Followers

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం

 ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, ఆధ్వర్యంలో అన్నదానం


మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  గౌరవ చైర్మన్ ఆదేశాల మేరకు  శుక్రవారం 7 మే ఉదయం  కరోనా తో చనిపోయిన వ్యక్తుల ఆత్మ శాంతి చేకూరాలని మన విశాఖ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షురాలైన పిల్ల సత్యవతి  సహయ సహకారాలతో నిర్వహించడినది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ షేక్ సిరాజుద్దిన్,నేషనల్ జనరల్ సెక్రెటరీ బి కేశవ రావు,రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, రాష్ట్ర మైనార్టీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే.శ్రీలత,జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌస్, జిల్లా సెక్రెటరీ కే శ్రీకమల్, జిల్లా కమిటీ మెంబర్ దనేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి

 ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి 

   

అరకు, పెన్ పవర్               

ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా బారినపడిన ప్రతి ఒక్కరిప్రాణాన్ని కాపాడాలని ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97 వ వర్ధంతి సందర్భంగా కరోనా కారణంగా బయటకు రాకుండా తమ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి యుద్దప్రాతిపదికన అన్ని ప్రైవేట్ హాస్పటల్స్ ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని కరోనా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు,మందులు మరియు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే విధంగా  చర్యలు చేపట్టాలని అధికార పార్టీ నాయకులే కరోనాతో  చనిపోయిన  శవాల దహన సంస్కారాలకు కూడా ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైందని చర్చించుకోవడం వారి వైఫల్యాలకు నిదర్శనమని ప్రైవేట్ హాస్పటల్స్ లో కరోనా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ హాస్పటల్స్ లో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు దొరకక నిరుపేదలు చనిపోతున్నారని ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కరోనా రోగుల వైద్యంపై దృష్ఠి సారించి వైద్యం అందేవిధంగా కృషిచేయాలని 104 నెంబర్ కు ఫోన్ చేసిన మూడుగంటలలో కరోనా రోగికి బెడ్ అందించాలని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి మాటలను కూడా లెక్కచేయకుండా మూడు రోజులకు కూడా బెడ్ అందించలేకపోతున్నారని,ప్రైవేట్ హాస్పటల్స్ లో అత్యధిక ఫీజుల వసూళ్ళను అధికారులు తనిఖీలు చేపట్టి నియంత్రించాలని, కరోనా రోగితో పాటుగా సహాయకులకు కూడా హాస్పటల్స్ లో భోజన సదుపాయం కల్పించాలని లేని పక్షంలో కరోనా రోగులకు సహాయకులుగా ఉండే వారంతా వివిధ హోటల్స్ కు రావడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని కరోనా నివారణ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి ఇవ్వాలని కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న క్రమంలో అందరూ వ్యాక్సిన్ల కోసం ఒకచోట గుమిగూడటం వలన కూడా కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందని అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు సరిపడా ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందేవిధంగా చర్యలు చేపట్టాలని వ్యాక్సిన్లు,ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని చనిపోయిన కరోనా బాధిత కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారాన్ని అందించి దహన సంస్కారాలు ఉచితంగా జరిపేవిధంగా చర్యలు చేపట్టాలని కోవిడ్ వారియర్ గా సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య, పారిశుద్ధ్య మీడియా, పోలీస్, సిబ్బందిలో కోవిడ్ బాధితులకు ఉచిత వైద్యం, మరణించిన వారి కుటుంబానికి 5లక్షల ప్రమాద భీమాను అందించే విధంగా కృషిచేయాలని పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

 విమ్స్ హాస్పిటల్ కు ఇంజెక్షన్ల వితరణ

విశాఖపట్నం,పెన్ పవర్

మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, బిజెపి విశాఖపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర విమ్స్ డైరెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసారు, అక్కడ కరోణా రోగులకు అందించే చికిత్స గురించి వాకబు చేశారు, కరోణా రోగులకు అవసరమైన ఇంజెక్షన్స్ ఫోండా ఫ్లో,మెప్రేస్సో ఇంజెక్షన్ లను అందజేశారు.ఈ కష్టకాలంలో ముందు ముందు కూడా స్నేహితుల సహకారంతో సహాయం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

రంగులుమీద ఉండే శ్రద్ధ ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు

 రంగులుమీద ఉండే శ్రద్ధ  ప్రజారోగ్యం మీద ఉండదా..!గంటా నూకరాజు


భీమిలి, పెన్ పవర్

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీశం చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని గంటా నూకరాజు అన్నారు. వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,దానికి తగ్గట్టుగా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు  ఆర్ధిక వ్యవస్థను పక్కనపెట్టి ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్షిన్స్ కొనుగోలు చేసి ప్రజలందరికీ వేయించే పనిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని గంటా నూకరాజు అన్నారు.   కార్యాలయాలకు,కరెంటు  స్థంబాలకు,గోడలకు పార్టీ రంగులు వేసేందుకు,తీసేందుకు  వందల కోట్లు ఖర్చు పెట్టేoదుకు డబ్బులు ఉంటాయి గాని ప్రజారోగ్యం కోసం ఉపయోగపడే వ్యాక్సిన్స్ కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు.రోజుకు 20వేలకు పైగా కేసులు రాష్ట్రంలో వస్తున్నా ,మరణాలు రేట్లు విపరీతంగా పెరుగుతున్న ముఖ్యమంత్రి మాత్రం మంగళగిరి కార్యాలయం వదలి రారని అన్నారు.   రాష్ట్రమంతా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ లేక రోగులు మరనిస్తుంటే ఏ జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లి ఏమి జరుగుతుందో చూడరని,ప్రజలు ఇంతలా భయాందోళనకు గురవుతున్నప్పటికి  రాజకీయాలమీదే జ్యాస తప్ప ప్రజారోగ్యం మీద లేదని అన్నారు.104కి ఫోన్ చేస్తే 3గంటల్లో కోవిడ్ రోగికి బెడ్ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో 50శాతం బెడ్లు కోవిడ్ బెడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చెబుతారు.. ఆక్సిజన్ లేక ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ శనిపోలేదని సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కే తప్పుడు నివేదికలు ఇస్తారు.. మీరు చెప్పేది ఏదీ నిజం ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నాను.చెప్పే వాటికి ఆచరణలో జరిగేవాటికి సంబంధం లేకుండా చేయడంలో మీరు ఉద్దండులని అన్నారు. పిట్టల్లా జనాలు రాలిపోతుంటే కనీశం చలనం లేకుండా ఉన్న ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ దేశంలో ఎవరూ ఉండరని గంటా నూకరాజు అన్నారు.   ఇళ్ల నిర్మాణం అంటారు,బడులకు సెలవులు ఇచ్చి  విద్యాదీవెన అని అంటారు.కరోనా విలయతాండవం చేస్తుంటే పరీక్షలు పెడతామంటారు కానీ ప్రజారోగ్యం పట్టదా అని గంటా నూకరాజు నిలదీశారు.

ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

 ప్ర‌తీఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్

హోం ఐసోలేష‌న్లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్లు పంపిణీ

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ .లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

 హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

 ఉదయం 7.30 నుంచి 11.30 గంట‌ల‌ వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు

జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న ప్ర‌క‌ట‌న‌


విజ‌య‌న‌గ‌రం,  పెన్ పవర్

కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

 జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ     

   

విజయనగరం, పెన్ పవర్


స్థానిక 42వ డివిజన్ పరిధిలో  ఉన్న అయ్యన్నపేట జంక్షన్ మరియు జంక్షన్ వద్దనున్న ఎస్సి కొలనీలో  జనసేన పార్టీ సీనియర్ నాయకులు,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇంటిఇంటికీ మాస్కులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రెండో వేవ్ కరోనా తీవ్రతదృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని బాలు చేపట్టారని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని,ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చిన్న,కృష్ణ, పాల్గొన్నారు.   


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...