Followers

Showing posts with label HELP. Show all posts
Showing posts with label HELP. Show all posts

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం

 మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం 

తాళ్లపూడి, పెన్ పవర్

ఇటీవల గౌరిపట్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 30 మంది గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో తీవ్ర గాయలై చేతులు కోల్పోయిన ఇద్దరికి గురువారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం అందజేసినట్టు సంస్థ అధ్యక్షులు బారనాల శంకరరావు తెలిపారు. ఈ సంఘటన లో అన్నదేవరపేట స్థానిక ఎంపిపి స్కూల్  బిసి కాలనీలో  5వ తరగతి చదువుతున్న   జాన్ పేట కి చెందిన బొంతు వెంకటేష్  (వయస్సు 10 సంవత్సరాలు)  ఎడమ చేయికి, అదే పేటకి చెందిన మైలాబత్తుల వీరమణికి కుడి చేయికి తీవ్ర గాయాలవ్వటం వల్ల వైద్యులు తొలగించారు. 

వైద్యానికి ఆర్థిక  స్థోమత లేకపోవడంతో వీరికి వైద్య ఖర్చుల నిమిత్తం సంస్థ తరపున రూ. 8000, సంస్థ సభ్యులు డెంటిస్ట్ డాక్టర్ గోళ్ళ కాంచన్ సాగర్ రూ.5500,   డెంటిస్ట్ డాక్టర్ కొక్కిరిపాటి  విజయకుమార్ రూ.1000,  రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య రూ.1000, అధ్యక్షులు బారనాల శంకరరావు రూ.1000, ఇంజరపు వెంకట కృష్ణ సత్యనారాయణ రూ.1000, వెలుగుబంటి శ్రీనివాస్ రూ.1000, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేసిరాజు లక్ష్మీ నర్సమాంబ రూ.1000 , టీచర్ నక్కిన వందన రూ.1000,  పాఠశాల వంట ఏజెన్సీ మరియు తల్లిదండ్రులు రూ.1300, జూనియర్ అసిస్టెంట్ కణితి నాగ సునీత రూ.500 కలిపి మొత్తం గా రూ.22,300 ఆర్ధిక సాయం అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలుంటే వీరికి వైద్య ఖర్చులు కోసం  సాయం అందజేయుటకి ముందుకురావలెనని సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, ఈసి మెంబర్ గంధం మునేశ్వరరావు, సభ్యులు గెడ్డం చినరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఉదారత చాటుకున్న సామ్రాట్ అశోక చారిటేబుల్ ట్రస్ట్

 ఉదారత చాటుకున్న  సామ్రాట్ అశోక చారిటేబుల్ ట్రస్ట్...

ఆదిలాబాద్, పెన్ పవర్

సిరికొండ మండల పరిధిలోని గ్రామాలలో కరోనా బాధితులకు సామ్రాట్ అశోక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా కిట్ తో పాటు ఇమ్యూనిటిని పవర్ ను పెంచే డ్రై ప్రూట్స్ తో కూడిన కిట్ లను తెరాస రాష్ట్ర నాయకులు, లింగాయత్ సమాజ రాష్ట్ర అధ్యక్షులు ముస్తపూరే అశోక్ పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కరోనా రోగులకు కుటుంబాలకు ఈ కిట్లను అందించి,కరోనా సోకిన వారు హోం క్వారంటైన్ లో దైర్యంగా ఉండాలని మంచి పౌష్టికాహారం తింటు వైద్యులు సూచించిన మందులను వేసుకొని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గుగ్గిల్ల స్వామి, మేరాజ్ అహ్మద్, పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా ఉన్న వారికి ఇంటికే భోజనం

 కరోనా ఉన్న వారికి ఇంటికే భోజనం


కూకట్ పల్లి, పెన్ పవర్ 

కరోనా వచ్చిన వారిని చూస్తేనే భయపడి దూరంగా ఉంటున్న వేళ వారికి రెండు పూటలా ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందిస్తూ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటుం ది . మాతా యోగ విజ్ఞాన కేంద్రం అన్నపూర్ణేశ్వరీ స్వచ్చంద సంస్థ.  కోవిడ్ బారినపడి ఆహరం వండుకోలేనివారికి ప్రతీరోజు 300 పైగా ఆహార కిట్స్ వారి ఇంటి వద్దకే చేరవేస్తున్నారు నిర్వాహకులు. దీంతోపాటు కూకట్ పల్లి కే.పీ.హెచ్.బి కాలనీలో ఉన్న యోగ కేంద్రం వద్ద రోజు మధ్యాహ్నం వేయి మందికి పైగా భోజనం అందిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా తమ సేవలు విస్తరించేందుకు ఆలోచిస్తున్నట్లు సంస్థ నిర్వాహ కులు జగన్ గురూజీ తెలియజేసారు. తమతో పాటు కలిసి ఎవరు అయినా దాతలు ముందుకు రావాలి జగన్ గురూజీ కోరారు. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ పనులు చేసుకోవాలని తెలియజేశారు.

బాధిత జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

 బాధిత జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలి : జాట్


వికారాబాద్ ,  పెన్ పవర్

విధి నిర్వహణలో భాగంగా కోవిడ్   బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తరహా ఎక్స్గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ  జాట్ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర  పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని అంతటినీ పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో కూడిన ఆర్థిక సహాయం చెల్లించాలని బాలస్వామి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులతో మొదలుకొని ఉన్నతాధికారులు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని పేర్కొన్నారు. కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని,జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు.  వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాట్ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జాట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గౌడు అధ్యక్షతన  జరిగిన సమావేశానికి వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి అడ్వకేట్ జేఏసీ అధ్యక్షులు అనంద్ గౌడు  డు మరియు వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు ఆంజనేయులు  హాజరయ్యారు. ఈ సందర్భంగా సదానంద రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వాలు బాసటగా నిలవాలని సూచించారు. సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల పక్షాన నిలబడే జర్నలిస్టుకు న్యాయం చేయాలన్నారు. కవి గాంచని చోటును కూడా జర్నలిస్టు సందర్శించి  సమస్యను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం విలేకరులు చేస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని  అనేక రంగాల్లో జర్నలిస్టుల సేవలు చిరస్మరణీయం అని హాజరైన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ విద్య వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందు ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు.  సమావేశం అనంతరం ఇటీవల విధులు నిర్వహిస్తూ చనిపోయిన జర్నలిస్టు సోదరుల ఆత్మకు శాంతి కలగాలని, వారి సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నర్సింలు రాజేశ్వర్ రాఘవేంద్ర చారి పవన్ వన్ గేమ్ రెడ్డి సాయి చాంద్ పాషా  బిజెపి  జిల్లా కార్యదర్శి  హరికృష్ణ మండల అధ్యక్షులు బిజెపి ఆంజనేయులు పెంటయ్య గుప్తా పాల్గొన్నారు.

కర్త ఫౌండేషన్ రెండవసారి ఉదారత

 కర్త ఫౌండేషన్ రెండవసారి ఉదారత

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

మండలంలోని అగ్రహారం గ్రామంలో కోవిడ్ బాధితులకు  రెండో విడతగా కర్త ఫౌండేషన్ వారు 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు సోమవారం రోజు అందజేశారు.2 రోజుల క్రితం ఇదే ఫౌండేషన్ వారు 25 కుటుంబాలకి సరుకులు అందజేయడం జరిగింది.ఇక్కడ ఇంకా చాలా బాధిత కుటుంబాలు ఉన్నాయి అన్న సమాచారం మేరకు ఇంకా 30 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు పది రోజులకు సరిపడా అందించడం జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న  గ్రామం వైపు ఎవరు చూడని సమయంలో కర్త పౌండేషన్ వారు వారంతట వారే ఈ ఊరి సమస్యను తెలుసుకుని బాధితులకి మనోధైర్యాన్ని నింపి, మొత్తం 55 కుటుంబాలని  ఆదుకోవడం గ్రామస్తులకు సంతోషాన్ని కలుగ చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు కర్త ఫౌండేషన్ సభ్యులు అన్వేష్,  ప్రశాంత్, అభిషేక్, అరవింద్ పాల్గొన్నారు. దీనికి నిధులు సమకూర్చిన ఎటువంటి సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

హాట్ వాటర్ ప్లాస్కో బాటిల్స్ అందజేత...

 హాట్ వాటర్ ప్లాస్కో బాటిల్స్ అందజేత...

సంతబొమ్మాలి, పెన్ పవర్

కరోనా కష్ట కాలంలో ధైర్యంగా ముందుండి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో పోలీసులు చేసిన పోరాటం  అభినందనీయమని నౌపడ మాజీ సర్పంచ్ పీరుపల్లి రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం నౌపడ పోలీసు సిబ్బందికి  మిల్టన్ కంపెనీ 1.లీటర్  హాట్ వాటర్ ప్లాస్కో బొటాల్స్ , మాస్కులు ను ఆయన చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. మహమ్మద్ యాసిన్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం

 పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రావిపాటి గంగాధర స్వామి తండ్రి గోవిందరాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కుటుంబ పెద్దని కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ  కుటుంబ పోషణార్ధం మరియు విద్యార్థికి చదువు నిమిత్తం ఆదివారం నాడు  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రూ.4000 ఆర్ధిక సాయం  అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బారనాల  శంకరరావు, సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, సభ్యులు డెంటిస్ట్ విజయ్ కుమార్, గెడ్డం సాయిబాబా, సనపల రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు చోడిపిండి వీర వెంకట శ్రీనివాస్, సంకు లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారి

 ఏబీవీపీ ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారి...

ఆదిలాబాద్,  పెన్ పవర్

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ సభ్యులు నడుం బిగించారు. ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో శనివారం శానిటైజర్ పిచికారి చేయడం జరిగింది. పట్టణంలోని జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతమైన ప్రయాణ ప్రాంగణం, కలెక్టరేట్, పోలీస్ స్టేషన్ లోనూ దవాఖానాలో పబ్లిక్ ప్లేసెస్ షాప్స్ లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఈ మేరకు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గండ్రత్ నరేందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు కరోనా అపత్కాలంలో  సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో  హాస్టల్ జిల్లా కన్వీనర్ మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సాయితేజ, కార్తిక్, అక్షయ్, ఉదయ్,  హృతిక్,  తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదానికి గురైన బాదితురాలిని పరామర్శించిన... జడ్పిటిసి చారులత రాథోడ్

అగ్ని ప్రమాదానికి గురైన బాదితురాలిని పరామర్శించిన... జడ్పిటిసి చారులత రాథోడ్

ఉట్నూర్, పెన్ పవర్

ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన గజ ఈతగాడు కొండ్ర పోషన్న భార్య కొండ్ర లక్ష్మి ఇటివలే వంట చేస్తుండగా అకస్మాత్తుగా ఫిడ్స్ వచ్చి పోయ్యి వద్ద మంటల్లో పడి అగ్ని ప్రమాదానికి గురైంది. శరీరం పూర్తిగా కాలడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడా కొద్ది రోజులుగా వైద్యం పొందుతున్న క్రమంలో ఆరోగ్యం క్షిణిస్తున్నదని హైదరాబాద్ కి రెఫర్ చేయాలని వైద్యులు చెప్పడంతో వారు తగిన ఆర్థిక స్థోమత లేక నిరుపెద స్థితిలో ఉన్నందున ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడలోని తమ స్వగృహానికి వెళ్ళారు.  విషయం తెలుసుకున్న ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ శనివారం బోయవాడలోని వారి స్వగృహానికి వెళ్ళి లక్ష్మిని పరామర్శించారు.లక్ష్మి ఆరోగ్య వివరాలను భర్త పోషన్నను అడిగి తెలుసుకున్నారు. వారి దీనమైన పరిస్థితులను గమనించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళాలని జడ్పిటిసి చారులత రాథోడ్ వారికి కొంత ఆర్థిక సహయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు ఉట్నూర్ మండలమే కాకుండా ఆయా ఇతర మండలాలలోని బావుల్లో చెరువుల్లో పడ్డ వారిని గజ ఈతగాడిగా కొండ్ర పోషన్న ఎందరికో ఎనలేని సేవలను అందించాడని, నేడు ఆయన భార్య లక్ష్మి అనారోగ్యంతో చావు బతుకుల మద్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వారికి ధైర్యం కల్పించి మెరుగైన వైద్యం కోసం తగిన సహయాన్ని అందించడం జరిగిందని, ఈ విషయంపై మానవతావాదులు ఆపదలో ఉన్న కొండ్ర లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం తోచినంతగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం,దుప్పట్లు,వస్త్రాలు,చీరలు పంపిణీ

 బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం,దుప్పట్లు,వస్త్రాలు,చీరలు పంపిణీ

 

బిక్కవోలు,పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం లో నల్లమిల్లి క్రీస్తు సంఘము ద్వారా నిర్వహించ బడుతున్న బిక్కవోలు ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 300 మంది  అర్హులైన వృద్దులకు, పేదలకు   విద్యార్ధులకు, విధవరాండ్రకు బియ్యం, చీరలు, దుప్పట్లు , బట్టలు, మరియు బహుమతుల పంపిణీ కార్యక్రమము క్రీస్తు సంఘ ఆవరణం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, విశిష్ట అధితులుగా అనపర్తి సర్పంచ్ వారా కుమారి,చిర్ల  వీర రాఘవ రెడ్డి,జిల్లా ప్రదాన కార్య దర్శి అనపర్తి గ్రామ ఉప సర్పంచి నల్లా దుర్గా ప్రసాద్,నల్లమిల్లి వైస్సార్సీపీ నాయకులు మట్టా శ్రీను ఎం.పి.టి.సి, నల్లమిల్లి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ముప్పిడి జాన్ డీన్  అధ్యక్షతవహించగా, ఉపాద్యక్షురాలు స్వరాజ్య లక్ష్మీ ,సెక్రెటరీ కర్రీ సూర్య రావు  మరియు కార్యవర్గ సభ్యులు కార్యక్రమమును నిర్వహించిరి.ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కి.శే ముప్పిడి శామ్యూల్ రాజు విగ్రహమునికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా అనపర్తి శాసన సభ్యులు మాట్లాడుతూ ఈ సంస్థ  వ్యవస్థాపకులు ముప్పిడి శామ్యూల్ రాజు ఆశయాలను కొనసాగిస్తున్న కార్యవర్గ సభ్యులను అభినందించిరి.పేదల పట్ల శామ్యూల్ రాజు ప్రేమ పూర్వక స్వభావము వారి దాన గుణమును,వారి సంస్థల ద్వారా మాత్రమే గాక ,కోవిడ్ సమయంలో వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంతటా చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు.శామ్యూల్  రాజు చివరి కొరికైనా సింగంపల్లి,నల్లమిల్లి గ్రామాలు  వీధిలైట్లు వేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఎమ్మెల్యే సభలో ప్రకటన చేయడం జరిగింది.

శామ్యూల్ రాజు అనంతరం వారి కుటుంబం ఏదో విధంగా కష్టపడి దాతల నుండి తెచ్చి ఇంత గొప్పగా పెదలను ఆదుకున్నందుకు జాన్ డీన్ వారి కుటుంబాన్ని వారి సిబ్బందిని ప్రత్యేకం గా అభినందించారు.ఎమ్మెల్యే వారి చేతులమీదుగా పేదలకు,విధవరాళ్లు చీరలు , దుప్పటి + బియ్యం 5 కేజి  వృద్దులులకు బట్టలు, దుప్పట్లు బియ్యం 5 కేజి,స్కినర్ గార్డెన్  స్టాఫ్ చీరలు ,దుప్పట్లు బిక్కవోలు స్టాఫ్ చీరలు, దుప్పటి  స్టూడెంట్స్ యూనీఫార్మ్ , దుప్పటి,  చిల్డ్రన్ హోమ్ పిల్లలు – బట్టలు, దుప్పటి, గిఫ్ట్  బ్యాగ్ , బూట్లు , స్కూల్ బ్యాగ్ , చాక్లెట్లు,  బైబిలు కాలేజీ ఫ్యాకల్టీ  బట్టలు మరియుచీర , గ్లోబల్ విజన్ స్టాఫ్ -బట్టలు అనంతరం  కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రేమ విందు  సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

 ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 

బెల్లంపల్లి, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వంటి కష్ట కాలంలో ప్రైవేట్ పాఠశాలలు మూసి వేయటం వల్ల ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ  సిబ్బంది ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండ  సీఎం కేసీఆర్  2000/- రూపాయల నగదు  25 కిలోల బియ్యం అందించే బృహత్కరమైన పధకం  బెల్లంపల్లి పట్టణంలోని గొంతమ్మ గుట్ట చెరువు వద్ద గల రేషన్ షాప్ లో  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రైవేట్ పాఠశాల సిబ్బందికి 25 కిలోల బియ్యం అందించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ఈ పధకం ద్వారా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది అందరికీ ఖచ్చితంగా నగదు,బియ్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ , తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ , పట్టణ కౌన్సిల్ సభ్యులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు నెల్లి రమేష్ , సముద్రాల మురళి ,తడక రవి ,మంగ మూర్తి , తెరాస యువ నాయకులు శ్యామ్, ఎంఈవో మహేశ్వర్ రెడ్డి , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు...

కర్త పౌండేషన్ వారు నిత్యవసర సరుకులు పంపిణీ.

 కర్త పౌండేషన్ వారు నిత్యవసర సరుకులు పంపిణీ..


ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండలం లోని  అగ్రహారం గ్రామంలో 512 జనాభాకు గాను 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి కర్త ఫౌండేషన్  ఫౌండర్ భీమనపల్లి అన్వేష్ మరియు టీం ఈ గ్రామంలో కరోనా వైరస్ తో బాధపడుతున్న పేద కుటుంబాలకి వారి సహకారంతో  పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, పండ్లు, కోడి గుడ్లు మరియు కూరగాయలు 25 కుటుంబాలు ఈరోజు అందజేయడం జరిగింది. ఒక దినపత్రిక  వచ్చిన కథనం ద్వారా ఆ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ల తో మాట్లాడి ప్రతి ఒక్క బాధిత కుటుంబం తో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో తెలుసుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా వారికి కావలసిన వస్తువులు అందజేయడం జరిగింది. వీరికి సరకులు అందించడానికి నిధులు సమకూర్చినఎటువంటి  సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కు మరియు వీటిని బాధితులకు చేరవేసి నటువంటి ఫౌండేషన్ సభ్యులకి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్త ఫౌండేషన్  అన్వేష్ బీమనపెల్లి, నాంపెల్లి ప్రశాంత్, హరీష్ బుర్ర పాల్గొన్నారు.

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

వి.ఆర్.పురం, పెన్  పవర్

వి.ఆర్.పురం మండలం వి.ఆర్.పురం బీసీ (కాలనీ) గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవ పు శాత్తు యాక్సిడెంట్ లోమృతి చెందిన ఆసు  లక్ష్మణరావు కుటుంబానికి వి.ఆర్.పురం ఎస్ ఐ లు చంటి వెంకట్ ఆ కుటుంబానికి  కొంత నగదు ఆహార ధాన్యం నిత్యవసర వస్తువులు అందజేసినారు.మృతి చెందిన ఆ వ్యక్తికి భార్య  ఇద్దరు పిల్లలు ఉన్నారు.బీసీ కాలనీ  గ్రామప్రజలు పోలీసువారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. మండలంలో ఎవరైనా దాతలు ఉంటే మానవతా దృక్పథంతోఈ కుటుంబానికి ఆర్థికంగా  సహాయం చేసి ఆదుకోవాలని మృతుడి భార్య  మండల ప్రజలు కోరుతున్నారు. 

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు

 మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు

చిన్నగూడూరు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలోని విస్సంపల్లి గ్రామానికి చెందిన పులిగుజ్జు యాకయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగావారి కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్ రావు శనివారం పరామర్శించి వారి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండం మురళి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకన్న, గ్రామ సీనియర్ నాయకులు మక్క వెంకన్న ,కంచనపల్లి బాబు, శాగంటి శ్రీను, కొమ్ము శరత్, మధు , యాకయ్య ,శాగంటి వీరన్న ,శ్రీశైలం ,వెంకన్న, ధర్మారపు ఉపేందర్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, సిబ్బంది ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

 ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి, సిబ్బంది ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం

మహారాణి పేట, పెన్ పవర్

అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  లో  (ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి) ఆంధ్రరాష్ట్ర మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు సిహెచ్ ఆదిలక్ష్మి, కన్న రావు దంపతులు మరియు బి.పావని  శ్రీదేవి  శంకర్ రావు దంపతులు  పెళ్లి రోజు దినోత్సవ సందర్భంగా  రైల్వే స్టేషన్ సమీపంలో నిరుపేదలకు  అన్నదానం, శీతల పానీయాలు మరియు బిస్కెట్స్ పంచడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నేషనల్ జిల్లా సెక్రెటరీ బి.కేశవ.రావు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్ మైనార్టీ విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పిల్ల.సత్యవతి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుజాత డైరక్టర్ లలితా, ఆల్బీర్ట్,సత్య వేణి తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ సర్టిఫికెట్ అందజేత

అర్హులైన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ సర్టిఫికెట్ అందజేత

గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు సోమారపు లావణ్య

రామగుండం ,  పెన్ పవర్

 రామగుండం కార్పోరేషన్ పరిధి 39వ డివిజన్ పరిధిలోని గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా టైలరింగ్  శిక్షణ పొందిన పలువురు మహిళలకు బిజెపి మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య చేతుల మీదుగా అర్హులైన మహిళలకు శిక్షణ పత్రాలు అందజేశారు. అలాగే మహిళ సాధికారత గురించి ఆమె మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ముందుకు వెళ్లాలని అన్ని రంగాలలో తమదైన ముద్ర వేసుకోవాలని పిలుపునిచ్చారు. పిఎం ముద్ర యోజన పథకంలో ఈ సర్టిఫికెట్  ద్వారా మహిళలు బ్యాంకు నుండి ముద్ర లోన్స్ కూడా పొంద వచ్చునని ఆమె తెలియజేశారు.

పేద విద్యార్ధులకోసం ఉన్నత ప్రమాణాలతో ఓ స్కూలు ను త్వరలోనే ప్రారంభిస్తాను

 పేద విద్యార్ధులకోసం ఉన్నత ప్రమాణాలతో ఓ స్కూలు ను త్వరలోనే ప్రారంభిస్తాను

రాజమహేంద్రవరం, పెన్ పవర్

నిరుపేద విద్యార్థిని విద్యార్థుల కోసం  త్వరలోనే తానొక   ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఓస్కూలు ను ఫ్రీప్రైమరీ నుంచి ఏడవ తరగతి వరకూ ప్రారంభించబోతున్నట్టు రాజమండ్రి నగర వైస్సార్ సిపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తెలిపారు.కోరుకొండ సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం లాంటి విద్యాసంస్థలలో  ప్రవేశాలకు అర్హతలు సాధించేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలనే సంకల్పం తో స్కూలు ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టు ఆయన చెప్పారు.శనివారం ఉదయం ఏ.కే.సీ.కాలేజీ పరిసరప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఏ.కే.సీ.కాలేజీ అనుకుని కొత్తగా వేసిన డబల్ రోడ్డుకు చేర్చివున్న మునిసిపల్ పార్కులో ఉదయాన్నే అనేక మంది మోర్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. 

ఆ పార్కును డాక్టర్ ఆకుల సందర్శించారు. అయితే పార్కులో వాకింగ్ ట్రాక్ పాడై,  పార్కు అంతా అపరిశుభ్రంగా ,పాడైపోయి వుండటాన్ని పరిశీలించారు. స్థానికులు, అక్కడ వాకింగ్ చేస్తున్నప్రజలు పార్కును అభివృద్ది చేయాలని , అపరిశుభ్రతను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల తమ సొంత ఖర్చుతో పార్కును ముందుగా శుభ్రం చేయిస్తానని వాకర్స్ కు హామీ ఇచ్చారు.  విశాలమైన స్థలంలో చెట్లనీడలో వున్న ఈ పార్కును చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు, పిల్లలకు  ఆహ్లాదకరమైన పార్కుగా, వాకర్స్ కు  ఉపయోగపడేలా  అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు.  ఈ సందర్భంగా పార్కు వద్దకు వచ్చిన నందీశ్వరీ అనే వాలంటీర్ తాను  ఈ వార్డు వాలంటరీనని చెప్పి డాక్టర్ ఆకులను పరిచయం చేసుకున్నారు. 

ఏం చదువు కొన్నావని ఆమె ను డాక్టర్ ఆకుల అడిగారు.  ఆని అడిగినారు.. పిజీ యం ఎస్పి చేశానని, డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించానని నందీశ్వరి చెప్పారు. తాను తన  తల్లి కలిసి వుంటున్నామని కుటుంబ వివరాలు చెప్పిన నందీశ్వరిని ఆమె ఆర్థికపరిస్థితులు గురించి తెలుసుకున్నారు.వెంటనే డాక్టర్ ఆకుల సత్యనారాయణ  వాలంటీర్ నందీశ్వరి ఇంటికి వెళ్లి వారి అమ్మగారిని పలకరించారు. అప్పులు వల్ల తమ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా వుందని నందీశ్వరి తల్లి చెప్పడంతో.. డాక్టర్ ఆకుల స్పందించి వారికున్న రెండు  లక్ష రూపాయలు బయట అప్పులు,60 వేల  గోల్డ్ లోన్ తీర్చేందుకు తాను ఆర్ధికసాయం అందిస్తానని డాక్టర్ ఆకుల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నిరు పేద విద్యార్థిని విద్యార్థుల కోసం  త్వరలోనే తానొక   ఉన్నత ప్రమాణాలతో స్కూలు ను ఫ్రీప్రైమరీ నుంచి ఏడవ తరగతి వరకూ ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.


కోరుకొండ సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఇలాంటి స్కూల్స్ ప్రవేశాలకు  అర్హతలు సాధించేలా   విద్యార్ధులను తీర్చిదిద్దాలనే సంకల్పం వుందన్నారు. అలాగే పేద కుటుంబం లో అభ్యర్ధులు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్  ప్రిపేర్ కావడానికి ప్రైవేట్ గా కోచింగ్ తీసుకోవడానికి   ఆర్థిక పరిస్థితులు సహకరించక చదవలేకపోతున్నారని, అటువంటివారిని కూడా చదివించేలా ఓ కార్యక్రమం చేపడతామని డాక్టర్ ఆకుల ఈ సందర్భంగా అన్నారు. విద్యార్హతలకు అనుగుణంగా తాను స్థాపించబోయే విద్యాసంస్థలో్ వాలంటీర్ నందీశ్వరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తానని డాక్టర్ ఆకుల హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు  మాజీ కార్పొరేటర్ కంచుమర్తి చంటి తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఏ.కే.సీ.కాలేజ్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ కాలేజీ వద్ద కోవిడ్ తీవ్రత తరుణంలో పరీక్షలు నిర్వహణ గురించి ఆరా తీశారు. కాలేజీ సిబ్బందిని,కాలేజీ బయట వున్న విద్యార్ధులతో మాట్లాడి కరోనా వల్ల ఇబ్బందులు వస్తున్నాయని,భౌతిక దూరం పాటించాలని,మాస్క్ లు ధరించాలని,తగినజాగ్రత్తలు పాటించాలని  సూచించారు.

కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

 కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. 

- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు   తొట్ల మల్లేష్ యాదవ్. 

 మంచిర్యాల , పెన్ పవర్

కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోట్ల. మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఒకేరోజు నలుగురు జర్నలిస్టులు  మరణించడం బాధాకరమని అన్నారు. కరోనా తో మరణించిన జర్నలిస్టుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల  రక్షణ కొరకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రెండో దశ కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ నుండి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిది గా ఉండే సేవలు అందిస్తున్న జర్నలిస్టును ఆదుకోవాలని జర్నలిస్టులకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. కరోనా వ్యాధిని హెల్త్ కార్డు లో చేర్చి ఆసుపత్రిలో జర్నలిస్టులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

టిఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి వితరణ

 టిఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి వితరణ

పెన్ పవర్, కందుకూరు 

పట్టణంలోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మౌలిక వసతుల అభివృద్ధికి 1980- 83 పూర్వ విద్యార్థి గట్టమనేని వెంకటేశ్వర్లు కుమారుడు రాజేష్ ద్వారా 5 వేల రూపాయలు సాధన సమితి సభ్యులు మంచి రాజు మురళీమోహన్ కు  శుక్రవారం అందజేశారు. వెంకటేశ్వర్లు కు సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టమనేని హరిబాబు కూడా ఉన్నారు.

అనుష్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ

 అనుష్  స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు  పంపిణీ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి పోటీలో నిలబడిన అభ్యర్థి బోనం   సాయి బాబా పుట్టిన రోజు సందర్భంగా అనుష్  స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడమంచిలి లక్ష్మి ఉప సర్పంచ్ బోనం రత్నకుమారి వార్డు సభ్యులు గోగుల నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దూరు బాబి రాలి విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...