Followers

వాడపల్లి వెంకన్న నకు లక్షా 50 వేలు రూపాయలు విరాళం

 వాడపల్లి వెంకన్న నకు లక్షా 50 వేలు రూపాయలు విరాళం

పెన్ పవర్, ఆత్రేయపురం 

 కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు అందులో ఒక భక్తుడు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్య భాస్కర్ రావు కృష్ణవేణి దంపతులు 1,00,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు.

 అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన వేగేశ్న మనోజ్ వర్మ లలితా దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టు 50,000వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వీరిద్దరిని దేవస్థానం రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

ముడసర్లోవ పార్క్ కి మహర్దశ....

 ముడసర్లోవ పార్క్ కి మహర్దశ....

అరిలోవ, పెన్ పవర్

ముడసర్లోవ పార్కు అభివృద్ధి, ఆధునీకరణ కొరకు 50 కోట్ల నిధులు కేటాయింపు జివిఎంసి కౌన్సిల్ మొట్టమొదటిగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో పార్క్స్ అభివృద్ధి పనులకు మేయర్ ఆమోదం తెలియజేశారు జీవీఎంసీ పరిధిలో గల సుమారు 20 ఎకరాల లో విస్తరించిన ముడసర్లోవ పార్క్ విశాఖ నగర ప్రజలకు మరియు ఇతర ప్రాంతాల వారికి, పర్యాటక ప్రాంతంగా నెలకొని ఉంది.ఆ ఒక్కటి అడక్కు. స్వర్ణకమలం. మరోచరిత్ర. కళ్ళు. నాలుగు స్తంభాలాట. మొదలగు అనేక చిత్రాలు విశాఖ వేదికగా గతంలో చిత్రీకరణ చేసేవారు, ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో గల ప్రాంతాల్లో ముడసర్లోవ పార్క్ఒకటి చుట్టూ పచ్చని కొండలు కొండలు మధ్యలో రిజర్వాయర్ పూర్తిగా వర్షాధారం కావడం పర్యాటకులకు ప్రకృతి ప్రేమికులకు, వివిధ రకాల పక్షులకు, అనేక జీవరాశులకు ఆధారం ఈ పార్క్.. నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన రిజర్వాయర్లో ఇది ఒకటిగా ఉంది దశాబ్దాల కాలంగా ఈ పార్కు పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంది పార్కు అభివృద్ధి కొరకు వీఎంఆర్డీఏ సుమారు 45 కోట్ల రూపాయలు తో ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వలన ప్రారంభానికి నోచుకోలేదు . 

పెరుగుతున్న నగర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు పర్యాటకులకు ఒక మంచి ఉద్యానవనం అందించుటకు ముడసర్లోవ పార్క్ ను అభివృద్ధి చేయుటకు కౌన్సిల్ ఆమోదం తెలపడంతో నగర మేయర్ చొరవతో పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.  13 వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత మాట్లాడుతూ ముడసర్లోవ పార్కు అభివృద్ధికి తన హయాంలో 50 కోట్ల రూపాయలు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేశారు పార్కు అభివృద్ధితోపాటు ఈ ప్రాంతం ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పార్కు నిర్మాణనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని  పార్కులను అభివృద్ధి చేయుటకు సహకరించిన అధికార గణానికి తోటి కార్పొరేటర్లకు మేయర్ హరి వెంకట కుమారి. కి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

కేంద్రం రైతులపై కక్షసాధింపు చర్యలు...సిపిఎం

 కేంద్రం రైతులపై కక్షసాధింపు చర్యలు...సిపిఎం

దేవరాపల్లి,  పెన్ పవర్

కేంధ్రప్రభుత్వం 58 శాతం ఎరువులు ధరలు పెంచడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తీవ్రంగా ఖండించారు శనివారం దేవరాపల్లిలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కర్రిదేముడుతో కలిసి,మాట్లాడారు ఎరువులు ధరలు ఒకే సారి 58 శాతం పెంచడం రైతులుపై కేంధ్రప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని తెలిపారు ఎరువులు ధరలు పెంచడం వలన రైతులు పరిస్థితి మరింత దౌర్బగ్యంగా తయారు అవుతుందని అన్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక కష్టాల్లో ఉన్న రైతంగంపై ఇంతపెద్ద ఎత్తున ఎరువులు ధరలు పెంచడం దుర్మామైన చర్య అని తెలిపారు కేంధ్ర బడ్జెట్లో వ్వసాయరంగానికి బారికోత విదించారని గతసంవత్సరం 5,1 వాట ఉంటే దీన్ని 4,3 శాతానికి తగ్గించారని అన్నారు 20 ,లక్షలు కోట్లు ఆత్మ నిర్బరప్యాకేజీ లో రైతులకు ఇప్పటి వరకు చేసింది ఎమిలెదని తెలిపారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత  ప్రజలుపై భారాలు వేయడం కార్మిచట్టాల్లో మార్పులు చేయడం ప్రభుత్వ రంగసంస్థలు కార్పోరేట్ సంస్థలుకు అమ్మేయడం లేదా మూసెయడం ఎత్తెడంవంటి చర్యలు పూనుకుందని అన్నారు దేశంలో రైతులు గోంతుకోసె నూతన వ్వవసాయచట్టాలును తీసుకువచ్చిందని దీని వలన రైతులు ఇప్పటికే ఐదునేలలు నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూన్నారని తెలిపారు.

 స్టీల్ ప్లాంట్ లాంటి బారి పరిశ్రమలను అమ్మేడం రైల్వే బ్యాంకింగ్ బి,యస్ ఎన్ ల్ హెయిర్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగసంస్థలు బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలు  విపరీతంగా పెంచడం దారుణం మన్నారు ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులుకు ఎరువులు పురుగుమందులు ధరలు పెంచడం వ్వవసాయానికి రైతును దూరం చేయడమేనని తెలిపారు రైతంగ పోరాటాలుపై దేశఅట్టుడుకు పోతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హెచ్చరించారు ఈనేల 18 న విశాఖపట్నంలో పామ్ బీచ్ వద్ద రైతు కార్మిక సంఘాలు అద్వర్యంలో ఉత్తరఆంధ్ర జిల్లాల మహపంచాయితీ జరుగుతుందని తెలిపారు దీనికి రైతు వ్వవసాకార్మిక సంఘాలు జాతీయ నాయకులు హజరు అవుతున్నారని కేంధ్రప్రభుత్వం మేడలు వంచడంకోసం ప్రజలు కదిలిరావాలని కోరారు వెంటనే పెంచిన ఎరువులు ధరలు వెనకకు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.

రావాడలో అనుమతులు లేని కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

 రావాడలో అనుమతులు లేని కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

పరవాడ, పెన్ పవర్

మండలం లోని రావాడ పంచాయతి శివారు బొట్ట వాని పాలెం గ్రామం లో ఎటువంటి అనుమతులు లేని సిమెంట్ రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణం కొరకు మిషనరీ వస్తే వాటిని సర్పంచ్ మోటూరి సన్యాసినాయుడు మరియు నాయకులు, రైతులు,గ్రామస్థులు  అడ్డుకోవడం  జరిగింది.ఈ కంపెనీ నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు అని  ఈ నెల మొదటి వారంలో మండల పరిషత్ కార్యాలయంలో  గ్రామస్థులు నాయకులు కలిసి అధికారులకు కంపెనీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దు అని వినతిపత్రం సమర్పించారు అని సన్యాసినాయుడు తెలియజేసారు.అయినా కంపెనీ యాజమాన్యం రాత్రి వేళల్లో దొంగ చాటుగా నిర్మాణ పనులు చేయిస్తోంది అని అరోపించారు.ఈ కంపెనీ పెట్టడానికి ఎటువంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా పెడుతున్నారు అని ఆరోపిస్తూ అధికారులు వచ్చి ఆపమని చెప్పినా ఈ కంపెనీ వారు మమ్మలిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని మాట్లాడుతున్నారు అని సన్యాసి నాయుడు తెలియ జేశారు.

గ్రామస్థులు ఇక్కడ పొల్యూషన్ లేకుండా బాగా జీవించాలి అంటే ఈ కంపనీ ఇక్కడ పెట్ట కూడదు అని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు అని అన్నారు.ప్రజలు ఇక్కడ  పశువుల మేపుకుంటు,వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు అని ఇప్పటికే ఇక్కడ ఇళ్లల్లో నివసిస్తున్న వారు  ఫార్మసీటి పొల్యూషన్ వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు అని వాపోయారు.కంపెనీ నిర్మాణం సాగిస్తున్న వారి దగ్గరకు పోలీస్ అధికారులు కూడా వచ్చి వారి దగ్గర పేపర్స్ అవి  తీసుకుని నిర్మాణ పనులు ఆపాలి అని వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని సన్యాసినాయుడు తెలియ జేశారు.అనుమతులు లేకుండా కంపెనీ నిర్మాణం సాగిస్తున్న యాజమాన్యం పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మోటూరి సన్యాసినాయుడు గ్రామస్థులతో కలిసి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వియ్యపు చిన్నా,స్థానిక నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన ఎస్ ఐ వెంకట్

 ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన ఎస్ ఐ వెంకట్ 

వి. ఆర్. పురం, పెన్ పవర్ 

వి.ఆర్.పురం మండలం ఇందిరాగాంధీ సెంటర్  పరిధిలోఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎస్ ఐ వెంకట్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వి.ఆర్.పురం ఎస్ ఐ వెంకట్   మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థినులు చదువు విషయంలోపోటీపడుతూ మంచి మార్కులతో పై స్థాయికి ఎదగాలి తప్ప పనికిరాని ఆలోచనలు రాకూడదు. ముఖ్యముగా బాలికలను ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడిన ఇబ్బంది పెట్టిన  ర్యాగింగ్ చేసిన మాకు తెలియజేయండి.  మీ కాలేజీలో లెక్చలర్లు ప్రతిరోజు వస్తున్నారా సిలబస్ పాఠాలు మంచిగా బోధిస్తు నారా మీకు అర్థమవుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మీ తల్లిదండ్రులు  మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీకి పంపిస్తున్నారు.  విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి. కాలేజీలో  చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్థాయికి ఎదగాలి.అప్పుడే  సమాజంలోతల్లిదండ్రులకు మీకు మంచి పేరు గౌరవం ఏర్పడుతుంది. వి.ఆర్.పురం ప్రభుత్వజూనియర్ కాలేజీ కూడా మంచి పేరు తేవాలని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చలర్లు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. 

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

 కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం

పెన్ పవర్, రౌతులపూడి

రౌతులపూడిలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రౌతులపూడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్వీ. నాయుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం లో గల 45 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 11-04-21 నుండి 14-04-21 వరకు  కార్యక్రమం జరుగుతుందని 45  సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని తెలిపారు. మండలం లో గల గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయ సిబ్బంది, సెక్రటరీ లు, వి ఆర్ ఓ లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా సిబ్బంది మొదలగు వారందరూ ప్రజలకు అవగాహన కల్పించి 45 సంవత్సరములు నిండిన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

ప్రజా పత్రిక ఎడిటర్ దేవీ సుదర్శన్ మరణం పట్ల ప్రెస్ క్లబ్ సంతాపం

 ప్రజా పత్రిక  ఎడిటర్   దేవీ సుదర్శన్ మరణం పట్ల ప్రెస్ క్లబ్ సంతాపం 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

    ప్రజా పత్రిక వారపత్రిక ఎడిటర్ సింహంభట్ల దేవీ సుదర్శన్ ఆకస్మిక  మరణం పట్ల చింతిస్తూ, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి అధ్యక్షతన ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం ఉదయం  సంతాప సభ  నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె చిత్రపటానికి సారధి తో పాటు క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామ మూర్తి,  సీనియర్ పాత్రికేయులు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, ఏ ఆర్ వి సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్,  ఎన్టీవీ శ్రీనివాస్, విశ్వనాధ్, రాఘవరావు ,ఈశ్వరరావు, మధు, దివాకర్ల ఆనంద్, కృపానందం, స్టార్ మురళి, కె మధు , రమేష్, తిరుమల, ఆర్కే,  ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ  తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మ శాంతికోసం రెండు నిముషాలు మౌనం పాటించారు.  విలువలతోవారపత్రిక నడుపుతూ దేవి సుదర్శన్ ఆదర్శంగా నిలిచారని, సంచలనాల కంటే నిజమైన వార్తకు విలువ ఇచ్చారని పలువురు పేర్కొన్నారు.  అందరితో, కలివిడిగా, కలుపుగోలు తనంగా ఉంటూ ఎందరికో ఆత్మీయులయ్యారని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...