Followers

మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష

 మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ  నిరసన దీక్ష

బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే బర్తరఫ్ చేస్తారా?

ఈటెలను బర్తరఫ్ చేయడం బీసీలను దగా చేయడమే

 జాజుల లింగంగౌడ్

తార్నాక, పెన్ పవర్ 

పంచాయితీ, పార్లమెంటు, మున్సిపల్, అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గం నుండి బీసీలను బర్తరఫ్ చేసి అవమానిస్తున్నారని, ఈ వైఖరి మానుకోకపోతే టిఆర్ఎస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర శాతం లేనివాళ్లు, ఐదు శాతం లేని వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించవచ్చు, వందల ఎకరాలు అడ్డగోలుగా పొందవచ్చు,  ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా పాలించవచ్చు గాని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు మాత్రం ఆస్తులుండి పదవులు పొందితే, అవినీతిపరులుగా,  కబ్జాకోరులుగా ముద్ర వేస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బీసీ ఎస్సీ ఎస్టీలు అవినీతి పరులైతే మీరు సుద్దపూసలా అంటూ ప్రశ్నించారూ.ఈరోజు అధికారం ఉందని బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ను, గతంలో దళిత వర్గానికి చెందిన రాజయ్యను కేసీఆర్ ప్రభుత్వం మెడలు పట్టి బహుజనుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా క్యాబినెట్ నుండి గెంటివేశారని, ఇది వ్యక్తులను అవమానించడం కాదని ఇది యావత్ 90 శాతం ఉన్న బడుగుల, బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రకులాలకు చెందిన ఒక్క మంత్రిని, ఒక్క ప్రజాప్రతినిధిని భర్తరఫ్, సస్పెండ్ లు చేసే దమ్ము లేదని, కేవలం బడుగులను మాత్రమే బలి తీసుకుంటున్నార ని ఇందుకు ఈటల రాజేందర్, రాజయ్యలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాదేశి రాజేందర్,బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

 ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి

జర్నలిస్టుల మరణాలను ఆపండి - టీయూడబ్ల్యూజే


 
పెన్ పవర్, మల్కాజిగిరి

జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి జర్నలిస్టులకు మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాల ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ లు ఒక ప్రకటనలో కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి, రెండో దఫాల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో నేలకొరిగినట్లు వారు విచారం వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా ప్రారంభం నుండి నేటివరకు 3,800 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు వివరించారు. అయితే ఐసోలేషన్ లో ఉంటున్న కొందరికి మాత్రమే మీడియా అకాడమీ నుండి ఆర్థిక సహాయం అందుతున్నదని, ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటున్న పలువురు బాధిత జర్నలిస్టులకు సహాయం అందించడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు అందిస్తున్న 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శేఖర్, విరాహత్, శ్రీకాంత్ లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. అలాగే పంజాబ్, పశ్చిమ బెంగాల్,  బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల మాదిరిగా వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పెన్ పవర్,  శ్రీకాకుళం

మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ వైసీపీ  విద్యార్థి యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్ జన్మదినం సందర్భంగా పలు  సేవా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం స్థానిక ఆదిత్యనగర్ కాలనీలో స్వరూప్ మిత్రమండలి ఆధ్వర్యం లో ఇంటింటికీ కూరగాయలు నిత్యావసరాలు అంద చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు లక్ష్మణ అప్పు యాదవ్, అశోక్, సోను,శ్రీను,తదితరులు ఉన్నారు.

కరోనా తో వార్డు కౌన్సిలర్ మృతి

 కరోనా తో  వార్డు కౌన్సిలర్ మృతి

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ 23 వ వార్డు కౌన్సిలర్  మురికొండ రమేష్ కరోనాతో మృతిచెందారు. రమేష్ మృతికి మన గౌరవ మంత్రివర్యులు తానేటి వనిత తన ప్రగాఢ సంతాపం తెలియచేసారు. కొవ్వూరు మున్సిపాలిటీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పరచుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వార్డు కౌన్సిలర్ మృతికి చైర్మన్ భావనా రత్నకుమారి తో పాటు కౌన్సిలర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

పోచవరంలో సేంద్రియ ఎరువుల తయారీ

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో యస్డబ్ల్యుపిసి నందు సచివాలయ కార్యదర్శి యస్.ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో పేడ నుంచి వానపాములనుపయోగించి సేంద్రియ ఎరువుల తయారీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఏఏ భార్గవ్ సాయి, ఏహెచ్ఏ వి.సాయిరామ్ పాల్గొన్నారు.

శివ సాయి నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి

 శివ సాయి నగర్ లో  మౌలిక సదుపాయాలు కల్పించండి.

పెన్ పవర్, కాప్రా 

 చర్లపల్లి డివిజన్ లోని శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు  మంగళవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గత అక్టోబర్ లో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అదేవిధంగా త్రాగునీరు  లేక అల్లాడుతున్న కాలనీ వాసుల దాహార్తిని తీర్చేందుకు వెంటనే నీటి వసతి కల్పించాలని సంబంధిత ఇంజనీరింగ్, జలమండలి అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు  చేపట్టేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ ఈ ఈ కోటేశ్వరరావు తో సుభాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు . అసలే కరోనా కష్టకాలం పక్క కాలని వాళ్ళు తాగునీరు ఇవ్వడానికి నిరాకరిస్తూ కాదు పొమ్మంటున్నారు తాగేందుకు చుక్క నీరు లేక పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి  మాధవి, ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే   స్పందించిన ఎమ్మెల్యే జలమండలి డీజీఎం కృష్ణ తో మాట్లాడి  తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తాగునీరు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, శివ సాయి నగర్ ఫేస్ 3 సంక్షేమ సంఘం  ప్రతినిధులు సత్యం, పురుషోత్తం రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 కరోనా తో పోరాడి ఓడిన మీ సేవ సత్యనారాయణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం గ్రామంలో కరోనా  మహమ్మారి మరణ మృదంగం గంటలు మోగుతున్నాయి  ఒకపక్క కరోనాబారిన పడిన వారు కోరుకుంటుంటే మరోపక్క కరోనా బారిన పడిన  తట్టుకోలేక మృతి చెందుతున్నారు ఈరోజు ఆత్రేయపురం మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న కాజులూరు రమా సత్యనారాయణ (42)  కరోనా పాజిటివ్ వచ్చినది ఆయన కొద్ది రోజులుగా రాజమహేంద్రవరం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు  ఆయన మృతి పట్ల ఆత్రేయపురం మండలం మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...