Followers

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఏలేశ్వరం, పెన్ పవర్

పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే  సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఏ ఐ సి సి టి యు, ప్రజా సంఘాల నాయకత్వంలో జెండా ఆవిష్కరణకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లిబరేషన్ కార్యదర్శి  కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిచ్చారు. దేశంలో సెకండ్  వేవ్  కరోనా మరణాలకు బిజెపి ప్రధాని మోడీ నిర్లక్ష్యమే కారణం అన్నారు.భారతదేశం కరోనా యాక్షన్ లు గొప్ప విజయం సాధించిందని  గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ భారత ప్రజలను కరోనా  మహమ్మారి కి బలి చేశాడు అని ఆరోపించారు.దేశంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గట్టారు. రైతు వ్యతిరేక 3  వ్యవసాయ నల్ల చట్టాలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ  చేయడం,ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వడంలో  అన్యాయం, యువతకు ఉద్యోగ ఉపాధి లేకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎన్నడూ ఎరుగని రేట్లు, మహిళలపై దళితులపై అత్యాచారాలు దాడులు,ప్రజా వ్యతిరేక విధానాలతో హిందూ మతోన్మాద పాసిజం నడిపిస్తున్న మోడీ  ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలు  గమనిస్తున్నారని అన్నారు. కార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఈ తరుణంలో కార్మికులంతా ఏకమై ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం , యువజన సంఘం, విద్యార్థి సంఘం , కూలీలు, రైతులు, ప్రజా సంఘాలు సీపీఐఎంఎల్ లిబరేషన్ , ఏ ఐ సి సి టి యు ప్రజా సంఘాల కార్యకర్తలు , నాయకులు గండే టి నాగమణి, గుమ్మడి రమణ, కందుల ప్రసాద్, జీ సాయి, కందుల సతీష్ ,పిల్లా కాంతం, నాగులాపల్లి అర్జునుడు, బి రాఘవ,  గుర్రం గోవింద్, చందక లక్ష్మి,  కందుల వరలక్ష్మి ,గుమ్మడి పాదాలమ్మ , వరాలమ్మ ,వడ్డాది గంగాభవాని తదితరులు పాల్గొన్నారు .

ఘనంగా మేడే వేడుకలు

ఘనంగా మేడే వేడుకలు

ఎటపాక, పెన్ పవర్

ఘనంగా మేడే వేడుకలు గన్నవరం, క్రిష్ణవరం ,లక్ష్మీపురం ,తోటపల్లి, సీతాపురం ,రంగాపురం ,పట్టుచీర,కన్నాపురం ,భూపతిరావుపేట ,జిన్నగట్ట ,కాపుగొంపల్లి ,నందిగామ, మురుమూరు సీపీఐ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మండలంలోని గన్నవరం లోని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ కందుకూరి మంగ రాజు గారి స్మారక స్థూపానికి సీపీఐ నాయకులు   జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మంగ రాజు గారి సతీమణి ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ  మాట్లాడుతూ కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి కార్మికునికి అందివ్వాలన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, వారి స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అమలు చేయించాలన్నారు. కార్మికులు ఎన్నో పోరటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు మార్చాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంద‌న్నారు.. ఈ కుట్రలను ఆపివేయాలని హెచ్చరించారు.. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, దేశంలోని కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు నిరసించాలన్నారు. పోలవరం ముంపు కి గురవుతున్నా గ్రామాలు ,భూములు నోటిపి కేషన్ ఇస్తున్నా రే తప్ప పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భద్రామ్మ, సీపీఐ మండల కార్యదర్శి ఎలిసాల నాగరాజు, కందుకూరి సుధీర్ చంద్ర, వాసం రాము, ఎంపిటిసి  ముత్తయ్య,  వరదా బ్రహ్మం, కంటె రాజు, ములిసెట్టి శ్రీను, సున్నం శ్రీను, పిడియాల దుర్గా ప్రసాద్, మైపా సాయి, కుమ్మర పల్లి శ్రీను, సాగర్, కంటె శివ, ఏడిద సుబ్బారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

50 లీటర్ల నాటుసారా పట్టివేత

50 లీటర్ల నాటుసారా పట్టివేత

తాళ్లపూడి, పెన్ పవర్

ఎస్ఈబి ఏలూరు వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు సిబ్బంది తనిఖీల్లో భాగంగా తాళ్లపూడి మండలం పెద్దేవం మరియు బల్లిపాడు గ్రామాల్లో శనివారం ఉదయం 50 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు మోటారు సైకిళ్లు పట్టుబడినట్లు, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా అక్రమ మద్యం అమ్మినా, తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుంది

ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుంది

ఏలేశ్వరం, పెన్ పవర్

 కళాశాలల్లో విద్యార్థులు ప్రయోగాత్మక  విద్య ద్వారానే విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుందని ఏలేశ్వరం నగర్ పంచాయతీ చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాల్లో భౌతిక శాస్త్ర ప్రయోగశాలను చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసం సమయంలో  పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలను, అంశాలను ప్రయోగాత్మకంగా ప్రయోగ శాలలో పరిశీలించినపుడు విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానం పట్ల సుస్పష్టమైన అవగాహన పెరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ వీర్రాజు  మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ జిల్లాలో ఉత్తమ కళాశాలగా తీర్చి దిద్దుతానని, కళాశాలకు కాంపౌండ్ వాల్ మంజూరు చేయించాలని కోరారు.విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు,కౌన్సిలర్ సుంకర హైమావతి, వైస్ ప్రిన్సిపాల్ ఎ. వెంకటరమణ, బి. రామకృష్ణ, కేశవరావు, జి. జానకిరామ్, డాక్టర్.వి.కనకరాజు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

అట్రాసిటీ కేసుపై సెల్-వన్ డిఎస్పీ విచారణ...

 సామర్లకోట, పెన్ పవర్ :      

సామర్లకోట పోలీసు స్టేషన్లో మూడు రోజుల క్రితం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-వన్ డిఎస్బీ అప్పారావు శనివారం ప్రత్యేక విచారణ జరిపారు. స్థానిక ఉప్పువారి వీదికి చెందిన వాలంటీరుకు, వారి వర్గీయులకు, ఉప్పువారి వీదికి చెందిన యువకులకు ఈ నెల 28వ తేదీన ఘర్షణ జరగగా పలువురు యువకులు గాయాల పాలవగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఒసీ సామాజిక వర్గానికి చెందిన యువకులపై వాలంటీరు విధుల్లో ఉన్న తనను కులం పేరుతో దూషించడమే కాకుండా ఈ విషయంపై సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు వెళ్ళిన తమ నాయకులపై అవతలి వర్గం దాడికి దిగి కులం పేరుతో దూషిస్తూ గాయాల పాలు చేసారంటూ స్థానిక పోలీసు స్టేషన్లో అట్రాసిటీ ఫిర్యాదు చేసారు. ఆ వివాదంలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబందించి శనివారం ఉదయం కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్-1 డిఎస్పీ  అప్పారావు విచ్చేసి సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి మధ్యహ్నం వరకు ఫిర్యాదు దారుల వర్గానికి సంబంధించిన 11 మందిని డిఎస్పీ విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేసారు. కాగా విచారణ ప్రస్తుతానికి ఒక వర్గానికి సంబందించి మాత్రమే పూర్తయిందని, మరలా రెండో వర్గం నుంచి విచారణ నిర్వహించనున్నట్టు డిఎస్పీ చెప్పారు.  తదుపరి చర్యల నిమిత్తం ముందుకెళ్ళనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విచారణను స్థానిక విఆర్వో సత్యన్నారాయణ సమక్షంలో చేపట్టగా స్థానిక ఎస్ ఐ సుమంత్, స్టేషన్ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు.


జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు

జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయములో శనివారం జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు  పంచాయతీ కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో కొవ్వూరు డిఎల్పీఓ మూర్తి, ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యువతకు ఉర్లోనే ఉఫాది అవకాశాలు

 గిరిజన యువతకు ఉర్లోనే ఉఫాది అవకాశాలు

పెన్ పవర్, విశాఖపట్నం

నిరుద్యోగులు ఉపాధి కోసం ఊర్లు వదల కుండా స్థానికంగా ఉపాధి పొందే విదంగా గిరిజన యువతకు శిక్షణ ఇస్తున్న మని ఆదివాసీ మిత్ర వెల్పేర్ సొసైటీ సిఈఓ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువత  ఆర్థిక స్తొమత లేక అరకొర  చదువులతో ఉపాధి రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణలు యువతకు తగిన అవకాశాలు అందక ఇంటి బాట పడుతున్నారు.చాలీచాలని వేతనం, పొందిన శిక్షణకు తగ్గ ప్లేసెమెంట్ చూపించకపోవడం తో యువత కష్టాలు ఎదుర్కొన్నారు. ఉన్న ఊర్లో నే మెరు గైన  ఉపాధి అందుకునేలా యువత కు పదును పెడుతున్నారు.

 గ్రామాలలో నిరుద్యోగులుగా ఉండి అగ్రోబేసెడ్ మీద ఉత్సహంగా ఉన్న యువతను 3 మండలాలు పాడేరు, హుకుంపేట, పెదబయలు నుండి 200 మంది యువతను గుర్తించి గ్రామాలలో ఉన్న యంగ్ ఫార్మర్లును ప్ప్గ్ గ్రూప్లలో చేర్పించి ఆ యువతను ఆదివాసీమిత్ర వెల్ఫేర్ సొసైటీ గుర్తించి మోడల్ ఫార్మ్, నర్సరీ, మష్రూమ్ కల్టివేషన్, ఫ్లోరి కల్చర్ పై శిక్షణలు ఇప్పించి యువతతో మార్కెటింగ్ హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గుమ్మడిగుండువా గ్రామంలో శ్రీలక్మి గ్రూప్ సభ్యులు చీపుర్లు మార్కెటింగ్ చెయ్యడం జరిగింది. అలాగే పెదబయలు మండలం, పెదకొడపల్లి పంచాయతీ, జైతికోట గ్రామానికి చెందిన సీదరి భీమేశ్వరరావు యువత పుట్టగొడుగుల పెంపకంపై ఆదివాసీమిత్ర సంస్థ ద్వారా శిక్షణ పొంది ఆదివాసీమిత్ర సహాయంతో ఎఎస్ట్రేం పుట్టగొడుగుల పెంపకం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. భవిష్యత్తులో యువతకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఆదివాసీమిత్ర సీఈఓ గారు చెప్పటం జరిగింది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...