Followers

డిప్యూటీ మేయర్ సతీష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం...

డిప్యూటీ మేయర్ సతీష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం...

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఇటీవల జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 46 వార్డు నుండి కార్పొరేటర్ గా ఎన్నికైన కటుమూరి సతీష్ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక నేపథ్యంలో బుధవారం బాలయ్య శాస్త్రి లేఔట్ లో గల సింధూర గెస్ట్ హౌస్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె కె రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ  మన  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని. అలాగే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందాలని సంకల్పంతో విశాఖపట్నంను పరిపాలన రాజధాని గా ప్రకటించి మరింత అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు.

 ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలు ఫలితంగానే గడిచిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డుల్లో విజయంసాధించి మేయర్ పీఠం కైవసం చేసుకున్నామని అన్నారు.అలాగే మన నియోజకవర్గం నుంచి డిప్యూటీ మేయర్ గా కటుమూరి సతీష్ ఎన్నిక  కావడం మనకు ఎంతో సంతషకరమైన విషయమని అన్నారు. విశాఖ నగర అభివృద్ధిలో శక్తివంచన లేకుండా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ పరిధిలోగల కార్పొరేటర్లు తో పాటు ఉత్తర నియోజకవర్గ మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చెన్న జానకిరామ్ ను ఘనంగా సన్మానించిన రాష్ట్ర రెల్లికుల నాయకులు

చెన్న జానకిరామ్ ను ఘనంగా సన్మానించిన రాష్ట్ర రెల్లికుల నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

ఇటీవల జీవీఎంసీ ఎన్నికలలో 37 వ వార్డు కార్పొరేటర్ గా వైయస్సార్ సిపి పార్టీ తరఫున విజయం సాధించి జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, స్టాండింగ్ కమిటీ మెంబర్ గా, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా పదవులు పొందిన చెన్నా జానకిరామ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నా వెంకటరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చెన్న గౌరీశంకర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఏవిఎన్ కాలేజ్ దరి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్న వెంకటరావు, డాక్టర్.చెన్న గౌరీ శంకర్ లు మాట్లాడుతూ దళితుల్లోని అట్టడుగు స్థాయిలో ఉన్న రెల్లి కులస్తులకు రాజకీయంగా ఉన్నత స్థితిని కల్పిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డీ కు సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితర వైసిపి నాయకులు అందరూ తమ రెల్లి కులస్తుల అభివృద్ధికి, ఉన్నతికి  ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వెంకట్రావు, డాక్టర్.చెన్న గౌరీశంకర్ లు కొనియాడారు. కార్పొరేటర్ చెన్న జానకిరామ్ మాట్లాడుతూ తమ రెల్లి కులస్తులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుంది సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో చొక్కాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఎల్లప్పుడూ వైఎస్ఆర్సిపి బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఘనంగా కైలాసనాధస్వామి దేవాలయ 38వ వార్షికోత్సవం

 ఘనంగా కైలాసనాధస్వామి దేవాలయ 38వ వార్షికోత్సవం

గుమ్మలక్ష్మీ పురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల కైలాసనాధ స్వామివారి దేవాలయ వార్షికోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.దేవాలయాన్ని ప్రతిష్టించి 38వసంతాలు పూర్తయిన సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ.గౌరీశంకర్ అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు,దోస్త్ మేరా దోస్త్ సభ్యులు  గుడిలో ప్రత్యేక పూజలను ఏర్పాటు చేసారు. పూజల అనంతరం ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో  ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ గౌరవ  అధ్యక్షులు మండంగి ప్రసాదరావు, కొత్తకోట.విష్ణు,ఉపాధ్యక్షుడు పైడా. నాగేశ్వరరావు,గ్రామ ఉపసర్పంచ్ కొత్తకోట కిషోర్, వైసీపీ పార్టీ నాయకులు నిమ్మక.శేఖర్, ఎద్దు. మురళీ తో పాటుగా కమిటీ సభ్యులు (మహా శివుని నిరంతర సేవకులు),గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తి దృశ్య యాత్ర కార్యక్రమాలు రద్దు:

కైలాసనాధ వార్షికోత్సవంలో గత పదేళ్లుగా పెద్దఎత్తున యాత్రకార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాత్రకు మండలంలోని ప్రజలే కాకుండా ఇతర మండలాల నుండి,ఒరిస్సా ప్రాంతం నుండి వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో యాత్రను నిర్వహించడం ప్రమాదకరమని యాత్ర కార్యక్రమాలను నిలిపివేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి కరోనా వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ,గౌరీశంకర్ తెలిపారు.

బాలికలను చదివిద్దాం, రక్షిద్దాం బాల్య వివాహలను అరికడదాం

 బాలికలను చదివిద్దాం, రక్షిద్దాం  బాల్య వివాహలను అరికడదాం...

 ఐసిడిఎస్ సూపర్ వైజర్ నైతం లక్ష్మి 


 నార్నూర్,  పెన్ పవర్ 

 బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసిడిఎస్ సూపర్ వైజర్ నైతం లక్ష్మి, జాదవ్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా గాడిగూడా మండలంలోని లోకారి( కే ) లో అంగన్వాడీ ఆధ్వర్యంలో బాలికలను చదువు పై అవగాహనా కలిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకుంటేనే మహిళా సమాజం  అభివృద్ధి చెందుతుందన్నారు. బాలికలను చదివించి బాల్య వివాహాలని అరికట్టవచ్చు అని అన్నారు. బాలికల విద్య విధానం భవిష్యత్తు కార్యాచరణ పై అవగాహనా కలిపించారు. బాలికల రక్షణ కోసం 100,181,1098 ను సంప్రదించాలని అన్నారు. అనంతరం కిషర బాలికలకు కరదీపికా పుస్తకాలు పంపిణి చేశారు. కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ జాదవ్ సుభద్ర, సందురా బాయి, మడవి విజయ్ లక్ష్మి, రత్నమలా, సునీత, లక్ష్మి, ఏ ఎన్ ఎమ్ రత్నమాలా సిస్టర్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

 రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ...

బోథ్, పెన్ పవర్

 బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  బుధవారం రోజున ఇండియన్ రెడ్ క్రాస్ ఆద్వర్యంలో వైద్య సిబ్బందికి మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ రావుల శంకర్ మాట్లాడుతూ మలివిడత కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో ఆహర్నిశలు కృషిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలను కొనియాడారు.ప్రతి ఒక్కరు కోవిషీల్డ్ టీకాను తీసుకోవాలన్నారు. కరోనా విజృంభించి ప్రభుత్వం లాక్ డౌన్ విదించకుండా ఉంఢాలంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ వాడాలని  సూచించారు. ప్రజలందరు అప్రమత్తమై కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గంగేశ్వర్, రాష్ట్ర యం.సి. మెంబర్ విజయ్ బాబు ,ఉప్పాల కిషన్ రావ్,డాక్టర్ రవీంద్రప్రసాద్,  డాక్టర్ చైతన్య ,  శ్రీనివాస్ రెడ్డి, మేరుగు బోజన్న , శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ని కలిసిన మహిళ కమిషన్ సభ్యురాలు

 రాష్ట్ర  మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కమిషనర్

 దివ్య దేవరాజన్ ని కలిసిన మహిళ కమిషన్ సభ్యురాలు...

ఆదిలాబాద్, పెన్ పవర్

 రాష్ట్ర  మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ  కమిషనర్ దివ్య దేవరాజన్ ను బుధవారం  హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు అంగన్ వాడి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల్లో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు పక్క భవనాలకు సంబంధించి, ఆదివాసీ మహిళలు సరైన పోషకాహారం లభించక రక్త హీనతతో బాధపడుతున్నటువంటి తదితర సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దినికై కమిషనర్ దివ్య దేవరాజన్ సానుకూలంగా స్పందించినట్లు ఈశ్వరీ

కాళేశ్వరం జలాలతో వేంకటాద్రి చెరువును నింపాలి

 కాళేశ్వరం  జలాలతో వేంకటాద్రి చెరువును  నింపాలి

గంభీరావుపేట,  పెన్ పవర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట  మండల కేంద్రం లో   బుధవారం వేంకటాద్రి  చెరువు ను ఎగువ  మానేరు వస్తున్నా కాళేశ్వరం  గోదావరి  జలాలతో   నింపాలని  కోరారు  వేంకటాద్రి చెరువు ఆయకట్టు రైతులు గంభీరావు పేట  మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో  సర్పంచ్  కటకం శ్రీధర్ ను  కలసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు అప్పటి కప్పుడు  చిన్న నీటి పారుదల శాఖ  డిప్యుటీ  ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి వెంటనే వేంకటాద్రి చెరువు కు నీటిని ఎక్కువ మోతాదు విడచి పెట్టి చెరువు నింపాలని  డిప్యుటీ ఇంజనీర్ ను కోరడమైనది.  అయకట్టు రైతులు  వేంకటాద్రి చెరువు  ద్వారా  వస్తున్న నీరు అందక తమ పంట పొలాలు పొట్ట చేతికి  వచ్చే దశలోనే  పొలాలు ఎండి పోతున్నాయని ఆయకట్టు రైతులు  ఆవేదన  వ్యక్తం  చేశారు. కార్యక్రమం లో  మేజర్ గ్రామ సర్పంచ్  కటకం శ్రీధర్, రైతులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...