Followers

ఎంపిటిసి, జెడ్పిటిసి లకు కొత్తగా నామినేషన్ వేసుకునే అవకాశం...

ఎంపిటిసి,  జెడ్పిటిసి లకు కొత్తగా నామినేషన్ వేసుకునే అవకాశం... 

కోరినవారికి ఎన్నికల అధికారులు అవకాశం  కల్పించాలి

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క.నాగేశ్వరరావు డిమాండ్ 



జగ్గంపేట, పెన్ పవర్


జగ్గంపేట మండలం జగ్గంపేట ట్రావెల్స్ బంగ్లా లో ఆయన పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అందరికీ అవకాశం కల్పించాలని ఆయన మాట్లాడుతూ తెలియజేశారు. ఎమ్ పి టి సి, జెడ్ పి టి సి లు గా  రాష్ట్రంలో నామినేషన్ వేసి సంవత్సరం కాలం అయినది .కరోనా మహమ్మారి ప్రాణాంతకమైన వ్యాధి వలన ఎన్నికలు వాయిదా పడడం జరిగినది  అందునిమిత్తము యువతీ యువకులు ఉత్సాహవంతులు వారెవరైనా ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి నామినేషన్ వేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను కోరినవారికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించి గ్రామ ప్రజలకు  సేవ చేసుకునే  అవకాశం వారికి కల్పించాలి, అప్పటిలో గ్రామ సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లుకు నామినేషన్ వేయనందన  ఈరోజు యువతీయువకులకు ఉత్సాహవంతులకు గ్రామానికి సేవ చేసుకునే అవకాశం మొదటి రెండవ విడతల్లో జరిగిన ఎన్నికల్లో దక్కిందనది అలాగే ఎం పి టి సి, జెడ్ పి టి సి, నామినేషన్లు వేసుకునే అవకాశం కోరిన వారికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పించి వారి అదృష్టాన్ని పరీక్షించుకునే  అవకాశం కల్పించాలని కోరారు.

బల్లిపాడులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు పట్టివేత


బల్లిపాడులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు పట్టివేత



తాళ్ళపూడి, పెన్ పవర్

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అదేశాలమేరకు, అడిషనల్ ఎస్పీ యస్ఈబి వారు జయరామ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కొవ్వూరు డిఎస్పీ బి.శ్రీనాథ్ ఆధ్వర్యంలో కొవ్వూరు సిఐ సురేష్, తాళ్ళపూడి ఎస్ఐ జి.సతీష్ ఎంతో చాకచక్యంగా గురువారం సాయంత్రం 7 గంటలకు బల్లిపాడు ఇసుక ర్యాoపులో అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలను, ఒక ప్రొక్లైన్ సీజ్ చేసినట్లు బి.శ్రీనాథ్ తెలిపారు. ఈ ర్యాంపు కంటిపూడి రవీంద్ర కనస్ట్రక్షన్ వారికి చెందిఉన్నదని, దీనిని వేరే వ్యక్తులకు సబ్ లీజ్ కు ఇచ్చినట్లుగా తెలిపారు. వీటిలో 3 లారీలకు బిల్లులు లేవని, 3 లారీలు అదనంగా లోడ్ తో ఉన్నాయని, మొత్తం 130 టన్నుల ఇసుక పట్టుబడిందని తెలిపారు. 14 మంది నిందితులు పట్టుబడగా, 10 మందిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లుగా తెలియజేసారు. కొవ్వూరు సిఐ సురేష్, తాళ్ళపూడి యస్ఐ జి.సతీష్, మరియు పోలీస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఉద్యోగ కర్తవ్యాన్ని  నిర్వర్తించినందుకు కొవ్వూరు డియస్పి బి.శ్రీనాథ్ కొనియాడారు. ఈ నియోజకవర్గoలో ఇసుక ర్యాంపులలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

చత్రపతి శివాజీ సేవలు దేశానికే గర్వకారణం...

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  జోగు రామన్న,  

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

బేలలో  చత్రపతి మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, భారీ బైక్ ర్యాలీ, శోభాయాత్ర

 బేలా (అదిలాబాద్),  పెన్  పవర్

బేలా:మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు యావత్ భారత దేశానికే గర్వకారణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు లు  అన్నారు. 

శుక్రవారం మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తో కలిసి విగ్రహ ప్రతిష్టాపన, చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు శివాజీ మహారాజ్ డీజే పాటలతో భారీ ర్యాలీతో శోభయాత్ర నిర్వహించారు. 

చిన్న పెద్ద తేడా లేకుండా మరాఠా  కులస్తులు తో పాటు ఆయా యువజన సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొని జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న,  సోయం బాపూరావు లు  మాట్లాడుతూ, చత్రపతి మహారాజ్ తల్లి జిజావు స్ఫూర్తితో దేశంలోనే గొప్ప రాజుగా కీర్తి పొందిన స్ఫూర్తి ప్రదాత శివాజీ మహారాజ్ అని అన్నారు.చత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలను మరాఠా, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని,ఆయన చేసిన సేవలను నిత్యం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారని అన్నారు. 

శివాజీ మహారాజ్ విగ్రహ దాత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ పవర్ ను ఎమ్మెల్యే, ఎంపీలు శాలువాలతో సన్మానించారు. విగ్రహాన్ని కొనివ్వడం హర్షనీయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీ. రామచంద్ర రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు అక్షిత సతీష్ పవార్, ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రె,  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ సర్పంచులు మస్కె తేజ రావు, దేవన్న,మరాఠా సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్,మరాఠా సంఘం మండల అధ్యక్షులు ఠాక్రె గంభీర్,నాయకులు మురళీదార్ ఠాక్రె, నారాయణ చొప్డే,వైద్య కిషన్, నాక్లే రాందాస్,  తేజ రావు వాడ్కర్, విపిన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదవ మహసభను విజయవంతం చేయండి

 యాదవ మహసభను విజయవంతం చేయండి

మందమర్రి పెన్ పవర్ :

మందమర్రి పట్టణంలోని ఇందు గార్డెన్ లో ఫిబ్రవరి 21న నిర్వహించు యాదవ మహసభను విజయవంతం చేయాలని అఖిల భారత యాదవ మహసభ జిల్లా అధ్యక్షులు బండి సదానంద యాదవ్ కోరారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశంలో మహసభ క్యాలెండర్ ఆవిష్కరణ, జిల్లా, మండల కమిటీలో మార్పులు, చేర్పులు, రాబోయే గొర్రెల, మేకల పెంపకందారుల సొసైటీ ఎన్నికల చర్చ నిర్వహించబడునని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర మహిళ కమీషన్ డైరెక్టర్ కొమ్ము ఉమాదేవి యాదవ్ కు సన్మానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి గ్రామ సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యాదవ కుల భాందవులు అధిక సంఖ్యలో హాజరై మహసభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశ హాజరు అయ్యే సభ్యులకు బోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

వీరశివాజీకి నివాళులు..


దేశభక్తి, సురక్ష, సుపరిపాలన అందించి వీరశాలిగా నిలిచిన మహా చక్రవర్తి శివాజీ..

రంగారెడ్డి నగర్ డివిజన్ లో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాలని వాసులు ఏర్పాటు చేసిన వేడుకలో శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు కార్పోరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మరణించి వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆయన అమరుడిగా నిలిచిపోయారన్నారు. ఆయన దేశభక్తి, సురక్ష, సుపరిపాలన అందించి వీరశాలిగా నిలిచారన్నారు. శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ధైర్యం, పట్టుదల, దైవభక్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, భౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యుడు రహీం, కాలనీ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, కార్తిక్ గౌడ్, సుధాకర్, వెంకటేశం, హరికృష్ణ, వెంకటేష్, వీరయ్య, అబ్రహం, గణేష్, మల్లేష్, శ్రీదర్, బాను, కృష్ణ, రాంబాబు, షకీల్, టిల్లు, అఫ్ఫు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన ధరలు తగ్గించాలని రాస్తారోకో ..


రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు పెట్రోల్, డీజిల్ , గ్యాస్ లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్,సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ,రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ధరలను పెంచి నిలువునా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.మోడీ ప్రభుత్వం రామ రాజ్యం అని చెప్పుకుంటుంది.రామ రాజ్యంలోప్రజలు సుభిక్షంగా ఉండాలి కానీ ధరల పెరుగుదల వల్ల మరింత పేదలుగా తయారవుతున్నారన్నారు . సీత పుట్టిన నేపాల్ రాజ్యంలో లీటర్ పెట్రోల్ ధర 54 రూపాయలు ఉంటే ,రావణ రాజ్యంలో లీటర్ పెట్రోల్ ధర 52 రూపాయలు ఉంటే మరి రామరాజ్యంలో 94 రూపాయలు ఉంటే ఇది రామ రాజ్యం ఎట్లయితది అన్నారు.ఇది ఏం రాజ్యం పేద లు మోయలేని విధంగా ధరలు పెరిగితే ఈ మోడీ ప్రభుత్వం   రామ రాజ్యంఎలా అవుతుంది అన్నారు.కాబట్టి  మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి అన్నారు.అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే మోడీ ప్రభుత్వం చమురు ధరలు ఎందుకు పెంచుతున్నారని,అన్ని ప్రభుత్వరంగ సంస్థలు అమ్మే ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేద,మధ్య తరగతి ప్రజలను నిలువు దోపిడీ చేసే ప్రభుత్వాలుగా తయారైనవన్నారు. .రైతులను నల్ల చట్టాలతో నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించనిచో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరంతరంగా పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆటోకు తాడు కట్టి గ్యాస్ ధరలు   తగ్గించాలని ఆటోను కొంత దూరం లోగి ,కర్రాలతో వంట చేసి నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

మండలంలో మొదలైన నామినేషన్ల సందడి

 మండలంలో మొదలైన నామినేషన్ల సందడి




పెన్ పవర్, కోత్తపేట

కొత్తపేట  నియోజకవర్గం కొత్తపేట  మండలం లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మండలంలోని కమ్మి రెడ్డి పాలెం  గ్రామంలో వైయస్సార్ సీపీ మద్దతు తో  నాల్గవ వార్డు, వార్డు మెంబర్  గా ఆలమురి  రామ సీత బుధవారం నామి నేషన్ దాఖలు చేశారు. నామి నేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకు ముందు   రామ సీత  గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామంలో వార్డు మెంబర్ గా   పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ సీపీ  నాయకులు , అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...