Followers

అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

 అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

తాండూర్, పెన్ పవర్

 మార్చి 16 నుంచి 30 వరకు పోషణ పక్వాడ్ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మాదరం సెక్టార్ లోని 32 మరియు కన్నల సెక్టార్ లోని 25 సెంటర్లలో ఈ రోజు అన్ని సెంటర్లలో సెంటర్లను శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నారు. తాండూరు మండల లోని నీలాయపల్లి ఒడ్డార కాలనీ అంగన్వాడీ సెంటర్ కి వైట్ వాష్ చేయించము. అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు ఉమారాణి,సువర్ణ, ధనలక్ష్మి, యాదలక్ష్మి, మీనా,అనసూర్య, విజయ, నాగమణి మరియు ఆయా పాల్గొన్నారు.

చేయూత ద్వారా రూ 55 వేలు ఆర్థిక సాయం

చేయూత ద్వారా రూ 55 వేలు ఆర్థిక సాయం

పెన్ పవర్,  కరప

కరప మండలం గురజానపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు కోన సాయికుమార్ వైద్యానికి చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ రూ 55,555 లు ఆర్ధిక సాయమందించారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సాయికుమార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు ఎం.రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎంఎ అలీమ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చింతా నారాయణమూర్తి, భాషా, విజయ్ లు తమ సంస్థ సభ్యులతో చర్చించి, విరాళాలు సేకరించారు. మంగళవారం గ్రామ సర్పంచ్ అనసూరి శ్రీనివాసరావు తదితర గ్రామస్తులతో కల్సి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

 ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

తార్నాక,  పెన్ పవర్

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఫై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నాచారం లో అంబెడ్కర్ ఐడియాలజీ నేతలు ఖండించారు.  డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దుతగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా  అంబెడ్కర్ ఐడియాలజి నేతలు మాట్లాడుతూ కొందరు మతం ముసుగులో తన వీడియోలను మార్ఫింగ్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరని  దాన్ని ఖండిస్తున్నామన్నారు.  డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు కోసం బాటలు వేస్తున్న తీరు అందరికీ తెలిసిందేనని, అంతటి గొప్ప త్యాగం చేస్తున్న అధికారిపై కొందరు సంఘ విద్రోహశక్తులు, పనిగట్టుకుని మరీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుపడుతున్నారని, వీరి ఆటలు సాగవని హెచ్చరించారు. అదే విధంగా తన వీడియోలను మార్ఫింగ్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎం సి కేశవులు, గౌడవెల్లి  రామకృష్ణ , నల్ల రాధాకృష్ణ, కోరపాక్  అంజయ్య , ఎలా సంతోష్ కుమార్, హరి బాబు ,శ్రీ రామ్ సత్యనారాయణ , తిరుపతి, సురేష, రఘు, మహేందర్ , మహేష్, రవి, ప్రభాకర్, రామ్ చందర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

కేశపట్నం, మొలంగుర్, వీణవంక మీదుగా బస్ సౌకర్యం కల్పించాలి

  కేశపట్నం, మొలంగుర్, వీణవంక మీదుగా  బస్ సౌకర్యం కల్పించాలి

 బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్.

కరీంనగర్,  పెన్ పవర్

కరీంనగర్ నుండి జమ్మికుంట వయా కేశపట్నం, మోలంగూర్, వీనవంక ల మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ , జిల్లా కలెక్టరేట్ పరిపాలనాదికారి లక్ష్మారెడ్డి కి   బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మానకొండూరు మండలంలోని చెంజర్ల, దుద్దెనపల్లి గ్రామాలకు,  శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్డినరీ బస్సు, బస్సు సౌకర్యము లేక ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, అట్టి దారిలో గట్టుదుద్దెనపల్లి ఆంజనేయస్వామి ఆలయం, మొలంగూర్ ఖిల్లా పర్యాటక ప్రాంతంలు ఉన్నవి, తరచూ వెళ్ళే సందర్శకులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ నుంచి జమ్మికుంట వయా చెంజర్ల, కేశవపట్నం, మొలంగూర్, వీణవంక ల మీదుగా మూడు ఆర్డినరీ బస్సులను ఏర్పాటుచేసి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా  అట్టి ప్రాంతాలలోని 16 గ్రామాలకు ప్రత్యేక్షంగా, 12 గ్రామాలకు పరోక్షంగా మొత్తం 3 మండలాల ప్రయాణికులకు సౌకర్యం కల్పించిన వరవుతున్నారని బస్ సౌకర్యం కల్పించి అట్టి ప్రాంతాల అభివృద్ధికి దోహదపడగలరాని ఆర్ యం గారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి ప్రణీత్, జిల్లా కార్యదర్శి  లేంకల అనిల్, నియోజకవర్గ ఇంచార్జి బోయినపల్లి సాయి చంద్, పట్టణ ఉపాధ్యక్షులు శివ, దళిత నాయకులు బొయిని శ్రీనివాస్, నిరుద్యోగ జాక్ నాయకులు పొత్తూరి శేఖర్, అమ్మిగాల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలకు రక్షణ లేదు

 ఆడపిల్లలకు  రక్షణ లేదు

 బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్ ,  పెన్ పవర్

తెలంగాణరాష్ట్రం లవ్ జిహాద్ కు అడ్డా గా మారిందని, రాష్ట్రంలో ఆడపిల్లలకు మహిళలకు భద్రత లేకుండా పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి విమర్శించారు . బైంసా లో మూడు సంవత్సరాల చిన్న పాపపై   అత్యాచారం చేసిన నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మహిళల పట్ల టిఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయ శ్రీ వేణు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట  ధర్నా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ఆడపిల్లల కు  రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందన్నారు. బైంసా లో మూడు సంవత్సరాల చిన్నారి బాలిక పై అత్యాచారం జరిగిన ప్రభుత్వం మొద్దు నిద్ర లో ఉందన్నారు.మైనారిటీ బాలికకు  శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్, హిందూ పసిపాపకు జరిగిన దారుణంపై పెదవి విప్పకపోవడం   దుర్మార్గమన్నారు.తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లవ్ జిహాద్ కు అడ్డాగా  మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వోటు బ్యాంకు రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని . , బాధితుడికి భరోసా కరువై బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే.. నిందితులు మాత్రం టిఆర్ఎస్ పాలనలో కాలర్ ఎగర వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు . ఒక ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఘటన  వెలుగులోకి వస్తుందని.,. తెలంగాణ రాష్ట్రంలో  హిందువులపై జరుగుతున్న దాడి. విషయాల్లో రక్షణ కల్పించాల్సిన పోలీసులు..  చోద్యం చూస్తున్నారనిఆయన అన్నారు.  భైంసా లో జరిగిన సంఘటనలు సభ్య సమాజానికి మంచిది కాదని, పసి బాలికపై అత్యాచారం  వేసిన విషయంలో స్థానికంగా పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల భద్రతపై, ఆడపిల్లల రక్షణ పై సోయి లేకుండా పోయిందని మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మహిళల భద్రత కొరకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బైంసాలో అత్యాచారానికి గురైన చిన్నారి పాపకు సరైన న్యాయం చేయాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్ నక్క పద్మ ,బండ రమణారెడ్డి,కటకం  లోకేష్ ప్రవీణ్ రావు ,మాడుగుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు శిల్ప వేదం గొట్టిముక్కుల ఉమారాణి దండ రమాదేవి చైతన్య సుంకే యశోద అన్నపూర్ణ చంద్రకళ పద్మ ప్రేమలత కన్నాంబ భారతి తిరుమల రేఖ  ట్తదితరులు పాల్గొన్నారు.

కూలి పోతున్న... కరుణ లేదా.?

 కూలి పోతున్న... కరుణ లేదా.?

ఉపాధి కూలీలు పనిచేసినా డబ్బు లు రాలేదు

పని ఒకచోట మస్టర్ మరోక చోట

పనికి రాకపోయినా కొందరికి  మస్టర్లు

ఒకొక్క కూలి రోజుకు నుంచి రూ. 10, వారానికి రూ 100 వ‌సూలు

పెన్ పవర్,వలేటివారిపాలెం

పేద మధ్య తరగతి వర్గాలకు ఉపాధి హామీ పథకం పనులు ఎంతగానో దోహదపడుతున్నాయి. మార్చి నెల నుంచి  ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్న  క్రమంలో కూలీలు కాయ కష్టానికి తగిన ఫలితాన్ని అందించడంలో ఉపాధి హామీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు 3 నుంచి4 గంటల సమయం లో ఉపాధి సిబ్బంది ఇచ్చిన కొలతలు మేరకు పనులు చేసిన కనీస వేతనం లో సగం కూడా కూలీలకు దక్కడం లేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు. మండలంలో లింగ పాలెం, పోకూరు తదితర గ్రామాల్లో  కొంతమంది పనికి రాకపోయినా, వచ్చి కొలతల మేరకు పని చేయకుండా ఉపాధి సిబ్బంది చేతులు తడిపితే మాత్రం కనీస వేతనాలు పొందుతున్న సంఘటనలు ఉన్నాయని కూలీలు చెబుతున్నారు.  మరికొన్ని గ్రామాల్లో అయితే గతంలో చేసిన పనులను అంచులు చెక్కినా సరిపోతుందని క్షేత్ర సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు. ఉపాధి సిబ్బంది ఒక్కొక్క ఉపాధి కూలీ నుంచి రోజుకు 10 రూపాయలు, కొన్ని గ్రామాల్లో వారానికి 100  రూపాయలు వరకు ఉపాధి సిబ్బంది తీసుకుంటూ కూలీలకు కూలి 200 తగ్గకుండా వేస్తున్న సంఘటనలు కోకొల్లలు.  మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు మేము ఇచ్చుకోవాల్సి వస్తోందని కూలీలతో బహిరంగంగానే ఉపాధి సిబ్బంది చెప్పడం గమనార్హం.కొన్ని గ్రామాల్లో అయితే కూలీలతో పనులు జరిపించేది ఒక చోట. అదే కూలీలకు మస్టర్లు  మరొకచోట ఉపాధి సిబ్బంది వేస్తున్నారు.ఉదాహరణకు..మండలంలోని లింగపాలెం గ్రామంలో 70368 పని సంఖ్యలో పలువురు కూలీలు  ఈ నెల మొదటి వారం  పని చేశారు. పని చేసినట్లు ఈ మస్టర్ ద్వారా హాజరు వేశారు. అయితే  ఉపాధి సిబ్బందికి ముడుపులు ముట్టకనో  లేక మరొక కారణం చేతనో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ పని ప్రదేశంలో కూలీలు పని చేసినట్లు( యం. బుక్.) చేయక పోవడంతో కూలీలకు  కూలిపోయిందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.అలాగే కాకుటూరు పంచాయతీలో ఎండల తీవ్రత పెరిగే కొలది భూమిలో తేమ శాతం తగ్గుతుంది.  కూలీలకు మాత్రం కూలి పెరుగుదల కనిపించడం విచిత్రం గా ఉంది. ఓ కూలి 5 రోజులు పని చేసినందుకు గాను సుమారు రూ. 1,200  చెల్లించారు.ఈ విషయం పై ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రవి ని పెన్ పవర్ వివరణ కోరగా  368 వర్క్ ఐడి ప్రదేశం లో పని జరగలేదు. అక్కడ పని జరగకుండా కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్లు ఎలావేశాడో తెలియదు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 60సం"పై బడిన వారికి కరోనా వ్యాకినేషన్

 ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 60సం"పై బడిన వారికి కరోనా  వ్యాకినేషన్

 పెన్ పవర్, మరిపెడ 

బుధవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంస్త్రాల  పై బడిన మరియు 45 నుండి 60 సంవత్సరాలు లోపు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ (టీకా)  వేసినట్లు డాక్టర్  గుగులోతు రవి నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 90 మందికి వ్యాక్సిన్ వేసినట్లు  వారు  తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పి హెచ్ కోటేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ సునంద ఏఎన్ఎం సరళ, రాములమ్మ, లలిత, రోజామని తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...