వార్డ్ ప్రెసిడెంట్ రంది గోపికృష్ణ ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ప్రేమాసమాజం లో కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్న అభాగ్యులకు కేక్,పండ్లు,డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాన్ వెస్లీ చాలా సౌమ్యుడు,మృదువైన స్వభావం కలిగిన వారని,నియోజకవర్గంలో వైస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తున్న బలమైన నాయకుడని, వైస్సార్సీపీ లో ఉన్నతమైన పదవులు చేపట్టాలని, ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకతో దక్షిణం లో వైస్సార్సీపీ బలోపేతం అయిందని, రాబోయే కాలానికి మినిస్టర్ గా చూడాలని,దీనికోసం నియోజకవర్గంలో వైస్సార్సీపీ కార్యకర్తలు అందరం కలిసి పని చేస్తామని తెలియజేశారు.

అర్చక,పురోహితులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి...

అర్చక,పురోహితులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి...

పెందుర్తి, పెన్ పవర్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక పురోహితులకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ అర్చకుల పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాస్ అన్నారు మంగళవారం సుజాతనగర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అర్చక పురోహిత సమస్యలను  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు జిల్లా వ్యాప్తంగా అర్చకుల సమస్యలపై పోరాడుతున్నామని కరోనా లాక్డౌన్ సమయంలో అర్చక పురోహితులకు తమ సంఘం చేసిన సామాజిక కార్యక్రమాలను వివరించారు. ఇప్పటికే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న అత్యధిక పురోహితుల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్చక పురోహితులకు అందే విధంగా కృషిచేసినట్లు పేర్కొన్నారు.అర్చకుల సమస్యలను పరిష్కరించడానికి అర్చక పురోహితులకు ఐడెంటిటీ కార్డులు మంజూరు విషయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు దృష్టికి తీసుకెళ్తామని ఉదయ కుమార్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ప్రైవేటు అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అంబడిపూడి సుధీర్ కుమార్ శర్మ మాట్లాడుతూ అర్చక పురోహిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు అదేవిధంగా బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వం నమోదు చేయుటకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి మావూడురు సంపత్ కుమార్ ఇన్చార్జులు ఏలూరు వెంకట రమణ మూర్తి గంటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

 భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

మహిళలకు తులసి మొక్కల పంపిణీ

మహారాణి పేట, పెన్ పవర్

29వ వార్డు అధ్యక్షురాలు పల్లా లక్ష్మి ఆధ్వర్యంలో  రామ జోగిపేట లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ ముందుగా బీజేపీ జెండా ఎగురవేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఇద్దరూ పార్లమెంట్ సభ్యులతోటి మొదలుపెట్టిన ప్రయాణము నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, కోట్లాది మంది కార్యకర్తలు కలిగిన పార్టీగా ఆవిర్భవించినదని, భారతరత్న  వాజపేయి,ఎల్.కె.అద్వానీ, మురళిమనోహర్ జోషి, రాజమాత ఇంకా వేలాది మంది నాయకుల త్యాగము,కృషి ఫలితమే నేడు బిజెపి తిరుగులేని శక్తిగా   మారిందని అన్నారు.

బిజెపి సీనియర్ నాయకులు పల్లా చలపతిరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా అతి తొందరలో పార్టీ అధికారంలోకి వస్తుందని ,కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీ ఉన్నత అభివృద్ధికై కృషి చేయాలని కోరారు.నగర  ఎస్సీ మోర్చ నాయకుడు  చుక్కాకుల రాంబాబు మాట్లాడుతూ  దళితులందరూ  ప్రధాని మోడీ చేయు అభివృద్ధి పనులకు బాసటగా నిలవాలని ,భారత అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి మోర్చా నాయకులు బండి లీలా ప్రసాద్,29వ వార్డు బీజేపీ నాయకులు  ఓ.వెంకట అప్పారావు,శ్రీను,గేదెల శ్రీహరి,కాగితపు రమేష్,బి.రాజు,కిలాన్ని రాజు,పల్లి. శ్రీనివాసు రావు, కోప్పల రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధిక సంఖ్యలో  మహిళలకు తులసి మొక్కలు పంపిణీ చేశారు.

భీమిలి పట్టణ ప్రజలకు సేవచేసుకోవడమే నాద్యేయం... గంటా నూకరాజు

 భీమిలి పట్టణ ప్రజలకు సేవచేసుకోవడమే నాద్యేయం... గంటా నూకరాజు

భీమిలి, పెన్ పవర్

భీమిలి జోన్ 3వ వార్డు నేరళ్ళవలస కోలనీలో  కోర్టు వెనుక భాగంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా తుప్పలు పేరుకుపోవడంతో  బాటసారులు ఇబ్బంది పడటం, చిన్న చిన్న పాములు బాటసారులను ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా స్థానికులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజుకి తెలియజేయడంతో  వెంటనే స్పందించి భీమిలి జోనల్ కమీషనర్ సి.హెచ్.గోవిందరావుతో మాట్లాడి  బాబుకాట్ మిషన్ ద్వారా దగ్గర ఉండి తుప్పలను తొలగించడం జరిగింది.సుమారుగా 3 గంటలు కష్టపడి రోడ్డుకు ఇరువైపులా శుభ్రంగా సదును చేసి, తుప్పలు తొలగించడంతో  స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సమస్యపై తెలియజేసిన వెంటనే స్పందించి పరిష్కరించిన గంటా నూకరాజుకి ప్రజలు ధన్యవాదాలు తెలియజేసారు.ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ  మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వెంటనే నాకు తెలియజేయండని,24/7 మీకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకొనే భాగ్యం కల్పించండని అన్నారు.నాజీవితం ప్రజా సేవకే అంకితం అని ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా,నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ సమస్య పరిష్కారం కోసం పరితపిస్తానని గంటా నూకరాజు అన్నారు. ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు,అల్లిపిల్లి సతీష్,నడిగట్ల క్రిష్ణ,నాయుడు  తదితరులు పాల్గొన్నారు.

విశాఖ 14వ వార్డు ఏ.ఏస్.ఆర్.నగర్,బిలాల్ కాలనీలో పర్యటించిన కె.కె.రాజు

 విశాఖ 14వ వార్డు ఏ.ఏస్.ఆర్.నగర్,బిలాల్ కాలనీలో పర్యటించిన కె.కె.రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఈరోజు ఉదయం 14వ వార్డు ఏ.ఏస్.ఆర్.నగర్,బిలాల్ కాలనీ కొండవాలు ప్రాంతాల్లో ఉత్తర నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ కె కె రాజు పర్యటించారు.ప్రతీ కుటుంబానికి మంచినీరు సదుపాయం కల్పించాలని, అక్కడక్కడా వాటర్ ట్యాంక్స్ పెట్టాలని వాటర్ సప్లై అధికారులకు తెలిపారు.మెట్లు,రెయిలింగ్,రక్షణ గోడలు నిర్మించాలని పబ్లిక్ వర్క్స్ అధికారులకు తెలిపారు.విద్యుత్ సదుపాయం లేని ఇళ్లకు ఎలక్ట్రికల్ మీటర్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఈ సందర్బంగా కె కె రాజు మాట్లాడుతూ ఇక్కడ నివసిస్తున్న ప్రతీ కుటుంబానికి ఇంటి పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు.మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ కఠారి.అనిల్ కుమార్ రాజు,జోనల్ కమిషనర్ శ్రీనివాస్ , ఈ.ఈ. శ్రీనివాస్, ఏ.జెడ్.సి.రమేష్, ఏఇ.రహీమ్,సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్సార్సీపీ నాయకులు కోడూరు సత్యనారాయణ, స్వరూప్, బల్ల శ్రీనివాస్,ఏ.ఏస్.ఆర్.నగర్ అధ్యక్షులు వడ్డి అప్పన్న,బిలాల్ కాలనీ అధ్యక్షులు బాషా, సింహాచలం,శంషుద్దీన్,లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.




ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం

 ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం.. 

తీవ్రంగా నష్టపోయిన మామిడి ,మొక్కజొన్న ,వరి , రైతులు 




పెన్ పవర్,  బయ్యారం 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గత రాత్రి భారీగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి తీవ్రంగా  సుమారు 50 ఏకరాలలో నష్టపోయిన రైతులు  జిల్లాలోని బయ్యారం మండలం  బాలాజీ పేట గౌరారం గ్రామం లోగల మామిడి వరి మొక్కజొన్న రైతులు పూర్తి స్థాయిలో నష్టపోవడంతో ఆ గ్రామ సర్పంచ్ జగన్ మాట్లాడుతూ గ్రామం లో గల రైతులు తోకల వెంకన్న , కోడి శ్రీను, సురబాయిన సత్యం, దరవత్ రవి, రైతుల పంటలు పూర్తిగా నేల మట్టమైనవి ఆరుకాలం కష్టపడి పెట్టుబడి పెట్టి పండిచిన పంట ఒక్కసారిగా రైతుల బ్రతుకులు అయోమయం గా  మారాయి నష్టపోయిన పంటను తక్షణమే మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు , పరిశీలించి రైతులను ఆదుకోవాలని వారికి నష్టపరిహారం అందచేయాలని  వారు కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...