Followers

అంగన్ వాడీ... ఇక ఆనందాల ఒడి.!

 అంగన్ వాడీ... ఇక ఆనందాల ఒడి.!   

అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ         

 తొలిదశలో 29 భవనాల నిర్మాణం

 నవీకరణతో 19 చోట్ల సొబగులు    

 పెన్ పవర్, కందుకూరు

 నాడు నేడు పథకం లో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం తో పాటు నవీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు  నాడు నేడు శ్రీకారం చుట్టనుంది. గత కొన్ని నెలలుగా వివిధ రకాల నిధులతో సొంత భవనాలను నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల పక్కా భవనం భాగ్యం లేదు. పల్లె, పట్టణాల్లో అద్దె ఇల్లు తీసుకొని నడుపుతున్నారు. మరోవైపు ఇరుకైన గదులతో  ఆసౌకర్యాలతో నెట్టుకొస్తున్నారు. కొన్నింటిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. మురుగు వసతి ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు నేడు అమలు చేస్తోంది. ఇక అంగన్వాడీలను అమలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు దశల్లో అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టి సారించారు. సాంకేతిక నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ కు అప్పగించారు. ఇప్పటికే నూతన భవనాలు నిర్మించాల్సిన కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లాలో సొంత గూడు లేని చోట నూతనంగా భవనాన్ని నిర్మించి కొత్త సొబగులు తీసుకురావాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో సుమారు 29 నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి 14 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. అవసరాన్ని బట్టి అంచనా వ్యయం పెంచే యోచనలో ఉన్నారు. వంటగది, సామాగ్రి నిలవ గది, మురుగు వసతి, ఆటస్థలం తో కలిపి నూతన భవనాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే నియోజకవర్గంలో లో తొలి దశలో నియోజకవర్గంలో 19 కేంద్రాలను నవీకరించాలి అని నిర్ణయించారు. అదనపు సదుపాయాల కల్పనకు ఒక్కో భవనానికి  6.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. అవసరమైన వసతులు ఏర్పాటు చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. ఫ్రిజ్, నీటి ఫిల్టర్, ట్యూబ్లైట్, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు,తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆటవస్తువులు, రంగులు, వంటగది నిర్మాణం చేపడతారు. ఇవేగాక ఎక్కడైనా ప్రహరీ లేకపోతే ఉపాధిహామీ నిధులతో నిర్మించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త నిర్మాణాలు, నవీకరణ పనులను అంగనవాడి కేంద్రాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు కన్వీనర్ గా ఉంటారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్త, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు, మహిళా సంరక్షణ కార్యదర్శి, కేంద్రంలో లబ్ధి పొందుతున్న 2-4 ఏళ్ల వయసున్న పిల్లల తల్లులు ముగ్గురు సభ్యులుగా ఎంపిక చేస్తారు. అభివృద్ధి కమిటీ కు చెందిన బ్యాంకు ఖాతాలకు నిధులను జమ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలను వైయస్సార్ పూర్వ ప్రాథమిక పాఠశాల గా మార్పు చేసింది. ఈ పాఠశాలలకు వచ్చే బాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతో నామమాత్రంగా ఉండేవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు అభివృద్ధి చేస్తుండడంతో కొత్త రూపు సంతరించుకోనున్నాయి. పట్టణాల్లో భూమి విలువ ఎక్కువ కావడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసేందుకు నిధుల సమస్య ఉంది. ప్రభుత్వ భూములు తక్కువగా ఉండడం అవి కూడా అంగన్వాడీ కేంద్రాలకు దూరంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థలాలు సమకూరితే గాని నిర్మాణ పనులు ప్రారంభించడం కుదరదు. దాతలు ఎవరైనా స్థలాన్ని విరాళంగా ఇచ్చిన కూడా తీసుకోమని ప్రభుత్వం సూచించింది. గ్రామాల్లో కొంతవరకు పూర్వీకుల స్థలాలను ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కానీ పట్టణాల్లోని స్థల సమస్య తీవ్రం కానుంది. ప్రభుత్వం  అంగనవాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టి ఆట పాటల ద్వారా ఇంగ్లీష్ మీడియం బాలలకు నేర్పించాలని ప్రతిష్టాత్మకంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడమే కాక అంగన్వాడీలకు నూతన భవనాలు అంగనవాడి భవనాల నవీకరణ కు నాడు నేడు కింద ప్రభుత్వం చేపట్టడంతో బాలల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా అంగన్వాడీ కేంద్రాలలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది.

కరోనా వ్యాక్సిన్ వేగవంతం

 కరోనా వ్యాక్సిన్ వేగవంతం  

పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులుగా గుర్తించారు దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పవచ్చు ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శనివారం కరోనా  వ్యాక్సిన్ రెండో దశ ప్రారంభించారు ఈ రోజు  45 సంవత్సరాలు దాటిన వారు 50 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు డాక్టర్ దుర్గ భవాని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని జనంలో అపోహ తొలగిపోవాలని డా. భవాని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి అన్నపూర్ణ పాల్గొన్నారు.

ప్రపంచ మేధావి డా.బి.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతిని జయప్రదం చేయండి

 ప్రపంచ మేధావి డా.బి.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతిని  జయప్రదం చేయండి

రాజమహేంద్రవరం,పెన్ పవర్

రాజమహేంద్రవరం లో ఉదయం 10గంటలకు స్టానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నందు డా.బి.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్భంగా 130వ జయంతి కార్యక్రమ కన్వీనర్ కోరుకొండ చిరంజీవి,మాట్లాడుతూ ప్రపంచ మేధావి భరత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ భారత దేశ ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతాల అభివృద్ది కోసం, వివిధ జాతుల,మనుగడ కోసం, మరియు మహిళా హక్కుల కోసం,ప్రపంచంలో  ఒక మంచి రూప కర్త గా దాన్ని అన్ని జాతులవారుకి దీనిని రూపొందించారు.గనుక నగర ప్రజలు తారతమ్యాలు లేకుండ అందరూ వచ్చి డా బి.ఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహనికి నివాళి అర్పించాలని కోరినారు.ఈ సందర్బంగా ప్రముఖ దళిత నాయకులు అజ్జరపు వాసు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు స్థానిక వై జంక్షన్ నుంచి గోకవరంబస్ స్టాప్ దగ్గర గల అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు జరుగు ర్యాలీ నిర్వహించుచున్నాము అని, ప్రజలు అభిమానులు తరలి వచ్చి జయప్రదం చెయ్యాలని వీరు కోరారు.ఈ కార్యక్రమంలో తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్,వైరాల అప్పారావు ,అజ్జరపు వాసు, కాప్పల వెలుగు కుమారి,పాము బాబు రావు,కోరుకొండ మురళి క్రిష్ణ,సమతం గనయ , బొట్చ రమణ, దువ్వడ రాజా, సొమబత్తులు విజయ కుమార్, మరే వెంకటేశ్వర రావు,అనకాపల్లి సూరి, తోలెటి రాంప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.

రావులపాలెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామారెడ్డి

 రావులపాలెం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామారెడ్డి

పెన్ పవర్, ఆలమూరు 

  కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆలమూరు మండలం జొన్నాడ కు చెందిన నల్లమిల్లి రామారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం రెండేళ్లు పాటు కొనసాగుతుందని, ప్రమాణ స్వీకారం ఆదివారం 11వ తేదీన రావులపాలెంలో గల విందు రెస్టారెంట్లో జరుగుతుందని వెల్లడించారు. రామారెడ్డి గతంలో ఎనిమిదిసార్లు తొమ్మిది ఏళ్లపాటు రావులపాలెం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు నిర్వహించగా, తూర్పు గోదావరి జిల్లా ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నాలుగేళ్లు పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్షుడు రామారెడ్డితో పాటు గౌరవ అధ్యక్షులుగా ఎం సంతోష్, జి రమణ, ఉపాధ్యక్షులుగా ఏడుకొండలు, సెక్రటరీగా ఎం మనోజ్ కుమార్, ట్రెజరర్ గా కె నరసింహమూర్తితో పాటు మరో పదముగ్గురు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి

 టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి...

ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న...

ఆదిలాబాద్, పెన్ పవర్

టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆదిలాబాద్ రూరల్ మండల్ అభ్యర్థిని గెలిపించే లా టిఆర్ఎస్ నాయకులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఉన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లో గాయత్రీ గార్డెన్ లో నిర్వహించిన  రౌండ్ టేబుల్  సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ. ఆదిలాబాద్ రూరల్ మండల జడ్పిటిసి గా ఆరే నరేష్ బలపరిచిన  నేపథ్యంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త జడ్పిటిసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, ఎంపిటిసి కోడాపె అరుణ్, టిఆర్ఎస్ శ్రేణులు,  టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాల సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమాధికారికి సన్మానం

 మాల సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమాధికారికి సన్మానం...

ఆదిలాబాద్ , పెన్ పవర్

జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా  బాద్యతలను స్వీకరించిన కడారి రాజలింగును  జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  శుక్రవారం  ఘనంగా సన్మానించారు.  జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన  సంఘం నేతలు పూలమాల, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ  సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు  సూరం భగవాండ్లు, అల్లూరి భూమన్నలు మాట్లాడుతూ  గుమాస్తాగా  నియామాకమై జిల్లా అధికారిగా  ఆదిలాబాద్​కే రావడం  దళితజాతికే గర్వకారణమని  కొనియాడారు.   బాద్యతల నిర్వహణలో పదవీకి మరింత వెన్నే తెవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.    ఈ కార్యక్రమంలో సంఘం డిస్ట్రిక్​ ప్రెసిడెంట్​, జనరల్​ సెక్రటరీలు  సూరం భగవాండ్లు, అల్లూరి భూమన్న,   బేర శ్రీనివాస్​,  సూర్యవరప్రసాద్​, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్ టిఎస్ఓ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ

ఐఎన్ టిఎస్ఓ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ

మందమర్రి,  పెన్ పవర్ 

ఐఎన్ టిఎస్ ఆన్ నైన్ పరీక్షలలో ప్రతిభ కనబరచిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఐ ఎన్ టి ఎస్ పరిక్షలలో శ్రీ చైతన్య పాఠశాల కు చెందిన విద్యార్థులు రెండో లెవల్ కు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. మందమర్రి కి చెందిన 26 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ సంజీవ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...