Followers

మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు

 మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు 

పెన్ పవర్,  మందమర్రి 

కాసిపేట:  కాసిపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూలు నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తు పొడిగింపు జరిగింది అని ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య తెలిపారు. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆన్ లైన్ ధ్వారా దరఖాస్తు చేసుకోవడానికి  ఈ నెల 8 వ తేదీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని  విద్యార్థులు వినియోగించుకోగలరు అని, పరీక్ష ఫీజు ఓపెన్ కేటగిరీకి 150  రూ, ఎస్సీ ,ఎస్టీ ,బిసి విద్యార్థులకు 75 అని రూపాయలు ప్రిన్సిపల్ నాగమల్లయ్య తెలిపారు.

ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం

 ఆట పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం...

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

 బేల, పెన్ పవర్

ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఓడిపోయిన వాళ్లు నిరాశ పడకుండా ముందుకెళ్లే పట్టు సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం మండలంలోని చప్రాల గ్రామంలో లో గత 15 రోజుల నుంచి నిర్వహించిన క్రికెట్ పోటీలు నేటితో  ముగిశాయి. మొదటి బహుమతి చాంద్ పెళ్లి జట్టుకు జోగు పౌండేషన్ తరఫున రూ31,000, రెండో బహుమతి చప్రాల జట్టుకు జడ్పిటిసి సభ్యులు అక్షిత సతీష్ పవార్ తరఫున (ఆడానేశ్వర్ ఫౌండేషన్ )రూ 15,000,గెలుపొందిన జట్లకు బహుమతులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో  ఉన్న యువకుల ప్రతిభను వెలికి తీయడానికి గ్రామా గ్రామాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ యువకులు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ దౌలత్ రావు, టిఆర్ఎస్ నాయకులు దేవన్న, సతీష్, ప్రవీణ్ , జగన్నాథ్,ప్రకాష్ రెడ్డి,గేడం సునీల్,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

  సిసి రోడ్డూ నిర్మాణం పనులను ప్రారంభించిన సర్పంచ్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రుగూడెం లో మంగళవారం సి సి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 30 లక్షల అంచనా వ్యయంతో ఆరు వీధులకు గాను సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు గూడూరు మండలం మేజర్ సర్పంచ్ నూనవత్ రమేష్ నాయక్ పనులను తానే స్వయంగా పార పట్టి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంతర్గత రహదారులు సరిగ్గగా లేనందున సి సి రోడ్డు నిధులను మంజూరు చేయించామని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని అలాగే గ్రామస్తులు పర్యవేక్షించాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ కత్తి స్వామి, ఉప సర్పంచ్ శివరాత్రి సంపత్, చంటి, శివక్రిష్ణ, తదితరులు పాల్గోన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి...

 డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్

బేల,  పెన్ పవర్ 

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు.బేలా మండలం లోని మాంగ్రూడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరన్ని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పరిశీలించారు. గ్రామంలోని 73 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యులు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య శాఖ అధికారి క్రాంతికుమార్, ఎంపీడీవో రవీందర్ భగత్, ఎస్ఐ సాయన్న, ఎంపీటీసీ ఠాక్రె మంగేష్, కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ.

 కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ...

అదిలాబాద్, పెన్ పవర్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్  జన్మదినాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆసుపత్రి లో మంగళవారం  కోవిడ్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్స్, బిస్కట్స్, జ్యూస్ బాటిల్స్ ని సాజిద్ ఖాన్ గారు కాంగ్రెస్ జిల్లా నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రాణాలకు ప్రాణంగా పెట్టుకుని కోవిడ్ రోగులకు వైద్య సేవలు మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో నాయకులు మల్లేష్ యాదవ్, రాహుల్, రాజు యాదవ్, రసూల్ ఖాన్ ,ఎం ఏ షకీల్, నాహిద్, మోసిన్ పటేల్, జాబీర్తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్

 కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్...

ఉట్నూర్,  పెన్ పవర్

కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతిఒక్కరూ వేసుకోవాలని ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి భర్త రాథోడ్ శైలెందర్ తో కలిసి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ని వేసుకున్నారు.వారితో పాటు పంచాయతీ రాజ్ ఎస్.ఈ. జాదవ్ వెంకట్ రావ్ దంపతులు ఉపాధ్యాయుడు చౌహాన్ రమేష్ దంపతులు టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు కరోనా కట్టడికి టీకాయే మార్గమని, కోవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు 45 ఏళ్ళు పైబడిన వారు టీకాను వేసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండల ప్రజలందరు టీకా కోసం నేటి నుండి ఆన్లైన్ లో selfregistration.cowin.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళి టీకా వేసుకోవాలన్నారు.

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం...

జైనథ్ , పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా జైనథ్  వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా సోయాబీన్ విత్తనాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించ నున్నట్లు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం జైనథ్ మండల నాయకులతో చర్చించిన అనంతరం ఈ విక్రయ కేంద్రం తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో 1000 బ్యాగ్ ల కరిష్మా సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమున్న రైతులు ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ లోని విత్తన విక్రయ కేంద్రానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో  ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగా రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఏవో వివేక్ తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...