Followers

అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి

 అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి  స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ 48 వ వార్డు బర్మా క్యాంప్ జైభారత్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం లో జరుగుతున్న కొత్త అమావాస్య ఉత్సవాలు సందర్బంగా అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో స్వామి వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జై భారత్ నగర్ గ్రామ అధ్యక్షుడు డాక్టర్ బొగ్గు శ్రీను, ఆలయ కమిటీ ప్రతినిధులు,బొగ్గు శ్రీను మిత్రమ మండలి సభ్యులు, శ్రీరామ్ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు పిల్లి రాజు,పుక్కళ్ళ ప్రసాద్, మరియు అధిక సంఖ్యలో యువత, మహిళలు భక్తులు, తదితరులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి బొగ్గు శ్రీను కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి స్వాత్మానందేంద్ర స్వామి వారు బొగ్గు శ్రీను దంపతులను ఆశీర్వదించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాదరావు,ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చిబాబు శర్మ,తదితరులు పాల్గొన్నారు.

డిపో డిలర్స్ తో అత్మీయ సమావేశం నిర్వహించిన కటమూరి సతీష్

 డిపో డిలర్స్ తో అత్మీయ సమావేశం నిర్వహించిన కటమూరి సతీష్

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

శుక్రవారం శాంతి నగర్ వార్డు ఆఫిస్ నందు 46వ వార్డు కార్పొరేటర్ కటుమురి సతీష్  డిపో డీలర్స్ తో  అత్మీయ సమావేశం నిర్వహించారు.46 వ వార్డులో వున్న రేషన్ డీలర్స్ మరియు ఇంటింటికీ రేషన్ పంపిణి మొబైల్ వాహనం డ్రైవర్ల తో సమావేశం ఏర్పటుచేసి ఆనంతరం వార్డు లో వున్న ప్రజలకు అందరకీ అందుతున్నాయా లేవా అని అడిగితెలుసుకొని  ప్రజలకు రేషన్ సరఫరా లో ఇబ్బంది కలగకుండా వుండాలని చెప్పారు.ప్రతి డిపోలో కూడ సక్రమంగా అందరి  ఇంటికి రేషన్ సరుకులు వెళ్లాలని,మరియు వాహనం డ్రైవర్స్ అందరు కలిసికట్టుగా ఉండి పని చేయాలి అని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్కిల్ -2 ఆర్.ఐ మరియు వార్డు సచివాలయం వి.ఆర్.ఓ లు వంశీ,స్వప్ణ,డిపో డీలర్స్ ఇంటింటికీ రేషన్ పంపిణి మొబైల్ వాహనం డ్రైవర్లు  పాల్గొన్నారు.

చీకటి కమ్మిన చినలబుడు గ్రామంచాయతీ, పట్టించుకోని విద్యుత్ అధికారులు...

చీకటి కమ్మిన చినలబుడు గ్రామంచాయతీ, పట్టించుకోని విద్యుత్ అధికారులు...

అరకు, పెన్ పవర్

చీకటి కమ్మిన చినలబుడు గ్రామంచాయతీ, పట్టించుకోని విద్యుత్ అధికారులు, తక్షణమే కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.శుక్రవారం(అరకువేలి) ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ శుక్రవారం చినలబుడు గ్రామపంచాయతీ పరిధిలోగల మాలివలస మంజగుడా పకనకుడి తుడుం మాలసింగారం చినలబుడు గ్రామాలకు పర్యటించి  ఆ గ్రామ ప్రజల ద్వార వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా గ్రామాలు కరెంటు సమస్యలతో సంవత్సరాల తరబడి ఇబ్బందిపడుతున్నరని, కొండకి చెరువులో ఉన్నందున రాత్రిపూట కరెంటు లేక మహిళలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లలు చాలా అవస్థలు పడుతున్నారని,తరచుగా కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లు కాలిపోయినా కరెంట్‌ (విద్యుత్) అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ లు ఇవ్వడంలో నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని,దీంతో కడుపుమండిన గ్రామపంచాయతీ ప్రజలు ఆందోళన బాట చేపట్టావలసి వస్తుందని,ఎన్నిసార్లు అధికారుల పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పాలకులు విద్యుత్‌ అధికారులు ఏమాత్రం ఇంతవరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లను అమర్చడంలో దృష్టి పెట్టడం లేదని, ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని అన్నారు. 

ఈ గ్రామాలకు ఇంతకుముందు సుమారు 20 సంవత్సరాల క్రితం ఏసిన కరెంట్ స్తంభాలు వైర్లు  45 హెచ్‌పీ మినీ ట్రాన్స్‌ఫార్మర్లు  ఇప్పటికీ వాటిని కొనసాగించడం వలన, లోవోల్టేజీ సమస్య ఏర్పడి వైర్లు తెగిపోవడం స్తంభాలు పడిపోవడం తరచుగ మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్లు కాలిపోవడం వంటివి జరుగుతున్నాయని ఆ ట్రాన్స్ ఫార్మర్ ల నుండి ఆయిల్ కారిపోతున్నాయని.కొత్త ట్రాన్స్‌ఫారం ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకునే నాధుడే లేడని.ట్రాన్స్‌ఫారం కాలిపోతే 24 గంటలు గడిచేలోపు ప్రత్యేమ్నాయంగా ఇంకో ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చవల్సి ఉన్నా,సకాలంలో అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను అందించలేకపోతున్నారని.ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుచేసే సిబ్బంది డబ్బులు ఇవ్వనిదే ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేసి ఇచ్చే పరిస్థితి ఉండటం లేదని అధికారులపై మండిపడ్డారు.ఇప్పటికైనా పాలకులు విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ లో గల పలు గ్రామాలకు త్రి పెస్ కరెంటు లైన్ తో హెవీ ఓల్టేజ్ కెపాసిటీ ట్రాన్స్ ఫార్మర్ లు మంజూరు చేయాలని కరెంట్ సమస్యలపై తక్షణమే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు నెంబర్ పాంగి సింహాద్రి సుంకరి బాలమురళి పొండోయి రాము మొస్య మంగేలి కిల్లో రఘురాం మొస్య మాణిక్యం పొండోయి మిస్యమ్మ కొర్ర ప్రదీప్ కుమార్ పొండోయి లైకొన్ పాంగి లక్ష్మి వంతల రంభ వంతల భాస్కర్ రావు వంతల మదు పాంగి ప్రసాద్ వంతల సోమ పాంగి మొతి గ్రామపంచాయతీ ప్రజలు మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది.

రిజర్వేషన్లు అమలు చేసే ప్రభుత్వరంగాన్ని రక్షించుకుందాం!

 రిజర్వేషన్లు అమలు చేసే ప్రభుత్వరంగాన్ని రక్షించుకుందాం!

మహారాణి పేట, పెన్ పవర్

విభిన్న ప్రతిభావంతులకు,మహిళలకు,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగ,ఉపాధికల్పించే దానిలో రిజర్వేషన్లు అమలుచేసే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని ఇన్సూరెన్సు కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి ఎన్.రమణాచలం పిలుపునిచ్చారు. జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ వేదిక అధ్వర్యంలో నడుస్తున్న దీక్షలు నేడు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (యన్.పి.ఆర్.డి) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విభిన్న ప్రతిభావంతులు కూర్చొన్నారు. వీరితో పాటు మున్సిపల్ వర్కర్స్ ఎఐటియుసి సభ్యులు కూడా ఉన్నారు. దీక్షలను రమణాచలం ప్రారంభించి మాట్లాడుతూ సరేంద్రమోడీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి సామాజిక భద్రతలేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వికలాంగులకు,మహిళలకు, ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉపాధి కల్పించడమే కాకుండా కొన్ని సౌకర్యాలు కూడా పొందుతున్నామన్నారు.ఇప్పటికే ప్రైవేట్ రంగం విస్తరించినా ఎక్కడా రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 

ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే ఈ దేశంలో రిజర్వేషన్లు పొందుతున్న వారి జీవితాలు అంధకారంలోకి పోతాయన్నారు. అందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని,ఇతర బ్యాంకులు,ఇస్సూరెస్సూ,ఆయిల్ రంగం,విద్యుత్, రక్షణ,రైల్వే రలగాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకొని మోడీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులు సైతం ఉద్యమాల్లో పాల్గొని కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారని గుర్తుచేసారు. ఈ దీక్షలలో ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు,జిల్లా కార్యదర్శి బుగిరి నూకప్పారావు,అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు,నగర అధ్యక్షులు పాల వెంకయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరమణ,  విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ సంఘంతో పాటు ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు,వేదిక వైస్ ఛైర్మెన్ పడాల రమణ మున్సిపల్ నాయకులు లింగాల వెంకటేష్,కాసారపు సత్యన్నారాయణ,బంగారిశవ, ప్రసాద్ లు కూర్చొన్నారు.సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.ఎస్.వి.కుమార్,ఎం.సుబ్బారావు,వై.రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ శాఖ ఎన్నికల ఓటింగ్ సమయంలో అతిముఖ్యం

 పోలీస్ శాఖ ఎన్నికల ఓటింగ్ సమయంలో అతిముఖ్యం

తాళ్లపూడి, పెన్ పవర్

ఎన్నికల్లో ఓటింగ్ మొదలైన దగ్గరనుండి అయ్యేవరకు పోలీస్ ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల సమయంలో రకరకాల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నింటినీ చక్కదిద్దుతూ ఎన్నికల విధుల్లో నిమగ్నమై పోలీస్ శాఖ చాకచక్యంగా విధులు నిర్వహిస్తారు. ఎంత మంది ఎన్నికలు నిర్వహించే సిబ్బంది ఉన్నా పోలీస్ శాఖ పాత్ర ఓటింగ్ సమయంలో ముఖ్య పాత్ర. బ్యాలెట్  బాక్సులు భద్రతా రూములకు తరలించే వరకు వీరి పాత్రే ఉంటుంది.

కరోన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కరోన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు వాడాలి.

జైపూర్ ఎసిపి జి.నరేందర్

మంచిర్యాల ,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా   జైపూర్ ఏసీపీ  కార్యాలయంలో ఏసీపీ నరేందర్  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైపూర్ ఎసిపి జి.నరేందర్  మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని,  “మాస్కులు” పెట్టుకోకుండా కిరాణా షాపుల్లో, హోటళ్లలో మరియు చికెన్, మటన్ షాపుల్లో కి వచ్చే వ్యక్తులకు సరుకులు ఇవ్వకూడదని, వాహనాలలో ప్రయాణీకులతో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవరు తప్పకుండా మాస్కు కలిగి ఉండాలని అదేవిధంగా మాస్కు కలిగి ఉన్న వారిని మాత్రమే ఎక్కించు కోవాలని మరియు బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ  మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని, కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని ఏసీపీ గారు చెప్పడం జరిగింది.కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని, వారి వారి గ్రామాలలో ప్రజలకు కరోన పై అవగాహన కల్పించాలని కోరారు. జైపూర్ డివిజన్ లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినా ఇకనుండి ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే చట్టప్రకారం పై కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై  “188 ఐపిసి, 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్”  ప్రకారం  చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 45 సంవత్సరాలు దాటినవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి, ప్రజా ప్రతినిధులు కూడా గ్రామాలలో చాటింపు వేయాలని తెలిపారు.ఆయన వెంట శ్రీరాంపూర్ సిఐ బిల్లా కోటేశ్వర్ జైపూర్ ఎస్సై కె.రామకృష్ణ, శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్, భీమారం ఎస్సై సంజీవ్ లు పాల్గొన్నారు.

కార్పొరేషన్ లో విలీనం అవుతున్న ప్రాంతాల్లో నాయకుల సమావేశం-చందన,ఆకుల

 కార్పొరేషన్ లో విలీనం అవుతున్న ప్రాంతాల్లో నాయకుల సమావేశం-చందన,ఆకుల

రాజమండ్రి, పెన్ పవర్

స్థానిక గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అధ్యక్షతన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అవుతున్న పంచాయతీలు రూరల్ వార్డులు విభజన ప్రక్రియ గురించి రూరల్ వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలతో చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా వారి నుండి వార్డు లపై అభ్యంతర విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్ , మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర గారు,కడలి వెంకటేశ్వరరావు,డబ్బింగ్ రమేష్,కట్టుమూరి విజయ్ కుమార్ వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...