Followers

గ్రామ గ్రామాన ఎగిరిన ఎర్ర జెండా

 గ్రామ గ్రామాన ఎగిరిన ఎర్ర జెండా

కార్మిక కర్షకులు హక్కుల కోసం ఉద్యమించాలి 

ఘనంగా 135 వ కార్మిక దినోత్సవ వేడుకలు

సీపీఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్


తొర్రూరు, పెన్ పవర్

కార్మిక కర్షకుల హక్కులకై సంఘటితంగా ఉద్యమించాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బొల్లం అశోక్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య లు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయంతో పాటు మరో మూడు చోట్ల,కంటాయపాలెం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో,అమ్మాపురం,  ఖానాపురం, హరిపిరాల గ్రామాలలో సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... 135వ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభల నడుమ జరుపుకోవడం బాధాకరమని, అన్నారు. కరోన మహమ్మారి ప్రపంచ మానవాళిని కబళించడం జరుగుతుందన్నారు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక అణగారిన వర్గాల రక్షణ చట్టాలను హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారన్నారు. 75 సంవత్సరాలు కార్మికుల రక్తమాంసలతో  కూడపెట్టిన ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా అంబానీ ఆధాని శతకోటీశ్వరులకు అప్పనంగా ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో 6నెలల నుండి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పోరాటం కొనసాగుతోందన్నారు.కరోన వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేయటలో విఫలమైందని అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, మాస్క్ జాగ్రతలు పాటించి, కరోన వైరస్ ని జయించాలని,పిలుపునిచ్చారు.గత సంవత్సరం ఢిల్లీ  సభలకు పోయి వచ్చిన ముస్లీమ్ నిందించినా బిజెపి ప్రభుత్వం కుంభమేళా నిర్వహించి, ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ ప్రాబల్యం పెంచిందన్నారు.  దోపిడి ప్రభుత్వానికి కార్మిక వర్గం ప్రతిఘటన ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎండి. యాకుబ్, మార్క సాంబయ్య, సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొమ్ము దేవేందర్, మార్బల్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కాశీం, సిపిఎం కంటాయ పాలెం గ్రామ కార్యదర్శి సోమిరెడ్డి, నాయకులు తాళ్ళ వెంకటేశ్వర్లు, బోర స్వామి, అమ్మాపురం గ్రామ కార్యదర్శి డోనుక దర్గయ్య, ఖానాపురం హమాలి యూనియన్ అధ్యక్షులు రమేష్, హరిపిరాల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి చంద్రయ్య, మురళి, రాపోలు ముత్తయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తొర్రూరు మండల అధ్యక్షులు రామ నరసయ్య, కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఏన్నమనేని శ్రీనివాసరావు, జంపా, గజానంద్, నాయకులు దొంగరి శంకర్, జై సింగ్, రమేష్, రాజేందర్, అంజయ్య, శ్రీకాంత్, శంకర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సురేష్ బాబు, కార్మికులు, కర్షకులు, తదితరులు పాల్గొన్నారు.

కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్న పురపాలక సిబ్బంది

కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్న పురపాలక సిబ్బంది


తొర్రూరు, పెన్ పవర్ 

కరోనా మృతదేహానికి   అంత్యక్రియలు  నిర్వహించేందుకు రక్తసంబంధీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు ఆదేశాల మేరకు. పురపాలక సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు.శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 58 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించగా, దహన సంస్కారాలు చేయడానికి బంధువులు భయపడ్డారు.అలాంటి సమయంలో కూడా మృతుని బంధుమిత్రులు సాయం పట్టడానికి ముందుకు రాలేదు. నాలుగో వ్యక్తి ఎవరైనా వస్తారా అని అరగంట సేపు ఎదురుచూసినా ఫలితం లేదు. దీంతో పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది మృతదేహన్ని ప్యాకింగ్‌ చేసి, బయటకు తీసుకు రావడానికి వారికి గంటకు పైగా సమయం పట్టింది.పట్టణంలోని హరిపిరాల రోడ్డులోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.కొవిడ్‌ మహమ్మారి బంధాలను చిదిమేస్తోంది. బతికి ఉన్నప్పుడు ఆలింగనం చేసుకున్నవారు, మరణించాక మృతదేహం వద్దకు వచ్చేందుకు కూడా సాహసించడం లేదు. కుటుంబ సభ్యులు మరణించినా అనవసరమైన అపోహలతో అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆత్మబంధువుల్లా మారి, మునిసిపాలిటీ సిబ్బంది చనిపోయిన వారి మతాచారాల ప్రకారం  అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు లు మాట్లాడుతూ... కరొనాతో మరణిస్తే బంధువులు భయపడుతున్నారని, తాము కూడా కొవిడ్‌ బారిన పడతామని ఆందోళన చెందుతున్నారన్నారు. మృతదేహానికి ప్యాకింగ్‌ చేసి, పీపీఈ కిట్లు ధరించి, అంత్యక్రియలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొవిడ్‌తో మరణించిన వారి శరీరంలో కనిష్ఠంగా 3, గరిష్ఠంగా 6గంటలు మాత్రమే వైరస్‌ ఉంటుందన్నారు.ఆ తర్వాత మృతదేహంలో ఎలాంటి వైరస్‌ ఉండదని, మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అందరికీ ఆత్మీయతను పంచినవారు మరణిస్తే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులు, బంధువుల బాధ్యత అన్నారు.కరోనాపై ప్రజల్లో అపోహలు దూరం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.ఈ అంత్యక్రియల్లో ఆర్ఐ రాకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్  కొమ్ము దేవేందర్,వీఆర్ఏ రాంబాబు,తదితరులు ఉన్నారు.

ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ.

 ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ.

తొర్రూరు, పెన్ పవర్

కరోనా వ్యాధి పట్ల భయపడాల్సిన పని లేదని,అదే సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని, ప్రముఖ సామాజికవేత్త,డాక్టర్ గడ్డం రాజు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రములోని అమ్మ హాస్పిటల్ ఆవరణలో "ఆరోగ్యమిత్ర" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా అవగాహన పై జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ...కరొనా సెకండ్  వేవ్ జాగ్రత్తల్లో మూడు విషయాలను జాగ్రత్తగా పాటించాలని, అందులో తప్పనిసరి అయితే తప్ప బయటికి రాకుండా ఉండటం,  నిరంతరం మాస్కూలు  ధరించడం,సామాజిక దూరాన్ని పాటించడం, ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కో వడం పాటించినట్లయితే కరొనా రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అని తెలిపారు.అనంతరం ఆరోగ్య మిత్ర సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించి, స్థానికులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో   అక్షర సేద్యం వ్యవస్థాపకులు కస్తూరి పులెందర్,డాక్టర్ పంతంగి నాగ కార్తీక్,బుదారపు శ్రీనివాస్,హాస్పిటల్ సిబ్బంది,ఆశా వర్కర్లు,  తదితరులు పాల్గొన్నారు.

మానుకోట జిల్లాను రామరాజ్యంగా మార్చిన ఎస్పి కోటిరెడ్డి

మానుకోట జిల్లాను రామరాజ్యంగా మార్చిన ఎస్పి కోటిరెడ్డి

మహుబూబాబాద్ జిల్లాకు వచ్చి నేటితో నాలుగు వసంతాలు పూర్తి.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా జిల్లా పోలీస్ బాస్.




నెల్లికుదురు, పెన్ పవర్

 నాలుగు సంవత్సరాల కాలంలో మహబూబాబాద్ జిల్లా లోని ప్రజల శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి ప్రజా రక్ష నే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన జిల్లా పోలీస్ బాస్ నంద్యాల కోటి రెడ్డి.  క్షేత్రస్థాయిలో ఎన్నో ప్రకృతిపరమైన ఆటంకాలు ఎదురైనా ప్రజల కోసం పోలీస్ బందోబస్తులు నిర్వహించి ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేశారు అలాగే యాక్సిడెంట్ వల్ల కానీ సస్ట్ర  చికిత్సల వల్ల కాని తీవ్ర  రక్తస్రావం జరిగి రక్త దాతల కోసం ఎదురు చూసె వారికి నేనున్నానంటూరక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణధాత గా నిలిచిన సేవాతత్పరుడు అలాగే, పేద విద్యార్థులకోసం ఉచిత  కోచింగ్ క్యాంపులు నిర్వహించి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని జిల్లాలో  అమలుపరిచి  పోలీస్ సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చేసి, ప్రజల మన్ననలు చూరగొన్న వ్యక్తి. పోలీస్ కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి,కారోన కాలంలో  నిత్యావసర సరుకులు అందించి,కారోన సోకిన పోలీస్ కుటుంబాలకు గుండెల్లో మనోధైర్యాన్ని నింపి అండగా  ఉండి,ఎలాంటి వారినైనా చిరునవ్వుతో పలకరించి,మహబూబాబాద్ జిల్లాను  రామరాజ్యం గా మార్చాడు. మహబూబాబాద్ జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి మహుబూబాబాద్ జిల్లా ప్రజలకు తన వంతు సేవ అందించడం నాకు  అదృష్టం.ఈ నాలుగు సంవత్సరాలు నాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్న జిల్లా ప్రజలకు ,ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తు, ప్రజల ఆరోగ్యాలను చిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ మాస్కు ధరించి, రాత్రివేళ కర్ఫ్యూ సమ యం లో మహబూబాద్ జిల్లా ప్రజలందరూ పోలీసువారికి సహకరించగలరు. 

బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

 బాలుడి వైద్య ఖర్చులు భరిస్తా - మైనంపల్లి రోహిత్

రామసాయి నైనిశ్ కు అండగా ఉంటా

మెరుగైన వైద్య సేవలు అందించాలి - రోహిత్

పెన్ పవర్, మల్కాజిగిరి

బాలుడు రామసాయి నైనిశ్(5) వైద్య ఖర్చులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు భరిస్తుందని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. శనివారం మౌలాలి ఎంజేకాలనీలో నివాసం ఉండే దనుంజయ్ శర్మ సాయి సిందూజ కొడుకు నైనిశ్ విద్యుత్ షాక్ కు గురైయి ఏఎస్ రావునగర్ అంకూర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతు నైనిశ్ ను మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్ పరమార్శించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి బాలుడి చికిత్స కోసం ఆయ్యే వైద్య ఖర్చులను భరిస్తామని తెలిపారు. అసుపత్రిలో వైద్య ఖర్చులు మీరూ చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. అసుపత్రి యజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చులు మైనంపల్లి ట్రస్టు భరిస్తుందని తెలిపారు. బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటికి వచ్చే వరకు తన బాధ్యత అన్ని రోహిత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్షి జీ.ఎన్.వి సతీష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, ఎం.బాగ్యనందరావు, ఉపేందర్ రెడ్డి, సంతోష్ నాయుడు, మహేష్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

పెన్ పవర్, వలేటివారిపాలెం

వలేటివారిపాలెం  కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా  సిఐటియు జెండాను జిల్లా కౌన్సిల్ సభ్యులు సాధు చెన్నకేశవులు పంచాయతీ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1,086 లో చికాగో నగరంలో కార్మికులు పనిగంటలు తగ్గించాలని, వేతనం పెంచాలని ఉవ్వెత్తున పోరాడాలని, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన కాల్పులు జరిపి 32 మంది ప్రాణాలు బలి తీసుకుందని, కార్మికుల రక్తంతో తడిసిన గుడ్డను ఎర్రజెండా గా ఎగరవేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పని దినం అమలు అవుతుందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 8 గంటలు ,12 గంటలు మారుస్తూ చట్టం చేసిందని, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  పోరాడటమే మేడే కర్తవ్యాన్ని మన ముందు ఉందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మాదాల రమణయ్య, సిఐటియు నాయకులు జీవిబి కుమార్,  మేస్త్రి రామాంజయ్య, నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం....

 ఘనంగాప్రపంచ కార్మిక దినోత్సవం.... 

పెన్ పవర్, ఉలవపాడు 

మే 1. మేడే సందర్భంగా ఉలవపాడు మండలం లో కరేడు ర్యాంపు లోని పి టి పి కంపెనీ వద్ద పి టి పి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆ సంఘం అధ్యక్షులు సవరం శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు, మండల కేంద్రంలోని సింగరాయకొండ ఆటో స్టాండ్ లో ఉలవపాడు మండల ఆటో వర్కర్స్ యూనియన్  (సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ జండా ను ఆ సంఘం మండల కార్యదర్శి జె. సురేష్ బాబు ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ జండాను ఆ పార్టీ నాయకులు ఎస్.డి గౌస్ ఆవిష్కరించారు  అనంతరం ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద కు వెళ్లి విగ్రహానికి సంఘం అధ్యక్షులు sd. జహీర్  పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్ మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని కార్మికవర్గం పోరాడుతుంటే, ఇది సహించలేని పెట్టుబడిదారీ వర్గం కార్మికుల పైన అమానుషంగా కాల్పులు జరిపిందని ఆ కాల్పుల్లో 32 మంది అమరుల అయ్యారని, వారి రక్తంలో తడిసిన గోడను ఎర్ర జెండా ఎగరేసి కార్మిక శక్తిని చాటారని, అప్పటి నుండి ఎనిమిది గంటల పనిదినం అమలవుతుందని తెలిపారు. అయితే నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూపనిని 8 గంటలనుండి 12 గంటలకు పెంచిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు కాల రాస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వ విధానాల తెచ్చుకోవటమే నేడు కార్మికవర్గం ముందున్న కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం నాయకులు  పొట్లూరు రవి కొమరగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు గంజి శ్రీనివాసులు చిమటా శ్రీనివాసులు, మండవ కోదండరామ్, జేమ్స్, పీ మస్తాన్ రావు  తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...