Followers

ప్రజా సంక్షేమ మే టిఆర్ఎస్ ధ్యేయం

 ప్రజా సంక్షేమ మే  టిఆర్ఎస్ ధ్యేయం...

 ఆదిలాబాద్,  పెన్ పవర్

ప్రజా సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బేల మాజి సర్పంచ్ మస్కే తేజరావ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని లోహారా, అల్లఖోరి గ్రామ పంచాయతీ లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రచారం నిర్వహించారు. మారుమూల గిరిజన గ్రామాలకు కోట్లాది రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎంతో కృషి ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చెందుతుందని పేర్కొన్నారు. పేదవారికి టిఆర్ఎస్ ప్రభుత్వం భరోసా గా నిలిచిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పక్షాన నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆత్రం సోము, గంగారాం, టిఆర్ఎస్ నాయకులు ధన్రాజ్, బాబాసాహెబ్, రామ్ హాల్, రామ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు - పిడిఎస్యూ 

తార్నాక , పెన్ పవర్ 

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలిపింది.  పిడిఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లోని గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు  జూపాక శ్రీనివాస్,  పిడిఎస్యూ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము లు  మాట్లాడుతూ సమానత్వ సమాజ స్థాపన కోసం  జార్జ్ రెడ్డి అసమాన పోరాటం చేసి ఎన్నో తరాలకు దిక్సూచిగా నిలిచాడని అని కొనియాడారు. జార్జ్ పోరాటం సిద్ధాంతం మతోన్మాద ఆధిపత్య వర్గాల గుండెల్లో వణుకు పుట్టించిన అందుకే ఆయనను భౌతికంగా నిర్మూలించి ఆయన భావాలను  నిలిపివేయాలని కుట్ర చేశారని అన్నారు. ఆ కుట్రలో భాగంగానే  జార్జ్ ను హత్య  మతోన్మాద గుండాలు హత్య చేశారని అన్నారు. జార్జ్ మరణం వేల మంది పోరాట యోధులను సృష్టించి మతోన్మాదుల కు సింహస్వప్నం అయిన పీ డీ ఎస్ యు సంస్థను  స్థాపించింది అని  అన్నారు. ప్రభుత్వ సంస్థలను విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  జార్జిరెడ్డి  49 వ వర్ధంతి సభలను ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.  ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ లో మార్నింగ్ వాక్ తో ప్రారంభమయ్యే జార్జి సంస్మరణ కార్యక్రమాలు సభలు సమావేశాలు ప్రదర్శనలు ఎగ్జిబిషన్లు సెమినార్లు గ్రూప్ మీటింగులు ఇలా తదితర రూపాల్లో విస్తృతంగా జార్జి అమరత్వాన్ని స్మరిస్తు  జార్జ్ కు నివాళులు తెలిపారు. జార్జ్ అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు ప్రగతిశీల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో  భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎస్ .నాగేశ్వరరావు , పిడిఎస్యు. స్టేట్ జాయింట్ సెక్రెటరీ పి మహేష్, పీడీఎస్యూ నాయకులు  అనిల్ , గడ్డం.శ్యామ్, మధు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ వాలంటీర్ అరుణ కుమారి కృషి అమోఘం

సచివాలయ వాలంటీర్ అరుణ కుమారి కృషి అమోఘం 

మహారాణి పేట, పెన్ పవర్

సచివాలయ సారధులు ఈ వాలంటీర్ లు  సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విశాఖపట్నం అర్బన్ జీవీఎంసీ జోన్ 4 గౌరి స్ట్రీట్ సచివాలయం కు చెందిన వాలంటీర్ అరుణ కుమారి కుటుంబంకు ఆసరాగా ఉండి వాలంటీర్ గా సర్వే లో ఉండగా అనుకోకుండా గాయం అయింది ఐనప్పటికిని తన విధి మర్చిపోకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో కష్టం వున్నా సరే పెన్షన్స్ అందించటం, ఇంటింటికి సర్వే, పథకాలు ప్రాముఖ్యత వివరించారు. మరియు కరోనా సమయంలో తన పాత్ర ను ప్రతీ ఇంటికి తగు ఆరోగ్య జాగ్రత్తలు, లక్షణాలు ఉన్న వారి వివరాలు హెల్త్ సిబ్బంది కి తెలియచేయటం లో కృషి , విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా స్వచ్ఛ విశాఖ కోసం పరిశుభ్రత కోసం అవగాహన పౌరుల కు కల్పించటం ఇంటింటికి రేషన్ అందించటం లో  గౌరి స్ట్రీట్ సచివాలయం వాలంటీర్ కె. అరుణ కుమారి  సేవలు  అభినందననీయం అని స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓటు వేయాలంటే బోటు దాటాల్సిందే...

ఓటు వేయాలంటే బోటు దాటాల్సిందే...

పంచాయితీలు ఆవిర్భావం నుంచి ఇదే తంతు

 బోటు ప్రమాదాలతో  ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులు

 ప్రభుత్వాలు మారినా గిరిజనులకు తప్పని బోటు ప్రయాణం

పెన్ పవర్, విశాఖపట్నం

 ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో  ప్రవహిస్తున్న  మత్స్య గడ్డ  పరివాహక ప్రాంతంలో  నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు బాహ్య ప్రపంచం చూడాలంటే బోట్లే శరణ్యం. నిత్య అవసరాలు  వైద్యం  అందుకోవాలన్న  మైళ్ళ దూరం గెడ్డ పై  ప్రయాణించాల్సిందే.  ఆదివాసి గిరిజనులు నివసిస్తున్న  ప్రాంతంలో  జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించడంతో మచ్చ గెడ్డ  జలకళ సంతరించుకుంది. దీంతో ఆయా గిరిజన గ్రామాలు గెడ్డ  పరివాహ కంగా మిగిలిపోయాయి. నాటి నుంచి గిరిజనులు ఏ చిన్న పని కైనా బోటు  ఎక్కి తీరాల్సిందే. పండించిన పంటలు  అమ్ముకోవాలి అన్న. తిని సరుకులు   కొనుక్కోవాలన్నా  అనారోగ్యంతో  వైద్యం చేయించుకోవాలి అన్నా  మత్స్య గెడ్డ పై  బోట్ల సహాయంతో  రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడ అక్కడ రోడ్ల మార్గాలు ఉన్నప్పటికీ చుట్టూరా తిరగలేక గిరిజనులు గెడ్డ  దారినే  ఎంచుకుంటున్నారు.  ముంచంగిపుట్టు మండలంలో పలు గిరిజన గ్రామాలు  మత్స్య గడ్డ అవతలివైపు ఉన్నాయి. అక్కడి గిరిజనులు వారపు సంత లకు నిత్యావసరాలకు వైద్యం కోసం మండల కేంద్రానికి రావాల్సిందే. కుమ్మరి పుట్టు సుజనపేట నర్సిపుట్టు శంకిడి గొంది మల్లుడ పుట్టు  బీట  తాళపు తోట  గొడ్డి పుట్టు తోటా పుట్టు  తదితర గ్రామాల  ఆదివాసీ గిరిజనులు బోట్లుపై  ప్రయాణిస్తున్నారు. ఈ గ్రామాల గిరిజనులు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి  గురువారం  సుజన కోట పంచాయతీ కార్యాలయానికి బోట్ల సహాయంతో  మచ్చ గెడ్డ దాటి వెళ్ళారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడి నుండి ఇక్కడే ఓట్లు వేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.  గతం లో బోటు ప్రమాదాలు కూడా జరిగాయని వారు గుర్తు.

డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి

 డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి : పన్నాల 

తార్నాక ,  పెన్ పవర్  

మల్లాపూర్ డివిజన్ లోని ఓల్డ్ మల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి  బస్తి సమస్యలపై పర్యటించి  స్థానిక ప్రజలను కలిసి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  డ్రైనేజ్, నీటి, కరెంటు ఇతర సమస్యపై క్షున్నంగా, ఆణువణువూ తిరిగి సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఓల్డ్ విలేజ్ లో నీటి సమస్య పై స్థానికులు పిర్యాదు చేస్తే అప్పటికప్పుడు పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏ సమస్య ఉన్నా తెలియజేస్తే త్వరగతి న పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయము తో  త్వరలో మరోసారి సందర్శించి సమస్యలపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తీగుల్ల శ్రీనివాస్ , వాసుదేవ్ గౌడ్ , కటార్ల భాస్కర్ , అల్తాఫ్ , అల్లాడి కృష్ణ , రాపోలు శ్రీనివాస్ , తోపు అశోక్ , కప్పరా సాయి , సాయి గౌడ్ , బాలరాజ్ గౌడ్ , ముజీబ్ , స్థానికులు , అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి  పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదు పాసర్ల ప్రసాద్

 ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదు పాసర్ల ప్రసాద్

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రభుత్వ భూములు అమ్మితే ప్రజా ఉద్యమం తప్పదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ హెచ్చరించారు.శుక్రవారం పాసర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం బృందం రామకృష్ణ బీచ్ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తున్న స్థలాన్ని పరిశీలించారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. రామకృష్ణ బీచ్ వద్ద సర్వే నంబరు 11 0 1. సుమారు 14 ఎకరములు భూమి ప్రభుత్వం వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రకటన విడుదల చేశారన్నారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వం సుమారు 18 ప్రభుత్వ స్థలాలు విక్రయానికి ఈ వేలం ద్వారా అమ్మ చూపుతున్నారని విమర్శించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని ఆపాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజల సహాయంతో ఉద్యమాన్ని చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు చాలా అన్యాయం చేసిందని,ఇప్పటి వరకు ఎక్కడా ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని విమర్శించారు.ప్రభుత్వ భూములను ఎలా అమ్మ చూపుతారని ప్రశ్నించారు.పరిపాలనా రాజధాని అని గొప్పగా ప్రకటించారని, రాజధానిగా విశాఖలో పాలనా ప్రారంభిస్తే ప్రభుత్వానికి భూములు ఎక్కడవని ఘాటుగాప్రశ్నించారు. నగర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సనపలపాండురంగారావు,టిడిపి నాయకులు గండి రవికుమార్,గడ్డం ప్రసాద్,తమరాన బంగారు నాయుడు,గొంప సత్యనారాయణ,పైలెట్ పూడి సత్యం,కృష్ణ చైతన్య తదితర నాయకులు పాశర్ల వెంట ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.

బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదన్ లాల్కు సన్మానం

బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదన్ లాల్కు సన్మానం

అందరి సహకారంతోనే నా నియామకం


నెల్లి కుదురు , పెన్ పవర్

బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గా ఎన్నికైన బీజేపీ యువ నాయకులు గుగులోతు మదన్ లాల్ ను మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కారు పోతుల చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయా ప్రాంతాలలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయాలని కోరారు. సన్మాన గ్రహీతబీజేపీ యువ మోర్చా రాష్ట్ర నూతన అధికార ప్రతినిధి మదన్లాల్ మాట్లాడుతూ.యువ మోర్చా  రాష్ట్ర పదవిలో నియామక వెనుక ప్రతి కార్యకర్త నాయకుల సహకారం ఉందన్నారు. నూతన పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందని పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. బండి సంజయ్ నేతృత్వంలో బిజెపి  తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంతకు మునుపు మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునిగలవీడు ఎంపీటీసీ నల్లాని పాపారావు, పార్టీ నాయకులు టైరు పటేల్ రవి గౌడ్  ఎడ్ల మహేష్, యుగేందర్ తాళ్ల పెళ్లి వాసు గౌడ్. జిలకర యాకయ్య యాకీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...