ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు, దళిత ఐక్య వేదిక నాయకులు ఏసురత్నం, సీపీఐ కుత్బుల్లాపూర్ కార్యదర్శి మహేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్నలు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ ప్రాంతంలో స్వేరో సర్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక ముఖ్య నాయకులు ఏసురత్నం, సీపీఐ కుత్బుల్లాపూర్ కార్యదర్శి మహేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్నలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సుమారు 1000 గురుకుల పాఠశాలలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకుల పాఠశాలలో కులాలు, మతాలకు, అతీతంగా ఎస్.సి, ఎస్.టి, బీసి, ఓసి,లు అందరు విద్యార్థుల కు విద్యను అందిస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మతోన్మాద, మనువాద భావాలను తమపై రుద్దాడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులు బండి సంజయ్ ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు వల్లూరి బాబు రావు, సీపీఐ నాయకులు డప్పు రాములు, వెంకటేష్, సోమయ్య, శ్రీను, దళిత నాయకులు గణేష్, నరేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర వీరన్న, సోమయ్య, రమేష్, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.