Followers

కేతేపల్లిలో వారోత్సవాలు

 కేతేపల్లిలో వారోత్సవాలు

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో గ్రామ సర్పంచ్ అనిత  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహం చేయడం బాల్య వివాహంగా పరిగణించబడుతుందని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా చూపిస్తూ ఉన్నత స్థాయిలో విద్య నేర్పిస్తూ అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తూ ప్రేరేపించినప్పుడు ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి దేవమ్మ, పంచాయతీ సెక్రెటరీ జహంగీర్, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, ఆశ వర్కర్లు మంజుల, పుష్పలత  పాల్గొన్నారు.

స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో మెకానిక్ శ్రీను

 స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో మెకానిక్ శ్రీను



 15 వ వార్డులో బీరువా జోరు

 నర్సీపట్నం, పెన్ పవర్ 

  నర్సీపట్నం మున్సిపాలిటీ 15 వార్డులో పెదిరెడ్ల శ్రీనివాసరావు (మెకానిక్ శ్రీను) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. చివరి వరకు పార్టీ బి-ఫారం తనకే దక్కుతుందని ఆశించిన శ్రీను, వేరొకరికి బి-ఫారం అందడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మెకానిక్ శ్రీను కు బీరువా గుర్తు కేటాయించింది. అయితే వార్డు ప్రజల కష్టసుఖాలలో తలలో నాలుకలా ఉండే మెకానిక్ శ్రీనును పోటీలో ఉండమని యువకులు, పెద్దలు పట్టుబట్టడం విశేషం. సాధారణ మెకానిక్ జీవితం గడిపే శ్రీనివాసరావు, తనకు వచ్చే ఆదాయంలో కొంత పేద ప్రజల కోసం కేటాయించటం పట్ల ప్రజల విశ్వాసం చూరగొన్నారు.  కరోనా వంటి కష్టకాలంలో కూడా, వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు,  కూరగాయలు అందజేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ అండగా నిలిచారు. ఇవన్నీ మెకానిక్ శ్రీను గెలుపుకు దోహదపడే అంశాలు. గుర్తు కేటాయించిన వెంటనే కరపత్రాల తో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  తనను గెలిపిస్తే వార్డులో పారిశుద్ధ్య పనులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, సిసి రోడ్లు వేయిస్తానని,  అవసరమైన చోట కల్వర్ట్ లు నిర్మాణం చేయిస్తానని,  వీధులలో ఎల్ఈడి బల్బులు వేయిస్తానని, ప్రతి వీధిలో రెండు చెత్తకుండీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు.  ప్రజలంతా మెకానిక్ శ్రీనుకు  పట్టం కట్టేందుకు ఉత్సాహపడుతున్నారు.  బీరువా గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే , మున్సిపాలిటీ లోనే 15 వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెకానిక్ శ్రీను హామీ ఇస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి హజర్

 కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి హజర్

వికారాబాద్ జిల్లా, పెన్ పవర్


పరిగి మండల కేంద్రం లో సోమవారం ఉదయం 10 గంటలకు మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి  అధ్యక్షతన  నివాసం పరిగి వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ  సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి , పోన్నం ప్రభాకర్, మాజీ ఎంపీలు కోండా విశ్వేశ్వర్ రెడ్డి  , మల్లు రవి ,మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ , రమేష్ మహరాజ్  మరియు తదితర కాంగ్రెస్ నాయకులు హజర్తెతారని .జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి హనుమంతు వివరించారు . పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని పట్టభద్రులు మరియు అన్ని మండల నాయకులు  కార్యకర్తలు గ్రామ కమిటీ నాయకులు మరియు బూత్ కమిటీ నాయకులు కార్యకర్తలు తప్పకుండా హాజరై ఈ యొక్క కార్యక్రమంను విజయవంతం చేయాలనికోరారు .  ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు కృష్ణ మండల అధ్యక్షుడు పరుశురాం రెడ్డి,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవార్ ,కౌన్సిలర్లు శబ్బనూర్ రియాజ్ మల్లేష్ యాదవ్ డిసిసి నాయకులు ఆంజనేయులు,అక్బర్ హుస్సేన్, ఎజాస్, రాంచందర్, నసీర్, థావుర్య నాయక్ తది తరులు పాల్గోన్నారు

పురపీఠం వైయస్సార్ కాంగ్రెస్ దే ...

పురపీఠం వైయస్సార్ కాంగ్రెస్ దే ...



నర్సీపట్నం, పెన్ పవర్ 

  మున్సిపాలిటీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి, వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 25, 26 వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. అబీద్  సెంటర్ లో సీనియర్ వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, 25 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని దేవత అరుణ, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. నూకాలమ్మ ఆలయంలో సీతారాముల ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయ్యరక వీధి, మేదరవీధి, కోమటివీధి,  తోట వారి వీధి, వెలంపేటలో ప్రచారం నిర్వహించారు.  మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. కౌన్సిలర్ అభ్యర్థి భర్త దేవత కామేశ్వరరావు ఏర్పాటు చేసిన పార్టీ రంగులతో కూడిన బెలూన్లు, పార్టీ సింబల్  ఫ్యాన్లు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గడప గడప లో మహిళలను పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధి జరగాలంటే దేవత అరుణను గెలిపించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో 26 వ వార్డు అభ్యర్థి రుత్తల శ్రీనివాసరావు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు. అక్కడ ఎమ్మెల్యే కొద్దిసేపు కాంగో ప్లే చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ నుండి 26 వ వార్డులో లగుడు వారి వీధి, వెలంపేట, గచ్చపు వీధుల్లో ప్రచారం చేశారు.  వార్డులను అభివృద్ధి చేసే అవకాశం  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఉందని, 26 వార్డ్ లో రుత్తల శ్రీనివాసరావు ను గెలిపించండని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు.  మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు.  ఎన్నికల హామీలో భాగంగా మున్సిపాలిటీలో 25% ఆస్తిపన్ను తగ్గించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  మున్సిపాలిటీలో అందరి దృష్టి 25, 26 వార్డ్ లపైనే ఉందని,  రెండు వార్డులలో వైసిపి అభ్యర్థులను గెలిపించి ప్రత్యర్థుల నోళ్ళు మూయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చింతకాయల వరుణ్, దేవత కామేశ్వరరావు,  స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి కనకమహాలక్ష్మి, కర్రి శ్రీనివాసరావు, రాంగోపాల్ , మీసాల సత్యనారాయణ ధనిమిరెడ్డి నాగు, ఏకా రాజబాబు, ధనిమిరెడ్డి ప్రసాద్,  లాలం చినఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భాగ్యనగరానికి బాటలు వేసింది చంద్రబాబు

 భాగ్యనగరానికి బాటలు వేసింది చంద్రబాబు: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ

కూకట్ పల్లి,పెన్ పవర్


 కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని గ్రావిటీ హోటల్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్.ఎల్.సి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్.ఎల్.సీ అభ్యర్థి ఎల్.రమణ, పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు తెరాస పాలనలో అప్పుల పాలయ్యిందని అన్నారు. ఉద్యోగుల పిఆర్సీ పే రివిజన్ కమిషన్ కాకుండా పే రెడ్యుసింగ్ కమిషన్ లాగా కనిపిస్తుందని, కరోనా సందర్భంలో తెరాస ప్రభుత్వం‌ ప్రజలు‌ ఎదుర్కొన్న సమస్యల‌ పై స్పందించలేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలా నిర్ణయాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 2020 విజన్ వల్లే నేడు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో గుర్తింపు లభించినదని,  హైదరాబాద్ నగరం ఒకనాడు కేవలం చారిత్రక నగరం మాత్రమేనని, సైబరాబాద్ నిర్మించి ఐటి కంపనీలు ఏర్పరిచి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడని తెలిపారు.‌ తెలంగాణ రాష్ట్రంలో‌ సామాజిక న్యాయం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమవుతుందని, రానున్న కాలంలో తెదేపా పార్టీ అన్ని వర్గాల గొంతు అవుతుందని అన్నారు. గతంలో ఎమ్ఎల్సీగా ఉన్న రాంచందర్, నాగేశ్వర్ లు గెలిచిన తరువాత తిరిగి ఓటర్లను కలిసింది లేదని, తాను ఎమ్.ఎల్.సి గా కౌన్సిల్ లో అడుగుపెడతానని ధీమా వ్యక్తం‌ చేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నందమూరి. సుహాసిని, ఉప్పలపాటి పద్మ చౌదరి, షేక్ సత్తార్, ఇతర తెదేపా శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన టీడిపి వార్డు సభ్యులు

 బాధ్యతలు స్వీకరించిన  టీడిపి వార్డు  సభ్యులు



జగ్గంపేట,పెన్ పవర్

 తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు ఎనిమిది మంది గెలుపొందారు. దానిలో భాగంగా ఈ రోజు మంచి ముహూర్తం చూసుకునే బాధ్యత స్వీకరించి గ్రామ పంచాయతీ సెక్రెటరీ గణేష్ బాబు తో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఐదవ వార్డు కురుమళ్ల లక్ష్మి, ఆరు వార్డు దార్ల దుర్గాదేవి, 8వ వార్డు పీలా వెంకట్ లక్ష్మి, పదో వార్డు కేసు బోయిన విజయకుమారి, పదకొండవ 11వ వార్డు చెలికాని హరిగోపాల్, 12వ వార్డు కోండ్రూతు సూర్య కృష్ణ, 17 వ వార్డు కందరాడ చంద్ర రావు, 18 వ వార్డు కోడూరి సత్యనారాయణ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా మహేష్ మాట్లాడుతూ జగ్గంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల గెలుపొందిన ఎనిమిది మంది బాధ్యతలు స్వీకరించి పంచాయతీ సెక్రెటరీ గారిని కలవడం జరిగింది అన్నారు. ఎన్నికల వరకు గెలుపోటములు సహజమని గెలుపొందిన వారు అందరూ కలిసి ప్రతిపక్షం అధికార పక్షం కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కలిసి ఒకరికొకరు సహకరించుకోవాలి అన్నారు . ప్రతిపక్ష వార్డు సభ్యులు అందరూ ఆ వార్డులో వారికి సహకరించి  వారి వార్డులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అధికారపక్షం అని కోరారు .ఈ కార్యక్రమంలో పీలా మహేష్, కుదప వాసు, వైభోగుల కొండబాబు యాదవ్, కోండ్రుతు శ్రీను, మారిశెట్టి పుండరీకాక్షుడు, కేసు బోయిన నాగేశ్వరరావు( చిన్ని) తోట అబ్బు, దార్ల నానాజీ యాదవ్, సీతానగరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల మేలు కోరి చాదర్ ను అజ్మీర్ కు పంపిన టిఆర్ఎస్ నాయకులు..

 తెలంగాణ ప్రజల మేలు కోరి చాదర్ ను అజ్మీర్ కు పంపిన టిఆర్ఎస్ నాయకులు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్



తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ టిఆర్ఎస్ నాయకులు వారాల వినోద్..మాజీ కార్పోరేటర్ సురేష్ రెడ్డి తమ టిఆర్ఎస్ నాయకుడు వాలిభాయ్ రాజస్తాన్ లోని అజ్మీర్ కు కుటుంబ సమేతంగా వెల్తున్న సందర్బంగా.. ప్రత్యేకంగా చాదర్ ను పంపించారు..  రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ గ్రామంలో వెలసిన "ఖాజా గరీబ్ నవాజ్" సుమారు ఎనిమిది వందల యేండ్ల క్రితం మహ్మద్ వక్త సూచన మేరకు ఖాజా గరీబ్ నవాజ్.. సౌదీ అరేబియా మక్కానుండి, భారత దేశంలోని రాస్థాన్ అజ్మీర్ వచ్చి స్థిరపడ్డారు..అప్పట్లో అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి అజ్మీర్ గ్రాంమలో స్థిరపడ్డట్టుగా ముస్లీం అనుభవజ్ఞులు చెపుతున్న వివరాలు... ముస్లింలకు ఆచార కట్టుబాట్లు నేర్పిన "ఖాజా గరీబ్ నవాజ్" ముస్లీం కుటుంబంలో..ఏవిదంగా ఉండాలి అనే విషయా నేర్పించిన వ్యక్తి ఖాజా గరీబ్ నవాజ్ అని మంచిమార్గాన్ని చూపించిన వ్యక్తే ఖాజా గరీబ్ నవాజ్ దేవునిగా పవిత్రమైన స్థలంగా ముస్లీంలు కొలుస్తారని.. టిఆర్ఎస్ నాయకులు వారాల వినోద్, సురేష్ రెడ్డి తెలియ జేశారు.. అలాంటి పవిత్రమైన అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ 809వ ఉర్సు ఉత్సవాలను ఈమద్యనే జరుపుకున్నారని.. అంత పవిత్రమైన స్థలానికి తాము చేరుకోలేక పోయినా ఆపవిత్ర స్థలానికి వెళ్లే వారితో, తెలంగాణ ప్రజల యోగక్షేమాలకోసం అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ కు చాదర్ పంపించడం ఎంతో మనశ్శాంతిగా ఉందని వారాల వినోద్ తెలుపారు.. అజ్మీర్ కు వెళ్ళేవారిలో మహ్మద్ వాలీ, సమీర్, సల్మాన్, యూనస్, వాకిల్, ఆశు, షాబుద్దీన్, దస్తగిరి, గౌస్, యాకూబ్ ఖాజా గరీబ్ నవాజ్ ను దర్శించుకొనుటకు వెళ్లారు..

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...