Followers

పంచాయతీ నిధులతో గ్రామాల్లో ఐదు చేతిపంపులు

 పంచాయతీ నిధులతో గ్రామాల్లో ఐదు చేతిపంపులు

వి.ఆర్.పురం,పెన్ పవర్

వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామపంచాయితీ  సంబంధించిన గ్రామం సెక్రెటరీ  సురేష్ రెడ్డిమరియు సర్పంచ్ సోడే నరసమ్మ పంచాయితీ నిధుల నుండి  ప్రజలకు నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో చేతిపంపులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీలో మొత్తం అయిదు చేతిపంపులు వేసినారు.వి.ఆర్.పురం బి.సి కాలనీలో2.  ధర్మ తాళ్లగూడెం  2.  వడ్డీ గూడెం కాలనీలో 1 ప్రజల కొరకుచేతిపంపులు వేయడం జరిగిందని  గ్రామ సెక్రెటరీ తెలిపారు.

వడ్డిగూడెం గ్రామపంచాయతీ సంబంధించిన  గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులకు  సర్పంచ్ సో డి  నరసమ్మ కు  సెక్రెటరీ సురేష్ రెడ్డి   పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్  కోట్ల  శ్రీనివాసు వార్డు నెంబర్ లు.ప్రమీల   వై.యస్.ఆర్.పార్టీ నాయకులు బొడ్దు సత్యానారాయణ సుమన్ సున్నంరాజుశ్రీనివాస్ శివ నాగార్జున శంకర్ విజయకాంత్  పాల్గొన్నారు. 

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి:మేడ్చల్ కలెక్టర్

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి:మేడ్చల్ కలెక్టర్

*శాసనమండలి ఎన్నికలకు అంతా సిద్దం

ఓటు వేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఉండాలి..*

ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి..

మేడ్చల్ ,పెన్ పవర్



మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా తమ విధులను నిర్వహించాలని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు చేపట్టామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.. జిల్లా వ్యాప్తంగా ఆదివారం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం కలెక్టర్ మల్కాజిగిరి సైనిక్ పురిలో ఉన్న భవన్స్ రామకృష్ణ విద్యాలయం, అబ్దుల్ కలామ్ ఆడిటోరియం, ద్రోణాచార్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్,  కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ... ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన బందోబస్తును కల్పించామన్నారు. ఆయా ఎన్నికల కేంద్రాలకు వెళ్ళే సిబ్బంది తమతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఇంకు, పోలింగ్ స్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, స్టాంప్లు, స్టాంప్ ప్యాడ్లతో పాటు అవసరమైన ఎన్నికల సామాగ్రిని సరిగ్గా పరిశీలించుకోవాలని... ఏమైనా అవసరమైతే సంబంధిత అధికారుల వద్ద నుంచి తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యా స్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరిస్తున్నందున ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే తెలిసిపోతుందన్నారు. అలాగే ప్రస్తుతం పట్టభద్రుల ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నందున ఎన్నికల ఏజెంట్లకు వీటి విషయంపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ముందుగానే వివరించాలని, వారికి ఏమైనా సందేహాలు వస్తే వివరించాలని  కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. అలాగే ఎన్నికల సమయం ముగిసే వరకు సిబ్బంది తమ విధులు నిర్వహించడంతో పాటు చివరి సమయంలో వచ్చిన వారికి సైతం ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు జిల్లాలో మొత్తం  1,31,000 మంది ఓటర్లు ఉండగా... 198  పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించినారు. దీంతో పాటు 74 పోలింగ్ లొకేషన్లు, 41 రూట్లలో 41 సెక్టోరియల్ అధికారులు ఉంటారని వివరించారు.. ఎన్నికల సందర్భంగా 198 పోలింగ్ కేంద్రాలకు గాను 198 ప్రిసైడింగ్ అధికారులు, 198 అదనపు ప్రిసైడింగ్ అధికారులు, 396 మంది ఇతర పోలింగ్ అధికారులు తమ విధులను నిర్వహించడంతో పాటు 198 సూక్ష్మ పరిశీలకులు ..198 మంది  వెబ్ క్యా స్టింగ్ విద్యార్థులు.. నిర్వహిస్తారని వీరందరికీ అదనంగా మరో పది శాతం సిబ్బందిని అందుబాటులో ఉంటారని కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు వచ్చే ప్రతి పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి  ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని... వాటిలో ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌, డిపార్ట్‌మెంట్‌ గుర్తింపు కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌,  పట్టాదారు పాసు పుస్తకం, ఫొటో ఉన్న బ్యాంకు ఏటీఎం కార్డుల్లో ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువస్తేనే ఓటు వేసేందుకు అనుమతించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.. ఎన్నికల సమయంలో సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని... ఈ విషయంలో ప్రిసైడింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపినారు. వివరించినారు. పోలింగ్ బూత్లలో ఎక్కువ మంది ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్లు విద్యాసాగర్,  డీఆర్వో లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. 

బచ్చు ఫౌండేషన్ అధ్యక్షుడిగా అవినాష్ దేవచంద్ర

 బచ్చు ఫౌండేషన్ అధ్యక్షుడిగా అవినాష్ దేవచంద్ర

పెద్దాపురం,పెన్ పవర్

బచ్చు ఫౌండేషన్ అధ్యక్షుడు గా  పేరబత్తుల అవినాష్ దేవ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బచ్చు ఫౌండేషన్ సేవలు పెద్దాపురం నియోజకవర్గ పేద ప్రజలoదరికి అందేలా కృషి చేస్తామని, ముఖ్యంగా పల్లెల్లో సేవలు మరింత ముందుకు తీసికెళ్ళి విధ్యా సంస్థల కోసం కృషి చేస్తామని, అలాగే నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని, నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఫౌండేషన్ కొరకు నా సేవలను అంకితం చేస్తామని, అలాగే బచ్చు పౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షుడు బచ్చు కోటేశ్వరరావు ఆశయసాదన కోసం నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయనున్నట్లు బచ్చు పౌండేషన్ ట్రస్ట్ బోర్డు అద్యక్షుడు పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్ర పేర్కొన్నారు. బచ్చు పౌండేషన్ అసెంబ్లీ హాల్ లో బచ్చు కోటేశ్వరరావు ఆదేశాలు మేరకు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారమహోత్సవం నిర్వహించినట్లు పేరాబత్తుల అవినాష్ తెలిపారు.అలాగే ప్రపంచ పటంలో పెద్దాపురం పట్టణాన్ని ప్రత్యేక స్థానం ఉండేలా బచ్చు పౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు. 

విద్యా పరంగా పెద్దాపురం పట్టణాన్ని తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తయారు చేయడంలో బచ్చు పౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షుడు కోటేశ్వరరావు లక్ష్యమన్నారు. రాబోయే కాలంలో బచ్చు పౌండేషన్ కొన్ని ప్రదాన లక్ష్యాలను నిర్దేశించుకుని ట్రస్టు బోర్డు ముందుకు వెళుతుందన్నారు. కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ట్రస్టు బోర్డు పనిచేస్తుందని, తెలిపారు.అనంతరం బచ్చు ఫౌండేషన్ యొక్క బుక్లేట్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్  రాజేందర్ దహ్యా,సుమన్ ధహ్య (భార్య) మాట్లాడుతూ ఫౌండేషన్ ట్రస్టీకి అద్యక్షులుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని, అలాగే డా.బచ్చు కోటేశ్వరరావు వారి ఆశయాలను అవినాష్ ప్రగతి వెలుగులోనికి తీసుకొస్తారని, ఒక క్రొత్త ప్రణాళిక తో కొత్త కార్యవర్గాన్ని ముందుకు నడిపిస్తారని ప్రజలందరికీ అందుబాటులో వుండే విధంగా ఫౌండేషన్ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డా, రీతూమాధురి,కె.సురేంద్ర బాబు,ఎం, శ్యామ్ సన్ డేవిడ్,వి.యేసు బాబు,ఎం.ప్రకాశ్,చోడిశెట్టి, వెంకటరమణ, వీర్రాజు,ఎం.శివ,వెంకట రెడ్డి, కె. మురళీ కృష్ణ, పి.చంటిబాబు, గురుప్రసాద్ బచ్చు, పి. సత్యన్నారాయణ, పి.కిరణ్, పౌండేషన్ సభ్యులుగా ఎన్నికైనవారు తదితరులు పాల్గొన్నారు.

మానవసేవే మాధవసేవ

 మానవసేవే మాధవసేవ

 పెన్ పవర్.,ఆత్రేయపురం

 ర్యాలీ  స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద శ్యామ్ జాదు ఫ్యామిలీ ప్రతి శనివారం దైవదర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు కోస్తా దేవాంగుల ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి డి.కె. నాగరాజు సారథ్యంలో నిర్వహించిన ఉచిత అల్పాహారం కార్యక్రమని  రావులపాలెం సి.ఆర్.సి ప్రధాన కార్యదర్శి కర్రీ అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవ సేవ లోనే ఆ నారాయణ సేవ దాగి  ఉందని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా భక్తులకు ఆహారంతోపాటు మధ్యాహ్నం మజ్జిగను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బోనం  రత్నకుమారి కప్పల శ్రీధర్ బోణం సాయిబాబు మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్ అన్నపూర్ణ పాల్గొన్నారు.

రామ్మోహన్ రావు కుటుంబాన్నీ పరామర్శించినా ప్రేమ్ సాగర్ రావ్

రామ్మోహన్ రావు కుటుంబాన్నీ పరామర్శించినా  ప్రేమ్ సాగర్ రావ్

మంచిర్యాల ,పెన్ పవర్

తెలంగాణ ఫిల్మ్ డేవలోప్మెంట్ కార్పోరేషన్  చెర్మైన్  పుస్కూరి రామ్మోహన్ రావు  తల్లి  కమలమ్మ  ఈ నెల 8న  దివంగతువులైన్నారు.ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని వారి  స్వగృహమైన ఊరు మందమర్రి లో  మాజీ ఎమ్మెల్సి, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల  ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ పరామర్శించి,వారి ఆత్మకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వీరి వెంట స్థానిక నాయకులు నూకల రమేష్, మున్సిపల్ ఇంచార్జి ఉపేందర్ గౌడ్ , పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి ముజాహిద్, మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సట్ల సంతోష్, బ్లాక్ ఉపాధ్యక్షులు ఏటూరి సత్యనారాయణ, బైర్నేని రాజేష్, పల్లె దేవేందర్, బైర్నేని సునీతా తదితరులు  ఉన్నారు. 

ఆర్డీవో కి, కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన జనసేన పార్టీ

 ఆర్డీవో కి, కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన  జనసేన పార్టీ 

మహారాణి పేట, పెన్ పవర్

బుధవారం నాడు 42 వార్డు లో పోలింగ్ అధికారులు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి  పోలింగ్ బాక్స్ లు పోలింగ్ ఏజెంట్లు ముందు సీల్ వేయకుండా అవకతవకలు జరిగాయని ఆ రోజే అర్ధరాత్రి  రెండు వరకు, జిల్లా నాయకులు జనసేన లీగల్  విభాగం, మరియు జనసైనికులు ధర్నా చేసి జరిగిన అన్యాయాన్ని ఆర్.డి.ఓ, కి తెలియజేయడం జరిగింది.ఈరోజు పూర్తి రిపోర్ట్ అలాగే వినతి పత్రం ఆర్డీవో కి, కలెక్టర్ కి అందించి  న్యాయం జరగాలని ఏవైతే బూతుల్లో అవకతవకలు జరిగాయో ఆ బూతుల్లో రీ పోలింగ్ జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

 ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జనసేన పార్టీ లీగల్ విభాగం నుండి రేవతి పూర్తి సహకారం అందించి మద్దతు తెలిపారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మద్దతుగా నిలిచి సహకరించిన సుందరపు విజయ్ కుమార్ కి హృదయపూర్వక  ఉషాకిరణ్ విశాఖపట్నం నియోజకవర్గం ఇంఛార్జి ధన్యవాదాలు తెలిపారు.

21న జరిగే ఎన్నికలను విజయవంతం చేయండి

 21న జరిగే ఎన్నికలను విజయవంతం చేయండి 

లక్షెట్టిపెట్,పెన్ పవర్

21వ తారికిన పట్టణం కేంద్రంలో జరిగే విశ్వబ్రాహణ సంఘం ఎన్నికలను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు బానాల రమేష్ పిలుపునిచ్చారు.పట్టణంలోని విశ్రాంతి భవనంలో శనివారం జరిగిన సంఘ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లేని విధంగా ఈ ఏడాది జరిగే సంఘం ఎన్నికల్లో ఐదు కులాలు ఏకమై నిర్వహించడం జరుగుతుందన్నారు.అందులో వడ్ల కుమ్మరి,అవుసుల,కాంచరి,శిల్పి కులాలకు చెందిన పురుషులు స్త్రీ లు పాల్గొని తమ ఓటును వేసి సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు.ఈ ఎన్నికలు ఒక మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అదే రోజు ఏకాదటిగా నిర్వహించడం జరుగుతుందని ఒక్కొక్కరు మండల అధ్యక్షునీతో పాటు జిల్లా అధ్యక్షున్నీ రాష్ట్ర అధ్యక్షున్నీ కూడా అదే రోజు ఎన్నుకోవాల్సి ఉందన్నారు.గత ఐదు కులాలకు చెందిన 18సంవత్సరాలు వయస్సు పై బడిన వారందరు ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఏదైనా ప్రభుత్వం జారీ చేయబడిన గుర్తింపు కార్డు తప్పకుండా వెంట తీసుకొని రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఐదు సంఘాల ముఖ్య సభ్యులు వెంకటేష్,సత్యనారాయణ,మురళి,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...