Followers

పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన మహుబూబాబాద్ డి పి ఓ.

 పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన  మహుబూబాబాద్ డి పి ఓ.


నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి, మొదనతూర్తి,రాత్తిరాంతండా, చిన్ననాగారం గ్రామాలలోని పల్లె ప్రకృతివనాలను, స్మశానవాటికల ను మహుబూబాద్ జిల్లా డి పి ఓ రఘవరణ్  ఎం పి ఓ పార్టసారధితో కలిసి  పర్యటించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతు గ్రామాలలో నిర్మిస్తున్న స్మశానవాటికలను త్వరగా పూర్తిచేయాలని మరియు గ్రామంలోని ప్రతివాడనుచెత్త లేకుండా పరిశుభ్రతతో ఉంచాలని అన్నారు. అంతేగాక ఇంటిపన్ను నల్లా పన్నులనుఈనెల చివరి వరకు వందశాతం వసూలు చేయాలనీ తెలిపారు. శ్రీరామగిరిలోనిర్మిస్తున్న హెల్త్ సెంటర్ నాణ్యతలోపం ఉన్నదని గ్రామస్టులు ఆయనకు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు వార్డుమెంబర్లు పాల్గొన్నారు.

పెన్ పవర్ కథనంపై స్పందన

 పెన్ పవర్ కథనంపై స్పందన

డ్రైనేజి సమస్యలను పరిష్కరించిన కార్పొరేటర్ ప్రేమ కుమార్



పన్ పవర్,  మల్కాజిగిరి

 ఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ సమస్యలపై పెన్ పవర్ లో కథనం రవడంతో స్దానిక కార్పోరేటర్ ప్రేమ్ కుమార్ స్పందించారు. ప్రేమ్ విజయ్ నగర్ కాలనీ, బి జె ఆర్ నగర్  డ్రైనేజి సమస్యలతో దుర్పాసనతో రవడంతో వెంటనే  జి.హెచ్.ఎం.సి అధికారులకు పీర్యాదు చేసి డ్రైనేజి సమస్యలను పరిష్కారించిన కార్పొరేటర్ ప్రేమ కుమార్. రోడ్డు పై ఉన్నా వ్యర్ధాలను పరిశుద్ద కర్మికులతో పరిశుభ్రంగా చేయించారు. ప్రజా సమస్యలపై కాలనీలో పర్యటించి, స్దానికంగా నెల్లకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, మౌళిక సాదుపాయలతో పాటు స్ట్రీట్ లైట్ కూడ పరిష్కారించి కృషి చేస్తామని స్దానికులకు తెలిపారు. గత ఐదు రోజులుగా డ్రైనేజి దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నా విషయం పై స్పందించి వెంటనే సమస్య పరిష్కరం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై అయా పత్రికలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు వారధిగా నిలిచారని స్దానికులు ఆభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

 ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...

ఆదిలాబాద్,  పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో మండల, జిల్లా పరిషత్ లకు అధిక నిధులు కేటాయించడం పట్ల ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ మాట్లాడుతూ.రాష్ట్రంలో తొలిసారిగా బడ్జెట్లో మండల, జిల్లా పరిషత్ లకు రూ. 500 కోట్లు కేటాయించడం హర్షణీయంన్నారు. బడ్జెట్ లో స్థానిక సంస్థలకు పెద్దపీట వేసిన ముఖ్య మంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పిటిసి ఫోరం అధ్యక్షుడు తాటిపల్లి రాజు, జెడ్పిటిసి లు  భాస్కర్, అక్షిత పవర్, వనిత రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎబివిపి

 ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎబివిపి



 
కూకట్ పల్లి, పెన్ పవర్

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో  జరుగుతున్న అవినీతి అక్రమాలపైన, స్వేరోలు చేస్తున్న దాష్టీకంపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం స్వెరో సంస్థ ఫౌండర్, ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందుస్థానీ మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్టుల పేర నిధులు దండుకుంటున్న స్వేరోల అక్రమాలను అరికట్టాలని, గురుకులాల్లో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలపై విచారణ జరిపి దుండగులను శిక్షించాలని, వీటన్నిటిని విశ్రాంత నాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తూ  విద్యార్థుల మెదళ్లలో విషబీజాలను నాటుతున్న గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనీల్, మురళీ, కార్యకర్తలు గోపాల్, జమీల్ నిఖిల్, రాకేష్, సుధీర్, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

 శ్రీ శ్రీ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు....

పెన్ పవర్, మేడ్చల్

 శ్రీ శ్రీ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం  బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఫాల్గుణ శుద్ధ పంచమి గురువారం నాడు  అంకురార్పణ మరియు సాయంత్రం 8 గంటలకు నందీశ్వర సేవ జరుగును. ఈ రోజు పూజా కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త  కాశీనాథ్ వీర రాజేందర్, వీరేందర్ మరియు ఉత్సవ కమిటీ అధ్యక్షులు  మర్రి దీపిక నరసింహారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు దాక్షాయిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయం కమిటీ సభ్యులు విష్ణుచారి, సంజీవ, లక్ష్మణ్, హరికృష్ణ మరియు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.

నిర్బంధ తనిఖీలు నిర్వహించిన కూకట్ పల్లి పోలీసులు

 నిర్బంధ తనిఖీలు నిర్వహించిన కూకట్ పల్లి పోలీసులు



కూకట్ పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో బుధవారం రాత్రి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ లోని పది పోలీస్  స్టేషన్స్ కి సంబంధించిన నూటయాబై ఆరు మంది పోలీసు సిబ్బంది పది బృందాలుగా ఏర్పడి నిర్బంధ తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి వ్యక్తి యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా సంవత్సరం తరువాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, రాజీవ్ గాంధీ నగర్ క్రైమ్ ఏరియా కావడం వల్ల తనిఖీలు నిర్వహించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలనీలో నివసించే ఫిరోజ్ అనే రౌడీ షీటర్ ను జనవరిలో లో హత్య చేయడం జరిగిందని, రౌడీ ఆక్టీవీటి ఎక్కువగా ఉండడంతో కాలనీ లోని 292 ఇండ్లను జల్లడపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ చాలన్ ఉన్న డెభై తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఐదు కార్లు, ఒక టెంపో ట్రావెలర్ వాహనాన్ని స్వాధీనం చేసికొని సీజ్ చేశారు. అలాగే ఎవరైనా వ్యక్తులు గతంలో ఏదైనా నేరాలలో నిందితులుగా ఉన్నారా అని సిడాట్ టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఇరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్డాన్ సెర్చ్ ద్వారా ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడమే తమ ముఖ్య ఉద్దేశ్యం అని, నేరస్తులను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు వాడుతున్న టెక్నాలజీ ద్వారా నేరస్తులలో భయం పెరిగి, నేరాలు తగ్గుముఖం పడతాయని డిసిపి వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్డన్ సెర్చ్ నిర్వహించడానికి ముఖ్య ఉదేశ్యం అవాంచనీయ కార్యకలాపాలు జరగకుండా ముందుగానే అరికట్టేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి ఏసిపి సురేందర్ రావు, సిఐ నర్సింగ్ రావు, ఎస్.ఐలు శంకర్, భానుప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వాటర్ ప్లాంట్ కు భూమి పూజ

వాటర్ ప్లాంట్ కు భూమి పూజ

చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలో గంగాభవాని డాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ బాధ్యులు మాట్లాడుతూ మండల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. చిన్నగూడూరు వాసులకు అతి తక్కువ ధరకే మినరల్ వాటర్ అందించేందుకు ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కరె దారా సింగ్, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, కుసుమ వెంకన్న, తదితరులుు పాల్గొన్నారు.


 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...