Followers

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. కరోనా లేని రాష్ట్రంగా చేద్దాం..

 డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

తార్నాక, పెన్ పవర్ 

కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్నందున కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ వేసుకొని మాస్కు,, శానిటైజర్ ఉపయోగించుకోవాలని,  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. బుధవారం తార్నాక డివిజన్ లాలాపేట్ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో కరోణ వ్యాక్సినేషన్ ను పరిశీలించారు. వాక్సిన్ చేసుకోవడానికి వచ్చిన వారిని శ్రీలత శోభన్ రెడ్డి పలకరిస్తూ వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని ధైర్యంగా వ్యాక్సిన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని తిరిగి పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుక రావాలని,  అధికారులకు , వైద్యులకు  సూచించారు. 

ఎటపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, పంపిణీ

 ఎటపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, పంపిణీ

ఎటపాక,పెన్ పవర్

బుధవారం ఎటపాక ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్  గీతారామకృష్ణ  చేతుల మీదుగా కోవిడ్ - 19 నివారణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్లబ్ సభ్యులు మాస్కులు , శానిటైజర్లను ఉచితంగా అందజేశారు. అనంతరం నేళ్ళిపాక లో కరోనా పై అవగాహనర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పి. మోహన్ రావు , ప్రధాన కార్యదర్శి అంబోజి. రా మ్ కోశాధికారి వై.రాంబాబు , ఉపాధ్యక్షులు గూడపాటి.రవికుమార్ , గౌరవ సలహాదారులు ఎస్.కె.షబ్బీర్ , వసంతాల.రమేష్ , కె.వెంకట్ , టి.రాజేష్ , పి.రాంబాబు , న్యాయ సలహాదారు టి.మల్లికార్జునరావు , జి.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తాం: డిప్యూటీ మేయర్

 జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తాం: డిప్యూటీ మేయర్

తార్నాక ,  పెన్ పవర్ 

జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తామని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం లాలాపేట్ జయశంకర్ స్టేడియం ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి డిప్యూటీ మేయర్ పరిశీలించారు. అనంతరం మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక తెరాస నేతలు, తదితరులు  పాల్గొన్నారు.

వైయస్సార్ బీమా రెండు లక్షలు అందజేత

 వైయస్సార్ బీమా రెండు లక్షలు అందజేత

 గోకవరం,పెన్ పవర్

గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళకు వైయస్సార్ బీమా పథకం కింద మంజూరైన రెండు లక్షల రూపాయల సహాయం  మంజూరు పత్రాలను ఆ గ్రామ సర్పంచ్ విజేత బత్తుల వెంకట రామకృష్ణ (శ్రీను)  బాధిత కుటుంబానికి అందజేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారంతో ఈ మంజూరు లభించిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అచ్యుతాపురం గ్రామానికి చెందిన బత్తుల వెంకటరమణ ఇటీవల మృతిచెందటంతో ఆయన సతీమణి అంజలికి  ఈ మంజూరు పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో వార్డ్ నెంబర్ జాజుల రామకృష్ణ   తదితరులు పాల్గొన్నారు.

వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ జెండా

వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ జెండా

 పెన్ పవర్,ఆత్రేయపురం

 వాడపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జాతీయ జెండాను రూపుదిద్దిన పింగళి వెంకయ్య చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ ఖద్దరు మాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ జాతీయ జెండాకు 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా  పింగళి వెంకయ్య ను  స్మరించుకుంటూ ఆయన ఆ రోజు మన భారత దేశానికి ఒక జెండా ఉండాలని భావించి రూపుదిద్దిన రూపకర్త   ఆయనను స్మరించుకుంటూ పాఠశాలలో విద్యార్థులు  100 జాతీయ జెండాల ను గిసి ఆయనకు ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సురేష్,  రమణ రావు శ్యామ్ కుమార్ లు పాల్గొన్నారు.

వైసిపి నాయకులు నక్కా చిట్టిబాబు కి కోవిడ్ వ్యాక్సిన్

వైసిపి నాయకులు నక్కా చిట్టిబాబు కి కోవిడ్ వ్యాక్సిన్

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి పిహెచ్సి లో బుధవారం వైసిపి సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకోవడం జరిగింది. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ కరోన రెండవసారి విజృంభిస్తున్న నేపథ్యంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ వైద్యుల సలహాతో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిదని తెలిపారు. ప్రతిఒక్కరు బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, తరచు చేతులు శుభ్రపరచుకోవడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చునని గ్రామ పెద్దగా తెలియజేశారు.

జాతీయ జెండాకు వందేళ్లు

జాతీయ జెండాకు వందేళ్లు 

 తాళ్లపూడి, పెన్ పవర్

 జాతీయ జెండాకు రూపకల్పన చేసి నేటితో వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక శ్రీ విజేత ఉన్నత పాఠశాల నందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మోపిదేవి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండాకు విద్యార్థులు గౌరవం వందన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. జె వి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. కేంద్ర  ప్రభుత్వం జెండా రూపకర్త పింగళి వెంకయ్య కు భారతరత్న ప్రదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట్, అనిత, కరిష్మా, స్వాతి, రేష్మా, భ్రమరాంబ, కరుణ విద్యార్థులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...