Followers

బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత

 బాధిత కుటుంబానికి ట్రాస్మా చేయూత...

బోథ్, పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గత శుక్రవారం కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ దాసరి గంగయ్య ను మంగళవారం నాడు బోథ్ మండల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ట్రాస్మా పరామర్శించి, సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బాధితుడు తోటి సహాయ కరస్పాండెంట్ గంగయ్య కు మనోధైర్యం అందించారు. అలాగే 7000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.కరోనా మహమ్మారి తో గత రెండు సంవత్సరాలుగా ప్రయివేటు పాఠశాలలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటి కి తోటి కరస్పాండెంట్ ను ఆపత్ కాల సమయంలో ఆదుకోవలనే సదుద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం సంతోషం కలిగించందని బాధితుడు దాసరి గంగయ్య ట్రాస్మా సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండలంలోని అన్నిప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమం కోసం బంద్

 ప్రజల సంక్షేమం  కోసం బంద్

నార్నూర్, పెన్ పవర్ 

గాదిగుడా మండలంలోని స్థానిక గ్రామాల్లో 4/5 /2021 నుండి 20/5/21తేదీ వరకు మద్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని స్ధానిక సర్పంచ్ మెస్రం జైవనత్ రావు, వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో  సర్పంచ్ మాట్లాడుతూ రెండవ దశ  లో కరోన ఉద్రిక్తత విజృంభించడంతో  ఇటూ జ్వరాలు అటు కరోనా మహమ్మారి ప్రజలను వంకించడం తో గాడిగూడా గ్రామపంచాయతీ పరిధిలో నిసమావేశం అయి రేపటి నుంచి అన్ని దుకాణాలు  మద్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని అలాగే ప్రతిఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ఉలంగిస్తే కఠినచర్యలు తప్పవని రు.1000 జరిమానా విధించాలలసి ఉంటుందని హెచ్చరించారు. మార్కెట్ మార్నింగ్ 6 గం. నుండి మద్యాహ్నం 2 గం వరకు తేరియా వలసిందిగా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కొంచెడ సుంగు అన్నారు. ఈ తీర్మానమును స్థానిక పోలీస్ స్టేషన్  ఎస్ ఐ ముజాహియోదిన సమర్పించిన తమ వంతు సహకరించాలని తీర్మానని సమర్పించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కోటంబె డిగంబర్, రెవత, జైతు, నందకిశోర్, బాలాజీ, శాలుబాయి, దేవుబయి ,రుక్మబాయి  ఉన్నారు.

వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

 వివాహానికి హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్

నార్నూర్, పెన్ పవర్

నార్నూర్ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో తడిహత్నూర్  కు చెందిన  కేంద్రే మహాదవ్  సూపుత్రుని వివాహానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరై నూతన వధు వరులకు అక్షింతలేసి ఆశీర్వదించారు. వారి వెంట  మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో అప్షన్ మెంబర్ దస్తగిర్,పరమేశ్వర్,సురేష్ ఆడే, రాథోడ్ ఉత్తమ్,దుర్గే కాంతారావు, మోతె రాజన్న,సయ్యద్ కశిం, అహమ్మద్తదితరులు పాల్గొన్నారు.

గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం

 గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండల పి హెచ్ సి ఆధ్వర్యంలో కోవిడ్19 మహమ్మారి విపరీతంగా  పెరగడం తో మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో  జ్వరాలు ఏకువగా పెరిగి ఉనందున ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం  రక్త పరీక్ష శిభిరం నిర్వహించారు.రక్త పరీక్ష కు ప్రజలు ముందుకు రావాలని  హెచ్ ఇ ఓ పవర్ రవీందర్ అన్నారు.వారి వెంట ఏ ఎన్ ఎం ఊర్మిళ, హెచ్ ఏ సురేష్,సి హెచ్ డబ్ల్యూ కుంతబాయి, ఉన్నారు.

12వ వార్డులో బొర్వెల్ కు మరమ్మత్తుల నిర్వహణ

 12వ వార్డులో బొర్వెల్ కు  మరమ్మత్తుల నిర్వహణ

బెల్లంపల్లి, పెన్ పవర్..

పట్టణ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాల్ టెక్స్ లో రామకృష్ణ థియేటర్ వెనుకాల గల మినీవాటర్ సప్లై బోర్ పాడయ్యి ఎండాకాలం వలన పంపులలో నీరు సరిగ్గా రాక బస్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వార్డు కౌన్సిలర్ నెల్లిశ్రీలతరమేష్  దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి,వార్డు తెరాస నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఇంజనీర్లతో మాట్లాడి, వారి సహాయంతో  దగ్గరుండి బోర్ వెల్ లో పైపుల మరమ్మత్తులు నిర్వహించారు. పైపులమరమ్మత్తు ద్వారా బస్తి మొత్తానికి నీటికొరత లేకుండా చేసారని,బస్తి ప్రజలు కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలిపారు

ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

 ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

నాలాలో ఉన్న చెత్త తొలగింపు

పెన్ పవర్, మల్కాజిగిరి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ నాలా క్లీనింగ్ పనులను, మెష్ ఏర్పాట్ల  పనులను కార్పొరేటర్  సునీత రాముయదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరేడ్మట్ దీన్ దయళ్ నగర్ లో ఎడాది క్రితం నాలాలో పడి చిన్నారి చనిపోయిన ఘటన జరిగిందని, ఇందుకు ఒపెన్ నాలా వద్ద సరియైన మెష్ రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే వర్షకాలం ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం నాలాలా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు

 విలేఖరికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు...

పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం లో గౌతమ్ నగర్ డివిజన్ సాక్షి దినపత్రిక విలేకరి మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గతనెల ప్రమాదవశాత్తు వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్నాడు,వెంటనే అబ్దుల్ రెహమాన్ సతీమణి ఆరోగ్యం క్షీణించి లోతుకుంట ఆస్పత్రిలో లో చేర్చి వైద్యం చేయిస్తున్నాడు, కరోనా వల్ల అబ్దుల్ రెహమాన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవ సేవ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు తమ గ్రూప్ లో ఈ విషయాన్ని  సభ్యులతో చర్చించడం జరిగింది. గ్రూప్ సభ్యులు 28 మంది కలిసి రూ16,800 నగదును సహాయంగా అందించారు. అబ్దుల్ రెహమాన్ వారి కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున మంగళవారం గ్రూప్ సభ్యులు నమస్తే తెలంగాణ విలేకరి వెంకటేష్ ద్వారా రెహమాన్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవ సేవే మాధవ సేవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు,ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, రషీద్, లయన్ హనుమంతరావు ముదిరాజ్, సక్కురీ భాస్కరరావు, హోటల్ శేఖర్, మనీ, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...