ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ
Followers
ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ
ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్" పై సదస్సు
ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్" పై సదస్సు
గండేపల్లి పెన్ పవర్
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ నందుస్టాక్ మార్కెట్ పై వర్చువల్ మోడ్ లో అవగాహనా సదస్సు నిర్వహించినట్లు డైరెక్టర్ డా. ఎన్.సుగుణారెడ్డి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో షైన్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్వాహకులు "శ్రీహర్ష"గారు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులలో అవగాహనా కల్పించినట్లు ఆమె తెలియజేసారు. ఈ సందర్భంగా శ్రీ హర్ష ఆన్ లైన్ ద్వారాసదస్సులో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూఅభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందువరుసలో ఉందని,అలాగే దేశంలో పెట్టుబడిదారులు అత్యధికులు స్టాక్ మార్కెట్ నందు పెట్టుబడులు పెడుతున్నారని,తద్వారా వారు మెరుగైన లాభాలను పొందుతున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె విధానం స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు క్షుణ్ణంగా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా వివరించారు. మనదేశ స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన బి.ఎస్.ఇ,(బొంబాయిస్టాక్ ఎక్స్చేంజి)మరియు ఎన్.ఎస్.ఇ,(నేషనల్ స్టాక్ఎక్స్చేంజి)లలోవాటాదారులు వాటాలను కొనుగోలు మరియు అమ్మకం పద్దతులను గురించి వివరించారు. విద్యార్థులు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు(ఇన్వెస్ట్) మరియు అమ్మకం ద్వారా లాభాలు (రిటర్న్స్)ఆర్జించడం ఎలా అనే విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డా. సుగునా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధి పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని అందుకే ఆదిత్య విద్యార్థి సర్వతో ముఖాభివృద్దికి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. విజ్ఞాదాయకంగా జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.డి.ఆస్ధాశర్మ, డా. ఎన్.విశాలాక్షి, ఉపాధ్యాయ సిబ్బంది, బి.బి.ఏ,మరియు ఎం.బి.ఏ విద్యార్థులు పాల్గొన్నారు.
యువతి అదృశ్యం.. కేసు నమోదు
యువతి అదృశ్యం.. కేసు నమోదు
పెన్ పవర్, రౌతులపూడి
రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన పసగడుగుల కృష్ణబాబు కుమార్తె శ్రావణ జ్యోతి వయసు 20 సంవత్సరములు గుమ్మరేగుల గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి నెల 25వ తారీకు ఉదయం 10 గంటలకు విధి నిర్వహణ కొరకు గ్రామ సచివాలయానికి తన ఇంటి వద్ద నుండి బయలుదేరి వెళ్ళింది. అదే రోజు ఉదయం పదకొండున్నర గంటలకు సచివాలయ సిబ్బంది యువతి తండ్రి కృష్ణ బాబు కి ఫోన్చేసి మీ అమ్మాయి డ్యూటీకి రాలేదని తెలిపారు. దీనితో కంగారుపడిన తండ్రి, కుటుంబ సభ్యులు గ్రామంలోని, ఇతర బంధువుల ఇళ్ళ వద్ద వెతికారు. అయినా యువతి ఆసూకీ లభించకపోవడంతో కోటనందూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్య ఘటనపై ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ ఎం. అశోక్ తెలిపారు.
రంపచోడవరం లో కోల్పోవద్దు...జెఏసి
రంపచోడవరం లో కోల్పోవద్దు...జెఏసి
అచ్చుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలు
అచ్చుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలు
గోకవరం, పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామం లో రెండవ నంబర్ అంగన్వాడి కేంద్రం లో బాలింతలు మరియు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అందించ వలసిన పోషక ఆహారాన్ని సక్రమంగా ఇవ్వడం లేదని గ్రామస్తులు కోరుకొండ ఐసిడిఎస్ పిడి కి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లాల వెంకన్నబాబు గ్రామస్థులతో కలిసి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రం నిర్వహణలో లోపాలు పై కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్లి సిడిఒ కు పిర్యాదు చేశారు. అనంతరం నల్లాల వెంకన్న బాబు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు సుమారు 100 మందివరకు ఉన్నారన్నారు. అయితే వీరికి ప్రభుత్వం అందిస్తున్న పోషకపదార్థాలను సక్రమంగా అందించడం లేదని ఆయన ఆరోపించారు. 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగ 15 గుడ్లు మాత్రమే ఇస్తున్నారని, రెండున్నర లీటర్ల పాలకు లీటర్ నర లీటర్లుమాత్రమే పాలు ఇస్తున్నారని, మూడు కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా రెండు కేజీల బియ్యం మాత్రమే ఇస్తున్నారని, అరకేజీ నూనె ఇవ్వాల్సి ఉండగా డబ్బా తో కలిసి ఇస్తున్నారని అన్నారు. రికార్డుల్లో మాత్రం మెనూ ప్రకారం ఇస్తున్నట్లు రికార్డు పూర్తిస్థాయిలో ఇస్తున్నట్లు నమోదు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అచ్చుతాపురం లోని రెండవ నెంబర్ కేంద్రంలో నిర్వహణ లోపాలపై విచారణ జరపాలని ఆయన కోరారు.
వైసిపి అభ్యర్ధులను గెలిపించండి
వైసిపి అభ్యర్ధులను గెలిపించండి
- 25, 26 వార్డులలో జమ్మీలు విస్తృత ప్రచారం
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీలో 25, 26 వార్డులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. 25 వ వార్డు అభ్యర్థి దేవత అరుణ, 26 వార్డ్ అభ్యర్థి రుత్తల శ్రీనివాసరావు లకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గతంలో సన్యాసిపాత్రుడు దంపతులు ప్రాతినిధ్యం వహించిన వార్డులే కావడంతో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని కోరారు. రాబోయే రోజులలో వార్డులను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 26 వ వార్డులో సన్యాసిపాత్రుడును సాదరంగా ఆహ్వానించారు. తప్పక మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రచారంలో చెరుకూరి సత్యనారాయణ, యువనాయకుడు చింతకాయల వరుణ్, లోకవరపు శారద, కర్రి రాంగోపాల్ , మీసాల సత్యనారాయణ, దాడి బుజ్జి , ఆరుగొల్లు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్ నగర్ లో రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం
కాగజ్ నగర్ లో రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం
మంచిర్యాల బ్యూరో, పెన్ పవర్
దళితులను అవమానపరిచి దళితుల ముస్లిమ్ ల ఆహార వ్యవహారపై అనుచిత వాఖ్యలు చేసిన రాజాసింగ్ శాషన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావణ్ ఆధ్వర్యంలో లో కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేశారు.
రాయడానికి వీలు లేని బూతులు తిట్టడాన్ని భీం ఆర్మీ తీవ్రంగా ఖదిస్తుందని, ఒక వైపు దళితులను కన్న తల్లులని తిడుతూ మరో వైపు భారత మాతకు జై అంటున్న రాజసింగ్ దొంగయని, దొంగ దేశ భక్తిని ప్రద ర్షిస్తున్నడు ఆవు పేరుతో దైవ భక్తి కూడా వట్టిదే దాని వెనుక దళితులు మైనార్టీల పై దాడులు చేయాలనే కుట్ర ఉందని పోలీసుల నిర్లక్ష్యంతో నే రాజసింగ్ రెచ్చిపోతున్నాడన్నారు. పరుష పదజాలంతో వ్యాఖ్యాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేవ్యాఖ్యలు రాజసింగ్ కు పరిపాటిగా మారిందని, రాజ్యాంగాన్ని ,దళితులను కించపరిచిన రాహసింగ్ పట్ల పోలీస్ లు ఉపెక్షి స్తే సహించేది లేదని భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రావణ్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో భరత్,మదాస్ నగేష్,ఇప్పా రవిశంకర్,దిలీప్,నక్క ప్రభాకర్,శ్రీను తదతరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
-
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు. సంతబొమ్మాలి, పెన్ పవర్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చ...