Followers

మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

 మరో మధర్ తెరిస్సా.! సంధ్యా..రాణమ్మా.!

అడగనిదే అమ్మైన అన్నం పెట్టదు కానీ..

అడగకుండానే కరోనా బాధితులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది

పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి


రామగుండం , పెన్ పవర్ 

పాలకుర్తి మండలంలోని గుడిపల్లి మరియు కొత్తపల్లి గ్రామాలలో కోవిడ్ సోకి హోం క్వారెంటైన్ లో ఉన్న 30 మంది బాధితులకి వారు కరోనా మహామ్మారి నుండి త్వరగా కోలుకోవాలని వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొంది తిరిగి ఆరోగ్యవంతులు కావాలనే ధృఢ సంకల్పంతో మీకు అండగా నేనున్నాననే మంచి మనసుతో మధర్ తెరిస్సా వంటి సేవా భావంతో శనివారం నాడు పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి కరోనా పాజిటీవ్ వచ్చిన వారి ప్రతీ ఇంటింటికి తిరుగుతూ  వివిధ రకాలైన పండ్లు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ చేసి కరోనా నివారణ కి పలు జాగ్రత్తలు తెలియజేస్తూ సూచనలు సలహాలు చెప్పి వారిలో మనో ధైర్యాన్ని నూరి పోసింది. ఇంకా ఈ కార్యక్రమంలో గుడిపెల్లి గ్రామ సర్పంచ్ కొప్పు రాజేషం, పొరండ్ల రాజిరెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు  ఊర వెంకటేష్, కొలిపాక శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

 కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, పెన్ పవర్

మంథని నియోజకవర్గంలోని 4 మండలాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పైన ఆస్పత్రిలో సౌకర్యాల పైన పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి మరియు మండల వైద్యాధికారు లతో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ  నిర్వహించిన  మాజీ మంత్రి ప్రస్తుత మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం లోని మంథని మండలము రామగిరి మండలం ముత్తారం మండలం కమాన్ పూర్ మండలంలో అక్కడి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని వాటి వివరాలు తెలుసుకొని వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాల్లో 100% 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని డాక్టర్లను కోరారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన వారిలో మంథని మండలంలో 80% మందికి మరియు రామగిరి మండలంలో 50% మందికి కమాన్ పూర్ మండలంలో 50% మందికి ముత్తారం మండలంలో 40% శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ జరిగిందని వచ్చే 6 రోజుల్లో పూర్తి చేస్తామని డాక్టర్లు ఎమ్మెల్యే కి తెలిపారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం జరిగితే చాలా వరకు వ్యాక్సిన్ అవసరముంటుందని చాలా కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ వ్యాక్సిన్ అందరికీ వేసే విధంగా కృషి చేయాలని డాక్టర్లను కోరారు. మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని మరియు జె.ఎన్.టి.యు కళాశాలలో కూడా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ కేంద్రంలో ఆక్సిజన్ సప్లయి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ నీ కూడా కోరుతానని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ మరియు కరోనా టెస్ట్ లు ఒకే ప్రదేశంలో జరపకుండా ఒకే ప్రదేశంలో జరిపితే కరోనా ప్రబలే అవకాశం ఉందా  భౌతిక దూరం పాటిస్తూ వేరువేరుగా జరపాలని  అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలను పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యే జిల్లా వైద్యాధికారి కి అన్ని మండలంలోని ఆసుపత్రికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి కావలసిన టెస్ట్ కిట్లు వ్యాక్సిన్లు, మందులు, మాస్కులు, గ్లౌజులు తదితర అన్ని ప్రభుత్వం నుండి అందుబాటులో ఉండే  విధంగా అందించాలని కోరారు. మంథని మాతా శిశు ఆసుపత్రిలోని ఖాలిలను భర్తీ చేయాలని ఇక్కడ పనిచేసే వారికి ఇచ్చిన డిప్యూటేషన్ లను రద్దుచేసి వారిని ఆస్పత్రిలో సేవలు అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మరియు మంథని మండల వైద్యాధికారి శంకర దేవి, వైద్యులు అగంతం నరేష్, కమాన్ పూర్ వైద్యులు అశోక్ కుమార్, ముత్తారం వైద్యులు వంశీ కృష్ణ, రామగిరి వైద్యులు నాగ శిరోమణి మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి

 విద్యాలయాలు  బలోపేతం చేయడంలో ఎనలేని కృషి...

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారని తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో యెల్లారెడ్డిపేటలో మే 1న విద్యావేత్త మంకురాజయ్యగారికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలిపింది. రాజయ్య "మనబడి మనందరి బాధ్యత"కార్యక్రమం  మరియు ఆంగ్లవిద్య ప్రవేశపెట్టి  ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరుశురాం తెలిపారు. విద్యాభివృద్ధికి చేయడంలో క్రృషిచేశారనీ జ్ఞాపకాలను  నెమరువేసుకున్నారు తెలంగాణ విరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం  జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, ఎం.డి దస్తగీర్, రాములు,రాజు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి సర్కిల్ ప్రజల అభిమానం మరువలేనిది; సి.ఐ. సూర్యనాయక్

 వనపర్తి సర్కిల్  ప్రజల అభిమానం  మరువలేనిది; సి.ఐ. సూర్యనాయక్   

వనపర్తి, పెన్ పవర్        

వనపర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్-సి.ఐ. హోదాలో మూడు సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వహించడానికి అవకాశం కల్పించిన ప్రజల అభిమానం మరువలేనిదని వనపర్తి నుండి గద్వాలకు బదిలీ అయిన సి.ఐ. సూర్యనాయక్ చెప్పారు. విధులు నిర్వహించడంలో  తగు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించిన  పోలీసు ఉన్నతాధికారులకు, విధులు నిర్వర్తించడంలో పూర్తి సహకారం అందించిన పోలీస్ సిబ్బందికి, వనపర్తి సర్కిల్ లో ఉన్న ప్రజలకు  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు,అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు,పట్టణ యువతకు, ప్రభుత్వ ఉద్యోగులకు  శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదరణ, అభిమానం జీవితంలో  మరువలేనని, నా ప్రతి అడుగులో  సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.


టెలీ కాన్ఫరెన్స్ లో ప్రజలతో ఎమ్మెల్యే వివేకానంద

 టెలీ కాన్ఫరెన్స్ లో ప్రజలతో ఎమ్మెల్యే వివేకానంద.. 

కరోనా విపత్కర సమయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.. 

జీడిమెట్ల, పెన్ పవర్ 

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు, శనివారం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని న్యూ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో 200 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో నెలకొన్న సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ మరియు శానిటేషన్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే 80 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు త్వరలోనే మొదలు కావాల్సి ఉన్నాయని, కరోనా వ్యాప్తి వల్ల కొంత ఆలస్యం జరిగిందని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేస్తామని తెలిపారు, తమ దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, అనంతరం వారు కాలనీ వాసులనుద్దేశించి మాట్లాడుతు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు దరిస్తూ ఎప్పటికపుడు చేతులను శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మనం జాగ్రత్తగా ఉంటేనే ఎదుటివారికి సహాయ పడగలమని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు..

పలు కంపెనీలలో మేడే జెండాను ఆవిష్కరించిన కెయం.ప్రతాప్ గౌడ్..

 పలు కంపెనీలలో మేడే జెండాను ఆవిష్కరించిన కెయం.ప్రతాప్ గౌడ్..

జీడిమెట్ల ,పెన్ పవర్ 

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కంపెనీలలో మేడేను పురస్కరించుకొని శ్రమశక్తి అవార్డు గ్రహీత కే.యం. ప్రతాప్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కొపల్లి ఫార్మాలో మరియు రంగారెడ్డి నగర్ పారిశ్రామికవాడలోని ఆల్మెలో కెమికల్స్ కంపెనీ లో మరియు తదితర కంపెనీలలో యూనియన్ అధ్యక్షుని హోదాలో కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించిన శ్రమ శక్తి అవార్డ్ గ్రహీత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ గౌడ్.. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ వెట్టి చాకిరి నుంచి కార్మికులు విముక్తులైన సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులతో కలిసి కంపెనీ యాజమాన్యం వారు కార్మిక చట్టాలను అమలుపరుస్తూ, అవగాహనతో పనిచేస్తేనే కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంత రావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, జయన్న, రామస్వామి, వెంకటేష్, జానీ కుమార్, రామ కృష్ణ, కృష్ణ యాదవ్, గణేష్, రామచందర్, సురేష్, వి.ఆర్.సి రెడ్డి, మనోహర్, నరేష్,  సుబ్బారావు, కృష్ణంరాజు, గోపాలకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

 మంత్రి ఈటెల రాజేందర్ పై కుట్రపూరిత ఆరోపణలు చేయడం మానుకోవాలి

ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్

తొర్రూరు, పెన్ పవర్

తెలంగాణ ఆకాంక్షకు జీవం పోసిన వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో నిలిచే రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని, ముదిరాజ్ మహాసభ తొర్రూరు మండల అధ్యక్షులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ అన్నారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీరప్ప నగర్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో మహాసభ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు రమేష్ మాట్లాడుతూ... మంత్రి ఈటెలను బలిపశువును చేసేందుకు పలువురు నాయకులు పనిగట్టుకొని, బలమైన బీసీ నేతను టార్గెట్ చేశారని, అందుకే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇరికించే కుట్ర చేస్తున్నారని,  విమర్శించారు. ఈటెల రాజేందర్ ను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నుంచి తప్పించడానికి పలువురు కుట్రలు పన్ని, మంత్రి భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.మంత్రి పై వచ్చిన ఆరోపణలపై దేశంలోని ఏ విచారణ కమిటీతో నైనా విచారణ జరిపించాలని, బహిరంగ సవాల్ విసిరిన ఈటెల ధైర్యం మెచ్చుకోదగిందన్నారు. భూకబ్జాలు వ్యవహారాల్లో తలదూర్చి విమర్శల పాలవుతున్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,గొంగిడి సునీతపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఎందుకు జరపడం లేదన్నారు.ప్రభుత్వ పెద్దలకు మంత్రి ఈటెల నచ్చడం లేదని,ఈ కుట్ర,మంత్రుల ఉద్వాసన చేస్తారనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నదేనని, ఆయన పేర్కొన్నారు.కరోనా నియంత్రణకై గడిచిన ఏడాది కాలంగా మంత్రి ఈటెల ఎంతో కస్టపడి పనిచేస్తున్నారని, అన్నారు. కొవిడ్ వ్యాప్తి వేళ  వైద్య పరీక్షలు,టీకా పంపిణీతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటెల వైరస్ కట్టడికి విఫల యత్నం చేస్తున్నాడని, గుర్తు చేశారు.ఆయన శ్రమను బూడిద పాలు చేసేలా ఆరోపణలు అంట కట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.నిప్పు లాంటి నికార్సైన వ్యక్తి ఈటెల పై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబన్నారు.  ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని, అలాంటి బలమైన సామాజిక వర్గం నాయకున్ని అప్రతిష్ఠ పాలు చేస్తామని, చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈటెల పై చేస్తున్న కుట్రలపై ముదిరాజ్ సామాజికవర్గ ప్రతినిధులు, బీసీ నాయకులు సరైన సమయంలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ముదిరాజ్ ముద్దుబిడ్డ, బడుగుల బాంధవుడు, ఉద్యమ నేత ఈటెలకు ఎలాంటి అపకారం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గంధం చంద్ర మూర్తి,డివిజన్ నాయకుడు సాధు రాములు, అమ్మాపురం మత్స్య పారిశ్రామిక శాఖ అధ్యక్షులు కొత్తూరు రాజు, తొర్రూరు సొసైటీ అధ్యక్షుడు రెడ్డ బోయిన మహేష్, ఉపాధ్యక్షులు రెడ్డ బోయిన రవి, శంకర బోయిన యాకయ్య, భాషబోయిన ఉప్పలయ్య, చర్లపాలెం సొసైటీ అధ్యక్షులు పులుగుజ్జ రామచంద్రు,ఖానాపురం సొసైటీ అధ్యక్షులు నారా బోయిన సోమయ్య, రెడ్డ బోయిన దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...