Followers

ఆక్వా రైతులకు విజ్ఞప్తి

 ఆక్వా రైతులకు విజ్ఞప్తి 

పెన్ పవర్,కొవ్వూరు

ఎపీ ఎస్ ఎ డీ ఎ 2020 అమలు అవుతున్న వలన  ఆక్వా రైతులు, చేపలు,రొయ్యల మేత &  మందుల షాపు యజమానులు, వారు మొదలైన ఆక్వా రంగంపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నవారు అందరూ కూడా పాత లైసెన్స్ ఉన్న వారు సచివాలయం లో  ఎండార్స్మెంట్ చేయించుకోవలెను.ఎండార్స్మెంట్ పూర్తిగా ఉచితం. పాత లైసెన్స్ లేనివారు కొత్త లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవలెను.కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఎకరానికి 1000 రు. చెల్లిచవలెను.  కావున మీయొక్క గ్రామ మత్స్య  సహాయకులను కలిసి వెంటనే దరఖాస్తులు చేసుకోవలెను.ఈ విధంగా లైసెన్స్  ఎండార్స్మెంట్ మరియు కొత్త లైసెన్స్ దరఖాస్తు  చేసుకొనుటకు  మే 31 వ తారీకు వరకు 3 నెలలు గడువు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తారీకు దాటిన తర్వాత లైసెన్సులు లేకుండా ఉన్నవారిని పై అధికారులు చర్యలు తీసుకోగలరు. అందరూ వెంటనే లైసెన్సులు కొరకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకొనగలవారని తెలియపరచడమైనది..

ఎండార్స్మెంట్ కు జత పరచ వలసిన పత్రములు..

1.ఆధార్ కార్డ్ జిరాక్స్

2.పాస్ బుక్ జిరాక్స్

3.పాత పర్మిషన్ ఒరిజినల్

4.వారి చెరువు యొక్క గూగుల్ మ్యాప్

5.ఫోన్ నెంబర్ ( ఆధార్ నెంబర్ తో లింక్ అవ్వాలి)


డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ మాదిగల హక్కు

డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ మాదిగల హక్కు

 ఎమ్మార్పీఎస్ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్

జగిత్యాల,పెన్ పవర్

బడ్జెట్ సమావేశాల్లో డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ కు బిల్లు ప్రవేశపెట్టాలని స్థానిక జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి డప్పు కొట్టే వృత్తిదారులకు చెప్పులు కుట్టే వృత్తి దారులకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి కి చాలాసార్లు తీసుకొచ్చామని అయిన ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు అణగారిన కులాల్లో చాలా కులాలకు వృత్తుల పేరుమీద పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వాటిని మేము స్వాగతిస్తున్నామని వారిలాగే మాకు కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం మాదిగలను ఉప కులాల వారిని ఆదుకోవాలని రానున్న బడ్జెట్ సమావేశాల్లో డప్పు చెప్పు బిల్లు ప్రవేశపెట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చెప్పు పెన్షన్ సాధించి తీరుతామని అన్నారు సమావేశంలో ఎమ్మార్పీఎస్ టి ఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి లక్ష్మణ్, జగిత్యాల మండల అధ్యక్షులు మెదపట్ల చంద్రయ్య, సామాజిక సేవ సభ్యులు ఎండీ షోయబ్ అఫీజ్, ఎండీ అలి, ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ చికుముల గంగరాజు,  తదితరులు పాల్గొన్నారు 

ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు

లక్షెట్టిపెట్,పెన్ పవర్

పట్టణంలోని విశ్రాంతి భవనంలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకని జాగృతి ఆద్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు.మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంయ్య, వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చెర్మాన్ సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి లు కేక్ కట్ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిది అని అన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలపై ఎన్నో కార్యక్రమలు నిర్వహించి అవగహనలు కల్పించారని తెలిపారు.అనంతరం మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకుడు బాణాలు రమేష్,విద్యార్థి విభాగం ఇంచార్జి మారుతి,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,కౌన్సలర్లు ఒరగంటి శ్రీకాంత్, చతరాజు రాజన్న,మెట్టు కళ్యాణిరాజు,నాయకులు అకంతి రమేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పికాల్వ లోకి దూసుకెళ్లిన కారు

 అదుపుతప్పికాల్వ లోకి దూసుకెళ్లిన కారు 

పెన్ పవర్,ఆత్రేయపురం

 లొల్ల లాకుల వద్ద గురువారం అర్ధరాత్రి  కారు అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లింది ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

మహాశివరాత్రి సందర్భంగా వీరు భీమవరం నుంచి కారులో ఆత్రేయపురం మండలం వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరుకు చెందిన చింతలపాటి శ్రీనివాసరాజు(46), ముందుటి సురేష్ వర్మ(36), ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజుగా పోలీసులు గుర్తించారు. మొత్తం కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముదునూరి వెంకటగణపతిరాజు, ముందిటి సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం ఎస్సై నరేష్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు

 రాష్ట్ర అభివృద్ధికి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు 

పెన్ పవర్,గోపాలపురం

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కొనియాడారు.వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఏ.ఎం.సీ.కార్యాలయ ఆవరణలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్న కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో లో ఎన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అభివృద్ధ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటిని ఏమీ లెక్కచేయకుండా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వై.ఎ స్.జగన్  అనిఅన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారని అన్నారు. దశాబ్ద కాలం నుండే ప్రజలకు ఇళ్ల స్థలాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని జగనన్న రాకతో ఆ సమస్య తీరిపోయింది అని అన్నారు.ప్రస్తుత నెల పట్టాల పంపిణీ జరిగిందని త్వరలో గృహాలు నిర్మించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.


నియమావళికి కట్టుబడి ఓట్ల లెక్కింపు చేపట్టాలి...!

 నియమావళికి కట్టుబడి ఓట్ల లెక్కింపు చేపట్టాలి...!

సామర్లకోట, పెన్ పవర్ 

మున్సిపల్ ఎన్నికలకు సంబందించి ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల కమీషన్ నియమావళికియ కట్టుబడి సిబ్బంది ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నియోజక వర్గ ఎన్నికల అధికారి, పెద్దాపురం ఆర్టీవో ఎస్ మల్లిబాబు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి భానూప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించారు. దానిలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ అభ్యర్థులకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు వివరాలు తెలిపే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆరోపణలు రావడం సహజంగా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అంతా సహనంతో వ్యవహరించాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు అనుమతి లేనందున వాటితో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బోమన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థులు వారి అనుచరులు సిబ్బందిని ఏ విధంగానూ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో సిబంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డీవో, ప్రత్యేకాధికారులు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో ఇంకా మన్సిపల్ కమీషనరు బీఆర్ శేషాద్రి, మేనేజరు అచ్యుతరాజు, ఓట్ల లెక్కింపు సిబ్బంది పాల్గొన్నారు.

క్వారీ నీటిలో చిక్కుకొని లారీ డ్రైవర్ మృతి

 క్వారీ నీటిలో చిక్కుకొని లారీ డ్రైవర్ మృతి

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

క్వారీలో నీటి ప్రవాహానికి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున ఆరుగొలను గ్రామంలో చోటు చేసుకుంది.కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు.కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్,కుటుంబ సభ్యులు,గ్రామస్థులు,సహచర లారీ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం ఆరుగొలను గ్రామ సమీపంలోని మెట్ట ప్రాంతంలోని గ్రావెల్ క్వారీలో జెసిబి సహకారంతో కంకర తవ్వుతుండగా తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన చెక్కా బాలస్వామి (40)లారీలో కంకర నింపుకునేందుకు సుమారు 60 అడుగుల లోతు ఉన్న క్వారీకి చేరుకున్నాడు.బాలస్వామి కంటే ముందు వరుసలో ఉన్న లారీలలో  జెసిబితో కంకర నింపుతున్న తన లారీని ఆపి పక్కన పెట్టాడు.జెసిబితో కంకర తవ్వే సమయంలో  క్వారీకి ఆనుకుని సరిహద్దులో పక్కనే ఉన్న నాలుగు ఎకరాల చేపల చెరువుకు ఒకసారిగా గండి పడింది.దీంతో జెసిబి డ్రైవర్,జెసిబి డ్రైవర్ స్పందించి కంకర లోడింగ్లో ఉన్న లారీ డ్రైవర్లుకు సమాచారం అందించాడు.

జెసిబి,లారీ  డ్రైవర్లు క్వారీ నుంచి పైకి చేరుకున్నారు.అయితే దీనిని గమనించని లారీ డ్రైవర్ చెక్క బాలస్వామి నీటిలో చిక్కుకొని మునిగిపోయాడు దీంతో సహచర డ్రైవర్లు పోలీసు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు,ఈ సహాయక చర్యల్లో తాసిల్దార్ సాయిరాజ్,రూరల్ సిఐ వి.రవి కుమార్,రూరల్ ఇంఛార్జ్ ఎస్ఐ రమేష్,పెంటపాడు శ్రీనివాస్,మహిళా పోలీస్ భాను,అగ్నిమాపక సిబ్బంది, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...