Followers

జగన్మోహిని కేశవ స్వామి గోపాల స్వామి ల శ్రావణమాస కళ్యాణ మహోత్సవం

 జగన్మోహిని కేశవ స్వామి  గోపాల స్వామి ల  శ్రావణమాస  కళ్యాణ మహోత్సవం

పెన్ పవర్,ఆత్రేయపురం

 ర్యాలీ  గ్రామంలో వెలిసిన శ్రీ జగన్మోహినీ కేశవస్వామి గోపాలస్వామి ల శ్రావణ నక్షత్రం మాస  కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగినది తదుపరి మాస కళ్యాణం 6.4.2021లో జరుగును.శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయముకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఈ ఆలయమునకు ఒక విశిష్టత ఉంది ముందు కేశవ స్వామి దర్శనం ఇవగా  వెనక  మోహినీ అవతారంతో దర్శనమిస్తారు స్వామి వారి  రెండు పాదాలు మధ్య గంగా విగ్రహం నుండి నిత్యం నీరు వస్తుంది అటువంటి విశిష్ట కలిగిన కేశవ  స్వామి కు గోపాల స్వామి కు  శ్రావణ నక్షత్రం మాసం లో   అత్యంత వైభవంగా జరిగే  కళ్యాణ మహోత్సవం లో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ కళ్యాణ మహోత్సవం లో పాలు పంచుకోలేని భక్తులు దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఆలయ ఈవో కృష్ణ చైతన్య ను 08855-250477,250231 సంప్రదించండి భక్తులకు పోస్టు ద్వారా ప్రసాదాలు స్వీకరించి పడుతుందని తెలియజేయడమైనది.

సావిత్రి భాయి ఫూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ పుస్తక ఆవిష్కరణ

 సావిత్రి భాయి ఫూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ పుస్తక ఆవిష్కరణ

పెన్ పవర్, రావులపాలెం

ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం రావులపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. సామాజిక కార్యకర్త హాఫిజ్ షేక్ అజహర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి 127వ  వర్ధంతి సందర్భంగా గొలుగూరి మునిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇరువురి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపసర్పంచ్ మునిరెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం  మహాత్మ జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే లతో కలసి 170 సంవత్సర క్రితం  భేటి పడావ్  ఉద్యమానికి నాంది పలికిన ఫాతిమా షేక్ మీద  భారతదేశంలో  వెలువడిన మొట్టమొదటి  గ్రంథమని అన్నారు.మహాత్మ జోతిరావు ఫూలే  సావిత్రి బాయి ఫూలే లను ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే తన ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు ఫూలే దంపతులకు తమ ఇంట ఫాతిమా షేక్, ఆమె అన్న ఉస్మాన్ షేక్ ఆశ్రయం కల్పించారని తెలిపారు. మరో ముఖ్య అతిథి మాజీ మండల ప్రతిపక్ష నేత కుడిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫాతిమా షేక్  మరాఠి భాష నేర్చుకుని సావిత్రి బాయితో కలసి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది పూలే ప్రారంభించిన పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉచిత సేవలు అందించారని ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో వరగోగుల వెంకటేశ్వరరావు,యార్లగడ్డ జగజ్జీవన్ రావు,ఎం.పి.జే జిల్లా అధ్యక్షులు షేక్ వలియా, రబ్బానీ ఖాన్, అహ్మద్ బాషా, ముహమ్మద్ యాశీన్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు కాకమ్మ కథలు మానుకోవాలి

అధికారులు కాకమ్మ కథలు మానుకోవాలి 

 గూడెం కోత్తవీధి,పెన్ పవర్ 

రెవెన్యూ అధికారులు,గిరిజనేతరలు కుమ్మక్కై అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ అధికారులు పై చర్యలు తీసుకోవాలని, అధికారులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్న అధికారులు మానేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు అన్నారు,గత రెండేళ్లుగా ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం నడుపుతూ ఆదివాసీ చట్టాలు, హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని, వాటిని సక్రమంగా అమలు చేయాలని ఆదివాసీ జెఏసి నాయకులు పాడేరు డివిజన్ అధికారికి, మండల రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు, ఇచ్చినప్పటికీ స్పంందించక‌‌‌ గిరిజనేతరలకు సపోర్ట్ చేస్తుందా అని, ఎన్నోసార్లు వినతిపత్రాలు, విజ్ఞప్తిలు చేస్తూ ఆదివాసీ గిరిజనుల ఆవేదనలు, వేదనలు, వాదనలు వినిపిస్తున్నా జిల్లా అధికారులు గానీ, పాడేరు డివిజన్ అధికారులు గానీ, మండల రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు,ఈ మధ్య ముడు రోజుల క్రితం ఒక్కసారిగా పాడేరు ఐటీడీఏ పీవో గిరిజనుల హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని అనడం ఆశ్చర్యానికి గురి చేసిన, ఆయన మీద ఆదివాసీలకు కొంత నమ్మకం ఉందని, గతంలో ఆయన సబ్ కలెక్టర్ గా చింతపల్లిలో మాట్లాడిన మాటలకు చాలా మంది ఆదివాసీలు తమ హక్కులను చట్టాలను కాపాడుకోవాలని ముందుకు వచ్చారని, కానీ అధికారులు నుండి మాత్రం కొంచెమైనా సహాకారం లేదని ఆదివాసీల భూములు ఆక్రమణకు గురైతే పట్టించుకోవడమే కాదు,తమ శాఖకు కేటాయించిన భూముల ఆక్రమణ జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఐదవ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నారని ఇదే అధికారులు నాన్ షెడ్యూల్ ప్రాంతానికి వెళితే అక్కడ సక్రమంగా పని చేస్తున్నారని మైదాన ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలే కాదు, చిన్న చిన్న ప్రహారీ గోడలు కూడా కూల్చే అధికారులు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని మాత్రం చట్టాన్ని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నారో తెలియడం లేదన్నారు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరలకు రాజకీయ నాయకులు అండదండలతో ఒత్తిళ్లు కూడా పెద్దగా ఉండనప్పటికీ జిల్లా అధికారులు, పాడేరు డివిజన్ అధికారులు, మండల అధికారులు సక్రమంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు సబ్ కలెక్టర్ అధికారులు ఆదివాసీ చట్టాలను, హక్కులను సక్రమంగా అమలు చేయాడానికి ప్రయత్నం చేస్తారని ఆదివాసీ తరపున ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు, అక్రమ భావనల పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు డిమాండ్ చేశారు.

కోదండ రామునికి లక్ష తులసి పూజ

 కోదండ రామునికి లక్ష తులసి పూజ   

 పెన్ పవర్,కందుకూరు

 పట్టణంలోని  పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా కోదండ రామునికి మంగళవారం ఆలయ అర్చకస్వాములు  రాజా స్వామి, పవన్ స్వాములు లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామ నామం జపిస్తూ స్వామివారికి తులసీ దళాలను అందజేశారు. మరి కొంత మంది మహిళా భక్తులు విష్ణు సహస్రనామం జరిపించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ లక్ష తులసి పూజ భక్తులకు కనువిందు చేసింది. పూజ అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది.సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఐ సి డబ్ల్యు డి సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చేయూత

 ఐ  సి డబ్ల్యు డి సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చేయూత

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం లోని నాగంబొట్లపాలెం గ్రామంలో క్రాస్ సంస్థ మరియ ఐ  సి డబ్ల్యు డి ఎస్ సంస్థ సారధ్యంలో గ్రామీణ వికాస్ బజార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్య మాట్లాడుతూ గ్రామీణ మహిళల అభివృద్ధి కొరకు గ్రామీణ వికాస్ బజార్లు ఎర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళలకు పది మంది గ్రూప్ కలిపి పది వేల రూపాయల చొప్పున వంద మందికి సూక్ష్మ రుణాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిని నిత్యావసర సరుకుల రూపంలో ఇచ్చి వాయిదా పద్ధతిలో వడ్డీ లేకుండా చెల్లించాలని గ్రూపు సభ్యులకు తెలిపారు. గ్రామంలోని మహిళలు లోను పొందడం ద్వారా ఉపాధి అవకాశాలు  మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు అభివృద్ధి కోసం క్రాస్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్యం సర్పంచ్ చిమాట  సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు సోము అనిల్ రెడ్డి,కె.నరసింహా రెడ్డి,కల్పనా ,గోపి కృష్ణ ,మోపురి విజయలక్ష్మి ,కె.వాణి, తదితరులు పాల్గొన్నారు.

రెండు జిల్లాల వారధి ప్రమాదాలకు దారి

 రెండు జిల్లాల వారధి ప్రమాదాలకు దారి

కరీంనగర్,పెన్ పవర్

పెద్దపల్లి-కరీంనగర్ జిల్లాలను కలుపుతూ సుల్తానాబాద్  మండలానికి సమీపం నీరుకుల శివారు హుస్సేన్ మియా వాగుపై ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ రెండువైపులా ప్రమాదాలకు అవకాశాలు ఏర్పడ్డాయి.రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వాహనాలు ఒక్కసారిగా కిందకు జారే పరిస్థితులు ఉన్నాయి. బ్రిడ్జి పైకి ఎక్కాలన్నా దిగాలన్నాభయపడాల్సిన పరిస్థితులున్నాయి.పాలకులు, అధికారులు దీనిపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.


కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకి కనుక

 కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకి కనుక 

గొల్లపల్లి,పెన్ పవర్

  గొల్లపల్లి మండలంలో  పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా  3కోట్ల 20లక్షలతో సిసి రోడ్లు, వైకుంఠదామం, చెక్ డ్యాం, పనులకు మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేశారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి మంజూరు అయిన 10లక్షల 16వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 5,94,500విలువ గల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను 19మందికి అందజేశారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ  శ్రీనివాస్ డి ఈ సౌమ్య ఏయ్ ఆదిత్య ఎంపీడీవో జనార్ధన్ తాసిల్దార్ నవీన్ ఎంపీపీ నక్క శంకరయ్య  జడ్పీపిటిసి గోస్కుల జెలెందర్ పిఏసిఎస్ చైర్మన్ సుమన్ రావు తెరాస పార్టీ  అధ్యక్షుడు రమేష్  మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్ మండల అర్జనేజర్ సెక్రటరీ పడల జెలెందర్ జనుప వెంకటేష్   వినోద్ నవీన్  ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు  పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...