Followers

హమాలీ కార్మికులకు ఎల్ల వేళలా అండగా ఉంటాం:టి ఆర్ కే ట్రస్టు వ్యవస్థాపకులు

 హమాలీ కార్మికులకు ఎల్ల వేళలా అండగా ఉంటాం:టి ఆర్ కే ట్రస్టు వ్యవస్థాపకులు

వేములవాడ,పెన్ పవర్

ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి తన వంతు సహాయసహకారాలు అందిస్తున్న టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ కు రోజు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు, యువకులు మీ వెంటే మేమంటూ స్వచ్ఛందంగా ముందుకువచ్చి టి ఆర్ కె ట్రస్ట్ లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వేములవాడ పట్టణానికి చెందిన హమాలి కార్మిక సంఘం వారు తరలివచ్చి తోట రామ్ కుమార్ ను స్వయంగా కలిసి, ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ లో తమ వంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు అన్ని వేళల్లో అండగా ఉంటూ కష్టసుఖల్లో పలు పంచుకుంటానని అన్నారు. అలాగే హమాలి కార్మిక సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

తోట రామ్ కుమార్ ను సన్మానించిన ఆర్ఎంపీలు..

వైద్య రంగంలో ఆర్ఎంపీ డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని టి ఆర్ కె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలకు గుర్తుగా ఆర్.ఎం.పి లు ఆదివారం వేములవాడ పట్టణములో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను కాపాడటంలో ఆర్.ఎం.పి లు తీవ్రంగా కష్టపడుతున్నారని, ముఖ్యంగా కరోన కష్ట కాలములో ప్రజలకు ధైర్యం చెప్పడంలో ఆర్.ఎం.పి లు కీలకంగా వ్యవహరించారని, వారికి తమ ట్రస్ట్ సహాయసహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్, వర్కింగ్, ఎంక్వయిరి టీం సభ్యులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు అండగా ఉంటా...ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

 జర్నలిస్టులకు అండగా ఉంటా...ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

పెన్ పవర్,మల్కాజిగిరి 

ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఇటీవల ప్రమాదవశుత్తు జారిపడి మోకాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న గౌతంనగర్ సాక్షి విలేకరి అబ్థుల్ రెహమాన్ మౌలాలి శ్రామికనగర్ లోని రెహమాన్ నివాసంలో ఎమ్మెల్యే పరామార్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్ కార్డుల విషయంపై ఆరా తీశారు. తన సొంతంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా కృషి చేస్తాన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికి సొంత ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్చిస్తామన్నారు. రెహమాన్ కు వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ అధక్ష్యులు, ప్రదాన కార్యదర్శులు పిట్ల శ్రీనివాస్, జి.ఎన్.వి. సతీష్ కుమార్, నాయకులు ఇబ్రహీం, జర్నలిస్టు మిత్రులు బాల్ రాజ్, వెంకటేష్, శ్రీనివాస్ స్వామి, సుబ్బారావు, అక్కల రాజుగౌడ్, క్రిష్ణమూర్తి, నాయుడు, లక్ష్మారెడ్డి, దాస్ తదితరులు ఉన్నారు.

ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో టీ షర్ట్స్ పంపిణీ కార్యక్రమం

 ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో టీ షర్ట్స్ పంపిణీ కార్యక్రమం

పెన్ పవర్,మందమర్రి 

ఫిట్ ఇండియా పౌండేషన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల సత్యనారాయణ, మందమర్రి, మండలంలోని చిర్రకుంట, గ్రామ క్రీడాకారులకు,క్రికెట్ క్రీడాకారులకు, టీ షర్ట్స్ పంపిణీ చేశారు మంచిర్యాల జిల్లా పరిధిలోని రామకృష్ణాపూర్,లొ గత కొన్ని రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి టోర్నమెంట్లో భాగంగా చిర్రకుంట గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు టోర్నమెంట్ లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా వారికి శుకాంక్షలుతెలిపి ఫిట్ ఇండియా పౌండేషన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ క్రీడాకారులకు టీ షర్ట్ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో చిర్రకుంట క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

 కూకట్‌పల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

కూకట్ పల్లి,పెన్ పవర్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎన్నికలు కూకట్ పల్లి మండలపరిధిలో ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా సాగింది. కూకట్ పల్లి మండల పరిధిలో 60 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రం ఓటు వేయడానికి అనుమతించలేదు. దీనితో ఓటర్లు కొద్దిసేపు అధికారులను ఓటు వేయడానికి అనుమతించాల్సిందిగా ప్రాధేయపడ్డారు. అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవంటూ అధికారులు సర్ది చెప్పడంతో చేసేదేమీలేక ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. 

కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఎండలో నిలబడి ప్రయాసపడుతున్న సరే చోద్యం చూస్తూ సెదతీరారే తప్ప ఓటర్ల కష్టాలను మాత్రం గుర్తించలేదు. దీనితో వయోవృద్దులు, చిన్న పిల్లలతో వచ్చిన ఓటర్లు చెట్ల నీడలో సెదతిరుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

విద్యుత్ అంతరాయం

 విద్యుత్ అంతరాయం

తాళ్ళపూడి, పెన్ పవర్

 సోమవారం నాడు అన్నదేవరపేట 33/11 కేవి సబ్ స్టేషన్ పరిధిలో నీ  11 కేవి అన్నదేవరపేట ఏజియల్ ఫీడర్  పరిధిలోని ఏజియల్ మోటర్స్ మరియు సూరయ్యపేట గ్రామంకు ఉదయం 07:00 గంటలనుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడునని, వార్షిక  మెయింటనేన్సు మరియు  పిఎంఐ వర్క్    ఉన్నందున విద్యుత్ నిలిపివేయబడునని,  కావున  ప్రజలు సహకరించవలసినదిగా ఏఈ కోరడమైనది .పై కారణం చేత 3పేష్  విద్యుత్ ఉదయం 2:00 గంటల నుండి ఉదయం 7:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంకాలం 5:00 గంటల వరకు ఇవ్వబడునని తెలిపారు  మరియు 132/33 కేవి సగ్గొండ సబ్ స్టేషన్ మెయింటినెన్స్ కారణం చేత ప్రక్కిలంక మరియు అన్నదేవరపేట 33/11కేవి సబ్ స్టేషన్ పరిధిలోని ఏజియల్ ఫీడర్స్ పై 3ఫేస్ ఆ ఒక్కరోజు మాత్రమే ఉదయం 2:00 గంటల నుండి ఉదయం 07:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 1:00 గంటల నుండి సాయంకాలం 5:00 గంటల వరకు ఇవ్వబడునని తెలియజేశారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపి కవిత మరియు జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్

 పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపి కవిత మరియు జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్

పెన్ పవర్, బయ్యారం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో జరుగుతున్న పట్టభద్రుల మండలి సభ్యుల ఎన్నికల సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత హాజరైనారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి దోహదపడతాయని కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆంగోతు బిందు మరియు యు.ఎన్ మండల తెరాస నాయకులు మూల మధుకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు బయ్యారం మండలంలో సాయంత్రం ఐదు గంటల వరకు 172 పోలింగ్ బూత్ నందు 497 మంది ఓటు హక్కు ను 173 పో 53 పాయింట్ 32 శాతంగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు లింగ్ నందు 962 మంది మహిళలు లు మొత్తం 470 మంది ఓటును సద్వినియోగం చేసుకున్నారు 173 పోలింగ్ బూత్ నందు పురుషులు 277 స్త్రీలు 222 మంది మండలం మొత్తం పోలింగ్ శాతం 54.2 శాతంగా అధికారులు ప్రకటించారు.

ప్రశాంత వాతావరణం లో జరిగిన ఉపాద్యాయ ఎంయల్సి ఎన్నికలు

 ప్రశాంత వాతావరణం లో  జరిగిన ఉపాద్యాయ ఎంయల్సి ఎన్నికలు

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయ ఎం.యల్.సి ఎన్నికలు తాళ్ళపూడి తహశీల్దార్ మరియు ఎన్నికల సహాయ అధికారి ఎం.నరసింహమూర్తి పర్యవేక్షణ లో  ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తాళ్ళపూడి మండలం లో 61 మంది ఉపాద్యాయ ఓటర్లు ఉండగా 61 ఓటింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. అంటే 100 % ఓటింగ్ జరిగింది. డిటి రాజబాబు, ఎస్ఐ జి.సతీష్ ఎన్నికల నిర్వహణ లో భాద్యత వహించి ప్రశాంతంగా జరిగేలా నియమ, నిబంధనలు తీసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీలు వేసి పూర్తి బందోబస్తు తో స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరిగింది. ముందుగా బ్యాలెట్ బాక్సులను కొవ్వూరు తీసుకెళ్లి, తరువాత కాకినాడ జేయన్టీయు కాలేజ్ కు  తరలిస్తారని అధికారులు తెలిపారు. 17 వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ క్రాంతిరేఖ, విఆర్వోలు లీలావతి, స్వర్ణ, మెడికల్ సిబ్బంది, పొలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...