Followers

Showing posts with label GENERAL NEWS. Show all posts
Showing posts with label GENERAL NEWS. Show all posts

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

 సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్,

 మెంటాడ మండలం లోని మీసాల పేట, కుంతిని వలస గ్రామంలో సర్పంచులు మహంతి రామునాయుడు, పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారము పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి గ్రామాలను శుభ్రం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండవ దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతము చిన్న చిన్న వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు.

సర్పంచ్ ఆహ్వానించకుండా నే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రా

సర్పంచ్ ఆహ్వానించకుండానే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రావు

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ లో ఈరోజు వడ్ల కొనుగోలు  కేంద్రంను చైర్మన్ కిషన్ రావు మాజీ సర్పంచ్ సత్తయ్య సీ.ఈ.వో మధుకర్ సెంటర్ ఇన్ ఛార్జ్ ఓడల హనుమంతు కలసి గ్రామ అ శివార్లలో అనగా రైతులకు అనుకూలంగా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో  వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు మంగళవారం రోజున సిపల్లి లక్ష్మి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నన్ను పిలువకుండా ప్రోటోకాల్ పాటించ కుండా నే వడ్ల కొనుగోలు కేంద్రమును  ప్రారంభించారు లింగాల సర్పంచ్ దళిత మహిళా కావడంతో నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించలేదని . ఈ పరిణామం మనోభావనీ కించపరిచే చేశారని వాపోయారు ఈ కార్యక్రమం దళితుల ను  కించపరిచే విధంగా ఉందని వారి మనోభావాలు దెబ్బతినేలా నడుచుకునేల  ఉన్నాయని వారు వాపోయారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు .అలాగే వారిపై ఎస్సీ. ఎస్టీ. అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని. రేపు అధికారుల కు కు వినతి పత్రం అందజేస్తారని ని అధికారులకు కలెక్టర్ కి ఎమ్మార్వో కు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని . ఫిర్యాదు చేస్తానని.లింగాల సర్పంచ్ లక్ష్మి కోరారు.

తెలంగాణ ద్రోహి కేసిఆర్

 తెలంగాణ ద్రోహి కేసిఆర్

 పీసీసీ సభ్యులు దసురు నాయక్

కేసముద్రం, పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి అనేక విధాలుగా నష్ట పోయిన వారికి ద్రోహం చేస్తూవారిని పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులైన సమైక్యవాదులను తన చుట్టూ పెట్టుకొని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని టిపిసిసి సభ్యులు దసురునాయక్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ ను భూకబ్జా పేరుతో మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశాడని కావాలనే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఒక తెలంగాణ ఉద్యమ కారుడిని ఇలా చేయడం చాలా బాధాకరమని మాట్లాడారు. కానీ అవినీతి భూ కబ్జాలు చేసిన వారిపై చర్యలలో భాగంగా ఈటెల పై చర్యలు తీసుకున్నారనుకుంటే  మరి సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది భూకబ్జాలు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరివారి మీద ఎందుకు తీసుకోవడం లేదు అంతేగాక ఇలాంటి ఆరోపణలు తన కొడుకు కేటీఆర్ పై కూడా ఉన్నవి కెసిఆర్  కి నీతి నిజాయితీ పై నమ్మకం ఉంటే వారు అందరిపై కూడా ఉన్నత అధికారులతో కమిటీలు వేసి వెంటనే మంత్రి పదవి నుండి తొలగించి విచారణ చేయించినట్లయితే పారదర్శకతను పాటించినట్లు అవుతుంది. లేనిచో  కేవలం 24 గంటలలోపే విచారణ పూర్తి కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా నే ఈటెల పై కెసిఆర్ దాడి చేసినట్లే అవుతుంది అని అన్నారు. అంతేగాని ఈటల రాజేందర్ పైనే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఘనంగా బేలా సర్పంచ్ జన్మదిన వేడుకలు

 ఘనంగా బేలా సర్పంచ్  జన్మదిన వేడుకలు ...

బేలా, పెన్ పవర్ 

సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు మండల టిఆర్ఎస్ నాయకులు,యువజన సంఘాల నాయకులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకుల రవి, సునీల్, రాహుల్, యాదవ్, అజయ్, అంకుష్తదితరులు పాల్గొన్నారు.

పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

 పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి పట్టణానికి చెందిన టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని 23వ వార్డు మేదర్ బస్తీ కి చెందిన  రామగిరి మల్లేష్ శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న రామగిరి మల్లేశ్ పెద్ద కూతురు రామగిరి శ్వేత వివాహము మే 16వ తేదీన నిశ్చయం కాగా పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో  వీరి కుటుంబ సభ్యులు మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే ఆర్ధిక సహాయంగా 20 వేల రూపాయల చెక్కు తోపాటు ఒక క్వింటాలు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో రాజ్ కుమార్ రంగనాథ్, సతీష్ , రిధం సది , బంటి తిరుపతి, ప్రసాద్, రఘు గంగుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.ఆర్ధిక సహాయం ను అందించిన బండి సదానందం కు రామగిరి మల్లేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

 కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

బెల్లంపల్లి , పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా కార్డుదారులు వివిధ కారణాలవలన ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం ఐరిష్ వలన వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం డీలర్లు రేషన్ నిలిపివేయడం జరిగింది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కార్డుదారులు కూడా ఐరిష్ తో రేషన్ తీసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. కావున రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లు మరియు కార్డు దారులు కోరుతున్నారు.

సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

  సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రుగూడెం లో మంగళవారం సి సి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 30 లక్షల అంచనా వ్యయంతో ఆరు వీధులకు గాను సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు గూడూరు మండలం మేజర్ సర్పంచ్ నూనవత్ రమేష్ నాయక్ పనులను తానే స్వయంగా పార పట్టి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంతర్గత రహదారులు సరిగ్గగా లేనందున సి సి రోడ్డు నిధులను మంజూరు చేయించామని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని అలాగే గ్రామస్తులు పర్యవేక్షించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ కత్తి స్వామి, ఉప సర్పంచ్ శివరాత్రి సంపత్, చంటి, శివక్రిష్ణ, తదితరులు పాల్గోన్నారు.

వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

 వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్

నార్నూర్, పెన్ పవర్

నార్నూర్ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో తడిహత్నూర్  కు చెందిన  కేంద్రే మహాదవ్  సూపుత్రుని వివాహానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరై నూతన వధు వరులకు అక్షింతలేసి ఆశీర్వదించారు. వారి వెంట  మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో అప్షన్ మెంబర్ దస్తగిర్,పరమేశ్వర్,సురేష్ ఆడే, రాథోడ్ ఉత్తమ్,దుర్గే కాంతారావు, మోతె రాజన్న,సయ్యద్ కశిం, అహమ్మద్తదితరులు పాల్గొన్నారు.

12వ వార్డులో బొర్వెల్ కు మరమ్మత్తుల నిర్వహణ

 12వ వార్డులో బొర్వెల్ కు  మరమ్మత్తుల నిర్వహణ

బెల్లంపల్లి, పెన్ పవర్..

పట్టణ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ లో రామకృష్ణ థియేటర్ వెనుకాల గల మినీవాటర్ సప్లై బోర్ పాడయ్యి ఎండాకాలం వలన పంపులలో నీరు సరిగ్గా రాక బస్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వార్డు కౌన్సిలర్ నెల్లిశ్రీలతరమేష్  దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి,వార్డు తెరాస నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో మాట్లాడి, వారి సహాయంతో  దగ్గరుండి బోర్ వెల్ లో పైపుల మరమ్మత్తులు నిర్వహించారు. పైపులమరమ్మత్తు ద్వారా బస్తి మొత్తానికి నీటికొరత లేకుండా చేసారని,బస్తి ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు

విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు

 విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు...

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం లో గౌతమ్ నగర్ డివిజన్ సాక్షి దినపత్రిక విలేకరి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గతనెల ప్రమాదవశాత్తు వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్నాడు,వెంటనే అబ్దుల్ రెహమాన్ సతీమణి ఆరోగ్యం క్షీణించి లోతుకుంట ఆస్పత్రిలో లో చేర్చి వైద్యం చేయిస్తున్నాడు, కరోనా వల్ల అబ్దుల్ రెహమాన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవ సేవ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్ లో ఈ విషయాన్ని  సభ్యులతో చర్చించడం జరిగింది. గ్రూప్ సభ్యులు 28 మంది కలిసి రూ16,800 నగదును సహాయంగా అందించారు. అబ్దుల్ రెహమాన్ వారి కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున మంగళవారం గ్రూప్ సభ్యులు నమస్తే తెలంగాణ విలేకరి వెంకటేష్ ద్వారా రెహమాన్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవ సేవే మాధవ సేవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు,ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, రషీద్, లయన్ హనుమంతరావు ముదిరాజ్, సక్కురీ భాస్కరరావు, హోటల్ శేఖర్, మనీ, తదితరులు పాల్గొన్నారు.

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పెన్ పవర్,  శ్రీకాకుళం

మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ వైసీపీ  విద్యార్థి యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్ జన్మదినం సందర్భంగా పలు  సేవా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం స్థానిక ఆదిత్యనగర్ కాలనీలో స్వరూప్ మిత్రమండలి ఆధ్వర్యం లో ఇంటింటికీ కూరగాయలు నిత్యావసరాలు అంద చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు లక్ష్మణ అప్పు యాదవ్, అశోక్, సోను,శ్రీను,తదితరులు ఉన్నారు.

కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి

 కరోనా తో  వార్డు కౌన్సిలర్ మృతి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్  మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో యస్డబ్ల్యుపిసి నందు సచివాలయ కార్యదర్శి యస్.ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో పేడ నుంచి వానపాములనుపయోగించి సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఏఏ భార్గవ్ సాయి, ఏహెచ్ఏ వి.సాయిరామ్ పాల్గొన్నారు.

శివ సాయి నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి

 శివ సాయి నగర్ లో  మౌలిక సదుపాయాలు కల్పించండి.

పెన్ పవర్, కాప్రా 

 చర్లపల్లి డివిజన్ లోని శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు  మంగళవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత అక్టోబర్ లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అదేవిధంగా త్రాగునీరు  లేక అల్లాడుతున్న కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు వెంటనే నీటి వసతి కల్పించాలని సంబంధిత ఇంజనీరింగ్, జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు  చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ ఈ ఈ కోటేశ్వరరావు తో సుభాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు . అసలే కరోనా కష్టకాలం పక్క కాలని వాళ్ళు తాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తూ కాదు పొమ్మంటున్నారు తాగేందుకు చుక్క నీరు లేక పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి  మాధవి, ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే   స్పందించిన ఎమ్మెల్యే జలమండలి డీజీఎం కృష్ణ తో మాట్లాడి  తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తాగునీరు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం  ప్రతినిధులు సత్యం, పురుషోత్తం రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం గ్రామంలో కరోనా  మహమ్మారి మరణ మృదంగం గంటలు మోగుతున్నాయి  ఒకపక్క కరోనాబారిన పడిన వారు కోరుకుంటుంటే మరోపక్క కరోనా బారిన పడిన  తట్టుకోలేక మృతి చెందుతున్నారు ఈరోజు ఆత్రేయపురం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న కాజులూరు రమా సత్యనారాయణ (42)  కరోనా పాజిటివ్ వచ్చినది ఆయన కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు  ఆయన మృతి పట్ల ఆత్రేయపురం మండలం మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

అక్రమంగా మద్యం అమ్మినా, తయారుచేసిన కఠిన చర్యలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి అదేశాలమేరకు తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎర్లీ మార్నింగ్ గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో 35 లీటర్ల నాటుసారా పట్టుకోవడం జరిగింది. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రైడింగ్ లో భాగంగా ఒక గ్లామర్ బైక్ పట్టుబడినట్లు, మరియు ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతను దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించడం జరిగిందని అన్నారు. మరియు కృష్ణంపాలెం నుండి వెంకటాయపాలెం కు నాటుసారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలియజేశారు.

రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

 రంజాన్ తోఫా అందజేసిన మంత్రి

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ తోఫా (కిట్టు) మంత్రి నిరంజన్ రెడ్డి ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి  తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రంజాన్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి కోరారు. పేద ప్రజలముఖంలో చిరునవ్వులు ఇవ్వడానికి కెసిఆర్  రంజాన్ తోఫా  రంజాన్ పండుగను అత్యంత ప్రతిష్టాత్మక జరుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  మంత్రి  చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ పండుగను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి  కోరారు. దాదాపు అక్కడికి వచ్చిన 120 మంది లబ్ధిదారులకు  మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. ఈ వివరాలు టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్ విలేకరులకు తెలిపారు.

అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

 అను అక్షయ కార్యక్రమాన్ని స్థాపించి నేటి రెండు సంవత్సరాలు

పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ  గ్రామంలో  అనుష్  స్వచ్ఛంద  సంస్థ ఆధ్వర్యంలో పేదవారి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో       అను అక్షయ కార్యక్రమాన్ని  ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్ మాట్లాడుతూ  కరోనా అరికట్టాలంటే అందరూ దూరం పాటించాలని ఇది సులువుగా పాటించాలంటే గొడుగులు ఉపయోగించడం ద్వారా  సాధ్యమవుతుందని కాబట్టి హరీష్ జీవన్ లక్ష్మి ల  సమకూర్చిన గొడుగులు చాపలు పేదలకు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశామని అలాగే అరుణ్ కుమార్ సమకూర్చిన భోజనం పొట్లాలు ఎనర్జీ డ్రింకులను కరోనా ప్రజలకు సోకాకుండా నిత్యం పోరాడుతున్న ర్యాలీ  16 మంది పారిశుద్ధ్య కార్మికులకు 30మంది పేద ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలను కరోనా  నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు.

సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

 సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సచివాలయ కార్యదర్శి ఎస్. ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో మే 1 నుండి 14 వరకు గ్రామంలో పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. దానితోపాటు కోవిడ్ 19 భద్రత, నివారణ అవగాహనా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోచవరం పంచాయతీ కార్యదర్శి రఫీ కోవిడ్ నియంత్రణ నిబంధనలు అన్ని విధాలుగా అమలు చేయడం జరుగుతుంది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...