Followers

Showing posts with label OTHER. Show all posts
Showing posts with label OTHER. Show all posts

ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడిగా డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌

 ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడిగా డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 

ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ సంయుక్త సంచాల‌కులుగా ఆ శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ శ‌నివారం అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ శాఖ జెడిగా పనిచేసిన డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు ఏప్రెల్ 30న ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. దీంతో అదేశాఖ‌లో డిప్యుటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న వైవి ర‌మ‌ణ‌, జెడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.


మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా మాస్కులు, సీతలపానియాలు పంపిణీ

 మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా మాస్కులు, సీతలపానియాలు పంపిణీ

మహారాణి పేట, పెన్ పవర్

అఖిలభారత మానవ హక్కుల పరిరక్షణ సమితి  మే డే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని  గౌరవ చైర్మన్ షేక్ సిరజుద్దిన్  ఆదేశాలు మేరకు సీతమ్మధార ఆఫీస్ సమీపంలో మస్కులు మరియు శీతల పానీయాలు మరియు బిస్కెట్స్ సిహెచ్ ఆదిలక్ష్మి రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు పంచడం జరిగింది.రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పిల్ల.సత్యవతి, ఆధ్వర్యంలో లో  మాస్క్ ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ జిల్లా సెక్రెటరీ బి.కేశవ.రావు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్ మైనార్టీ విభాగం అధ్యక్షురాలు షేక్ మున్నీ,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మీ,డైరక్టర్ లలితా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.


ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

 ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

మన ఇంటి నుండే మొదలవ్వాలి
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆన్ని ఏర్పాట్లు
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

గరుగుబిల్లి, పెన్ పవర్

కరోనా వైరస్ రాకముందుతో పోలిస్తే మన దైనందిన కార్యక్రమాలలో ఊహించని మార్పులు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టెందుకు మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నాం ఇవి రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలి అందుకు ముఖ్యంగా మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్   పేర్కొన్నారు.   శనివారం ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి గరుగుబిల్లి  మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో 350 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారైంటిన్ సెంటర్లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు. కేంద్రంలో చేపడుతున్న పనుల పై అరా తీశారు. 

ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు.  ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు  త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల తహశీల్దార్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఉద్యానవన కళాశాల ప్రిన్సిపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మే డే...

ఘనంగా మే డే...

పెన్ పవర్, యదమరి

యాదమరి మండలం లో పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్  నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను  ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం లొ కోవిడ్ నిబంధనల తో ర్యాలీ నిర్వహించారు  అనంతరం  ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పరిధిలోని ఏర్పాటు చేసిన  కార్మికుల జెండాను యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా ఎగరవేశారు, ఈ సందర్భంగా యాదమరి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా కార్యదర్శి యోగానంద రెడ్డి  మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగాపెట్రోల్ ట్యాంకర్   డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లిడర్ ఆన్సర్ బాషా, కార్యదర్శి యోగానంద రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కుప్పయ్య, కమిటీ మెంబెర్స్ భాస్కర్, రఫీ, జగ్గా, భీమా తదితరులు పాల్గొన్నారు.

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పి.డి బి.బాబురావు.....

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన పి.డి బి.బాబురావు..... 

పెన్ పవర్, ఉలవపాడు 

వీరేపల్లి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పి.డి .బి.బాబు రావు పరిశీలించారు, ఆయన రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం లో 18 వందల 70 టన్నులధాన్యం నిల్వ ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేసినది 264 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగినది. మిగిలిన ధాన్యము 16 వందల పైచిలుకు ధాన్యము నిల్వ ఉండిపోయిందని రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు, వర్షాలు  ఎప్పుడు వస్తాయా తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు , అని తెలుసుకుని వెంటనే జెసి గారితో మాట్లాడి గోనె సంచులు ఏర్పాటు చేస్తానని  మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి భయానికి గురి కావద్దని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని రైతులకు భరోసా కల్పించారు. అలాగే నూతనంగా ప్రారంభించిన బద్దిపూడి, భీమవరం ,ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం చాగొల్లు, వీరేపల్లి, గిరిజన సంఘాల లో పింఛన్లు పంపిణీ పరిశీలించి, మహిళలు గ్రూపులో చేరని వారు ఉంటే కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేయాలని అని కమ్యూనిటీ కోఆర్డినేటర్ కి ప్రతి ఒక్కరూ కోవిడ్ పై జాగ్రత్తలు పాటించాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో  ఎం పి డి ఓ టి. రవికుమార్, కార్యదర్శి  భాస్కర్ రావు,సీసీ మాధవరావు, విరేపల్లి సర్పంచ్ వెంకట సుధారాణి, కారసాల శ్రీనివాసులు, నన్నం పోతురాజు, రైతులు పాల్గొన్నారు. 

135 వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో ఎర్రజండా రెపరెపలు

135 వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో ఎర్రజండా  రెపరెపలు

చిత్తూరు,   పెన్ పవర్

కార్మికుల హక్కులను, చట్టాలను, కాలరాస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం. ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపు 135 వ మేడే సందర్భంగా  చిత్తూర్ నగరంలో ఆర్టీసీ  1 డిపో ,2 డిపో, ఏ పీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్,  చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్,  భవన నిర్మాణ కార్మిక సంఘం మార్కెట్ చౌక్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్, ఐ ఎం ఎఫ్ ఎల్ హమాలి వర్కర్స్ యూనియన్,  ఫీడ్ హమాలి వర్కర్స్ యూనియన్, వామన , న్యూట్రిన్, సుందరయ్య, సువేరా, ఎంజీఆర్, ఆటో డ్రైవర్స్ యూనియన్, సిమెంట్ స్టీల్ హమాలి వర్కర్స్ యూనియన్, వివిధ రంగాలకు సంబంధించిన ఏఐటీయూసీ అనుబంధ సంఘాల  ఎర్ర జెండాలతో పాటు పాత  ప్రశాంత్ నగర్ కాలనీలో ఎర్ర జెండాలను  ఏఐటీయూసీ నాయకులు ఎస్. నాగరాజు, గంటా మోహన్, కె. వెంకటేష్, సీ కే జయచంద్ర, కే .మణి, బి. ఆర్ముగం రెడ్డి,ఏ. సత్యమూర్తి,పి.యస్. నాగరాజు నాయుడు,  దాసరి చంద్ర,గిడ్డుబాయ్, యస్ .జయలక్ష్మి,కె. విజయ్ గౌరీ, యస్ . పుష్పలత, కె.రమాదేవి, పి. గజేంద్ర బాబు,పి. రఘు, పెనుమూరు బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే చరిత్రను  కార్మికులు సాధించుకున్న చట్టాలను హక్కుల గురించి కార్మికవర్గానికి తెలియజేశారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఎర్ర జెండా ఆవిష్కరణ జరిగింది.  ఈ కార్యక్రమంలో జాన కారపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ లక్ష్మణమూర్తి ,అనుబంధ సంఘాల నాయకులు రాధాకృష్ణ ,మనీ, గజేంద్ర రెడ్డి, దామోదర్ రెడ్డి, మునిరత్నం, విక్టోరియా, కృష్ణ, దాసు, కమల్ ,నాగరాజ్, ప్రేమ్ రాజ్, రమేష్ , సురేష్ శరవణ, పయని, మురుగేష్, బాబు నాయుడు, వెంకటేష్, గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో  మేడే జెండాను ఆవిష్కరించారు,  కృష్ణమూర్తి , జయరామ్, రవి, పొన్ను రంగం తదితరులు పాల్గొన్నారు. 

హుకుంపేట మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు

 హుకుంపేట మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు

హుకుంపేట, పెన్ పవర్: 

 హుకుంపేట మండలం బాకూరు భీమవరం కేంద్రాల్లో శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం(మేడే) వేడుక లు ఘనంగా జరిగాయి. సీఐటీయూ హుకుంపేట మండల కమిటీ నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు లక్ష్మణ రావు ల ఆధ్వర్యంలో  మేడే కార్యక్రమం నిర్వహించారు.మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాకూరు సర్పంచ్ బాకూరు వెంకట రమణ రాజు  హాజరయ్యారు.మేడే కార్మిక జెండా ను ఆవిష్కరించి కార్యక్రమంలో నాయకులు కామ్రేడ్ సుడిపల్లి కొండలరావు  మాట్లాడుతూ  దేశ సంపదకు మూలమైన కార్మికుల కు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,కరోనా కష్టకాలంలో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ,కష్టాలు పాలుచేస్తున్నా రని అన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం తో లక్షలాదిమంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోతున్నారన్నారు. బి ఎస్ ఎన్ ఎల్. పోర్ట్ డాక్ యార్డ్, షిప్ యార్డ్, బీమాసంస్థలుతో పాటు రైల్వేలు,విమానయాన సంస్థ ఎయిరిండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల ను కారుచౌకగా తనకు కావాల్సిన అంబానీ, ఆధాని వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఉన్నా ఉద్యోగలు పోగొట్టుకునే ల చేసి  మోడీ,బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు.రాష్ట్ర వైసీపీ జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రేట్లు 100 రేట్లు పెంచి నూనె లీటర్ 185 /-లు,పంచదార 55 రూపాయలు ఇలా అన్నింటిలో నచ్చినట్లు రేట్లు పెంచి ,ఇస్తున్న సంక్షేమ పథకాలు సొమ్ము నెలకు కూడా సరిపోని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉందని,భవిష్యత్ లో  తీవ్ర అవస్థలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని,కనీస వేతనo రూ 21 వేలు ఉద్యోగులు/కార్మికుల ఇవ్వాల్సి ఉన్న అరకొరగా జీతాలు ఇస్తున్నారని, రైతులు పండించే కాపీ, మిరియాలు,రాజ్ మా కందులు,అల్లం,పసుపు, పిప్పల మోడీ వంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ,కరోనా నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి కేరళ  ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సీపీఎం ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతీ కుటుంబానికి నెలకు 50 కేజీల బియ్యం,నూనె 5 కేజీల,కారం 5 కేజీల,మసాలా 5 కేజిలు, ఉల్లిపాయలు వంటి 14 రకాల సామాన్ల తో పాటు కుటుంబానికి నెలకు రూ.7 వేల 5 వందలు ఇవ్వాలని,కరోనా వ్యాక్సిన్ అందరికి ఉచితంగా ,సాధ్యమైనంత వరకు త్వరగానే ఇవ్వాలని,అంగన్ వాడి సెంటర్లు కు సెలవులు ప్రకటించి ఇంటింటికీ డ్రై పొడి సరుకులు అందేలా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు/ కార్మికులు. చంద్రకళ, సింహాద్రి, చిలకమ్మ, నాగమణి, కామేష్,, కొండలరావు, కమలమ్మ, కృష్ణవేణి , గోపాలమ్మ, అంగన్ వాడీ, ఆశావర్కర్లు,మిడ్ డే మిల్స్ వర్కర్స్ ,బాకూరు పంచాయితీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.   మేరకచింత పంచాయితీ లోని రంగసింగ పాడు, గన్నేరుపుట్టు పంచాయితి డొంకి నవలస లో కూడా మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమ్మలు చిట్టమ్మ, గణేష్, సింహాచలం, రాంబాబు, మత్స్యరాజు, కొండబాబు, అప్పలనాయుడు, గంగన్న,వై చిట్టిబాబు, చంటిబాబు, సింహాచలం, లచ్చన్న, ఎం పండన్న, వీ పండన్న సన్యాసమ్మ, అచ్చులమ్మ, చిలకమ్మ, కాసులమ్మ,ఎర్రమ్మ ,లలిత , పండన్న తమ్మయ్య, గోపాలకృష్ణ, ఎం రామన్న, జన్ని చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.



జూన్ రెండోవారంకు ఐదులక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు

జూన్ రెండోవారంకు ఐదులక్షల టన్నుల ఇసుకను 

నిల్వ ఉంచే విధంగా చర్యలు : జే.సీ. రెవెన్యూ  కె. వెంకట రమణా రెడ్డి



 కొవ్వూరు, పెన్ పవర్ : 


     జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల ట న్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ  కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూ రు  ఆర్డీవో కార్యాలయం లో శనివారం ఏ పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపు ల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకుల తో సమీక్ష సమా వేశం నిర్వహించారు. 

ఈ సంద ర్భంగా  వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్ప త్తి పెంచే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు.ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాం పులు, డీ సిల్టేశన్ ర్యాం పులు, ఇసుక డిపోలు, త్వరిత గతిన ప్రారం భించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు28డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపు లు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.  10 పట్టా ర్యాంపు లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు.  22 ఓపెన్ ర్యాంపు ల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగు తోంది అని అన్నారు. ఇసుక ఉత్ప త్తీ నీ పెంచేందుకు అన్ని ర్యాంపు లు తెరిపించాలని  ఏ పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవె న్యూ  కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పని సరిగా  వేయించు  కోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఏటువంటి ఇబ్బందులు ఉంటే 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తం గా ఉం డి, వైరస్ వ్యాప్తి నీ నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు, సాని టైజర్ లు, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటిం చాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టు లు చాలా వరకు పెంచడం జరి గింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు.   ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరిగు తుం ది అని అన్నారు.  ఈ కార్యక్రమంలో  కొవ్వూరు ఆర్డీవో, డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి. ఐ, సురేష్, ఏ పి.యం.డి.సి. అధికా రీ, తదితరులు పా ల్గొన్నారు.

ఘనంగా మే డే....

 ఘనంగా మే డే....



చిత్తూరు, పెన్ పవర్ 

నగరి పట్టణంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టంలోని కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం  మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడ, ఏకాంబరకుప్పం అలాగే తిరుత్తని రోడ్డులోని ఆటో స్టాండ్ వద్ద కార్మికుల జెండాను ఎగరవేశారు, ఈ సందర్భంగా నగరి పట్టణ సి ఐ టి యు కార్యదర్శి పెరుమాళ్ మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. గోవిందస్వామి, వాసు, షణ్ముగం, జగదీష్,సందీప్,ఉమాపతి,అయ్యప్ప,మాయా,తమిలరసన్,ఎయిల్,ప్రవీణ్,కంధన్,మునిరత్నం,శ్రీనివాసన్,శరవణన్,మయిలుస్వామి,సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కార్మిక దినోత్సవం...

ఘనంగా కార్మిక దినోత్సవం...

 పారిశుధ్య , స్మశాన వాటిక కార్మికులకు సన్మానం ..

వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్

వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక సచివాలయంలో అవరణలో, స్వచత్ రూరల్& అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధికారపార్టీ ప్రచార కార్యదర్శి ఓడూరు ఉజ్వల రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ,గ్రామ స్మశాన వాటిక కార్మికులు సచివాలయ సిబ్బంది నడుమ కరోనా నిబంధనలు పాటిస్తూ అ. ఆనందోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నా,ప్రజా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాసేవలో నిమగ్నమైన పారిశుధ్య, మరియు స్మశానవాటి కార్మికుల పని తీరు ఎంతో ఉన్నతంగా ఉందని ఆయన కోనియాడారు.

 ఇలాంటి కార్మికులను గుర్థించి , వారికి సహకరించాలనీ కోరారు, మానవరూపంలో సేవలందిస్తున్న వారిని దైవస్వరూపులుగా బావిచాలన్నారు,ఈ సందర్భంగా ఆయన వారిచేత కేక్ కట్ చేసి,చిరు సత్కారం చేసి ఆనందిం జేశారు. ఈకార్యక్రమంలో  స్వచత్ రూరల్ సోసైటి, ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ కిషోర్, సభ్యుడు షన్ముగం,గ్రామ సర్పంచ్ మణి, వార్డు సభ్యుడు వేనాటి అశోక్,మునిశేఖర్,ఎం పీ టి సి అభ్యర్థి,కస్తూరిధనపాల్,, సచివాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మే డే వేడుకలు

 ఘనంగా మే డే వేడుకలు

వరదయ్య పాలెం, పెన్ పవర్ న్యూస్

 చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బస్టాండ్ నందు ఘనంగా మే డే వేడుకలు సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా. సిపిఐ. జిల్లా కార్యవర్గ సభ్యులు. అంబాకం. చిన్ని రాజ్. మాట్లాడుతూ. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కరోనా తో  చనిపోయిన కారిషిక కార్మిక శ్రమజీవులకు నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే కార్మికుల తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను అమలు పరచి . దేశంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని మరియు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే మధ్యతరగతి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో. సిపిఐ.  సీనియర్ నాయకులు. సిద్ధయ్య.  కృష్ణమూర్తి. బాల గురునాథం. ఏ ఐ వై ఎఫ్.  నాయకులు. దయాకర్.చంద్ర. మురళి. తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలను ఆదరించిన నాడే నిజమైన మేడే

ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలను ఆదరించిన నాడే నిజమైన మేడే

--సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ.
--ఘనంగా ఆలమూరులో 135వ మేడే వేడుకలు.




ఆలమూరు, పెన్ పవర్ :

      ప్రపంచ కార్మిక 135 వ దినోత్సవం "మేడే" సందర్భంగా  మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద అరుణ పతాకం సీపీఐ, ఏఐటీయూసీ, ఎస్టీయూ, యూటిఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు శ్యామ్ రామకృష్ణ, సీపీఐ నాయకులు వి శ్యామ్, కె రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా ప్రభాకర్రావు  మాట్లాడుతూ 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా పనిగంటలు నియమ నిబంధనలు అమలులో లేవని కార్మిక హక్కులు, చట్టాలు లేవని అటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటలు పని ఉండాలని వారానికి ఒకరోజు శెలవు కావాలని, భోజన విరామం కావాలని సంఘం పెట్టుకొనే హక్కు, కార్మిక చట్టాలను అమలు చేయాలని 1886 మే1 నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా.. పోలీసులకు కార్మికులకు మధ్య జరిగిన గొడవల్లో ఎందరో కార్మికులు అసువులుబాశారని ఆ కార్మికుల రక్తంతో తడిచిన చేతి రుమాలు నేడు కోట్లాదిమంది కార్మికులకు అండగా ఎర్ర జెండాగా మారిందని అంతటి చరిత్ర కలిగిన మేడే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పండుగగా జరుపుకొంటున్నారని అన్నారు. కె రామకృష్ణ మాట్లాడుతూ మేడల మీద మేడలు పెరుగుతున్నాయి కానీ పేదవాడి కష్టాలు తీరటంలేదని ఎన్ని "మేడే"లు వచ్చినా రామరాజ్యం కలల రాజ్యంగానే మిగిలిపోతోందని నేను వ్వవసాయం చేస్తున్నాను హాయిగా ఉన్నాననే రైతులు కనపడటం లేదని, వ్వవసాయ కూలీల డొక్కలు చిక్కి పోతున్నాయని, ఇకా కార్మికులైతే చెప్పనఖ్ఖరలేదని చీకటిలో జీవితనావను లాగలేక లాగుతున్నారని, కరోనాలో దినసరి కూలీలు  పిల్లలనెత్తుకొని కాలినడకన ,కూటికోసం పరుగులు పెడుతుంటే కన్నీరు ఆగటం లేదని వ్వవసాయాన్నీ పరిశ్రమలను ప్రభుత్వం ఆదరించి స్యయం ఉపాధి పధకాలను ప్రోత్సాహించాలని,  అప్పుడే కర్షక,కార్మిక జనావళి జీవితాల్లో మే డే కన్పిస్తుందని నిఖిలలోకం హర్షిస్తుందని అన్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సేవాదళ్ కన్వీనర్ చల్లా ప్రభాకర్రావు సమకూర్చిన నూతన వస్త్రాలను కార్మిక కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు చక్రవర్తి, కె రాజగోపాల్, ఉడతా వెంకటేశ్వర్రావు, నాయకులు దడాల చంద్రరావు, గండి రవికుమార్, లంకె యాకోబు, పారిశుధ్య కార్మికులు, రిక్షా కార్మికులు, ఎలక్ట్రికల్, అటో వర్కర్లు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

మంచిర్యాల పట్టణంలో ఐదు రోజులు సంపూర్ణ బంద్.

 మంచిర్యాల పట్టణంలో ఐదు రోజులు సంపూర్ణ బంద్. 

  -చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మంచిర్యాల.

 మంచిర్యాల , పెన్ పవర్

మంచిర్యాల పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తూ,  పట్టణ ప్రజలను వ్యాపారులను అనారోగ్యానికి గురి  చేస్తున్నందున తప్పనిసరి పరిస్థితులలో మే ఒకటి నుండి మే 5 వరకు ఐదు రోజుల సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు  గుండా. సుధాకర్  గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగా మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ సుధాకర్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ  ప్రజల మరియు వ్యాపారస్తుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.  అదేవిధంగా ఈ విషయంపై పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులను సంప్రదించి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.  మే ఒకటి నుండి  మే 5 వరకు మంచిర్యాల పట్టణంలో అత్యవసర సర్వీసులు అయినా మెడికల్ షాప్స్, పాలు, పండ్లు, కూరగాయలు, చికెన్ సెంటర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రజలు, వినియోగదారులు, అందరూ వ్యాపారస్తులు ఈ ఐదు రోజులు పూర్తి  బంద్ కు  సహకరించగలరని చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్ష, కార్యదర్శులు గుండ సుధాకర్,  ఇరుకుల్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

భక్తిశ్రద్ధలతో గుంటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్లు

 భక్తిశ్రద్ధలతో గుంటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్లు.


పెన్ పవర్, తాళ్ళూరు

తాళ్లూరు మండలం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవానీ  అమ్మవారి 96 వార్షికోత్సవం తిరునాళ్లు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూనే అమ్మవారి ని దర్శించుకుని పూజలు చేశారు.బుధవారం తెల్లవారుజామున  ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం మహానైవేద్యం నివేదన చేశారు.గంగమ్మ అమ్మవారికి భక్తులు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం బహుళ విధియ నాడు అత్యంత వైభవంగా తిరునాళ్లు నిర్వహిస్తారు.రెండు సంవత్సరాలు నుంచి కరోనా నేపథ్యంలో విద్యుత్ ప్రభలు,సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు అధికారులు అనుమతించలేదు.

మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా మారాలి

మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా మారాలి

చిత్తూరు,  పెన్ పవర్

 రాష్ట్రంలో మహిళలను గొప్ప వ్యాపారవేత్తగా, లక్షాధికారులుగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం రెండవ సంవత్సరం అమలులో భాగంగా శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ఈ వీడియో సమావేశానికి చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి నగర మేయర్ ఎస్.అముద, నగర కమిషనర్ పి.విశ్వనాథ్, డిప్యూటీ మేయర్ ఆర్.చంద్రశేఖర్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ  సున్నా వడ్డీ పథకాన్ని రెండవ సంవత్సరం కొనసాగిస్తున్నామని... 2020-21 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో చెల్లించిన అన్ని సంఘాలకు, ఈ సంవత్సరం తీసుకున్న కొత్త రుణాలు కూడా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు వ్యాపారాలు చేయడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో మెప్మా సీఎంఎం గోపి, ఆర్పి లు  పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సమావేశాన్ని అన్ని వార్డు సచివాలయాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు వీక్షించారు.

ఒలా,ఊబర్ డ్రైవర్సగా పనిచేస్తున్న వారిని ఉద్యోగులుగా గుర్తించాలి

 ఒలా,ఊబర్ డ్రైవర్సగా పనిచేస్తున్న వారిని ఉద్యోగులుగా గుర్తించాలి

మహారాణి పేట, పెన్ పవర్

ఒలా,ఊబర్ డ్రైవర్సమస్యలు పరిష్కారం చేయాలి సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జి.వి.ఎమ్.సి,గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికే ఓలా‌,ఉబర్ యజమానులకు,కలెక్టర్ కి కలిసి నెల రోజుల అయినా స్పందన లేదు.ధర్నాను ఉద్దేశించి విశాఖ క్యాబ్ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి.జగన్ మాట్లాడుతూ ఓలా ఉబర్ లో పనిచేస్తున్న డ్రైవర్ల ను ఉద్యోగులుగా గుర్తించి కార్మిక చట్టాల అమలు చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. డ్రైవర్స్ దగ్గర 35%  కమిషన్ తీసుకుంటున్నారు. జిఎస్టి లో అత్యధికంగా 28 శాతం మాత్రమే,దానికి మించి వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి కానీ కిలోమీటర్ కి చిన్న కారు ఐదు రూపాయలు పెద్ద వాహనములకు రూపాయలు 8రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.

బయట మార్కెట్లో చిన్న కారు కి పది రూపాయలు పెద్ద కార్ కి 13 రూపాయలు ఇస్తున్నారు డ్రైవరు 10 నుంచి 15 లక్షలు ఫైనాన్స్ కి కారు తీసుకుని నడుపుతుంటే కనీసం ఫైనాన్స్ తీరే విధంగా కూడా ఓలా ఉబర్ వచ్చే డబ్బు సరిపోవడం లేదు.ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా వాళ్ల యాప్ ఇవ్వడంతో 30 శాతం కమిషన్ తీసుకోవడం దుర్మార్గం. అలాగే గత రెండు రోజుల నుండి వాళ్ల ఇస్తున్న ఇన్సెంటివ్ కూడా తీసివేయడం దుర్మార్గం. ఇప్పుడు వస్తున్న అన్నీ కరోనా పేషెంట్ తీసుకెళుతున్న ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎగ్గొట్టడం సరైంది కాదు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మంత్రి జోక్యం చేసుకొని వాళ్ల సమస్యలు పరిష్కారం చేయాలి లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం.26న ఓలా‌ ఆఫీసు వద్ద, మే3న కలెక్టర్ వద్ద దర్నాలు చెయబోతున్నాం.అప్పటి కీ పరిష్కారం కాకపోతే బంద్ చెస్తాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లో యూనియన్ నాయకులు శ్రీ రాములు అప్పలరాజు రాయుడు ప్రొఫైల్ కుమార్,పాత్రుడు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం

 అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 స్థానిక  మండల మహిళా సమాఖ్య కార్యాలయం లో ఎంపీడీఒ నాతి బుజ్జి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి  ‌మాట్లాడుతూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడపడుచుల మోములో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో  గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆర్థిక క్లిష్ట పరిస్థితులలో కూడా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారము మాట తప్పకుండా ఈరోజు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు  సున్నా వడ్డీ సొమ్ము జమచేసారని అన్నారు. కొత్తపేట నియోజకవర్గం లో  మొత్తం 6315 గ్రూపులలో ఉన్న 63150 మంది మహిళలకు 3కోట్ల 97 లక్షల రూపాయలను సున్నా వడ్డీ క్రింద ఈరోజు విడుదల చేశామన్నారు. అంతేకాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన మరియు పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపునేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పధకాల అమలులో అగ్రగామిగా ఉందనీ, వీటిని ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనీ ఆయన ఆకాంక్షించారు. సంక్షేమ పధకాల ఫలాలు అందించడంలో ఎవరైనా ఉద్యోగుల వల్ల లేదా బ్యాంకు లలో ఏదైనా ఇబ్బంది వస్తే తన దృష్టి కి   రావాలన్నారు. మహిళలకు సున్నా వడ్డీ చెక్కు ను ,గృహ నిర్మాణం చేసుకుంటున్న మహిళకు 50 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆత్రేయపురం  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముదునూరి రామరాజు, మాజీ ఎంపిపి పీఎస్ రాజు, చిలువూరి రామకృష్ణం రాజు, వాడపల్లి దేవస్థానం మెంబర్ దావీదు, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, డీఆర్‌డీఏ కోఆర్డినేటర్ అన్నపూర్ణ,రావులపాలెం ఎంపీడీఒ రాజేంద్ర ప్రసాద్, ఆలమూరు మండల పరిషత్ పరిపాలనాధికారి సురేంద్ర రెడ్డి నాలుగు మండలాల మహిళా సమాఖ్య నాయకురాళ్లు, సుబ్రహ్మణ్యం, స్వయం సహాయక సంఘాల మహిళలు, డిఆర్డిఎ సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

సర్పంచ్, వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం

 సర్పంచ్, వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలంలో 3 వెన్యూల వద్ద యూనిసెఫ్ నిపుణుల ద్వారా నూతనంగా ఎన్నికయిన సర్పంచులు, వార్డు సభ్యులకు కోవిడ్ నియంత్రణలో పంచాయతీల పాత్రపై జూమ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఫస్ట్ వెన్యూలో ఎంపిడిఓ ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో, సెకండ్ వెన్యూలో  ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ ఆధ్వర్యంలో, థర్డ్ వెన్యూలో  ఆర్డబ్ల్యుయస్ అండ్ యస్ ఏఈ శ్రీనివాస  ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మండలంలోని ఆయా పంచాయతీల సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

కోవిడ్ 19పై అవగాహన శిక్షణ

 కోవిడ్ 19పై అవగాహన శిక్షణ

మెంటాడ ,పెన్ పవర్  

మెంటాడ మండలం లోని గురువారము సర్పంచులకు, వార్డు నెంబర్లకు, గ్రామ వాలంటీర్లకు, గ్రీన్ నెంబర్స్ మెంట్ కు కోవిడ్ 19 ఒకరోజు అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మెంటాడ లో కరోనా తీవ్రంగా ఉందని, ఈ శిక్షణా కార్యక్రమాన్ని మెంటాడ మండలం లోని చల్లపేట జడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించడానికి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, గ్రామ వాలంటీర్లకు అధికారులు పిలుపునిచ్చారు. అవగాహన సదస్సు కు పెద్దగా ఏ ఒక్కరూ ఆసక్తి చూపించక పోవడంతో కొంతమంది సర్పంచులు, వార్డు సభ్యులు పెద్దగా హాజరు కాలేదు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారి వాణిశ్రీ మాట్లాడుతూ కరోనా చాలా తీవ్రంగా ఉందని, గౌరవ సర్పంచులు, వార్డ్ నెంబర్లు గ్రామాల్లో కరోనా పై అవగాహన కల్పించాలని కోరారు. కరోనా టీక ప్రతి ఒక్కరూ వేసుకోవాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఢిల్లీ రైతు పోరాట నాయకులు

 దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఢిల్లీ రైతు పోరాట నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ పరిరక్షణ వేదిక నిరాహారదీక్ష శిభిరాన్ని ఢిల్లీ రైతుపోరాట నాయకులు రాకేష్ టీకాయత్, అశోక్ థావలే ఆదివారం సందర్శించారు. ఆదివారం ఆర్కేబీచ్ లో  భారీఎత్తున జరిగిన సభకు ముఖ్యవక్తలుగా ఆలిండియా  కిసాన్ మోర్చా ప్రధాన నాయకులలో ఒకరైన రాకేష్ టికాయత్, ఎఐకెఎన్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి అశోక్ థావలె, ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితరులు విశాఖనగరానికి వచ్చారు. వీరు ఆదివారం ఉదయం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిభిరానికి పాల్గొని తమ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా రాకేష్ టీకాయత్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు తీవ్ర నష్టదాయకమైన నిర్ణయాలను చేస్తోందన్నారు. రైతులు ఢిల్లీలో నలుమూలల వ్యవసాయచట్టాలు రద్దుకోసం పోరాడుతుంటే యావత్తు భారతదేవ ప్రజలంతా మద్దతు తెలియజేస్తున్నా మోడీకి మాత్రం చలనం రావటం లేదన్నారు. 

మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెట్టే చర్యలు చేపడుతుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని విశాఖ కార్మికవర్గం, ప్రజలు పోరాడుతున్నారు. వీరికి మద్దతు తెలియజేయడం కోసమే వచ్చామన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి పోరాడి మన హక్కులను సాధించుకుందామన్నారు. ఆదివారం దీక్షల్లో ఆర్టిస్ ఎస్ డబ్యుఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఎఐటియుసి శ్రామికమహిళా కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్ బ్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు ఉంటే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కార్యదర్శి ఎం.సిహెచ్ అప్పుడు, రాజేంద్రప్రసాద్,సీతాలక్ష్మి,పరమేశ్వరరావు, ప్రసాద్, రాజు,ఎ.ఎస్.రావు,యు.కె.రావు,కె.వి.పి.రావు, ఎఐటియుసి శ్రామిక మహిళా విభాగం కన్వీనర్, కోకన్వీనర్లు పి.శ్యామలదేవి. ఎస్.తులసీలత,రమ, వేదిక చైర్మెన్ ఎం.జగ్గునాయుడు,వైస్ చైర్మెన్ పడాలరమణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...