Followers

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన -చైర్మన్ సంకిస భవాని ప్రియ

 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన -చైర్మన్ సంకిస భవాని ప్రియ

తిరుపతి టౌన్, పెన్ పవర్

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైస్సార్సీపీ పార్టీ తరపున  ప్రచారం లో భాగంగా ఈ రోజు 33 వ వార్డులో వైస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటింటికి ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియా మరియు ఆమె వెంట 33 వ వార్డు కార్పొరేటర్ కుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోరంట్ల చే ప్రశంసలు పొందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు పర్వతారోహకుడు

 గోరంట్ల చే ప్రశంసలు పొందిన  ప్రముఖ టేబుల్ టెన్నిస్  క్రీడాకారుడు మరియు పర్వతారోహకుడు     

       


రాజమహేంద్రవరం, పెన్ పవర్

ఇటీవల టాంజానియా దేశంలోని  ప్రపంచంలోనే ప్రముఖ మరియు క్లిష్ట మయిన  కిలిమంజోరో పర్వత శిఖరాన్ని అధిరోహించి భారత దేశానికి  మరియు తెలుగు జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఆచంట ఉమేష్ కుమార్ నేడు తన తండ్రి ఆచంట బాలాజీ తో కలిసి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆచంట ఉమేష్ కుమార్ సాధించిన ఘనత పట్ల గోరంట్ల సంతోషం వ్యక్తం చేసి శాలువా కప్పి  సత్కరించారు.ఉమేష్ కుమార్ మన ప్రాంతంలో ఎంతోమంది యువకులకి తను సాధించిన విజయాల ద్వారా స్పూర్తిని నింపాడని అలాగే వొక్కొక్క మెట్టు పైకెక్కుతూ మరిన్ని చారిత్రిక విజయాలు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కరోనాతో ముంచుకొస్తున్న ముంపు

 కరోనాతో ముంచుకొస్తున్న ముంపు.. 

కరోనా టెస్టు,వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి..బాజాపా. 

మూడు కోతులకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన బీజేపి శ్రేణులు.. 

కరోన టెస్టులకు 11 కిలోమీటర్ల దూరంలోని దుండిగల్ కి వెళ్లాల్సిన పరిస్థితి.. 

మాస్కులు,సామాజిక దూరం పాటించకపోతె కరోన విలయతాండవానికి గురికాక తప్పదు.. 

ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుందని బాజాపా నాయకుల ఆరోపణలు..


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కోతి బొమ్మలకు వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో బాజాపా నిరసన తెలియజేశారు.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత కరోనా టెస్ట్ సెంటర్లు మరియు వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ బాజాపా ఆధ్వర్యంలో మూడు కోతులు సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.. కోతుల బొమ్మలకు విజ్ఞాపన పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా కరోణ వ్యాధి రెండో దశ విజృంభిస్తున్న, మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు ,మేయర్, కమిషనర్ లు ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదని, కార్పొరేషన్ పరిధిలో కనీసం కరోణ టెస్టులు ఏర్పాటు చేయకపోవడం, గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచిత కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన, కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోక పోవడం సిగ్గుచేటని, కరోనా టెస్ట్ చేసుకోవడానికి, వ్యాక్సినేషన్ తీసుకోవడానికి నిజాంపేట కార్పొరేషన్ ప్రజలు 11 కిలోమీటర్ల దూరంలోని దుండిగల్ కి వెళ్లాల్సిన పరిస్థితి అని అన్నారు.. కావున తక్షణమే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు కరోనా టెస్ట్ సెంటర్స్, వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని పది రోజుల్లో ఏర్పాటు చేయాలని, లేనియెడల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా మహిళ ప్రముఖ ఆమల్లేశ్వరి మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు చిత్తశుద్ధి లేదని, ప్రజా ప్రతినిధులు ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి మోర్చా స్కాలర్షిప్ కన్వీనర్ దాస నాగరాజు, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శివ కోటేశ్వరరావు, సెక్రెటరీ అనిత, అధ్యక్షులు రవీంద్ర ,ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, కార్యవర్గ సభ్యులు నవ్య, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ ,హనుమంతురావు, సుధాకర్, కృష్ణ, సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు..

లక్ష్మి కి నిత్యావసర వస్తువులను అందజేసిన చేసిన వానపల్లి రవి కుమార్

 లక్ష్మి కి నిత్యావసర వస్తువులను అందజేసిన చేసిన వానపల్లి రవి కుమార్

మహారాణి పేట, పెన్ పవర్

31వ వార్డ్ లో ఉన్న లక్ష్మి కి  సాయి పూజా ఫౌండేషన్ చైర్మన్, 31వ వార్డ్ కార్పొరేటర్ వాన పల్లి రవికుమార్ గత 9సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ఇవడం జరుగుతుంది.ఈమె కు విద్యుత్తు ఘాతం వల్ల చేయి కాలి పోయింది.ఇంకొక చేతి వేళ్ళు కూడా కాలి పోయాయి.ఈమె కుటుంబానికి అండగా ఉండాలని ప్రతీ నెలా నిత్యావసర సరుకులను అందచేస్తున్న రవికుమార్. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు సారిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్సీపీ ఇంచార్జి సీనియర్ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

 వైఎస్ఆర్సీపీ ఇంచార్జి సీనియర్ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

గాజువాక, పెన్ పవర్

జీవీఎంసీ పరిధి పెదగంట్యాడ గంగవరం గ్రామంలో ఈరోజు 64వ వార్డ్ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాస రావు పుట్టినరోజు సందర్భంగా  ఉచిత కంటి వైద్య శిబిరం 76 వార్డు వైస్సార్సీపీ ఇంచార్జి సీనియర్ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా గాజువాక  వైయస్సార్ సిపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరం విశాఖ డైరీ కిమ్స్ ఐకాన్ సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సహకారంతో నిర్వహించడమైనది. అనంతరం ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న76 వార్డ్ ఇంచార్జ్ దొడ్డి రమణను,ధర్మాల శ్రీనును  అభినందించారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వంనుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మందికి వైద్య సేవలు అందించడమే కాకుండా కంటికి సంబంధించి రెండు వంద మందికి వైద్య పరీక్షలు జరిపించి 55 మందిని ఆపరేషన్ నిమిత్తం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. ధర్మాల శ్రీనివాస రావు మాట్లాడుతూ నా పుట్టిన రోజు సందర్భముగా ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన దొడ్డి రమణకు దేవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు .ఈ కార్యక్రమంలో 87వ వార్డు ఇంచార్జి కొమ్మటి శ్రీనివాసరావు,బి.సి. కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట అప్పారావు మాజీ కౌన్సిలర్ డి ఈ వి అప్పారావు.పి.పెంటయ్య, కె.గోపి,పి.నూకరాజు, కె.బాపణయ్య,డి.ఎల్.బి.నూకరాజు,సలీమ్,కె.అది, ఎన్.మంగరాజు,ఎం.అప్పారావు,బి.సోములు, సింగపూర్ రాజు,సత్తిబాబు,సిహెచ్. అప్పలరాజు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పోలింగ్ ప్రశాంతం....

 పోలింగ్ ప్రశాంతం....

పెన్ పవర్, ఆలమూరు

జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రామచంద్రాపురం పోలీస్ సబ్ డివిజన్లో ప్రశాంతంగా జరిగిందని ఇన్చార్జ్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్  (విజయవాడ డిఐజి కార్యాలయం) షేక్ షరీమా బేగం  అన్నారు. మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మంగాదేవి తో కలిసి ఎస్పీ మండపేట, ఆలమూరు మండలంలో గల పోలింగ్ కేంద్రాలు వద్ద జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రామచంద్రాపురం పోలీస్ సబ్ డివిజన్లో అన్ని గ్రామాల్లో ఎన్నికల సరళి ప్రశాంతంగా జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ మంచి పనితీరును కనబరిచారని అన్నారు. ఎస్పీ వెంట ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పెన్ పవర్, రౌతులపూడి

 రౌతులపూడి మండలంలో జెడ్ పి టి సి ,ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా మండల పరిధిలో గల పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. పరిశీలనలో భాగంగా రౌతులపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ వద్దగల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఓటర్లతో  మాట్లాడుతూ ఓటర్లు ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సరళిని, పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.ఆయన వెంట ఆర్డీవో మల్లిబాబు, ఎం ఆర్ ఓ అబ్బాస్, ఎం డి ఓ ఎస్వీ.నాయుడు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...