Followers

రాజన్న బిడ్డ షర్మిల గారికి అండగా

 రాజన్న బిడ్డ షర్మిల గారికి అండగా

 ఆదిలాబాద్ , పెన్ పవర్


తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా,స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయసాధనే లక్ష్యంగా దూసుకొస్తున్న రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ  వైయస్ షర్మిలమ్మ ను హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిటిడి ఎల్ ఎ సి మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి బెజ్జంకి అనీల్ కుమార్ తన పూర్తి మద్దతు తెలిపారు. తుదిశ్వాస వరకు రాజన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు.విద్యార్థి దశలో రాజశేఖరరెడ్డి గారితో, తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డితో జగనన్న సీఎం అయ్యె వరకు చెప్పులు వేసుకోకుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇపుడు షర్మిలమ్మ తో కలిసి నడవబోతున్నారు. తనకు ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చాటుతున్నారు.మార్చి నెల చివరి వారంలో జరిగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిటిటిడి ఎల్ ఎ సి మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

 మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

 ఇద్దరూ మట్కా నిర్వాహకుల అరెస్టు,  టు టౌన్​లో  కేసు నమోదు..

 ఆదిలాబాద్ ,పెన్ పవర్

ఆదిలాబాద్ టు టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం మట్కా నిర్వహిస్తున్నారనే  పక్కా  సమాచారం తో   టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి ఆధ్వర్యంలో   ఎస్ఐ కె విష్ణు ప్రకాష్ తో కలిసి చాకచక్యంగా నలువైపుల నుండి మట్కా స్థావరంపై దాడులు నిర్వహించారు.  ఈ క్రమంలో సుందరయ్య నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మట్కా నిర్వాహకులు  లహనే సుధాం (42) .షేక్ ఇర్షాద్ (28) లను అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి  మట్కా మట్కా చిట్టిలు రూ 3,420- నగదు స్వాధీనం చేసుకొని  పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుళ్లు శోభన్ కుమార్, రమేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, సయ్యద్ రహత్, మంగల్ సింగ్, ఎం ఏ కరీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్.ఎల్. సి ఎన్నికల్లో హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదు;

 ఎమ్.ఎల్. సి ఎన్నికల్లో  హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదు;రావుల చంద్రశేఖర్ రెడి 

వనపర్తి, పెన్ పవర్

సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన రమణకు ఓటు వేయాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తిలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు పి.ఆర్.సి ఇవ్వకుండా మోసం చేసారని రావుల చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసారని, ఉపాద్యాయుల బదిలీలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రములో 2లక్షల 67వేల పోస్టులు ఖాళీగా పెట్టి ఉన్న సిబ్బందిపైన పని భారం పెంచి ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు.గతములో పని చేసిన ఎమ్.ఎల్.సి లు  ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని కాబట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎల్.రమణను గెలిపించాలని కోరారు.ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.ఆలోచించి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశానికి నందిమల్ల అశోక్ అధ్యక్షత వహించారు. సమావేశములో బి.రాములు,గంధం. బాలపెరు,నందిమల్ల.శారదా,ఏర్పుల.లక్మి,జోగు.శాంతన్న,మాధవ రెడ్డి,రాజశేఖర్,దస్తగిరి,శ్రీనివాస్ రెడ్డి,హుస్సేన్,కిశోర్ రెడ్డి,జెమీల్ ప్రసంగించారు.కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

.

శామీర్ పెట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం..

 శామీర్ పెట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం..

తమిళ నాడుకు వెల్తున్న కెమికల్ లారీ..ఒక కంటైనర్ అగ్నికి ఆహూతి..

ప్రమాద సమయంలో లారీలో నలుగురు.. సూపర్ వైజర్ ముఖేశ్ మంటల్లో మృతి..

పెన్ పవర్,శామీర్ పెట్



నగర శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి, ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు.. మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈసంగటన వివారాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని సేలంకు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు డ్రైవర్ తివారీ తెలిపాడు.. రెండు లారీలు మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని. ఈ ప్రమాద సమయంలో లారీలో మొత్తం నలుగురు ఉన్నట్టు డ్రైవర్ తివారీ తెలిపాడు.. ముగ్గురం బయట పడ్డామని,తమ సూపర్ వైజర్ ముఖేష్ అనే వ్యక్తి కాలుజారి కారి కింద మంటల్లో పడిపోయి సజీవ దహనమయ్యాడని డ్రైవర్ తివారీ పేర్కొన్నాడు.. సమాచారం తెలుసుకున్న శామీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్ర కృషిచేసి మంటలు ఆర్పినా ఫలితం దక్కలేదు.. రెండు లారీలు పూర్తిగా ఖాళీ పోయాయి.. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యాదవ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

 యాదవ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

బెల్లంపల్లి ,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోగల కన్నల గ్రామంలోనీ  బుగ్గ  రాజరాజేశ్వర ఆలయంలో జాతర సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో బుగ్గ రాజేశ్వర దేవాలయం వద్ద  భక్తులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు గెల్లి రాజలింగు హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గెల్లి జయరాం ( కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు) నూనేటి సత్యనారాయణ (కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు) బండి రామ్ యాదవ్ (ప్రధాన కార్యదర్శి) గాధం శ్రీనివాస్ యాదవ్ (కార్యదర్శి) లెంకల సన్ని యాదవ్ రేణి రంజిత్ కుమార్ యాదవ్, వేల్పుల రాకేష్ యాదవ్, సంకరి హరీష్ యాదవ్.తదితరులు పాల్గొన్నారు.

జ్ఞాన దిక్షే-భీమ్ దీక్షా వాల్ పోస్టర్లు

 జ్ఞాన దిక్షే-భీమ్ దీక్షా వాల్ పోస్టర్లు

ఆదిలాబాద్, పెన్ పవర్

ఇచ్చోడ మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ దీక్షల వాల్ పోస్టర్లు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఇచ్చోడ మండల స్వేరోస్ అధ్యక్షుడు గాయక్వాడ్ విశ్వభోధి మాట్లాడుతూ జ్ఞాన సముపార్జన కోసం చేసే దీక్షే భీమ్ దీక్ష,భీమ్ అంటే జ్ఞానం, భీమ్ దీక్షలు అనగా జ్ఞాన దీక్షలు అని అన్నారు. ఈ భీమ్ దీక్షలు మార్చి 15 మాన్యశ్రీ కాన్షిరాం జయంతి నుంచి మొదలుకొని 14 ఏప్రిల్ భారత రాజ్యాంగ నిర్మాత పరమాపూజ్యులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతాయని,భీమ్ దీక్షల ముఖ్య ఉద్దేశ్యం వ్యక్తి మానసిక, వికాసం,ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన సముపార్జన,శారీరక దృఢత్వం,ఆర్యోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇచ్చోడ  మండల డా. బి ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు నర్వాడే రమేష్, ఇచ్చోడ భీమ్ ఆర్మీ మండల అధ్యక్షులు నౌషద్,సాహెబ్,ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.




అడవి లో చెలరేగిన మంటలు

 అడవి లో  చెలరేగిన  మంటలు

తాండూర్, పెన్ పవర్

తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లోని రహదారిని అనుకోని ఉన్న మాదారం అడవి ప్రాంతం లో  ప్రమాదవశత్తు మంటలు చెలరేగాయి. అటువైపుగా వెళ్తున్న బాటసారులు వెంటనే  స్పందించి సంబంధిత అడవి అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే  స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను అదుపులో తేవడం లో  భాగంగా మాదారం బీట్ అధికారి తన్వీర్ పాష మరియు బాటసారులు పాల్గోన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...