Followers

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి

 ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి  వనపర్తి జిల్లా ఎస్పీ

వనపర్తి,పెన్ పవర్

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వరావు  సూచించారు. శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు విధులు నిర్వహించేపోలీసు అధికారులు, సిబ్బందితో  సంగం పంక్షన్ హాలులో వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వరావు  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ కు తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.  ముఖ్యంగా సమస్యాత్మక,  కేంద్రాల వద్ద పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలోని సిసి కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.  బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఎక్కడైనా సమస్య తలెత్తితే నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.వనపర్తి జిల్లా వ్యాప్తంగా 31 పోలింగ్ కేంద్రాలకు గాను 06 రూట్లను ఏర్పాటు చేసి 250 మంది  సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

అదనపు ఎస్పీ౼1

డిఎస్పీలు ౼ 01

సిఐలు  ౼ 04, 

ఎస్సైలు ౼ 18 

ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్,  మహిళా కానిస్టేబుల్స్, హోమ్ గార్డులతో పాటు  ఏ.ఆర్. సిబ్బంది మొత్తం 250 మంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ  వివరించారు.  పోలింగ్ ప్రశాంత నిర్వహణలో ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో   వనపర్తి డిఎస్పీ,కె యం. కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ, శ్రీనివాస్, కొత్తకోట సీఐ, మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూర్ సీతయ్య, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలులో రాజీ పడే ప్రసక్తే లేదు

 మధ్యాహ్న భోజన పథకం అమలులో రాజీ పడే ప్రసక్తే లేదు

పెన్ పవర్,విశాఖపట్నం

 మధ్యాహ్న భోజన పథకం అమలులో రాజీ ప్రసక్తే లేదని జిల్లా విద్యాశాఖ అధికారి  లింగేశ్వర రెడ్డి అన్నారు. శనివారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఏజెన్సీలోని మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక నిబంధనలతో మెనూచార్ట్ ను  అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  మధ్యాహ్నం భోజనం  అమలులో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకున్న సహించేది లేదన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూర్చాలని  ఇంప్రూమెంట్ ఏజెన్సీలు ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించిన  ఎం ఈ వో లు స్పందించకపోయినా  చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలంలో ఎం ఈ ఓ లు భోజన పథకాన్ని తనిఖీలు చేయాలని డి ఈ ఓ ఆదేశించారు. ఎప్పటికప్పుడు మిడ్ డే మీల్స్ సమాచారాన్ని తనకు చేరవేయాలని ఎటువంటి ఆ లక్ష్యం జరిగిన సహించేది లేదని డీఈవో లింగేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐటీడీ ఏ పీవో  వెంకటేశ్వర్  సలిజామల  ఏజెన్సీలోని ఎం ఈ ఓ హెచ్ ఎం లు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి

 మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి

అరకు, పెన్ పవర్

అరకువేలి మండలం మాడగడ పంచాయతీ కి చెందిన హట్టగుడా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య  ప్రేమ్ కుమార్ మండల నాయకులు గుంజిడి సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం గ్రామాన్ని పరిశీలించి ఆ గ్రామ ప్రజలతో మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.వారికి మరిముఖ్యంగ తాగే మంచినీటి సమస్య ఉన్నట్లుగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఆ గ్రామ ప్రజలతో మహిళలు  పిల్లలు కాలి బిందెలు పట్టుకొని రోడ్ షో నిర్వహించి 170 గడపలు సుమారు 600 పైన జనాభా గల ఈ గ్రామంలో చాలా కాలం నాటి నుండి మంచినీటి సమస్య తో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని, ఉన్న కొద్దిపాటి ఊట నీరు చాలా దూరం లో పొలాల మధ్య ఉంది అది వర్షాకాలంలో మురికి నీళ్లు గా మారుతున్నాయని అది తాగడం వల్ల గ్రామంలో చాలా మంది జబ్బులకు విష జ్వరాలకు లోనయి హాస్పిటల్ పాలవుతున్నారని కనీసం మంచినీరు కూడా కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అందుకు ఉన్నతాధికారులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారు విశాఖపట్నం జిల్లా  కలెక్టర్ వారు ఈ గ్రామాన్ని సందర్శించి  మంచినీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గొల్లోరి పైడన్న,చలానా గౌరీ,గరం సుంక్ర,పడాల అప్పారావు,బి బుల్లమ్మ,పడాల కాంతమ్మ,పడాల శైలజ,ఆ గ్రామ పెద్దలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో గ్రామ స్థాయి నుండి యువనాయకత్వాన్ని బలోపేతం చేస్తాం...

 పార్టీలో గ్రామ స్థాయి నుండి యువనాయకత్వాన్ని బలోపేతం చేస్తాం...

విశాఖపట్నం, పెన్ పవర్

పార్టీలో గ్రామ స్థాయి నుండి యువనాయకత్వాన్ని బలోపేతం చేస్తాం.వెన్నుపోటు రాజకీయాలను సహించం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్.రానున్న రోజుల్లో పార్టీలో యువనాయకత్వాన్ని పెద్దఎత్తున బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ,శాసన మండలి సభ్యులు బుద్ద నాగ జగదీష్ అన్నారు.పార్టీలో ఉంటూ వెన్నుపోటు రాజకీయలను చేస్తున్న నాయకులను సహించేదిలేదని తెలిపారు.కొన్ని గ్రామాలలో తక్కువ ఓట్ల వత్యాసంతో ఓడిపోయినందుకు భాద కలిగించందని అన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ గెలుచుకోవడం ఖాయం అని అన్నారు.ఈ రోజు గవరపాలెంలో స్థానిక మళ్ళ జగన్నాధం కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో వారు పాల్గొన్నారు. 

అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన నాయకులని వదిలిపెట్టమని అన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, కొణతాల సావిత్రి- శ్రీనివాసరావు, పచ్చికూర రాము, బుద్దిరెడ్డి చిన్నా,ఎల్లంకి సత్తిబాబు,నడిపల్లి గణేష్,సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, ఉగ్గిన రమణ మూర్తి,కడిమిశెట్టి నరసింగ రావు, మువ్వల అప్పల నాయుడు, అక్కిరెడ్డి రమణ బాబు, రేబాక ప్రసాద్,కర్రీ బాబీ,సిద్దిరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తుంది

రాష్ట్రాన్ని కేంద్రం చిన్న చూపు చూస్తుంది

మహారాణి పేట, పెన్ పవర్

ఆంధ్రరాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం  చిన్న చూపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆవేదన వ్యక్తం చేసారు. శనివారం పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద  చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మద్దతుగా రమణి కుమారి ఒక ప్రకటన విడుదల చేసారు.ఆంధ్రప్రదేశ్ కు అడుగడుగునా అన్యాయంచేస్తున్నారని ఆ ప్రకటనలో విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా విశాఖ ఉక్కును వంద శాతం ప్రవేటీకరణకు పూనుకొంటున్నామని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు అద్దంపడుతోందన్నారు.పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విభజన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు.న్యాయబద్దంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారన్నారు.పోలవరానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. 

రైల్వే జోన్,మెట్రో రైల్ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు.ప్రత్యేక హోదా,రైల్వే జోన్,విశాఖ ఉక్కు పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.న్యాయబద్దంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను,హక్కుల కోసం పోరాటం చెయ్యాల్సిన జగన్ స్వంత ప్రయోజనాలకోసం మోడీ ముందు మోకరిల్లుతున్నారని రమణి కుమారి దుయ్యబట్టారు.కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలుపుతుందని,ప్రత్యేక హోదా సాధించేంతవరకూ,విశాఖ ఉక్కు ప్రవేటీకరణ రద్దుచేసేంతవరకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.

వేల కోట్ల నిధుల మళ్లింపు

 వేల కోట్ల  నిధుల మళ్లింపు,  దుర్వినియోగం జరుగుతోంది

...బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

తెలంగాణ ,పెన్ పవర్

 పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ గనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపినారు .అందులో ప్రధానంగా సింగరేణి సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆరు సంవత్సరాల నుండి పన్నుల రూపేణా సుమారు రూ 15011 కోట్లు,కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొరకు రూలు 230 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కొరకు 2739 కోట్లు మొత్తం రూపాయలు 17980 కోట్లు పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయల నిధుల మళ్లింపు నిధుల దుర్వినియోగం జరుగుతోందని అందుకే సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్సుల పై  ఆదాయపన్ను సింగరేణి యాజమాన్యం కార్మికులకు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని అలాగే ఆదాయపన్ను ప్రతి ఏటా 250 కోట్ల రూపాయల పన్ను కార్మికులకు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేసినారు సింగరేణికి రావలసిన విద్యుత్ బకాయిలను రూ 15 వేల కోట్ల రూపాయలు వెంటనే సింగరేణి యాజమాన్యానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంతింటి పథకం అమలు చేయడానికి కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పెడుతున్నా పన్నుల నుండి నిధులు కేటాయించి సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు జిల్లాల గ్రామాలకు పట్టణాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని దుబారా ఖర్చులను తగ్గించాలనే అని కొత్త ఉద్యోగాలు రావడానికి నూతన బొగ్గు గనులకు నిధులు కేటాయించాలని తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఫిట్ కార్యదర్శి సిరిపురం నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు పెండెం సత్యనారాయణ, తాట్ల లక్ష్మయ్య  కందుల నరహరి, గంధం ధర్మయ్య, గాలి పెళ్లి తిరుపతి, పోతరవేణి విజయ్ కుమార్, బోడకుంట రాజేశం, తడగొండ నరసయ్య,సాయవేణి సతీష్, వై కోటయ్య ఎస్ పర్వతాలు కె బిక్షపతి,ఎన్. గంగారాం, కె మహేష్ జి చంద్రమౌళి  జి నరేష్ జి వెంకటేష్ ఎం నరేందర్ మేకల రవీందర్ ఎం వర్మ ఏ ప్రవీణ్ జి కిషన్ తదితరులు పాల్గొన్నారు

నేడే పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్

 నేడే పెద్దాపురం ఆర్డీఓ  కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్

పెద్దాపురం,పెన్ పవర్

పెద్దాపురం పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డిఓ ఎస్ మల్లిబాబు  తెలిపారు శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ విలేకరులతో మాట్లాడుతూ  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని దీనికి సంబంధించి 8 టేబుల్స్ ఏర్పాటు చేశామని, నాలుగు రౌండ్లు ద్వారా కౌంటింగ్ పూర్తి అవుతుందని  తెలిపారు . ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

 కౌంటింగ్ సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ లకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకమైన కౌంటింగ్ పాసులు జారీ చేశారని చెప్పారు. గుర్తింపు పొందిన ఐడి కార్డు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్  హలు లోప్రవేశం ఉంటుందని చెప్పారు. సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు గాని  కౌంటింగ్ హాల్లోకి అనుమతించమని తెలిపారు . మీడియ సెంటర్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కు సమాచారం అందజేయడం జరుగుతుందని తెలిపారు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకుచర్యలు తీసుకున్నామని ఆర్డిఓ తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...