Followers

ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


అనకాపల్లి , పెన్ పవర్


పట్టణంలో చేపల బజార్ జంక్షన్లో  వేంచేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.  స్వామి వారికి  ప్రత్యేక పూజలు చేశారు. వెదురుపర్తి సుందరయ్య (బాబి) ఆద్వర్యం లో వేడుకలు ఘనముగా జరిగాయి. పొన్నాడ విస్సు, మాతుర్తి గంగారాం, అంజి బాబు, పొన్నాడ పెదబాబు, వానపల్లి కోటి, పెదపాటి శ్రీను, కృష్ణ ,రవి, సతీష్, నాగు తదితరులు పాల్గొన్నారు. 


పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి

 


పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి



స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)


 


విశాఖ నగరంలోని వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల స్థానిక ప్రజలు 12 మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని వెంకటాపురం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దీర్ఘకాలికంగా అందించాలని ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ సైనికులు కోన మంగయ్య నాయుడు విజయ శంకర ఫణీంద్ర మాధవి చార్లెస్ కంభంపాటి సత్యనారాయణ పూరి జాల సుబ్రహ్మణ్యం తదితరులు జివిఎంసి కమిషనర్ డాక్టర్ కె సృజనకు వినతి పత్రం అందజేశారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు


ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే  ఐదు శాతం మినహాయింపు



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 



నగరంలో  ఏడాది  ఆస్తి పన్ను  ఒకేసారి  చెల్లిస్తే  ఐదు శాతం  మినహాయింపు  ఇస్తామని  జివిఎంసి కమిషనర్  సృజన  అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్  నేపద్యంలో  ఆస్తిపన్ను దారులకు   వెసులుబాటు కల్పించాలని  నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ  జీవీఎంసీ  పరిధిలో 2020_ 21  ఆర్థిక సంవత్సరానికి గాను  ఆస్తిపన్ను దారులకు  ఏడాది మొత్తం  పన్ను  ఒకేసారి చెల్లించిన వారికి  ఐదు శాతం  తగ్గింపు  కల్పిస్తామని  ఆమె అన్నారు. నగరంలో  పారిశుధ్యం  త్రాగునీరు పై   ప్రత్యేక చేపడుతున్నామని  ఆమె తెలిపారు. పాలిమర్స్ విషవాయువు   ప్రభావిత ప్రాంతాల్లో  సర్వే నిర్వహిస్తున్నామని  సర్వే పూర్తి అయిన తర్వాత  ప్రభుత్వం ప్రకటించిన  పరిహారం  బాధితులకు అందజేస్తామని  సృజన ఒక ప్రకటనలో తెలియజేశారు.


మన్యంలో  మారని  డోలీల మోత.


మన్యంలో  మారని  డోలీల మోత.



రోడ్లు మృగ్యం.. ఆదివాసీలకు ప్రాణసంకటం.



  ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ మారని దురాచారం.


 


           స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్) 


మన్యంలో  డోలీలు మోత  ఆచారం లా మారిపోయింది.  ఎక్కడ ఎవరికి  అనారోగ్యం  చేసిన  ప్రాణాపాయ స్థితిలో   ఉన్నా   వైద్యం కోసం తరలించాలి అంటే  డోలిలో మోయాల్సిందే.కొండల కోనల మధ్య  మైళ్ల దూరం మోసుకొని ని  ఆస్పత్రులకు  చేరవేస్తున్నారు. సకాలంలో  వైద్యం అందితే  ప్రాణాలు  నిలిచినట్టే  లేకుంటే  గాలిలో కలిసి పోవడమే.  స్వాతంత్రం  వచ్చి  73  వసంతాలు  కావస్తున్నా  శివారు గిరి పల్లెల్లో  డోలీల దురాచారం  ఇంకా మారలేదు. రోడ్లు లేకపోవడంతో  ఆ గ్రామాల్లో ప్రజలకు  జ్వరం జబ్బు   వచ్చిన  గర్భిణీ  పురిటి నొప్పులు తలెత్తిన  ఉచిత వైద్యం అందుకోవాలంటే  రోగిని  డోలి లో  ఆసుపత్రికి తీసుకు రావాలి.  వైద్యులు అందుబాటులో ఉంటే  సకాలంలో వైద్యం ఉంటుంది  లేకుంటే లేదు. ప్రభుత్వాలు మారుతున్నా యి   గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని  ఎన్నికల్లో  ప్రకటనలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల కేటాయించిన నిధులు  ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతి మండలంలో వందల సంఖ్యలో శివారు గ్రామాల ప్రజలు  రోడ్డు మార్గం లేక  కొండలు పొదలు  నడుచుకుంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఆ గ్రామాల వైపు  చూస్తే   హృదయ  విదారక  సంఘటనలు  కంట పడతాయి. హుకుం పేట  మండలం  తీగ వలస పంచాయితీ పనస బంధ గ్రామంలో శుక్రవారం రాత్రి చీదరి  చిలకమ్మ  ఆదివాసి మహిళ  గర్భిణీ నొప్పులు మొదలై  ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది కూడా  అందుబాటులో లేకపోవడంతో  పాలుపోని గ్రామస్తులు ప్రసవ వేదన అనుభవిస్తున్న చిలకమ్మ ను డో లీపై  కొండలపై నుంచి నాలుగు కిలోమీటర్లు మూసుకొని రోడ్డు వద్దకు చేర్చారు  అక్కడ నుంచి హుకుం పేట  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. జి.మాడుగుల మండలం లువ్వాసింగ్ పంచాయతీ  వంచేబు బిడ్డ పుట్  గన్నె గుంట 11 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక  కొండల పైనుంచి నడుచుకొని రావాల్సిందే. ఆనారోగ్యానికి గురైతే డోలీలపై  మోసుకు రావాల్సిందే. ఏళ్ల తరబడి అక్కడి గిరిజనుల్లో  రోడ్లు నిర్మించాలని  నాయకులను అధికారులను కోరుతున్నారు అయినా ఆ గ్రామాలకు మోక్షం కలగలేదు. ప్రతి ఏడాది పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు  ఇతర నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది  శివారు గ్రామాలకు అంచెలంచెలుగా  రోడ్ల నిర్మాణం చేపడితే డోలీ  మోత దురాచారం  సమసి పోతుందని  ప్రజా సంఘాలు  మోర పడుతున్నాయి. నింగికి రాకెట్లను పంపుతున్న కాలంలో కూడా  గిరిజనులుగా పుట్టిన పాపానికి  ఇంకా  డోలీల నే  ఉపయోగిస్తున్నారు అంటే  అభివృద్ధి  స్పష్టమవుతోంది.


రైతు భరోసా పథకం కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్న దొర


రైతు భరోసా పథకం కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్న దొర



మెంటాడ, పెన్ పవర్:


 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కరపత్రాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర శుక్రవారం శనివారము తమ నివాసంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెంటాడ మండలం మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు మాట్లాడుతూ మెంటాడ మండలంలో వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న విత్తన సరఫరా, రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు మంజూరైన నిధులు, ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రణాళికలను తయారుచేసి జిల్లా అధికారులకు నివేదికను పంపించినట్లు ఏ.వో. మల్లికార్జున రావు ఎమ్మెల్యే రాజన్నదొర కు వివరించారు. ఖరీఫ్ కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజన్న దొర వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెంటాడ ఎంపీడీవో భానుమూర్తి, సాలూరు వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.


 మన్యంలో  మసకబారుతున్న  ప్రేమ(లు)



 మన్యంలో  మసకబారుతున్న  ప్రేమ(లు)



  ఆకర్షణను  ప్రేమగా భావిస్తున్న యువత.



మోజు తీరాక ఎడమొహం పెడమొహం.



పోలీసులను ఆశ్రయిస్తున్న యువతులు.



    స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)



   మన్యంలో  ప్రేమ(లు) మసకబారుతున్నయి.  ఆకర్షణకు లోనైన  యువతీ యువకులు  చెలిమి చేస్తున్నారు  ప్రేమ అనే మైకం లో  మోజు తీరాక  ముఖం చాటేస్తున్నా సంఘటనలు లేకపోలేదు.  అవగాహన లోపంతో మోసపోయి  తేరుకున్న యువతులు  పోలీస్ స్టేషన్ లను  ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మౌనపోరాటానికి  సై. అంటున్నారు. కొయ్యూరు  నాతవరం  జీకే వీధి హుకుం పేట  మండలాల్లో   యువతీ యువకుల ప్రేమ వ్యవహారం  బెడిసికొట్టి రోడ్డున పడింది.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కొయ్యూరు మండలం  సింగందొర వాడు  గ్రామానికి చెందిన  కొర్రూ  లోవ లక్ష్మి  నాతవరం మండలం ఎర్ర కంపాడు మూల పర్తి  వరప్రసాద్  కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.   లక్ష్మీ పెళ్లి పేరు ఎత్తడం తో ప్రసాద్ మొహం చాటేశాడు. ఎంత ప్రాధేయపడినా  ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు  కొయ్యూరు పోలీసులను ఆశ్రయించింది.  ఎస్ ఐ  దాసరి నాగేంద్ర  తన శైలిలో పెద్దల సమక్షంలో  లోవలక్ష్మి  ప్రసాదల  పెళ్లి జరిపించారు. గూడెంకొత్తవీధి  మండలం దామునా పల్లి పంచాయితీ గొడుగు మామిడి గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న  భీమరాజు  హుకుంపేట  మండలం  గుచ్చరి  గ్రామానికి చెందిన   యువతిని  ప్రేమ లో పడేశాడు   చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు  మోజు తీరాక  మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని   యువతి కోరిన  పట్టించుకోలేదు. ఇటీవల వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు  తెలుసుకొని  మోసపోయానని  భావించిన యువతి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు  ఉపాధ్యాయుడు పై  కేసు నమోదు చేయడంతో  అధికారులు    రాజును సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు  గిరి ప్రాంతంలో  అక్కడక్కడ వెలుగు చూస్తున్నయి.  స్వచ్ఛమైన  మనసు  కలిగిన యువత  ఆకర్షణ మోజులో  పడి  ప్రేమకు  గ్రహణం పట్టిస్తున్నారని  సంఘటనలు  నిర్ధారిస్తున్నాయి.అవగాహన లేక యువకులు కేసుల్లో ఇరుక్కుంటున్ననారు.


సంక్షేమంలో మేటి...అభివృద్దిలో ఘ‌నాపాఠి


సంక్షేమంలో మేటి...అభివృద్దిలో ఘ‌నాపాఠి
స‌మ‌తూకంతో ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన  క‌లెక్ట‌ర్‌
జిల్లాకు వ‌రించిన జాతీయ పుర‌స్కారాలు
ల‌క్ష‌లాది మొక్క‌లు నాటి హ‌రిత జ‌వ‌హ‌రుడుగా ప్ర‌సిద్ది
ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల న‌డుమ రెండేళ్ల పాల‌న పూర్తి


బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్, విజ‌య‌న‌గ‌రం, 


  ప్ర‌గ‌తి ర‌థాన్ని ప‌రుగులు పెట్టించి, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించి,  అభివృద్దికి బాట‌లు వేసి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌చెంత‌కు చేర్చి, ఎన్నో జాతీయ‌ పుర‌స్కారాల‌ను సంపాదించి, జిల్లా ఖ్యాతిని విశ్వ‌వీధిలో ఎగుర‌వేశారు మ‌న  క‌లెక్ట‌ర్ మ‌రియు జిల్లా మెజిస్ట్రేట్‌ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్, ఐ.ఏ.ఎస్‌. జల‌మే జీవ‌నాధారం అని గుర్తించి, జిల్లా వ్యాప్తంగా వంద‌లాది చెరువుల‌ను పున‌రుద్ద‌రించిన ద్ర‌ష్ట ఆయ‌న‌.  నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ, ప్ర‌జా శ్రేయ‌స్సే ప‌ర‌మావ‌ధిగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఆయ‌న చేసిన కృషి అస‌మానం, అనిత‌ర సాధ్యం. అందుకే ఆయ‌న‌ను అంద‌రూ గౌర‌వంగా హ‌రిత జ‌వ‌హ‌ర్‌లాల్ అని పిలుస్తున్నారు.  ఈనెల 17తో విజ‌య‌వంతంగా త‌న రెండేళ్ల పాల‌న‌ను పూర్తిచేసుకొని, ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా స్థానం సాధించిన మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ప్రస్థానంపై ప్ర‌త్యేక క‌థ‌నం......


           జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ జీవిత‌మే ఒక స్ఫూర్తి. అట్ట‌డుగు స్థానం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్‌గా అత్యున్న‌త స్థాయికి ఎద‌గ‌డానికి ఆయ‌న చేసిన కృషి, త‌ప‌న ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కం. త‌న‌ను ఆద‌ర్శంగా తీసుకొని కొంద‌రైనా ఉన్న‌తస్థాయికి ఎదగాల‌న్న ఆకాంక్ష‌తో, క‌లెక్ట‌ర్‌తో కాసేపు అన్న వినూత్న‌ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.సంక్షేమ వ‌స‌తిగృహాల్లో చ‌దువుతున్న నిరుపేద విద్యార్థుల‌ను ప్ర‌తీ ఆదివారం త‌న బంగ్లాకు ర‌ప్పించుకొని, ఎదుగుద‌ల‌కు చ‌దువే మార్గ‌మంటూ వారిలో ప్రేర‌ణ క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వృద్దాశ్ర‌మాలు, అనాధాశ్ర‌మాల‌కు వెళ్లి,  వారితో మ‌మేకమై, వారిని అప్యాయంగా ప‌ల‌క‌రించి క‌ష్ట‌సుఖాలు తెలుసుకొనేవారు. ఇలా సెల‌వు రోజుల్లో కూడా ఆయ‌న స‌మ‌యాన్ని ప్ర‌జ‌ల‌కోస‌మే వెచ్చించారు. ప్ర‌మాదానికి గురై, రోడ్డుపై బోల్తాప‌డ్డ ఒక ఆటోను చూసి త‌క్ష‌ణ‌మే త‌న‌వాహ‌నంలోనుంచి క్రిందికి దిగి స్వ‌యంగా జ‌నంతో క‌లిసి ఆటోను పైకిలేపి, గాయ‌ప‌డ్డ‌వారికి స‌ప‌ర్య‌లు చేసి త‌న‌లోని మాన‌వ‌త‌ను చాటుకున్నారు. జిల్లాకు అత్యున్న‌త అధికారి అయిన‌ప్ప‌టికీ,  ఒక సామాన్య వ్య‌క్తిలా ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కుమారుడితో క‌లిసి ఆటోలో త‌న బంగ్లాకు చేరుకున్న సంఘ‌ట‌న హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ నిరాడంబ‌ర‌త‌కు నిద‌ర్శ‌నం.   సృజ‌నాత్మ‌క‌త‌కు మారుపేరు మ‌న జిల్లా క‌లెక్ట‌ర్. ఆయ‌న‌ పాల‌న‌లో క‌లికితురాయిగా నిలిచింది స్పంద‌న భోజ‌న ప‌థ‌కం. పేద‌ల క‌ష్టాలు విని చ‌లించిపోయిన జిల్లా క‌లెక్ట‌ర్‌‌, క‌లెక్టరేట్‌కు వ‌చ్చేవారి నుంచి అర్జీల‌ను స్వీక‌రించ‌డ‌మే కాకుండా, వారికి క‌డుపు నిండా భోజ‌నం పెట్టి పంపించాల‌న్న ఆశ‌యంతో రూపుదాల్చింది  ఈ ఆద‌ర్శ‌నీయ ప‌‌థ‌కం.  కేవ‌లం దాత‌ల విరాళాల‌తోనే నేటికీ విజ‌య‌వంతంగా న‌డుస్తున్న ఈ ప‌థ‌కం క్రింద‌, స్పంద‌న కార్య‌క్ర‌మంలో విన‌తులు ఇవ్వ‌డానికి వ‌చ్చిన వారంద‌రికీ రూ.10కే క‌డుపు నిండా భోజ‌నం పెడుతున్నారు. దివ్యాంగులు, గ‌ర్భిణిల‌కు పూర్తిగా ఉచితంగానే భోజ‌నాన్ని పెడుతుండ‌టం విశేషం. ఇప్పటి వరకు సుమారు 15 వేల మందికి సంతృప్తిగా రుచికరమైన భోజనాన్ని అందించారు. దీనికోసం త‌న బంగ్లాలో ప్ర‌కృతి సేద్యం ద్వారా కూర‌గాయ‌ల‌ను పండించి, ఉచితంగా ఈ ప‌థ‌కానికి స‌ర‌ఫ‌రా చేస్తుండ‌టం క‌లెక్ట‌ర్ ఔదార్యానికి, చిత్తిశుద్దికి నిద‌ర్శ‌నం. గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తిగ‌ల విజ‌య‌న‌గ‌రానికి, నాటి ఘ‌న‌త‌ను నేటి త‌రానికి నిరంత‌రం గుర్తు చేసి, వారిలో స్ఫూర్తిని నింప‌డానికి ప‌ట్ట‌ణంలో ప‌లు చోట్ల సైన్‌బోర్డుల‌ను ఏర్పాటు చేయించారు క‌లెక్ట‌ర్‌. మ‌న విజ‌య‌న‌గ‌రం,  విద్య‌ల‌న‌గ‌రం, హ‌రిత విజ‌య‌న‌గ‌రం, క్రీడల న‌గ‌రం-విజ‌య‌న‌గ‌రం, సాంస్కృతిక విజ‌య‌న‌గ‌రం త‌దిత‌ర బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. ప‌ట్ట‌ణాన్ని చెత్త‌ర‌హిత న‌గ‌రంగా మార్చి స్వ‌చ్ఛ విజ‌య‌న‌గ‌రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేశారు. స్వ‌యంగా తాను ఒక డాక్ట‌ర్ కావ‌డంతో, జిల్లా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి, జిల్లా కేంద్రానికి ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ను మంజూరు చేయించుకున్నారు.మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు, క‌ళ‌లు  అంటే జిల్లా క‌లెక్ట‌ర్‌కు అపారమైన మ‌క్కువ‌. వాటిని పునరుద్ద‌రించ‌డానికి ఈ రెండేళ్లూ ఆయ‌న ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. ఘ‌న చ‌రిత్ర గ‌ల మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత నృత్య క‌ళాశాల‌ను దాని ప్రాభ‌వం దెబ్బ‌తిన‌కుండా పున‌ర్‌నిర్మించి, చ‌రిత్ర‌లో త‌న పేరును కూడా లిఖించుకున్నారాయ‌న‌. ఘ‌నంగా వందేళ్ల ఉత్స‌వాన్ని నిర్వ‌హించి నాటి క‌ళావైభ‌వాన్ని క‌ళ్ల‌ముందుకు తెచ్చారు.  అలాగే మ‌హాక‌వి గుర‌జాడ స్వ‌గృహాన్ని పున‌రుద్దించింది కూడా ఈ రెండేళ్ల కాలంలోనే. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను, పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.  జిల్లా కీర్తిని ప్ర‌పంచ దేశాల్లో చాటిన ఘ‌న‌త హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌కే ద‌క్కింది. 2018లో జ‌రిగిన పేరిస్ పీస్ ఫోర‌మ్‌లో ఆయ‌న దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించి, ప్ర‌కృతి సేద్యంపై ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంది. ప్ర‌కృతి సేద్యంలో పాఠాలు నేర్చుకోవాడినికి విదేశాల‌నుంచి జిల్లాకు ర‌ప్పించ‌డం ద్వారా జిల్లా ఖ్యాతిని, రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌జేశారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను జిల్లాకు తీసుకువ‌చ్చి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను చూపించి, ఆయ‌న చేత సెభాష్ అనిపించుకున్నారు.  జిల్లాకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డిని తీసుకొని వ‌చ్చి, ఆయ‌న చేతుల‌మీదుగా   జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌ ప‌థ‌కాన్ని ప్రారంభించుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేసిన ఏర్పాట్లు, రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌నుంచి ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాయి. సాలూరు, గుమ్మ‌ల‌క్ష్మీపురం వ‌ద్ద గిరిజ‌న గ‌ర్భిణీల‌కోసం ప్ర‌త్యేక హాస్ట‌ళ్ల‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోనే ఆద‌ర్శంగా నిలిచారు.  
            క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ హ‌యాంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా దేశంలోనే ఒక ప్ర‌త్యేక గుర్తింపును సాధించింది. కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన  ప‌లు ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలను జిల్లాలో విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రిపి పుర‌స్కారాల‌ను సాధించారు. పోష‌ణ్ అభియాన్ ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాకు జాతీయ అవార్డు ద‌క్కింది. ఎక్స్‌టెండెడ్ గ్రామ స్వ‌రాజ్ అభియాన్‌, కృషి క‌ల్యాణ్ అభియాన్‌ కార్య‌క్ర‌మాలు అత్య‌ద్భుతంగా అమ‌లైన  నీతి అయోగ్  జిల్లాల్లో మ‌నం కూడా ఒక‌టిగా నిలిచి, కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాం. అలాగే ఇటీవ‌లే ఒకేసారి మూడు స్కోచ్ అవార్డులు కూడా జిల్లాకు వ‌రించాయి. గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం అమ‌ల్లో కూడా జిల్లా అవార్డుల‌ పోటీకి నామినేట్ అయ్యింది. ర‌క్త‌దానానికి ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలోఆయ‌న ఎప్పుడూ ముందుంటారు. సేవ్ బ్లూ అంటూ నీటి వ‌న‌రుల‌ను ప‌రిర‌క్షించ‌డం, స్ప్రెడ్ గ్రీన్ అంటూ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించ‌డం, డొనేట్ రెడ్ అంటూ ర‌క్త‌దానానికి ప్రోత్స‌హించ‌డం జిల్లా క‌లెక్ట‌ర్ ముఖ్య నినాదాలు. దాని ఫ‌లితంగానే ర‌క్త‌దానంలో జిల్లాకు తొలిసారిగా రెడ్‌క్రాస్ అవార్డు వ‌రించింది.      నవరత్నాలు వంటి రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప్రాధాన్య‌తా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూనే,  జిల్లా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించి  అమలు చేయడానికి జిల్లా కలక్టర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.  స్పంద‌న ఫిర్యాదుల ప‌రిష్కారంలో తొలినుంచి జిల్లా మొద‌టి స్థానంలో నిలుస్తూ వ‌స్తోంది. గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక ఓటింగ్ శాతం న‌మోదైన జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిల‌వ‌డం విశేషం. ఓట‌ర్ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ తీసుకున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ద కార‌ణంగా ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాము. డాక్ట‌ర్ వైఎస్ఆర్ కంటివెలుగు, కాపు నేస్తం ప‌థ‌కాల అమ‌ల్లో రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానాన్ని సాధించాం. పిఎం మాతృత్వ వంద‌న‌, వ‌నం మ‌నం, వైఎస్ఆర్ వాహ‌న‌మిత్ర త‌దిత‌ర కార్య‌క్ర‌మాల అమ‌ల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచాము.  ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో జిల్లా 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగ‌బాకింది. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేకశ్రద్ద పెట్టారు.  వైఎస్ఆర్ పెన్ష‌న్ కానుక పంపిణీలో ప్ర‌తీనెలా తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాం. ఇంకా న‌వ‌ర‌త్నాల అమ‌ల్లో గానీ, వైఎస్ఆర్ న‌వ‌శ‌కంలోగానీ విజ‌య‌న‌గ‌రం జిల్లాను తొలి రెండు మూడు స్థానాల్లో నిల‌ప‌డం క‌లెక్ట‌ర్ గొప్ప‌ద‌నంగా పేర్కొన‌వ‌చ్చు. జిల్లా ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడేలా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఘ‌న‌త క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌దే. ఆయ‌న స్వ‌యంగా త‌న చేతుల‌తోనే వేలాది మొక్క‌లు నాటారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 5 గంట‌లు నుంచి 7 గంట‌లు వ‌ర‌కూ హ‌రిత య‌జ్ఞాన్ని కొన‌సాగించారు. ఆయ‌న స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా సుమారు కోటి 40 లక్షల  మొక్క‌లు వేళ్లూనుకొని చిగురించాయి. కేవ‌లం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోనే సుమారు రెండు ల‌క్ష‌ల మొక్క‌ల‌ను నాటారంటే, ఈ కార్య‌క్ర‌మం ఏ స్థాయిలో జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అందుకే వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంలో కూడా మ‌న జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇటీవ‌ల చోటుచేసుకున్న వాతావ‌ర‌ణ మార్పులు, అహ్లాద‌ర‌క‌మైన ప‌రిశ‌రాలు హ‌రిత య‌జ్ఞం ఫ‌లిత‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు       దార్శ‌నిక‌త‌కు మారుపేరుగా నిలిచే హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జ‌లంతోనే జ‌గ‌త్ ముడిప‌డి ఉంద‌ని భావించారు. అందుకే మనవూరు - మనచెరువు పేరుతో చెరువుల శుద్దికి శ్రీ‌కారం చుట్టారు. దుర్ఘంధంతో కంపుకొట్టి, ముళ్ల‌పొద‌లు పెరుకుపోయి, చెత్త‌చెదారాల‌తో, ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోయిన చెరువుల స‌ముద్ద‌ర‌ణ‌కు ఆయ‌న న‌డుం బిగించారు. చిటికేస్తే ప‌లికే అధికార యంత్రాంగం త‌న చెప్పుచేతల్లో ఉన్న‌ప్ప‌టికీ, త‌న అధికారాన్ని, ద‌ర్పాన్ని ప్ర‌క్క‌న‌బెట్టి, చెరువుల శుధ్దికి ఆయ‌నే స్వ‌యంగా ముందుకు నడిచి స్వచ్చ సేవను ప్రారంభించారు. స్వ‌యంగా కాలువ‌ల్లో, చెరువుల్లో దిగి చెత్తా చెదారాల‌ను వెలికి తీశారు. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకున్న వంద‌లాది స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వేలాదిమంది యువ‌త చెరువు శుద్ది కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో వంద‌ల చెరువులు ఇప్ప‌డు కొత్త‌రూపును సంత‌రించుకున్నాయి. అహ్లాదంగా మారి పార్కుల‌ను త‌ల‌పిస్తున్నాయి.విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ న‌డిబొడ్డున ఉన్న అయ్య‌కోనేరే దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. జిల్లా క‌లెక్ట‌ర్‌గానే కాకుండా, విజ‌య‌న‌గ‌రం కార్పొరేషేన్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా ఆయ‌న జిల్లా కేంద్రం రూపురేఖ‌ల‌ను మార్చేందుకు సాయ‌శ‌క్తులా కృషి చేశారు. జిల్లాకు త‌ల‌మానిక‌మైన క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. భ‌వ‌నాల‌కు కొత్త సొబ‌గులు అద్దారు. ప‌ట్ట‌ణంలో రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేపట్టి, విశాలంగా మార్చారు. న‌గ‌రానికి సైన్‌బోర్డుల‌తో కొత్త‌గా తోర‌ణాలు క‌ట్టారు. పెద్ద‌చెరువు చుట్టు అభివృద్దికి శ్రీ‌కారం చుట్టారు. మ‌రెన్నో పార్కుల‌ను అభివృద్ది చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌పంచ‌మంతా గ‌జ‌గ‌జ‌లాడుతున్న స‌మ‌యంలో, ఈ అంటువ్యాధి ప్ర‌భ‌ల‌కుండా జిల్లాను దాదాపు 45 రోజుల‌పాటు సంరక్షించారు. చివ‌ర్లో వ‌ల‌స కూలీల‌ను జిల్లాకు అనుమ‌తించ‌క‌పోయి ఉన్న‌ట్ల‌యితే, నేటికీ విజ‌య‌న‌గ‌రం జిల్లా గ్రీన్ జోన్‌లోనే ఉండేద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. తాను స్వ‌యంగా జిల్లాకు స‌ర్వోన్న‌తాధికారి అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం బేష‌జాలు లేకుండా అటు అధికారుల‌తో గానీ, ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌తో గానీ క‌లిసిపోవ‌డం అల‌వాటు. హాస్టల్ విద్యార్దులు, పేద విద్యార్దుల సంక్షేమంపై ఆయన ఎంతోశ్రద్ద వహించారు.  సంక్షేమ వసతి గృహాల్లో మెనూను తనిఖీ చేసేందుకు స్వయంగా విద్యార్దులతో కలిసి నేలపై కలిసి కూర్చొని సహపంక్తి భోజనం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ప్ర‌తిఒక్క‌రినీ పేరుపెట్టి అప్యాయంగా పిల‌వ‌డం ఆయ‌న నైజం. స‌మష్టి త‌త్వాన్ని అల‌వాటు చేసి, జిల్లా యంత్రాంగాన్ని ఒక కుటుంబంలా ముందుకు న‌డిపించారు. ఇటు అధికార యంత్రాంగానికి, అటు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ‌ధ్య చ‌క్క‌ని స‌మ‌న్వ‌యాన్ని ఏర్ప‌రిచడ‌మే కాకుండా, ప్ర‌జా ప్ర‌తినిధుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను అనుగుణంగా పాల‌నార‌థాన్ని ముందుకు న‌డిపించారు.  అందుకే ఆయ‌న విజ‌య‌వంతమైన క‌లెక్ట‌ర్‌గానే కాకుండా, ఒక ఆద‌ర్శ‌నీయ‌మైన వ్య‌క్తిగా కూడా ఇటు ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌న్న‌న‌ల‌ను పొంద‌డ‌మే కాకుండా, సామాన్య జ‌నం అభిమానాన్ని కూడా చూర‌గొన్నారు. 


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...