Followers

జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

విజయనగరం, పెన్ పవర్

 ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీమతి రెడ్డి పావని గారు పార్టీ జెండాను కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల  ఫలితమే ఈరోజు భారతీయ జనతాపార్టీ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది కార్యకర్తల గల పార్టీగా,  అతి పెద్ద పార్టీగా రూపొందడం జరిగిందన్నారు.  భారతీయ జనతా పార్టీకి పూర్వం జన సంఘ్ పార్టీగా ఉండేదన్నారు.1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ గా రూపాంతరం చెందింది అన్నారు.  అలాగే పార్టీ ఎదుగుదలకు ఎంతోమంది పూర్తి సమయ కార్యకర్తలు త్యాగం  మరువలేనిదన్నారు. భారతీయ జనతా పార్టీ కి ఈ దేశం పట్ల,  ప్రజల సమస్యల పట్ల, మౌళిక వసతుల పట్ల పూర్తి అవగాహనతో  ముందుకు వెళుతుందన్నారు.  క్రమశిక్షణ, కార్యకర్తల నిబద్ధత భారతీయ జనతా పార్టీ సొంతం  అన్నారు. ఈ కార్యక్రమంలో తీగల హరనాథ్, బగ్గం రాజేష్, కట్టా బాబు, బూర జగ్గారావు, గొలగాన రమేష్, కొండల శ్రీను, పసుపునాటి గిరి, గిరీష్, తాడి నానాజీ  తదితరులు పాల్గొన్నారు.

స్క్రాప్ షాపులో చోరీకి పాల్పడిన ఇద్దర్ని అరెస్టు చేసిన 1వ పట్టణ పోలీసులు

స్క్రాప్ షాపులో చోరీకి పాల్పడిన ఇద్దర్ని అరెస్టు చేసిన 1వ పట్టణ పోలీసులు

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం 1వ పట్టణ పరిధిలో స్క్రాప్ షాపులో చోరీలకు పాల్పడిన ఇద్దరు నేరస్టులను ఏప్రిల్ 5న, అరెస్టు చేసినట్లుగా విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. గత సంవత్సరం అక్టోబరు మాసంలోను, ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకే తరహాలో నేరాలు జరిగి, సుమారు రూ.3.25 లక్షలు రాగి, ఇత్తడి స్క్రాప్ ను గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించుకొని వెళ్లిపోయినట్లుగా, షాపు యజమాని అబ్దుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం 1వ పట్టణ పోలీసులు రెండు కేసులను నమోదు చేసారు. 

ఈ రెండు నేరాలు ఒకే తరహాలో ఉండడంతో, ఒకే నేరస్థులు నేరాలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించి, సిసి ఫుటేజులను పరిశీలించారు. స్క్రిప్ షాపుకు దగ్గరలోగల వేరే షాపులో పని చేసే వాచ్మెన్ షాపులోకి రాత్రి సమయంలో ఒక టాటా ఏస్ వ్యాను వెళ్ళినట్లు, కొంత సమయం అయిన తరువాత వెళ్ళినట్లుగా తెలపడంతో, ఆ వాహనాన్ని గుర్తించేందుకుగాను విజయనగరం నుండి ఏలూరు వరకు గల చెక్ పోస్టుల వద్ద సిసి ఫుటేజులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందం పరిశీలించడం జరిగింది. నక్కపల్లి వద్ద ఎపి 13 ఎక్స్ 4513 వేన్ ఫిబ్రవరి 5వ తేదీని చెక్ పోస్టు దాటినట్లుగా గుర్తించారు. సదరు వేన్ చాలా ఫుటేజుల్లో కనిపించడంతో అనుమానం వచ్చి, సదరు నంబరును ద్వారా సదరు వాహనం హైదరాబాద్ కు చెందినదిగా గుర్తించడం జరిగింది.ఆర్టీఓ ఆఫీసులో లభించిన సమాచారంతో హైదరాబాద్ కు ప్రత్యేక పోలీసు బృందం వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో వాహన యజమానిని కలవగా తన వాహనాన్ని తన స్నేహితుడికి లీజుకు ఇచ్చినట్లుగా తెలపడంతో, సదరు స్నేహితుడి వద్దకు వెళ్ళగా, అతడు తన వద్ద పని చేసే బహదర్ పూరలో ఉంటున్న (ఎ-1) పుస్టో పేంద్ర సింగ్ కు లీజుకు ఇచ్చినట్లుగా తెలిపారు. 

పుస్టో పేంద్ర సింగ్ గురించి వాకబు చేయగా సదరు వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తన స్వంత ఊరు వెళ్ళినట్లుగా తెలిసింది. దీనితో సదరు వ్యక్తి రాక గురించి స్థానికుల సహకారంతో తెలుసుకొని, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యగా, గతంలో తాను హైదరాబాద్ కు చెందిన యజమాని పాత ఆర్టీసీ బస్సులను వేలంలో కొని, వాటి భాగాలను వేరు చేసేందుకుగాను విజయనగరం పంపినట్లు, బస్సు పార్టులను వేరు చేసి, రాగి,ఇత్తడి వస్తువులను హైదరాబాద్ పంపగా, మిగిలిన ఇనుమును విజయనగరం ఎల్బీసి ఆఫీసు ప్రక్కన గల స్క్రాప్ కొట్టు యజమాని అబ్దుల్ రఫీకి అమ్ముతుండేవాడనన్నారు. ఆ సమయంలో ఆ షాపులో పని చేసే విజయనగరం పట్టణం లంకా పట్నంకు చెందిన గోక రాంబాబుతో పరిచయం ఏర్పడింది. రాంబాబుకు హిందీ రావడంతో నేను అతడితో తరుచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఇటీవల (ఎ-2) గోక రాంబాబు విజయనగరం స్క్రిప్ షాపులో పని మానేసినట్లు,తాను పని చేసిన షాపులో ఎక్కువగా ఇత్తడి, రాగి సరుకు ఉందని, దానిని అప్పగిస్తానని చెప్పడంతో, నేను గత సంవత్సరం అక్టోబరులో ఒకసారి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి వచ్చి, అబ్దుల్ రఫీ స్ట్రాప్ షాపులో సరుకును దొంగిలించి, వేతో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ సరుకును అమ్మేసినట్లుగా విచారణలో తెలిపాడు. (ఎ-1) పుస్టేపేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు లంకావట్నంకు చెందిన (ఎ-2) గోక రాంబాబును 1వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 150 కిలోల కాపరు వైరు, 50 కిలోల ఇత్తడి, రెండు సెల్ ఫోనులు, టాటా ఏస్ వేన్ (ఎపి 13ఎక్స్ 4513) మరియు రూ. లక్ష నగదును వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ పి. అనిల్ కుమార్ తెలిపారు. ఈ కేసు విచారణను ఛాలెంజింగుగా స్వీకరించి, సుమారు 2 మాసాలు తీవ్రంగా శ్రమించి, నేరంకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా 1వ పట్టణ సీఐ జె.మురళి ఆధ్వర్యంలో 1వ పట్టణ ఎస్ ఐ లు కిరణ్ కుమార్, రాజా సుబ్రమణ్యం, హెచ్ సిలు అచ్చిరాజు, భాస్కరరావు, కానిస్టేబులు సునీల్, శివ, భాస్కర్ పని చేసారన్నారు. ఈ కేసును ఛేదించడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి కూడా అభినందించారన్నారు.విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 1వ పట్టణ సిఐ జె.మురళి,ఎస్ ఐ లు కిరణ్ కుమార్, రాజా సుబ్రమణ్యం పాల్గొన్నారు.

ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

 ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్.. 

భవిష్యత్తు అవసరాల అంచనాతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై ప్రణాళికను సిద్ధం చేయాలి.. 

సీఎం కేసీఆర్ ముందుచూపు..3 వేల కోట్ల నిధులతో శివారు ప్రాంతాల సమీకృత అభివృద్ధి.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు జోనల్ కమిషనర్ మమత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కావలసిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో 2050 వరకు జనాభా పెరుగుదల, అవసరాలు అంచనా వేస్తూ, సమస్యల శాశ్వత పరిష్కారం, మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఏకీకృత విధానాన్ని అమలు పరుస్తున్నారని ఇందుకోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమున్న చోట ప్రజలకు విద్య, వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు నివేదికను రూపొందించాలన్నారు. నగర శివారు ప్రాంతాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 3 వేల కోట్లు కేటాయించడం హర్షదాయకం అని, ఈ నిధుల ద్వారా ప్రజా సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, చైర్మన్లు, కార్పొరేటర్లు మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఉత్తర నియోజకవర్గ శ్రేణులు

 స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఉత్తర నియోజకవర్గ శ్రేణులు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

జివిఎంసి డిప్యూటీ మేయర్,ఫ్లోర్ లీడర్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లు మరియు స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు మొత్తం 16 మంది కి వివిధ హోదాల్లో ఉత్తర నియోజకవర్గం వారికి అవకాశం కల్పించడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు ఆధ్వర్యంలో  శ్రేణులు మంగళవారం బీచ్ రోడ్డులో గల స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో విశాఖ నగర అభివృద్ధికి అనేక రకాలుగా కృషి చేశారని అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు కృషి చేస్తున్నారని తదనుగుణంగానే ఈ జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. 

అంతేకాకుండా సోమవారం ప్రకటించిన జీవీఎంసీ కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ గా ఉత్తర నియోజకవర్గం లో 46 వ వార్డు కు చెందిన కటుమూరి సతీష్ కు, ఫ్లోర్ లీడర్ గా 44 వ వార్డు కు చెందిన బాణాల శ్రీనివాస్ కు మరియు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లతో పాటు మొత్తం 16 మందికి వివిధ హోదాల్లో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి,ఉత్తరాంధ్ర పరిశీలకులు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పిల్ల పోలీస్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ... ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

పిల్ల పోలీస్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ... ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

మహారాణి పేట, పెన్ పవర్

30వార్డ్ పెయిందోరపేట,మత్స్యకార కులానికి చెందిన పిల్ల పోలీస్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి బోట్ ప్రమాదానికి గురై కె.జి.హెచ్ లో జాయిన్ చేయగానే చనిపోయారు.వారి కుటుంబానికి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని అశోక్ నగర్,అసిల్ మెట్ట, ఎమ్మెల్యే కార్యాలయంలో తెలియజేయగానే  సొంత నిధులనుండి ₹.5,000/- ఆర్థిక సహాయం చేసి పేదల ప్రజల మన్నలను పొందిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫీషరిస్ అధికారులతో మాట్లాడి చేపల వేట సమయంలో చనిపోయిన కారణంగా కుటుంబ పోషణ కోల్పోవటం వలన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక భృతి మంజూరు చేయాలని ఆదేశించారు.

కరోన బాధితులకు కోడిగ్రుడ్లు పంపిణీ చేసిన వి ఆర్ ఓ కోమ్మాలు

  కరోన బాధితులకు కోడిగ్రుడ్లు పంపిణీ చేసిన వి ఆర్ ఓ కోమ్మాలు 

కేసముద్రం, పెన్ పవర్ 

కేసముద్రం మండలం లోని నారాయణపురం గ్రామ పరిధిలో గల తులస్య తండాలో  కరోన వచ్చిన 12 మంది కి కి ఎమ్మార్వో సరిత రాణి చేతుల మీదుగా కోడిగ్రుడ్లను  వి ఆర్ వో కొమ్మాలు పంపిణీ చేశారు. వారం రోజుల క్రితం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఏడు కుటుంబాలకు చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు నారాయణపురం ఇంచార్జ్ వి ఆర్ ఓ కొమ్మాలు మానవత్వంతో వారందరికీ ఒక్కొక్క కేసు చొప్పున కోడిగుడ్లను అందజేశారు. మానవత్వంతో ముందుకు వచ్చిన విఆర్వో కొమ్మాలును తహసిల్దార్ సరిత రాణి, గ్రామ సర్పంచ్, ఎం పి టి సి లు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీపతి, ఎంపీటీసీ ధరావత్  రవి, వీఆర్ఏలు ప్రశాంత్, నాగేందర్, మహేష్, ఏఎన్ఎం మాధవి,  ఆశ వర్కర్ కనక లక్ష్మి, అంగన్వాడి టీచర్ సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది శ్రీకాంత్, మధుసూదన్, అమరేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

బిజెపి , ప్రజా సంక్షేమ పార్టీ

 బిజెపి , ప్రజా సంక్షేమ పార్టీ.. మండల అధ్యక్షుడు పొదిల నర్సింహరెడ్డి.

కేసముద్రం,  పెన్ పవర్

 కేసముద్రం మండలం లోని కేసముద్రం విలేజ్ లో మంగళవారం భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పొదిల నర్సింహరెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలుపెరగని ప్రజా సంక్షేమం సంక్షేమ పార్టీ అని, ప్రజల కోసం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతర పోరాటం చేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీ అని అన్నారు. దానికి గుర్తింపుగా నేడు ఒక చాయ్ వాలా దేశ ప్రధానిగా పరిపాలన కొనసాగింస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం విలేజ్ లో గ్రామ పార్టీ అధ్యక్షులుగా మంగిశెట్టి నాగన్న, అదేవిధంగా మండల ఆర్గనైజేషన్ సౌలభ్యం కోసం మండల ప్రధాన కార్యదర్శిగా వేముల సతీష్ రెడ్డి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి గాంతి వెంకటరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు రడం వెంకన్న గౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు జూలకంటి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు తుమ్మ ప్రేమ్ కుమార్, పోలేపల్లి దేవి రెడ్డి, ఒంటెల ప్రభాకర్ రెడ్డి, కాటం వెంకటరెడ్డి, ఎదునురి  మహేందర్, వేల్పుల ఐలయ్య యాదవ్, ఆకుతోట శివ, కదిర రాజేందర్ గౌడ్, బొల్లోజు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...