Followers

ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు

లక్షెట్టిపెట్,పెన్ పవర్

పట్టణంలోని విశ్రాంతి భవనంలో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకని జాగృతి ఆద్వర్యంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు.మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంయ్య, వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చెర్మాన్ సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి లు కేక్ కట్ చేసారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిది అని అన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలపై ఎన్నో కార్యక్రమలు నిర్వహించి అవగహనలు కల్పించారని తెలిపారు.అనంతరం మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకుడు బాణాలు రమేష్,విద్యార్థి విభాగం ఇంచార్జి మారుతి,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,కౌన్సలర్లు ఒరగంటి శ్రీకాంత్, చతరాజు రాజన్న,మెట్టు కళ్యాణిరాజు,నాయకులు అకంతి రమేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పికాల్వ లోకి దూసుకెళ్లిన కారు

 అదుపుతప్పికాల్వ లోకి దూసుకెళ్లిన కారు 

పెన్ పవర్,ఆత్రేయపురం

 లొల్ల లాకుల వద్ద గురువారం అర్ధరాత్రి  కారు అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లింది ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

మహాశివరాత్రి సందర్భంగా వీరు భీమవరం నుంచి కారులో ఆత్రేయపురం మండలం వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరుకు చెందిన చింతలపాటి శ్రీనివాసరాజు(46), ముందుటి సురేష్ వర్మ(36), ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజుగా పోలీసులు గుర్తించారు. మొత్తం కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముదునూరి వెంకటగణపతిరాజు, ముందిటి సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం ఎస్సై నరేష్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు

 రాష్ట్ర అభివృద్ధికి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు 

పెన్ పవర్,గోపాలపురం

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కొనియాడారు.వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఏ.ఎం.సీ.కార్యాలయ ఆవరణలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్న కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో లో ఎన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అభివృద్ధ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటిని ఏమీ లెక్కచేయకుండా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వై.ఎ స్.జగన్  అనిఅన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారని అన్నారు. దశాబ్ద కాలం నుండే ప్రజలకు ఇళ్ల స్థలాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని జగనన్న రాకతో ఆ సమస్య తీరిపోయింది అని అన్నారు.ప్రస్తుత నెల పట్టాల పంపిణీ జరిగిందని త్వరలో గృహాలు నిర్మించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.


నియమావళికి కట్టుబడి ఓట్ల లెక్కింపు చేపట్టాలి...!

 నియమావళికి కట్టుబడి ఓట్ల లెక్కింపు చేపట్టాలి...!

సామర్లకోట, పెన్ పవర్ 

మున్సిపల్ ఎన్నికలకు సంబందించి ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల కమీషన్ నియమావళికియ కట్టుబడి సిబ్బంది ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నియోజక వర్గ ఎన్నికల అధికారి, పెద్దాపురం ఆర్టీవో ఎస్ మల్లిబాబు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి భానూప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించారు. దానిలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ అభ్యర్థులకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు వివరాలు తెలిపే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆరోపణలు రావడం సహజంగా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అంతా సహనంతో వ్యవహరించాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు అనుమతి లేనందున వాటితో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బోమన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థులు వారి అనుచరులు సిబ్బందిని ఏ విధంగానూ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో సిబంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డీవో, ప్రత్యేకాధికారులు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో ఇంకా మన్సిపల్ కమీషనరు బీఆర్ శేషాద్రి, మేనేజరు అచ్యుతరాజు, ఓట్ల లెక్కింపు సిబ్బంది పాల్గొన్నారు.

క్వారీ నీటిలో చిక్కుకొని లారీ డ్రైవర్ మృతి

 క్వారీ నీటిలో చిక్కుకొని లారీ డ్రైవర్ మృతి

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

క్వారీలో నీటి ప్రవాహానికి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున ఆరుగొలను గ్రామంలో చోటు చేసుకుంది.కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు.కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్,కుటుంబ సభ్యులు,గ్రామస్థులు,సహచర లారీ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం ఆరుగొలను గ్రామ సమీపంలోని మెట్ట ప్రాంతంలోని గ్రావెల్ క్వారీలో జెసిబి సహకారంతో కంకర తవ్వుతుండగా తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన చెక్కా బాలస్వామి (40)లారీలో కంకర నింపుకునేందుకు సుమారు 60 అడుగుల లోతు ఉన్న క్వారీకి చేరుకున్నాడు.బాలస్వామి కంటే ముందు వరుసలో ఉన్న లారీలలో  జెసిబితో కంకర నింపుతున్న తన లారీని ఆపి పక్కన పెట్టాడు.జెసిబితో కంకర తవ్వే సమయంలో  క్వారీకి ఆనుకుని సరిహద్దులో పక్కనే ఉన్న నాలుగు ఎకరాల చేపల చెరువుకు ఒకసారిగా గండి పడింది.దీంతో జెసిబి డ్రైవర్,జెసిబి డ్రైవర్ స్పందించి కంకర లోడింగ్లో ఉన్న లారీ డ్రైవర్లుకు సమాచారం అందించాడు.

జెసిబి,లారీ  డ్రైవర్లు క్వారీ నుంచి పైకి చేరుకున్నారు.అయితే దీనిని గమనించని లారీ డ్రైవర్ చెక్క బాలస్వామి నీటిలో చిక్కుకొని మునిగిపోయాడు దీంతో సహచర డ్రైవర్లు పోలీసు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు,ఈ సహాయక చర్యల్లో తాసిల్దార్ సాయిరాజ్,రూరల్ సిఐ వి.రవి కుమార్,రూరల్ ఇంఛార్జ్ ఎస్ఐ రమేష్,పెంటపాడు శ్రీనివాస్,మహిళా పోలీస్ భాను,అగ్నిమాపక సిబ్బంది, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అధికారం చేపట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందాం

 అధికారం చేపట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందాం

పెన్ పవర్,ఆలమూరు 

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పది వసంతాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి 12వ తేదీ)న 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టి అతి స్వల్ప కాలంలోనే ప్రజల మన్నలను పొందామని  కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. మండల పరిధి లో చెముడులంక, ఆలమూరు, మడికి  గ్రామాల్లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తమ్మన మాట్లాడుతూ జననేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మన పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అధికారం చేపట్టిన 20 నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ అమలు పరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ నాయకులు కార్యకర్తలు గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారని అన్నారు. అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ అని  మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న వాస్తవం మీ అందరికీ తెలిసిందేనని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల  ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం  వృద్ధులకు నూతన వస్త్రాలతో పాటు పండ్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడమటి రాంబాబు, మల్లెమొగ్గలు చిన్న, రావుల దుర్గాప్రసాద్, కంచుమర్తి బాబులు, పాల్గొన్నారు.   అలాగే చొప్పెల్ల గ్రామంలో తోరాటి లక్ష్మణ్రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు

 రాష్ట్ర చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

రాష్ట్ర చరిత్రకు,రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రోజని స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ పథకాల హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు.తాడేపల్లిగూడెంలోని  వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జెండాను ఎగురవేసి,వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రని మలుపుతిప్పిన సుదినం ఈ రోజు అని, పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ రోజు పార్టీ శ్రేణులకు పండుగరోజు అని అన్నారు.రాష్ట్ర ప్రజల అసలు,ఆశయాలకు జీవం పోసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేసి పార్టీని ప్రజల మనస్సుల్లో నిలబెట్టారని అన్నారు.

ప్రజాసంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ వైయస్సార్ పార్టీ అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నామని అన్నారు.యువనేత కొట్టు విశాల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.11వసంతంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమమంలో వైస్సార్సీపీ యువనేత కొట్టు విశాల్,కర్రీ భాస్కరరావు,గుండుబోగుల నాగు,ముప్పిడి సంపత్ కుమార్,తెన్నేటి జగజీవన్,సింగం సుబ్బారావు,గుండెమొగుల బలుసులు,మండా  పద్మావతి,బొలెం రామలక్ష్మి,శెట్టి రమాదేవి,ముద్రగడ లలిత,నీలం నాగ భూషనం,బొడ్డు సాయిబాబా,నలిమిల్లి అంజిరెడ్డి,కాకర్ల శ్రీనివాస్,తాళ్లూరి మురళి,పత్సమట్ల సావిత్రి,కొవ్వూరి భాస్కర్ రెడ్డి చింతా శ్రీనివాస్,గురజాడ బ్రహ్మాజీ,కట్టుబోయిన కృష్ణ ప్రసాద్,పాలకోడేటి సురేష్,సిర్రాపు శాంత కుమార్,వీర్ల గోవింద్,చింతకాయల సత్యనారాయణ,కొలుకులూరి ధర్మరాజు,శిరిగినీడి విజయకృష్ణ,వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...