Followers

దేవిశ్రీ పాటలే మనలని గెలిపిస్తాయి అవంతి శ్రీనివాస్..

 దేవిశ్రీ పాటలే మనలని గెలిపిస్తాయి అవంతి శ్రీనివాస్..




 పెన్ పవర్ న్యూస్ విశాఖపట్నం సీటీ 


 దేవిశ్రీ పాటలే మనలని గెలిపిస్తాయి అవంతి శ్రీనివాస్.....ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ పాటలు కార్పెరోషన్ ఎన్నికల్లో మన అభ్యర్థులు ను అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపిస్తాయిని అన్నారు వైస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు తో ఆయన సాహిత్యం సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో దేవిశ్రీ పాటలు ఉన్నాయని  వెయ్యి ప్రసంగాలు కంటే ఓ పాట సక్తివంతమనియాదని అన్నారు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పేద,సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అండగా ఉన్నారని ఏ కష్టం వచ్చినా ప్రజలకు భరోసా కల్పించడం తో పాటు పనులు చేసి అండగా ఉన్నారని తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో ఏవిదంగా భారీ మెజార్టీతో yscp అభ్యర్థులు ను గెలిపించారో మునిసిపల్ ఎన్నికల్లో అంతే మెజార్టీతో మన వాళ్ళని గెలి పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అక్కరమాని పదమవతి రమునైడు రెడ్డి అవంతి మహేష్ చిన బాబు, రమేష్,సురేష్  రాము ,చిన్న  తదితరులు పాల్గున్నారు....ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ పాటలు కార్పెరోషన్ ఎన్నికల్లో మన అభ్యర్థులు ను అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపిస్తాయిని అన్నారు వైస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు తో ఆయన సాహిత్యం సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో దేవిశ్రీ పాటలు ఉన్నాయని  వెయ్యి ప్రసంగాలు కంటే ఓ పాట సక్తివంతమనియాదని అన్నారు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పేద,సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అండగా ఉన్నారని ఏ కష్టం వచ్చినా ప్రజలకు భరోసా కల్పించడం తో పాటు పనులు చేసి అండగా ఉన్నారని తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో ఏవిదంగా భారీ మెజార్టీతో yscp అభ్యర్థులు ను గెలిపించారో మునిసిపల్ ఎన్నికల్లో అంతే మెజార్టీతో మన వాళ్ళని గెలి పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అక్కరమాని పదమవతి రమునైడు రెడ్డి అవంతి మహేష్ చిన బాబు, రమేష్,సురేష్  రాము ,చిన్న  తదితరులు పాల్గున్నారు

కన్నుల పండువగా బాలాజీ వేంకటేశ్వరస్వామి కల్యాణం..

కన్నుల పండువగా బాలాజీ వేంకటేశ్వరస్వామి కల్యాణం..

నేడు స్వామివారి రథోత్సవం..

ఉమ్మడి ఆదిలాబాద్ , పెన్ పవర్


  కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కల్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది . స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య కల్యాణ వైభవాన్ని కడు రమణీయంగా నిర్వహించారు.రెండవ తిరుపతిగా పేరుగాంచిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు , తలంబ్రాలు , కంకణాలు , ప్రసాదాలు రాగా ఆలయ అర్చకులు టీటీడీ సభ్యు లకు ఘనస్వాగతం పలికారు. జాతర మొదటి రోజు భారీగా తరలిచ్చిన భక్తులు గుహలో ఉన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చు కున్నారు. కల్యాణ మహోత్సవంలో పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.రెబ్బెన యంపిపి సౌందర్య ఆనంద రావు, గంగాపూర్ సర్పంచ్ పందిర్ల వినోద మదునయ్య,ఆలయ చెర్మన్ వోలువోజు వెంకటేశం హారిత,మాజీ ఆలయ చెర్మన్ గుర్లే చంద్రయ్య దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి  పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారిని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, పిఎస్సిఎస్సి చైర్మన్ సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగ మహేష్ గౌడ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్న సోమశేఖర్, నవీన్ జైస్వాల్,మోడెం సుదర్శన్ గౌడ్,పల్లె రాజేశ్వరరావు ఆసిఫాబాద్ అచ్చేశ్వర్ రావు పలువురు దర్శించుకు న్నారు.బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వ హించే మూడు రోజుల జాతర మహోత్సవం లో నేడు రథోత్సవం నిర్వహించనున్నారు . నేటి సాయంత్రం 6.15 గంటలకు గంగాపూర్ వాగు లో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ బాపిరెడ్డి, చెర్మన్ వలువోజు వెంకటేషం చారి కమిటీ సభ్యులు వినోద్ జైశ్వాల్,రాపాల శ్రీనివాస్,మడే చిన్నయ్య,ఇగురపు పర్వతాలు, అడె శంకర్ ,గోగర్ల చంద్రకళ తెలిపారు . రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరానున్నట్లు అంచనా స్వామి దర్శనం కోసం ఆలయ కమిటీ ధర్మదర్శనంతో పాటు శీఘ్ర దర్శనం , ప్రత్యేక దర్శన సదుపాయాలను కల్పించింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . మండల కేంద్రం నుంచి గంగాపూర్‌లోని ఆలయం వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అడుగ డుగునా పోలీసు సిబ్బందికి విధులు అప్పగించారు . నంబాల రైల్వే గేట్ తో పాటు ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు , జాతరలో అల్లర్లు , అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు . ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్ రావు నేతృత్వంలో రెబ్బెన సీఐ అడప సతీష్ రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్,వాంకిడి ఎస్ఐ దికోండ రమేష్,తిర్యాణి ఏస్ ఐ రామరావు తో పాటు పలువురు పోలీసులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.. 

మన విజయం - మన వార్డు - అభివృధ్ధి 46 వార్డు లో దూకుడుగా సాగుతున్నా ఎన్నికల ప్రచారం కటుమురి సతీష్

మన విజయం - మన వార్డు - అభివృధ్ధి 46 వార్డు లో దూకుడుగా సాగుతున్నా ఎన్నికల ప్రచారం కటుమురి సతీష్ 



పెన్ పవర్ న్యూస్ విశాఖపట్నం 


 ఈరోజు విశాఖ ఉత్తరనియోజకవర్గం 46 వార్డు సంజీవయ్యకోలని లో ఎన్నికల ప్రచారం నార్త్  ఇంచార్జ్ కె.కె రాజు బలపరిచిన  ఆశీస్సులతో   ప్రచారంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన   రాష్ట్ర రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు గుంటూరు డిస్ట్రిక్ట్ వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైన మెరుగు నాగార్జున గారు పాల్గోన్నారు 46 వార్డు వైసిపి పార్టి అభ్యర్ధిగా కటుమురి సతీష్ ని ప్రజలు ఆశీస్సులు దీవేనలు తీసుకుంటు జోరుగా హృషారగా ప్రచారం సాగింది కటుమురి సతీష్ మట్లడుతూ నేను రాజకీయలకీ రావడం ప్రజలు సేవచేయ్యలి ప్రజలు కష్టలు  లేకుండ మన వార్డుని అభివృధ్ధి చేయ్యలి  మన వార్డు లో ఏ ప్రోబలంవున్నా సమస్యలు వున్నా పేదవాడికీ  చేదుడో వాదుడుగో నేనువుంటను ప్రతిఒక్కరు నాకు సహకరించి మనవార్డూని అభివృధ్ధీలోకి తిసుకువస్తానూ 46 వార్డు సంజీవయ్యకోలని లో గ్రామస్తులు బ్రహ్మరధం పట్టారు తమ అభిమాన నాయకడు అందరివాడు కటుమురి సతీష్ కీ జై అంటు మార్మోగించారు ప్రతి ఇంటా మహిళలు మంగళహారతులతో  ఘన స్వాగతం పలికారు  ఈ సందర్భంగా ఆయన ఇంటికీంటికీ వేళ్ళి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నా సంక్షేమ పధకాలు వివరిస్తు వార్డు ని అభివృధ్ధి కీ తాను కట్టుబడి ఉంటాను ఈ జీవియంసి ఎన్నికల్లో తననూ కార్పోరేటర్ గా అత్యధిక మెజార్టితో గెలిపించాలని కోరారు మియొక్క అమ్యులమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయ్యలని అభ్యర్ధించారు  కటుమురి సతీష్ ప్రచారంలో అనూహ్య స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వార్డు ఎన్నికల పరిశీలకు కె.వి బాబా  మాజీకార్పోరేటర్ సేనాపతి అప్పారావు ,కె,చిన్నా, బి గోవింద్ రాజు ,ఎన్ కృష్ణ ,,దూదీ నర్శింగ్ రావు ,ఎమ్ వి రమణ, గంబారపు అప్పారావు ,కె లావణ్య , సుజాత ,కె ఈశ్వరరావు , సితయ్యరెడ్డి ,కె రామరావు ,బాబురావు,  ,ఎన్ ఈశ్వరరావు ,వి శ్రీను  ,దుర్గభావని ,ఆశోక్ , తారేకెష్  ,కృపారావు,శేఖర్  ,రమణరెడ్డి , ,శ్రీనూ ,జాని,రవి,యువకలు 

అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

 పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

బెల్లంపల్లి నియోజకవర్గం , పెన్ పవర్


దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా

 తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా                

టీజెఎస్ నేత  ప్రొఫెసర్ కోదండరాం

నెల్లికుదురు,పెన్ పవర్. 

కేసీర్ సార్ మీరు కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా?అయినప్పుడు ప్రజల అవసరాలకు కావలసినవి మేం అడుగుతే తప్పేంటి?అని టీజేఎస్ పార్టీ  అధ్యక్షులు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ  అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహుబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం  అంబేద్కర్ సెంటర్లో హాజరైన పట్టభద్రులు, ప్రజలను  ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అణచివేత ధోరణి పాల్పడుతోందని ఇదేమిటని అడిగితే అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో  కనీసం చెప్పకపోవడం దారుణమన్నారు.నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇంతవరకు  ఏమి నెరవేర లేదన్నారు.తాము పదవుల కోసం మాట్లాడడం లేదని పదవి కావాలంటే ఏనాడో అడిగి తీసుకునే వాడిని అని జయశంకర్ సార్ కోరిక మేరకే ప్రజల పక్షాన కొట్లాడుతున్న అన్నారు.ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోందని నియంత్రిత సాగు పేరుతో రైతుల ను ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.ఉద్యోగులకు నిరుద్యోగులు వెరసి అన్ని వర్గాల ప్రజల పక్షాన మరింతగా పోరాడి సమస్యలను సాధించుకోవడానికి తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.అనంతరంస్థానిక ప్రభుత్వ కళాశాల పాఠశాలలో నీ అధ్యాపకులు ఉద్యోగులను తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు . ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ,నాయకులు పిల్లి సుధాకర్ ఆరుద్ర పరమాత్మ చారి ఇరుగు మనోజ్ రాజ కు మార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

అంబిర్ చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

 అంబిర్ చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

కూకట్ పల్లి,పెన్ పవర్



ప్రగతినగర్ అంబీర్ చెరువు సుందరీకరణ పనులను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు యాదవ్ తో కలిసి పరిశీలించిన  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తితో శుక్రవారం అంబిర్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వేగవంతం చేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, గోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్, జోగిపేట్ భాస్కర్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కొల్లి సింహాచలం కు ఘనస్వాగతం పలికిన కోటవీది ముస్లిం పెద్దలు,స్థానికులు

కొల్లి సింహాచలం కు ఘనస్వాగతం పలికిన కోటవీది ముస్లిం పెద్దలు,స్థానికులు




మహారాణి పేట, పెన్ పవర్



39 వ వార్డు లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం కోటవీధి ముస్లిం  ఆజి అబు సరంగి మసీద్  దగ్గర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు ఘనస్వాగతం పలికారు.39వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థి కోల్లి సింహాచలం ముస్లిం ఆజి అబు సరంగి మసీద్ కి వెళ్లి  అక్కడ ప్రార్థనలు చేసి అనంతరం అక్కడ ఉన్న మత పెద్దలు, కలిసి  జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలిపించ వలసినదిగా ప్రతి ఒక్కరిని కోరారు.శుక్రవారం సందర్భంగా స్థానిక ముస్లిం మహిళల తో కలిసి  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. స్థానిక మహిళలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...