Followers

Showing posts with label CRIME. Show all posts
Showing posts with label CRIME. Show all posts

కుక్కల వేటలో జింక మృతి

కుక్కల వేటలో జింక మృతి

 పూతలపట్టు,  పెన్ పవర్

పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, అమ్మేపల్లి గ్రామ పంటపొలాల్లో జింక మృతి. గ్రామస్తుల కథనం మేరకు పక్కనే అడవి ఉంది అక్కడనుండి జింకను కుక్కలు తరుముకొచ్చాయి.  గ్రామ సమీపంలో సుమారు 5 గంటల ప్రాంతంలో కుక్కల తరుముకొని వచ్చిన జింక పంట పొలాల్లో వేసిన కంచికి తగులుకోవడంతో కుక్కలు దాడి  చేసి  దానిని చంపేసాయి. ఇది గమనించిన గ్రామస్తులు అరవడంతో కుక్కలు పారిపోయాయి. జింక అప్పటికే మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.

లారీ ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి

 లారీ ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి

 బంగారుపాళ్యం,  పెన్ పవర్ :

చిత్తూరు - బెంగళూరు రహదారి లో గల మహాసముద్రం విలేజ్ నందు మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద లారీ బైక్ ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్నా ఇద్దరు మరణించారు..,మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద  ముతరపల్లి గ్రామంలో నుండి ఓ పెద్ద లారీ టర్న్ తీసుకునేటప్పుడు బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది..,మృతులు సావిత్రమ్మ 45 సం" మరియు వారి తనయుడు సెట్టేరి గ్రామం గా తెలిసింది. సంఘటనా స్థలం లో వివరాలు సేకరించిన బంగారుపాళ్యం పోలీసులు హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్  మరియు కోదండ.  కేసు నమోదు చేసి  ఫిర్యాదు చేస్తున్న పోలీసులు.

మద్యం బాటిల్ ల పట్టివేత

 మద్యం బాటిల్ ల పట్టివేత... 

బేలా, పెన్ పవర్

 కరోనా మహమ్మారి నేపథ్యంలో  గ్రామ ప్రజలకు హాని కలిగే విషయాలు,  ఏ పనులైనా చేయకుండా ఉండాలని నేపథ్యంలో బేల మండలంలోని సిర్సన్న  గ్రామస్తుల, విడిసి ల మాట వినకుండా గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తి తన కిరాణా కొట్టు లో మద్యం సీసాలు అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామ పెద్దలు విడిసి నాయకులు మద్యము అమ్మ వద్దని  సూచించినప్పటికీ వీడీసీ మాట లెక్క చేయకుండా మద్యం అమ్మేవాడు,  ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు గ్రామ విడిసి నాయకులు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై కళ్యాణ్ పోలీసులతో అక్కడికి చేరుకొని, అక్రమంగా మద్యం అమ్ముతున్న 30 ఆఫీసర్ ఛాయిస్,  చీప్ లిక్కర్ బాటిల్ అను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టి అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

 బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం


తొర్రూరు, పెన్ పవర్

టివిఎస్ ఎక్సెల్ బైక్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సిహెచ్ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన మేడిగా లక్ష్మయ్య (57) బట్టల వ్యాపారం చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రానికి పని మీద వచ్చి పని ముగించుకొని, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఎక్సెల్ బండి పై ఇంటికి వెళుతున్న దారిలో బొత్తల తండా శివారులోని కల్వర్ట్ దగ్గర కాలువలో ఉన్న బండా రాయిపై పడి, తలకు బలమైన గాయం కావడంతో, మరణించడం జరిగిందని,మృతుని భార్య మేడిగా మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.శవ పంచనామ కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య మృతితో అమ్మాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు

 కరోన నిభందనలపై నిర్లక్ష్యం వ్యహిస్తే కఠిన చర్యలు - సిఐ నర్సింహ్మ స్వామి

మాస్కు, బౌతిక దూరం తప్పనిసరి

కర్ప్యూ  నిబంధనలు మరింత కఠినం బయటకు వస్తే కేసులు


పెన్ పవర్, మల్కాజిగిరి 

కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశానుసారం ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, కాలనీలలో తనిఖీలు చేస్తూ మాస్కులు, కర్ఫ్యూ నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 68, బౌతిక దూరం పాటించని వారిపై 15, గుంపులు గుంపులుగా తిరుగు తున్న వారిపై 9, కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై2, ప్రధాన రహదారిపై పాన్ గుట్కా వేసుకొని ఉమ్మేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

మల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో కరోనాతో మృతి...

గండేపల్లి, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదిత్య శంకర్ (50)కరోనాతో వీధుల్లో ఉండగా మృతి చెందారు. మృతదేహానికి పరీక్ష రాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, ఈయనది కొంతమూరు  గ్రామం అని సమాచారం.

లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు బంగారం చోరీ...

 లలితనగర్ లో వృద్ధురాలు మెడలో చైన్ స్నాచర్లు  బంగారం చోరీ...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్ ఈ. ఎస్.ఐ హాస్పిటల్ రోడ్ నందు అక్కడ వృద్ధ మహిళ మెడలో బంగారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ద్విచక్రవాహనంపై అటుగా రోడ్ దాటుతున్న వృద్ధురాలు బంగారం అపహహరించుకుని పరార్ అయ్యారు.వృద్ధురాలు కిందపడి గాయాలు పాలయ్యింది.సి.సి ఫుటేజులు అక్కడ ఆప్రదేశం లో ఉన్నాయి అని వాటి ఆధారంగా ఆ దుండగులు ఎవరు అనేది 3 వ పట్టణ  పోలీసులు దర్యాప్తు లో తెలియాలని అక్కడ స్థానికులు తెలపడం జరిగింది.

వదల బొమ్మాళి.. ..

వదల బొమ్మాళి.. 
కరోనా కాటుకు  తండ్రి కొడుకులు మృతి

సంతబొమ్మాళి, పెన్ పవర్

సంతబొమ్మాలి ని కరోనా వదలను అంటుంది. జాగ్రత్తలు  పాటించకుంటే! అమ్మ లేదు, నాన్న లేదు, అక్క, చెల్లి తంబి లేదు. నా దగ్గర ఎవరైనా ఒకటే. వివరాల్లోకి వెళితే  కరోనా తో ఐదు  రోజుల వ్యవధి లోనే తండ్రి కొడుకు మరణించిన ఉదంతం సంతబొమ్మాళి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ ఉమా పాలేశ్వర స్వామి ఆలయం ధర్మకర్తఅయిన  కొండాల గణపతి రావు గురువారం రాత్రి కన్నుమూశారు. పది రోజులు క్రితం కరోనా లక్షణాలు తో  గణపతి రావు తో పాటు భార్య, కుమారుడు శ్రీకాకుళం లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స కోసం చేరారు.అయితే ఇదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గణపతి రావు పెద్దకుమారుడు ఐదు  రోజుల క్రితం గత శనివారం మరణించాడు.కొడుకు చనిపోయిన విషయం తండ్రి కి కుటుంబ సభ్యులు తెలియనీయలేదు .  ఆవిషయం గ్రామస్తులు ఇంకా  మరువక ముందే గణపతి రావు కన్ను మూయడం తో సంతబొమ్మాళి లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు మరి  కొంతమంది బంధువులు పిపి కిట్లు వేసుకొని  ఆయన పార్ధవ దేహాన్ని సంతబొమ్మాళి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం ఉన్నప్పటికీ పలువురు అభిమానులు అంత్యక్రియలు  సుదూరంలో ఉండి చూసారు.    గణపతిరావు  గ్రామాభివృద్ధి తో పాటు దేవాలయాలు అభివృద్ధి,  పూజా కార్యక్రమా ల్లో ముందుండి నడిపించే వారు.  గ్రామం లో వెలసిన అతి పురాతన శ్రీ ఉమా పాలేశ్వరస్వామి దేవాలయం నుఏడాది క్రితం నుంచి  లక్షలు వెచ్చించి నూతనంగా ఆలయం గా రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించి పదిమందికి ఆదర్శ oగా నిలిచారు.గ్రామ పెద్దలకు, యువకులు లకు తలలో నాలుకగా మెలిగిన గణపతి రావు ఇకలేరు అనేవిషయం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అందరూ మాస్కు ధరించి తోటివారికి సహకరిస్తారని పోలీసులు, వైద్య సిబ్బంది మరియు పాత్రికేయులు కోరుకుంటున్నారు.

 

విద్యుత్ తీగ తగిలి సిపిఐ పార్టీ కార్యకర్త మృతి

 విద్యుత్ తీగ తగిలి సిపిఐ పార్టీ కార్యకర్త  మృతి

 పెదబయలు, పెెన్ పవర్

 మండలంలో ని అడుగులపుటు  పంచాయతీ వడ్డే పుట్టు గ్రామానికి చెందిన వంతల జగ్గారావు  మేకల కాపు కు వెళ్లి మేకలకు మేత ఇవ్వాలనే ఉద్దేశంతో చెట్టుకొమ్మలు నరుకు తుండగా చెట్టుకొమ్మలు కరెంటు తీగకు తగలడంతోజగ్గారావు అక్కడికక్కడే కరెంట్ షాక్ కొట్టి మృతిచెందారు.  దీంతో ఆ గ్రామస్థులు బోరున విలపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు గత 20 ఏళ్లుగా సిపిఎం పార్టీ లో నమ్మకంగా గా ఉంటూ తన శక్తి మేరకు పార్టీ లో కృషి చేయటం జరిగింది. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు మాట్లాడుతూ జగ్గారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజే సారు.

రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు ఎమ్.ఎల్.ఏ.న్.శ్రీనివాస్ మృతి

 రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు ఎమ్.ఎల్.ఏ.న్.శ్రీనివాస్   మృతి

మహారాణి పేట, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ముఖ్యనాయకులు అయిన ఎం.ఎల్.ఏ.ఏన్ శ్రీనివాస్ నగరంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.  శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు బ్రాహ్మణుల భిన్నం కి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని హిందూ దేవాలయాల పరిరక్షణ కూడా నిరంతరం పాటుపడ్డారని శ్రీనివాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.వి.ఎస్.ప్రభాకర్ రావు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 

నిషేధిత గుట్కా పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

 నిషేధిత గుట్కా పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిడికె వన్ టౌన్  సీఐ రమేష్ బాబు 

రామగుండం ,  పెన్ పవర్

గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్  గంగాధర రమేష్ బాబు ఆధ్వర్యంలో పలు చోట్ల నిషేధిత గుట్కా, పొగాకు విక్రయిస్తున్న దుకాణదారుల పై వన్ టౌన్ సిబ్బంది మెరుపు దాడి చేసి అక్రమంగా గుట్కా, పొగాకు ప్యాకెట్స్ ని విక్రయిస్తున్న రవి రాజు, తండ్రి మొగిలి, అడ్డగుంటపల్లి నివాసి, యండి అబ్బాస్ తండ్రి మహబూబ్, రాంనగర్ నివాసి, సర్దార్ అబ్దుల్ రజాక్ తండ్రి సర్దార్, జవహర్ నగర్ నివాసి, కొమ్ము నరేందర్ తండ్రి అంద్రయ్య, విఠల్ నగర్ నివాసి, పలువురి పై కేసులు నమోదు చేశారు. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖని పట్టణంలో కొంత మంది దుకాణదారులు నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారనే  సమాచారం మేరకు సంబంధిత దుకాణాల పై తమ పోలీస్ సిబ్బందితో మెరుపు దాడులు చేసి వారి వద్ద నుండి 70,500/- రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్స్, పొగాకు ప్యాకెట్స్ స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఎవరైనా నిషేధిత వస్తువులను, మత్తు పదార్థాలను అమ్మితే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మెరుపు దాడులలో సీఐ లు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, కానిస్టేబుల్స్ ఏలీయా, శేఖర్, సదయ్య, హోంగార్డ్స్ తిరుపతి, మర్రి శ్రీనివాస్, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

17 రోజులు హోమ్ క్వారంటైన్ పూర్తి కాకుండా బయట తిరిగితే కఠిన చర్యలు

 17 రోజులు హోమ్ క్వారంటైన్ పూర్తి కాకుండా బయట తిరిగితే కఠిన చర్యలు..

మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్..

ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్

ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండలాల ప్రజలు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ హోం క్వారంటైన్ 17 రోజులు పూర్తి కాకుండానే బయట స్వేచ్ఛగా తిరుగుచున్నారు. ఇది చాలా ప్రమాద ప్రమాదకరమని హోం క్వారంటిన్ పూర్తి కాకుండా బయట తిరిగినట్లయితే వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి చెందుతుందని. కావున ప్రతి ఒక్కరూ కూడా హోం క్వారంటైన్ నిభందనలు పాటించి మిమ్మల్ని మీరు రక్షించు కుంటు , మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కరోనా బారిన పడకుండా రక్షించిన వారవుతారని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ గారు తెలిపారు.

వనపర్తిలో వేగంగా వెళుతున్న బైకులతో ప్రమాదం

 వనపర్తిలో వేగంగా వెళుతున్న బైకులతో ప్రమాదం

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణంలో సి.సి.కెమెరాలు ఉన్నా కాని కొందరు బైకులపై వేగంగా వెళుతూ ఇతరుల బైకులకు డీ కొట్టి,ప్రమాదం చేసి వెళుతున్నారు. ఒక్కో బైకుపై ముగ్గురు వ్యక్తులు వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కూడా బైకుపై వెళ్ళి ఒక బైకును డి కొట్టి వెళ్లిపోయారు. సి.సి.కెమెరాల ద్వారా వేగంగా వెళుతున్న బైకులు,ముగ్గురు వెళ్లే బైకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

మద్యం మత్తులో వ్యక్తీ ఆత్మహత్య

 మద్యం మత్తులో వ్యక్తీ ఆత్మహత్య

  

గుమ్మలక్ష్మీపురం,  పెన్ పవర్         

మద్యం మత్తులో పురుగులమందు త్రాగి ఒక వ్యక్తి మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం  గుమ్మలక్ష్మీపురం మండలం, ఇరిడి పంచాయతీ, కన్నడ గూడ గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటరావు( 52) అనే గిరిజనుడు మద్యం మత్తులో పురుగుమందు సేవించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. వెంకట్రావు గత మూడు రోజులుగా మద్యం సేవిస్తున్నాడని, మద్యం సేవిస్తూ ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడుతున్నాడని ఈ మేరకు తన భార్య మద్యానికి బానిస అవ్వొద్దని మందలించిందని, దీంతో వెంకట్రావు మద్యం మత్తులో పురుగుమందు సేవించాడని తెలిపారు. అకస్మాత్తుగా పురుగుల మందు సేవించిన నేపథ్యంలో వాంతులు చేసుకున్నాడని  అయితే దీనిని గ్రహించిన భార్య, బంధువులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం సాయంత్రం తీసుకుని వెళ్లారని అన్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారని అన్నారు. ఈ మేరకు వెంకట్రావు గురువారం ఉదయం మరణించినట్లు ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నట్లు ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

కోవిడ్ రిపోర్ట్ లో అవకతవకలతో అంగన్ వాడి టీచర్ మృతి

కోవిడ్ రిపోర్ట్ లో అవకతవకలతో అంగన్ వాడి టీచర్ మృతి  

పెన్ పవర్, కురుపాం 

విజయనగరం జిల్లా కురుపాం లో స్థానికంగా నాలుగవా సెంటర్ కు అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఉమా(50) అనే మహిళ కోవిడ్ లక్షణాలు ఉండటం తో స్థానికంగా టెస్ట్ చేసుకున్నారు,అయితే ఆ రిపోర్ట్ నెగిటివ్ రావడం తో వైద్యం పొందకన్న ఉండటం తో వ్యాధి తీవ్రత ఎక్కువ అయిపోయి ఊపిరితిత్తులు కు ఇన్ఫెక్షన్ సోకింది. ఆమె కుమార్తె బొబ్బిలి లో నివాసం ఉండటం తో అక్కడకు వైద్యం నిమిత్తం వెళ్లిన ఆమె ఈ రోజు మృతి చెందారు, ఆమె కురుపాం ఐ.సీ.డీ.స్ పరిధిలో అంగన్వాడీ టీచర్ల యూనియన్ కు సెక్రటి గా కూడా పనిచేస్తున్నారు..ఆమె మృతి తో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కోవిడ్ రిపోర్ట్స్ లో అవకతవకలు స్థానికంగా కోవిడ్ టెస్ట్ లు R.T.P.C.R కోసం నమూనా లు సేకరించి విజయనగరం పంపిస్తున్నారు, ఇక్కడ నుండి నమూనాలు విజయనగరం వెల్లకముందు కూడా కొంత మందికి నెగిటివ్ అని ఫోన్లు కు  ల సందేశాలు వస్తున్నాయి, టెస్ట్ లు సంఖ్య ఎక్కువగా ఉండటం తో రిపోర్ట్స్ సవ్యంగా రావట్లేదు అని ఆరోపణ ఉంది..అధికారులు మాత్రం అలాంటిది ఏమి లేదు అంత సవ్యంగా జరుగుతుంది అని చెప్తున్నారు..ఇప్పటికి అయిన రిపోర్ట్స్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పలువులు కోరుతున్నారు.

మద్దెల కృష్ణ హఠాన్మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

 మద్దెల కృష్ణ హఠాన్మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే 

పెన్ పవర్, కందుకూరు

పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మద్దెల కృష్ణ మరణం చెందడం పట్ల స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మరణవార్త ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చురుకైన అంకితభావం గల యువకుడు కృష్ణ హఠాన్మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కృష్ణ మరణం వ్యక్తిగతంగా తన మనసును ఎంతగానో కలచివేసినదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కృష్ణ చిన్న వయసులోనే కన్నుమూయడం దురదృష్టకరమని అన్నారు. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తూ నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులు కృష్ణ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ కలుపుగోలుగా ఉండే కృష్ణ ఇంక లేరు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుని ప్రార్ధించినట్లు తెలిపారు.

హెచ్చరికలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు

 హెచ్చరికలు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు మందమర్రి పోలీస్

పెన్ పవర్,  మందమర్రి 

నిబంధనలు తొలగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మందమరి ఎస్సై భూమేష్ అన్నారు కరోనా సెకండ్, వెవ్, ఉధృతంగా వ్యాపిస్తుందని ఇట్టి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి మీకు ఏదైనా  అవసరానికి బయటకు వెళ్ళేటప్పుడు వ్యక్తి నుండి వ్యక్తి మధ్య మూడు సీట్లు భౌతిక దూరం తప్పకుండా పాటించాలని దుకాణం సముదాయాల్లో కనిపిస్తే దుకాణ యజమానులు పై కేసు నమోదు చేయబడును అదేవిధంగా ప్రతి ఒక్క దుకాణాల్లో శానిటైజర్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి దుకాణం యజమానికి దుకాణంలో పనిచేసే వ్యక్తులు చేతులకు గ్లౌజులు, ధరించాలి అదేవిధంగా సైన్స్ పాన్ షాప్ మాంసం బట్టలు మొదలగు అన్ని దుకాణాలు హోటల్లు మిర్చి బండి చాయి సెంటర్లు ముందు తెల్ల రంగుతో మూడు ఫీట్ల సామాజిక దూరాన్ని కనబడే విధంగా రౌండప్ ఏర్పాటు చేయాలి లేనియెడల దుకాణాల యజమానులపై కేసు నమోదు చేయబడును రోడ్లపై, ధూమపానం చేసే రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు, విధించబడతాయి అని దయచేసి మందమరి పట్టణంలోని దుకాణాల యజమానులు కానీ ప్రజలు కానీ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యం

రాజమహేంద్రవరం, పెన్ పవర్

స్థానిక 7వ వార్డు కంచర్ల లైన్ గత కొంతకాలంగా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి స్థానిక ప్రజలు  ఆవేదన తెలుపుతున్నారు .ఎనిమిది మంది కలిపి ఒక విద్యార్ధి ఇల్ల నాగేంద్ర పై మరణాయుదాలతో బ్లేడులతో దాడిచేసి తలను  పగలకొట్టారు.స్థానికులు చూసి అరవడంతో దుండగులు పారిపోయారు.బాధితుడికి చేతికున్న రెండు వేళ్ళు,తలపై గాయాలు కాగా అక్కడ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అతనికి 20 కుట్లు పడ్డాయని ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు చేసి అక్కడ వైద్యం జరుగుట కష్టం అని ప్రభుత్య ఆసుపత్రి సిబ్బంది తెలుపగ కాకినాడ ప్రభుత్య ఆసుపత్రికి తరలించాలి అని బాధితుడు కుటుంభానికి తెలుపగ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యానికి తీసుకెళ్లామని అక్కడ స్కానింగ్ పరీక్షలు చేస్తే గాని చెప్పలేము అంటూ, హైదరాబాద్ హాస్పటల్ కు తరలించామని బాధితుడు అమ్మ తెలియజేసారు.దవిలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు  చేసిన రెండు రోజుల తర్వాత మేము స్టేషన్ వెళ్లగా మా కేసులో ఉన్న  నిందితులలో ఇద్దరికి  స్టేషన్ బెయిల్ మంజూరు చేశామని పోలీస్ అధికారులు మాకు తెలిపారు.అదే నిందితులు మరల బెయిల్ మీద బయటకు వచ్చి మరొక వ్యక్తిని కొట్టడం, భయపెడుతూ గంజాయిని తన జోబులో పెట్టండి పోలీసులకు ఫోన్ చేసి అప్పచెప్పేదామని ఆ ఏరియా లో స్థానికుల ను భయభ్రాంతులకు గురిఅవడం,మహిళలు దగ్గర నగ్నం ప్రదర్శన చేయడం చెప్పలేని భూతులు,పదజాలం వాడుతూ,రోజు రోజు కి మాకు నరకయాతన మా ప్రాణాలకు రక్షణ లేదు అని, మాకు జరిగిన అన్యాయం మరొకరు జరగకూడదుఅని, ఎవరికి రాకూడదు అని వారు మీడియా వారికి  అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఆగడాలు జరుగుతున్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు.మా ఏరియాలో జరుగుతూన్నా ఈ కార్యకలాపాలు మాకు మా కుటుంబాలకు వీరి నుండి మాకు పూర్తి రక్షణ కలిగించాలని,ప్రతి రోజు మా కాలనీలలో  పోలీస్ వారూ పర్యవేక్షణ లో భద్రత కల్పించాలని అక్కడ స్థానికులు    పోలీస్ వారిని కోరారు.

పార్కు స్థలాన్ని కబ్జా చేశారు

 పార్కు స్థలాన్ని కబ్జా చేశారు - బీజేపీ నాయకులు.

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కాలి స్థలాలు మరియు పార్కు స్థలాలే టార్గెట్ గా భూ మాఫియా చెలరేగిపోతుందని బీజేపీ మేడ్చల్ మున్సిపల్ నాయకులు ఆరోపించారు. ఈ మాఫియాకు చెందిన నాయలులే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను చేరపడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక మేడ్చల్ చెక్ పోస్ట్ లోని సర్వే నెంబర్ 882 లో గ్రామపంచాయతీ పర్మిషన్ తో 18 ఎకరాల విస్తీర్ణంలో శ్రీసాయి నిలయ రెసిడెన్సీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్లోని సుమారు 1800 గజాల పార్కు స్థలాన్ని గత రెండు సంవత్సరాల నుండి కబ్జాకు పాల్పడడానికి ప్రయత్నిస్తూ దాన్ని అడ్డుకోబోయిన కాలనీ వాసులను రౌడీలతో బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు అనేకం. దీనిపై కాలనీ వాసులు పోలీస్ కమిషనర్, ఏసీపీ, సీఐ లకు పిర్యాదు చేసినా కూడా పైస్థాయి నుండి వస్తున్న ఒత్తిళ్ల వల్ల సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇట్టి కబ్జాలను వెంటనే అరికట్టి పార్కు స్థలం చుట్టూ ప్రహరిణి ఏర్పాటు చేసి పార్కులో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అప్పగించాలని మరియు వెంచర్లో మురుగునీటిని బైటకి పంపే వ్యవస్థ లేకపోవడం వల్ల కాలి ప్లాట్లలో నీరు చేరి చుట్టుపక్కల ఇళ్ల వారికి దుర్గంధం వేదజల్లుతూ ఆరోగ్యానికి హానికారకం అవుతుందని ఇట్టి సమస్యకు కూడా వెంటనే పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆర్ శ్రీనివాస్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి, సీఎం రాజు, వినోద్ యాదవ్, మున్సిపల్ ఉపాధ్యక్షులు సీహెచ్. శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ యాదవ్, రవి, కపిల్ రాజ్, అర్జున్, వంశీ కానుగంటి, ఆనంద్, వంశీదర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యాయత్నం

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యాయత్నం

చిత్తూరు, పెన్ పవర్

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యా యత్నానికి పాల్పడ్డారని బంగారుపాళ్యం  మండలం బిల్వమానుకి చెందిన 82 ఏళ్ళ వృద్ధురాలు కనకమ్మ వాపోయారు.చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భర్త సుబ్బయ్య మొదటి భార్య పద్మావతమ్మ కు శివప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ అను కుమారులు సంతానం అని చెప్పారు. పద్మావతమ్మ అనారోగ్య కారణంగా చనిపోవడంతో తనను రెండో వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. తన భర్త బిడ్డలే తన సొంత బిడ్డలా భావించి పెంచి పెద్ద చేశారని పేర్కొన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అతని భార్య మాటలు విని తనను పోషించకుండా నిరాదరణకు గురి చేశారని ఆరోపించారు. నా భర్త ఆస్తులను ఇద్దరు కుమారులు కు సమానంగా పెంచాలని కోరుతూ 2019లో కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. అయితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు కేసు వాపసు తీసుకోవాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, రాజేంద్రప్రసాద్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, జిల్లా ఎస్పీ స్పందించి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...