Followers

తహసీల్దార్ ను సన్మానించిన బీజేపీ నాయకులు

 తహసీల్దార్ ను సన్మానించిన బీజేపీ నాయకులు

అదిలాబాద్, పెన్ పవర్


 
మండల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తాహసిల్దార్ దుర్వ లక్ష్మణ్ ను బీజేపీ నాయకులు. బుధవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సేవలు అందిస్తామని తాహసిల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు తోడసం బండు, ఉపాధ్యక్షులు బిక్షపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి బాబూలాల్ రాథోడ్, జిల్లా నాయకులు ప్రకాష్, చలుర్కర్ భోల సాయి, ఉన్నారు.

పల్లెల రూపు రేఖలు మార్చిన పల్లె ప్రగతి

 పల్లెల రూపు రేఖలు మార్చిన పల్లె ప్రగతి గ్రామ వికాసo బుగ్గరాం మండల జడ్పీటీసీ బాదినేని రాజేందర్ 

బుగ్గారం, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా బుగ్గరాం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి గ్రామ వికాసo. కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా బుగ్గరాం మండల ఎంపీపీ బాదినేని రాజమణి    జడ్పీటీసీ బాదినేని రాజేందర్ మాట్లాడుతూ  ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ప్రజా ప్రతినిధులు అధికారులు పనిచేయాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్నీ చేపట్టి నేల రోజుల పాటు దీని పై పని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ద్వారా అనేక సమస్యలకు శాశ్వత చూపించిన సంగతి అందరికీ తెలుసు తెలంగాణ రాష్టం రాక ముందు గ్రామాలు ఎలా ఉండేవో మనకు తెలుసు  అనంతరo జడ్పీటీసీ  బాదినేని రాజేందర్   గ్రామంలో పలు వార్డులను సందర్శిoచి,పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒక  నెల రోజులలో ఎవరైతే ఈ గ్రామ కార్యదర్శి  పంచాయతీ కార్యదర్శి వారి ద్వారా  దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు  పరిశీలించి ఉన్నట్లయితే వారు ఎవరినైనా కావచ్చు  ఒంటరి మహిళ ఫించన్ కావచ్చు వికలాంగులు కావచ్చు  గీత నేత కార్మికులకు ఎవరైనా  మరి వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళoదరు కూడా ఫించన్ వస్తుంది  అదేవిధంగా రేషన్ కార్డులు కూడా చాలా రోజుల నుంచి కొత్త వాళ్ళ కు ఇవ్వలేదు కుటుంబం లో కొంతమంది పిల్లలకు పెళ్లిళ్లు  ఇవాళ కూడా కార్డు కావాల్సిన వాళ్ళవి కూడా మన ముఖ్యమంత్రి  చెప్పిన కొద్దీ సమయంలో ఒక కొత్త రేషన్ కార్డులు అమలు జరిగితే చాలా పెద్ద సమస్య  తీవ్రత  మరి ముఖ్యంగా పేదలకు పెదవాళ్ళుకు సంబంధించిన సమస్య ఇది ఎంతోమందికి ఆదర్శoగా నిలిచినటువంటి  సమస్య కాబట్టి అవి కూడా రెండు తీరిపోతాయన్నారు.  గ్రామంలో మిషన్ భగీరథ  పనితీరు ఇంకుడు గుంతల నిర్మాణం తడిచెత్త, పొడిచెత్త,వేరు చేయు విధానం పల్లె ప్రకృతివనం నాoపేడ్  కాoపోస్టు నిర్వహణ సంక్షేమ ఫలితాలు ఇంకా ఇతరత్రా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా  కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమ్మినేని సుశీల-నారాయణ  వైస్ ఎంపీపీ సుసెంధర్  బుగ్గరాం మండల రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ రావు  ఉప సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి  ఎంపీపీ కో ఒఫ్షన్ సభ్యులు రహమాన్  టిఆర్ఎ స్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం తహసీల్దార్ ఫారూఖ్  ఎంపీడీఓ తిరుపతి   ఎంపిఓ అబ్దుల్ మియా వివిధ హోదాల్లో ఉన్నా నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

 ఉపాధి హామీ పనుల పరిశీలన

ఆదిలాబాద్,పెన్ పవర్ 

తాడిహత్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె శేఖర్ క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. పనిచేస్తున్న కూలీల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. పనికి వచ్చే వారి వివరాలు ప్రతిరోజు మస్టర్ లో పొందుపరచాలి అన్నారు. ప్రతి కూలీకి పని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

యోగ శిక్షకులకు సన్మానం

 యోగ శిక్షకులకు సన్మానం

గొల్లపల్లి ,పెన్ పవర్ 

 గొల్లపల్లి మండలం లోని రంగదమున్నిపల్లి గ్రామంలో లో యోగా శిక్షణ ముగింపు సందర్భంగా యోగ శిక్షకులు    కముటo గంగారం  జూoజురురాజమల్లు  చింతకింది కిషోర్  యోగ సాధకులు మరియు గ్రామ పెద్దలు సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రంగదామునిపల్లి మాజీ సర్పంచ్ క్యాతం రవీందర్ రెడ్డి మరియు సర్పంచ్ కోసున్న హనుమంత రెడ్డి ఉప సర్పంచ్ కనపర్తి భాస్కర్ స్వర్గం అమర్నాథ్ యాల అజిత్ రెడ్డి జగిసెట్టి స్వామి చింతకింది స్వామి రాగల తిరుపతి మరియు యోగ సాధకులు నాయకులు పాల్గొనడం జరిగింది.

బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం సావిత్రిబాయి పూలే

 బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం సావిత్రిబాయి పూలే 

 అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నవీన్ మహోర్కర్

అదిలాబాద్, పెన్ పవర్ 

 బడుగు బలహిన వర్గాల ఆరాధ్య దైవం  సావిత్రి బాయి పూలే అని ఆమె చేసిన సేవల వల్లే ఈ రోజు మహిళలు ఈ స్థాయిలో ఉన్నారని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నవీన్ మహోర్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్త్రీల  పట్లా ఎనాలిని కృషి చేసిన మహోన్నతమైన స్త్రీ సావిత్రిబాయి పూలే  అని ఉన్నారు. సావిత్రి బాయి ఫులే ఆశయాల సాధనకై ప్రతి ఒకరు కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో విశాఖ మహిళా మండల అధ్యక్షరాలు దుర్గే రుక్మిణి బాయి,మినా, నిర్మలబాయి,సేవంతబాయి,జైపాల్,ప్రమోద్, చంద్రశేఖర్,కేశవరావ్ తదితరులు పాల్గొన్నారు.

స్థలం ఇచ్చిన దాతలకు సత్కారం

 స్థలం ఇచ్చిన దాతలకు సత్కారం

పెన్ పవర్,ఆత్రేయపురం

ఉచ్చిలి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రానికి అవసరమైన 10 సెంట్ల స్థలాన్ని ఉచ్చిలి గ్రామ పెద్దలు కీ. శే.  నంబూరి జగ్గ రాజు నంబూరి వెంకట రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నంబూరి వెంకట రామరాజు మురళి మాస్టారు రవి మాస్టార్ట్ రాంబాబు సుబ్బారాజు వారి స్వాధీనంలో సర్వే నంబర్34/13లో ఉన్న స్థలం 10 సెంట్లు ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా కీ. శే. నంబూరి  జగ్గరాజు వెంకటరాజు స్థల దాతలుగా పేర్కొని ఆత్రేయపురం ఎంపీడీవో  ద్వారా ఉచ్చిలి  గ్రామపంచాయతీకీ అందించినట్లు తెలిపారు ఎంపీడీవో నాతి బుజ్జి  మాట్లాడుతూ మండలంలో ఎంత విలువైన భూములను ఎలాంటి స్వ లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ కార్యాల నిర్మాణం కొరకు అందించినందుకు స్థల దాతలు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉచ్చిలి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఊర్రింకల మీరమ్మ త్రిమూర్తులు ఉప సర్పంచ్ పద్మరాజు బాబులురాజు  ఇందుకూరికృష్ణంరాజు బచ్చు శివ ప్రసాద్ ఊర్రింకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించిన ఏబీవీపీ నాయకులు

 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించిన ఏబీవీపీ నాయకులు 

అదిలాబాద్,పెన్ పవర్

  బేల మండల కేంద్రంలో ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్, నందు ను ఏబీవీపీ మండల నాయకులు శాలువా తో  ఘనం గా సన్మానించారు.వారి ఎన్నిక పట్ల జిల్లా  ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ మడవార్ హరీష్, మండలఅధ్యక్షుడు శివనిత్ వార్ ఓంప్రకాశ్ హర్షం వాక్యం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ అజయ్, పాండు, సాయి,ప్రితం, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...