Followers

గ్రామ పంచాయతీ లే-అవుట్ లను రిజిస్ట్రేషన్లు చేయండి ఎమ్మెల్యేకు వినతి

 గ్రామ పంచాయతీ లే-అవుట్ లను రిజిస్ట్రేషన్లు చేయండి ఎమ్మెల్యేకు వినతి

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామపంచాయతి లేఅవుట్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కే.పీ.వివేకానందకు వినతి.. నియోజకవర్గానికి చెందిన ఎస్.ఎల్.ఎన్ వెంచర్స్, అక్షర వెంచర్స్, వైష్ణవి వెంచర్స్, ఎస్ఆర్ వెంచర్స్, ఎకేఆర్ ప్రాజెక్ట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకూ కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆగస్టు నుండి ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ లు నిలిపివేయడంతో ఆర్థికంగా బాధపడుతున్నామని, గ్రామ పంచాయతీ లే-అవుట్ లకు రిజిస్ట్రేషన్ లు నిలపడంతో ఏమి తోచని స్థితిలో జీవనం కొనసాగిస్తున్నామని, ఈ సమస్యకు పరిష్కారంగా రిజిస్ట్రేషన్ లు తిరిగి ప్రారంభించేలా తమరు చొరవ చూపాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం చూపి తిరిగి రిజిస్ట్రేషన్ లు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాకేష్ జాలిగం, ఆనంద్, సతీష్, జాకీర్ హుస్సేన్, సాయి, సుభాష్ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

 బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకుల డిమాండ్

 ఆదిలాబాద్,పెన్ పవర్ 

ఏదైతే గతంలో ఉన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి నీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసినటువంటి అనుచితమైన వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ అదిలాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.  జిల్లా కేంద్రంలో గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక మాదిగ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేక మైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అదేవిధంగా నాణ్యత  ఆహారాన్ని అందిస్తూ రానున్న దశలో  కులాల్లోని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఉద్దేశంతోనే ముందుకు నడుపుతున్న ఇటువంటి ప్రవీణ్ కుమార్ పై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని లేని ఎడల బిజెపి నాయకులను ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో నిరసన కార్యక్రమాలను అడ్డుకొని తిరిగి తనే ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హెచ్చరిస్తోంది అదేవిధంగా ఉన్నత స్థాయిలో దళితులు ఉంటే ఇటువంటి బిజెపి పుట్టుక లక్షణాలను బయట పెట్టాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇప్పుడిప్పుడే దళితులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతుంటే ఓర్వలేక అగ్రవర్ణాల చేతి చేతులు కీలుబొమ్మగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నాం  గ్రామ గ్రామాన ఈ బిజెపి నాయకులు దళితులపై చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు ఎండగడుతూ బిజెపి నాయకులను గ్రామాల్లో దళిత వాడలో తిరిగి రాకుండా దళితులు అడ్డుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ బిజెపి నాయకులకు ఎక్కడ కూడా దళితుల పట్ల అనుచితమైన వాక్యాలు చేసినట్లయితే ఎమ్మార్పీఎస్ తీవ్ర పోరాట రూపాలు చేస్తుందని దానికి బాధ్యత బిజెపి వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాదిగ జిల్లా అధ్యక్షులు గజ్జల కాంతం మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి అశోక్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగొండ గంగాధర్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు మాదిగ అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మల్యాల కరుణాకర్ మాదిగ  ఆశన్న ,ఉషన్న, జాదవ్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ఖురాన్ అల్లా యొక్క గ్రంథం దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి లేదు

ఖురాన్ అల్లా యొక్క గ్రంథం దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి  లేదు

గొల్లపల్లి  (పెన్ పవర్)

 విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన మతిభ్రమించిన ఒక మంత్రి వసీం రీజ్వీ “సత్య గ్రంథమైన ఖురాన్” లోని 26 ఆయతులను తొలగించాలని సుప్రీంకోర్టులో ఫైల్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖురాన్ సర్వ మానవాళి సన్మార్గం కోసం అల్లాహ్ పంపించిన ఆకాశ గ్రంథమని. అది మానవ రచన  ఎంతమాత్రం కాదని అందులో ఒక సూరా (అధ్యాయం)కాని , ఒక ఆయతే కానీ ఒక పదమే కానీ ఒక అక్షరమే కానీ ఒక పొల్లు కానీ మానవ కల్పితం కానే కాదని చెప్పారు. అందులోని ఒక చిన్న అక్షరాన్నైనా తొలగించే శక్తి  మానవమాత్రులకు లేదని, దీన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ యే తీసుకున్నాడని తెలియజేశారు.వారు మాట్లాడుతూ వసీం రిజ్వి ఏ ఆయతులు అయితే తొలగించమని అంటున్నాడొ అవి తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయని బూటకపు ప్రచారం చేస్తున్నాడనీ అన్నారు. వాస్తవానికి ప్రతి దేశం యొక్క రక్షణకు డిఫెన్స్ సిస్టమ్, ఆదేశాలు ఎలా ఉంటాయో ఖుర్ఆన్ లోని జిహాద్ కు సంబంధించిన ఆయతులు అలాంటివేనని స్పష్టం చేశారు. ఖురాన్ అల్లా యొక్క గ్రంథమని దాన్ని ప్రళయం వరకు మార్చే శక్తి ఎవరికి కూడా లేదని దాని యొక్క బోధనలు సర్వమానవాళి శాంతి కోసమే ఉన్నాయని అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రపంచంలోని ఏ కోర్టులకు, ప్రభుత్వాలకు కూడా లేదని తెలియజేశారు. గౌరవ కార్యదర్శి  మాట్లాడుతూ వసీం రిజ్వీ యొక్క రెచ్చగొట్టే మాటలకు కు రెచ్చిపోయి ముస్లిం సమాజం మరియు ప్రజలంతా కూడా శాంతి సహనాలు కోల్పోకూడదని, అందరూ ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.ఇంకా వసీం రిజ్వీ పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని అతనిని కఠినంగా శిక్షించాలని ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉండే సోదరుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని గౌరవనీయులు సుఫ్యాన్  కోరారు.ఈ సమావేశంలో  హఫీజ్ రఫిఖ్ అధ్యక్షులు తిరుమలాపూర్  సయ్యద్ అబ్దుల్లా జామిఈ ప్రధాన కార్యదర్శి మదర్సా సౌతుల్ ఖురాన్ యశ్వంతరావు పేట, టీఆర్ఎస్ అధ్యక్షులు అబ్దుల్ రహీం బుగ్గారం మండల మైనార్టీ ప్రెసిడెంట్ షబ్బీర్  తదితరులు పాల్గొన్నారు.

పని భారాన్ని తగ్గించాలని వినతి

 పని భారాన్ని తగ్గించాలని వినతి

గొల్లపల్లి, పెన్ పవర్

గ్రామ పంచాయతీ కార్యదర్శుల పైన ఉన్నటువంటి ఉపాధి హామీ పని భారాన్ని తగ్గించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని మరియు ప్రో బిషన్ కాలాన్ని రెండు సంవత్సరాలు తగ్గించి రెగ్యులర్ చేయాలని  గొల్లపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో జనార్ధన్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది సంగారెడ్డి జిల్లా లో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథంకు నివాళులు అర్పించి పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపిడిఓ జనార్ధన్ ఎం పీ ఓ వెంకటేశ్వర్ రెడ్డి సూపరిండెంట్ రవీందర్రావు పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ అధికారులు పాల్గొనడం జరిగింది

ఆడారి కుమార్తె ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన మండల వైయస్ఆర్ సీపీ అగ్ర నాయకులు

 ఆడారి కుమార్తె ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన మండల వైయస్ఆర్ సీపీ అగ్ర నాయకులు

విశాఖపట్నం, పెన్ పవర్

విశాఖ డైరీ ఉత్తరాంధ్ర డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో రోలుగుంట,రావికమతం,బుచ్చయ్యపేట, మండలాలకు సంబంధించిన పాల సొసైటీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు,ఆడారి తులసీరావు కుమార్తె రమా కుమారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. ఆయన రాజాం పాల సొసైటీ ఆవరణలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆడారి తులసీరావు మరియు ఆనంద్ బాబు మరియు నాయకులు కరణం ధర్మశ్రీ  ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని ఎల్లవేళలా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.పెద్ద మనసుతో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆడారి కుటుంబానికి గుర్తింపు తీసుకురావడం వల్ల ఒక మంచి రాజకీయ వాతావరణంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రమాదేవి పేరు ప్రకటించడం వల్ల మేమందరం ఎమ్మెల్యే  ఆశీస్సులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ మరిశా నాని, సర్పంచులు పడాల నాగభూషణం, ముచ్చర్ల శ్రీను, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కర్రీ నాయుడు బాబు, స్థానిక పాల సంఘం అధ్యక్షులు యన్నంశెట్టిశెట్టి అప్పారావు, మాజీ సర్పంచ్లు, పాల సంఘం అధ్యక్షులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా....ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి

 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా....ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి


విశాఖపట్నం సిటీ, పెన్ పవర్

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా  (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు.రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు.న్యాయవ్యవస్థలో అపార అనుభవం.. జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.గోల్డ్ మెడలిస్ట్.. 2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1996-96 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు.

మాలసింగారం లో మంచినీటి కష్టాలు తీర్చండి మహాప్రభో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్

 మాలసింగారం లో మంచినీటి కష్టాలు తీర్చండి మహాప్రభో  యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్

అరకు, పెన్ పవర్

ఆంధ్ర ఊటీ గా చెప్పుకుంటున్న అరకులోయ  పరిధిలో గల చినలబుడు గ్రామపంచాయతీకి చెందిన సుమారు150 గడపలు 700కి పైగా జనాభా గల మాలసింగారం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని గురువారం, అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్ పాలకులపై మండిపడ్డారు, ఆయన ఆధ్వర్యంలో కాలిబిందెలు పట్టుకొని గ్రామస్తులు రోడ్ షో ద్వారా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి సమస్య అధికంగా ఉందన్నారు, వర్షాకాలంలో మంచినీళ్లు దొరక్క గ్రామస్తులు చాలా అవస్థలు పడుతున్నారని కలుషిత మురుగు నీళ్లు తాగడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు చాలా రకాలైన జబ్బులు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని. మంచి నీటి సమస్య పై ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన పెడచెవిన పెడుతు న్నారని మండిపడ్డారు.ఇప్పటికైన పాలకులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరువలో ఉన్న చంప గడ్డ ఊట నీళ్లను శుద్ధిచేసి  కోళాయిల ద్వారా గ్రామంలో శుభ్రమైన మంచినీళ్లు అందించి మాలసింగారం లో ఉన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మొస్య దేవదాసు, కిల్లో దుతి, బిసోయి సుశీల, కీల్లో లక్ష్మి, సుంకరి బృందా, గ్రామ పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...